state divided
-
విశ్వసనీయత ఎందుకు కోల్పోయాం?
సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శివర్గం అంతర్మథనం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనతో తీవ్రంగా నష్టపోయిన సీపీఐ ఏపీ శాఖ పార్టీ నిర్మాణంపై దృష్టి సారించింది. ప్రజా విశ్వాసాన్ని తిరిగి పొందడానికి ఏమి చేయాలనే దానిపై అంతర్మథనం ప్రారంభించింది. కొత్తగా ఏర్పాటైన పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గం బుధ, గురువారాల్లో సుదీర్ఘంగా చర్చించింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి సహాయ కార్యదర్శులు ముప్పాళ్ల నాగేశ్వరరావు, వి.సత్యనారాయణమూర్తి, పీజే చంద్రశేఖర్, జి.ఓబులేసు, రావుల వెంకయ్య, జల్లి విల్సన్ తదితరులు హాజరయ్యారు. ఓట్లు, సీట్లు ఎలా ఉన్నా పార్టీ పునాదులు పూర్తిగా కదిలిపోవడం కార్యదర్శివర్గాన్ని తీవ్రంగా కలవరపరిచింది. నయా ఉదారవాద ఆర్థిక విధానాలతో ప్రజల ఆలోచనా సరళిలో తీవ్ర మార్పులు చోటు చేసుకుంటున్నాయని అభిప్రాయపడింది. ఇకపై క్రియాశీల (మిలిటెంట్) పోరాటాలకు పార్టీ శ్రేణులను సంసిద్ధం చేయాలని నిర్ణయించింది. చట్టసభలో ప్రాతినిధ్యం లేనందున సభ దృష్టిని ఆకర్షించేందుకు నిత్యం జనం మధ్యలో ఉండాలని తీర్మానించింది. ఇందుకోసం తక్షణ సమస్యలుగా రుణమాఫీ, అసంఘటిత కార్మికులు, కౌలు రైతుల సమస్యల్ని గుర్తించింది. -
తేలిన అప్పుల లెక్క
తెలంగాణకు రూ.67వేల కోట్లు, సీమాంధ్రకు రూ.93వేల కోట్ల అప్పు తాత్కాలిక లెక్కల ప్రకారం అంచనా వేసిన ఆర్థిక శాఖ అధికారులు జనాభా ప్రాతిపదికన రెండు రాష్ట్రాలకు అప్పుల పంపిణీ ఎవరు ఏ అప్పు ఎంత వడ్డీతో కట్టాలో చెప్పనున్న ఆర్బీఐ హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రంలో అప్పులను కొన్నింటిని ప్రాజెక్టుల వారీగా ఏ ప్రాంతానికి వినియోగిస్తే ఆ ప్రాంతానికి పంపిణీ చేయనున్నారు. ప్రత్యేకంగా ఒక ప్రాంతానికి మాత్రమే అప్పు తెచ్చినట్లు నిర్ధారించలేమని జనాభా ప్రాతిపదికన రెండు రాష్ట్రాలకు పంపిణీ చేయనున్నా రు. అప్పుల పంపిణీకి సంబంధించి తాత్కాలికంగా ఆర్థికశాఖ అంచనాలను వేసింది. ఇప్పటి వరకు ఉమ్మడిరాష్ట్రంలో