ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినట్లు చంద్రబాబు నాయుడు అప్పుడే పగటి కలలు కంటున్నారని, ఆయన మాట్లాడే మాటలు, ఇచ్చే హామీలు దీన్ని స్పష్టం చేస్తున్నాయని జై సమైక్యాంధ్ర పార్టీ(జేఎస్పీ) అధికార ప్రతినిధి డాక్టర్ సుధారాణి విమర్శించారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినట్లు చంద్రబాబు నాయుడు అప్పుడే పగటి కలలు కంటున్నారని, ఆయన మాట్లాడే మాటలు, ఇచ్చే హామీలు దీన్ని స్పష్టం చేస్తున్నాయని జై సమైక్యాంధ్ర పార్టీ(జేఎస్పీ) అధికార ప్రతినిధి డాక్టర్ సుధారాణి విమర్శించారు. నరేంద్ర మోడీ ఆదుకుంటే తప్ప తెలుగువారికి భవిష్యత్తే ఉండదని చంద్రబాబు చెప్పడం తెలుగుజాతిని మరోసారి అవమానించడమే అవుతుందని దుయ్యబట్టారు.
ఆదివారం పార్టీ కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. చంద్రబాబుపై తీవ్రంగా ధ్వజమెత్తారు. తొమ్మిదేళ్లపాటు రాష్ట్రానికి సీఎంగా పనిచేసిన చంద్రబాబు ప్రజలకు ఒరగబెట్టిందేమిటని ప్రశ్నించారు. అదేవిధంగా కేంద్రంలో పాలన సాగించిన ఎన్డీఏ సర్కారు కూడా చేసిందేమీ లేదన్నారు.