ఇంకా రాష్ట్రం విడిపోలేదు
విభజనకు సహకరించిన పార్టీలకు బుద్ధిచెప్పండి: కిరణ్
నెల్లూరు/గూడూరు, రాష్ట్ర విభజన ఇంకా పూర్తికాలేదని మాజీ ముఖ్యమంత్రి, జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు నల్లారి కిరణ్ కుమార్‌రెడ్డి అన్నారు. సోమవారం శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరుజిల్లా కేంద్రం లో, గూడూరులో నిర్వహించిన రోడ్‌షోలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర విభజనపై తాను సుప్రీంకోర్టును ఆశ్రయించానని, బిల్లును కోర్టు రద్దు చేస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించేందుకు సహకరించిన పార్టీలకు బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. విభజన పాపం కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలదేనని ఆరోపిం చారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రెండుసార్లు లేఖలు ఇచ్చారని పేర్కొన్నారు. తాను లేఖ ఇచ్చినందువల్లే రాష్ట్రం వచ్చిందని తెలంగాణ లోను..
లాగే, సీమాంధ్రలో తాను సమైక్యవాదిని అని చంద్రబాబు రెండునాల్కల ధోరణి అవలంబి స్తున్నారని విమర్శించారు. తన లేఖ కారణంగా తెలంగాణ వచ్చిందంటున్న బాబు.. చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు వచ్చి ఆ మాట చెప్పగలరా అని ప్రశ్నించారు. విభజన జరుగుతున్న నేపథ్యంలో నోరు మెదపకుండా మౌనం వహించిన పిరికిపంద బాబు అని దుయ్యబట్టారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం దీక్షచేసి అమరుడైన శ్రీపొట్టిశ్రీరాములు జిల్లాలో పుట్టిన వెంకయ్యనాయుడు సైతం అడ్డగోలు విభజనకు అనుకూలంగా మాట్లాడటం సమంజసం కాదన్నారు. ప్రాంతాలకు అనుగుణం గా మాట్లాడుతూ ప్రజలను వంచిస్తున్న చంద్రబాబును తనజిల్లా వాసిగా చెప్పుకునేం దుకు సిగ్గుపడుతున్నానని కిరణ్ పేర్కొన్నారు.