అన్ని రకాల అప్పులు కలిపి రూ.1.60లక్షల కోట్లుగా తేల్చారు. ఇందులో తెలంగాణకు రూ.67వేల కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు రూ.93 వేల కోట్ల అప్పు ఉంటుందని ప్రాథమిక అంచనాలో తేల్చింది. ఇందులో ప్రత్యేకంగా ఒక ప్రాంతంలోని ప్రాజెక్టులకు తెచ్చిన విదేశీ, స్వదేశీ అప్పులను ఆయా ప్రాంతాలకే కేటాయించారు. అలాగే సాగునీటి ప్రాజెక్టులతో పాటు ఇతర ప్రాజెక్టులకు వెచ్చించిన అప్పులను మాత్రం జనాభా ప్రాతిపదికనే పంపిణీ చేస్తున్నారు. ప్రతి ఆర్థిక సంవత్సరంలో ప్రణాళిక పద్దు కింద ఆస్తుల కల్పన వ్యయం కోసం సెక్యూరిటీల విక్రయం ద్వారా ప్రభుత్వం అప్పులు చేస్తుంది. ఈ అప్పులను బడ్జెట్ ద్వారా సాగునీటి ప్రాజెక్టులతో పాటు ఇతర ఆస్తుల కల్పన కోసం వ్యయం చేస్తారు. మొత్తం బడ్జెట్ ఆధారంగా వ్యయం చేస్తున్నందున ప్రాంతాల వారీగా ప్రాజెక్టుల వ్యయం తీయడంలేదని అధికార వర్గాలు తెలిపాయి. ప్రాజెక్టుల వారీగా వ్యయం తీయాలంటే ప్రణాళిక పద్దు కింద ఏ జిల్లాల్లో ఏ ఆర్థిక సంవత్సరంలో ఎంత వ్యయం చేసిందీ గత 30 సంవత్సరాల నుంచి లెక్కలు తీయాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో బడ్జెట్ కోసం తెచ్చిన అప్పులను రెండు రాష్ట్రాలకు జనాభా ప్రాతిపదికన పంపిణీ చేయనున్నారని అధికార వర్గాలు తెలిపాయి. విదేశీ సంస్థలు, నాబార్డు నుంచి తెచ్చిన అప్పులను ప్రత్యేకంగా ప్రాజెక్టుల వారీగా తెచ్చినందున ఆ అప్పులను ఏ ప్రాంతంలో ఆ ప్రాజెక్టు ఉంటే ఆ ప్రాంతానికి అప్పులను లెక్కకట్టినట్లు వివరించాయి. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చే అప్పులు కొన్ని 20 సంవత్సరాల్లో, కొన్ని 15 సంవత్సరాల్లో, కొన్ని పది సంవత్సరాల్లో, మరికొన్ని ఐదు సంవత్సరాల్లో తీర్చాల్సిన అప్పులు ఉంటాయని, వాటిలోను వడ్డీ శాతాల్లో వ్యత్యాసం ఉంటుందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అప్పులు తీర్చే సమయం, వడ్డీ శాతాలను పరిగణనలోకి తీసుకుని ఏ రాష్ట్రంలో ఎంత కాలంలో, ఎంత వడ్డీ అప్పులను తీర్చాలో ఆర్బీఐ నిర్ధారించనుందని తెలిపారు. -
స్ధానికత వివరాల పై ఉద్యోగుల ఫైర్
-
విభజన తేదీ 26కు మారే అవకాశం!
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కసరత్తు హైదరాబాద్: రాష్ట్ర విభజన తేదీని కొంత ముందుకు జరపనున్నట్లు ఉన్నతస్థాయి వర్గాల సమాచారం. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాలు ఏర్పాటు చేయకుండా జాప్యం చేయడం సమంజసం కాదనే వాదన అధికార వర్గాల్లో వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాన్ని విభజించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రాలు ఏర్పడే తేదీగా ఈ నెల 26ను (అపారుుంటెడ్ డే) నిర్ణయించే అవకాశం ఉందని తెలుస్తోంది. జూన్ 2వ తేదీని అపాయింటెడ్ డేగా ఇంతకుముందు నిర్ణయించిన విషయం తెలిసిందే. అరుుతే దీనివల్ల తెలంగాణ, సీమాంధ్రల్లో ప్రభుత్వాలు ఏర్పాటు చేయకుండా పక్షం రోజుల పాటు వేచి చూడాల్సి ఉంటుంది. ఈ కారణంగా అపాయింటెడ్ డేను ముందుకు జరపాలనే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నెల 21వ తేదీన ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నందున.. ఆ వెంటనే ఆపాయింటెడ్ డే ను ముందుకు జరిపేం దుకు ఆయన అనుమతి తీసుకోనున్నట్లు సమాచారం. మరోవైపు మోడీ ప్రమాణ స్వీకారంతో సంబంధం లేకుండా, ఆయనకు సమాచారం ఇవ్వడం ద్వారా కూడా విభజన తేదీని ముందుకు జరిపే యోచనలో కేంద్ర హోంశాఖ ఉన్నట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. 26 నుంచి ప్రయోగాత్మకంగా అమలు!: ఇలా ఉండగా ముందుగా నిర్ణరుుంచిన రాష్ట్ర విభజన తేదీ జూన్ 2 కంటే ముందుగానే అంటే.. ఈ నెల 26వ తేదీ నుంచే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలను ప్రయోగాత్మకంగా పనిచేయించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. సచివాలయంతో పాటు రాజధానిలోని పలు ప్రభుత్వరంగ సంస్థలు, శాఖలు, కమిషనరేట్లు, డెరైక్టరేట్లలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలను ప్రయోగాత్మకంగా పని చేయించడం వల్ల అధికారులు, సిబ్బందికి సాధకబాధకాలు తెలిసివస్తాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే, అధికారికంగా ఎటువంటి నిర్ణయాలను తీసుకోరు. ఒక వేళ అపాయింటెడ్ డే ఈ నెల 26గా అధికారికంగా నిర్ణయమైతే రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆ రోజు నుంచి అధికారికంగానే పని ప్రారంభిస్తారుు. -
సీపీఐ తెలంగాణ, సీమాంధ్ర శాఖల ఏర్పాటుకు సన్నాహాలు
హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ, సీమాంధ్రల్లో శాఖల ఏర్పాటుకు సీపీఐ సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం ఈ నెల 22, 23 తేదీల్లో పార్టీ రాష్ట్ర కౌన్సిల్ భేటీ కానుంది. ఈ క్రమంలో రాష్ట్ర కార్యదర్శివర్గం ఈ నెల 21న సమావేశమై దీనికి సంబంధించిన అజెండాను ఖరారు చేస్తుంది. వాస్తవానికి ఏప్రిల్‌లోనే రెండు శాఖల్ని ఏర్పాటు చేయాలని పార్టీ నిర్ణయించినప్పటికీ ఎన్నికలు రావడంతో వాయిదా వేశారు. రెండు ప్రాంతాలకు ఎన్నికల కమిటీలను ఏర్పాటు చేసి ప్రస్తుత కార్యదర్శి కె. నారాయణను ఇప్పటి దాకా ఆ పదవిలో కొనసాగించారు. ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లో శాఖల ఏర్పాటు చేయనున్నారు. ఎన్నికల కమిటీలకు నాయకత్వం వహించిన చాడా వెంకటరెడ్డి తెలంగాణకు, సీమాంధ్రకు కె.రామకృష్ణ కార్యదర్శులుగా ఎంపికయ్యే అవకాశముంది. -
ఎస్సీ, ఎస్టీల లెక్క తేలింది
తెలంగాణలో 59 ఎస్సీ, 32 ఎస్టీ కులాలు మన్నెదొర, తోటి కులం కూడా ఉన్నట్లు గుర్తింపు విభజన ఉత్తర్వుల్లో స్పష్టం చేసిన ప్రభుత్వం హన్మకొండ, రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ ప్రాంతంలోని షెడ్యూల్డ్ కులాల లెక్క తేల్చారు. ఎస్సీ, ఎస్టీ వాస్తవ కులాలు, వాటి ఉపకులాలెన్ని.. ఏ ప్రాంతంలో ఎక్కువ.. కొన్ని ప్రాంతాలకే పరిమితమైన కులాలు..వీటన్నిటిపై స్పష్టంగా నివేదికల్లో పొందుపర్చారు. తెలంగాణ వ్యాప్తంగా 59 షెడ్యూల్ కులాలుం డగా కొన్నింటికి ఉపకులాలు కూడా ఉన్నాయి. 32 షెడ్యూల్ తెగలకు గాను ఉప కులాలు మరిన్ని ఉన్నా యి. ఎస్టీలకు సంబంధించి రెండు కులాలు మాత్రం కొన్ని జిల్లాల్లోనే ఉన్నట్లు జాబితాల్లో పేర్కొన్నారు. అయితే వీరి సంఖ్యను తేల్చలేదు. ఎస్టీ కులాల్లో ఎక్కువగా ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, మెదక్, నల్లగొండ, నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లో ఉన్నట్లు గుర్తించారు. వీటిలో తోటి అనే ఎస్టీ కులం ఉనికి ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, మెదక్, నల్లగొండ, నిజామాబాద్ జిల్లాల్లో మన్నదొర కులం కూడా ఈ జిల్లాల్లోనే ఉన్నట్లు గుర్తిం చారు. గోదావరి పరీవాహక ప్రాంతంలోనే ఎస్టీలు, వాటి ఉప కులాలు నివాసం ఉంటున్నట్లు పేర్కొన్నారు. విభజన నేపథ్యంలో ఆంధ్ర కంటే తెలంగాణ ప్రాంతంలోనే ఎస్సీ, ఎస్టీ కులాలు ఎక్కువగా ఉన్నాయని తేల్చారు.ఈ మేరకు రెండు రోజుల క్రితం గవర్నర్ నుంచి ఆయా జిల్లాల అధికారులకు ఉత్తర్వులు అందాయి. ఉప కులాలూ ఎక్కువే: తెలంగాణలోని పది జిల్లాల్లో 59 షెడ్యూల్ కులాలుండగా వాటికి ఉప కులాలు సైతం ఎక్కువగానే ఉన్నాయి. ఎస్సీల జాబితాలోని చమర్ కులం పరిధిలో మోచి, మూచి, చమర్-రావిదాస్, చమర్-రొహిదాస్ కులాలున్నాయి. డక్కలకు ఉపకులంగా డక్కలవార్, దోమ్కు దోంబేరా, పైడీ, పానో, ఎల్లమల్వార్కు ఎల్లమ్మలవాండ్లు, ఘాసీ కులానికి హద్దీ, రేలీ, చెంచడి ఉప కులాలున్నాయి. కొలుపువాళ్ల కులానికి పంబాడా, పంబండా, పంబాల కులాలు, మాదాసి కురువ, మాదారి కురువగా గుర్తించారు. మాదిగ దాసుకు మస్తీం, మాల కులానికి మాల అయ్యవారు మాలా సాలీ, నేతాని కులాలు ఉప కులాలుగా ఉన్నట్లు నివేదికల్లో పేర్కొన్నారు. ఎస్టీ కులాల్లోనూ ఉప కులాలు అధికంగానే ఉన్నాయని జాబితాలో లెక్కగట్టారు. ఆదిలాబాద్, వరంగల్, నిజామాబాద్ ప్రాంతాల్లో గోండు కులం ప్రత్యేకంగా నమోదై ఉన్నట్లు నివేదించారు. నాయక్ కులం కూడా కేవలం ఏజెన్సీ ప్రాంతాల్లోనే ఉన్నట్లు పేర్కొన్నారు. తెలంగాణలోని మరో ప్రధాన కులం లంబాడాను కూడా ఉప కులంగానే ఉందన్నారు. ప్రధాన కులం సుగాలీలకు లంబాడీలు, బంజారాలను ఉప కులాలుగా చూపించారు. గదబ కులానికి ఉప కులంగా బోడో గదబ, గూడోబ్ గదబ, కల్ల్యాయి గదబ, పరంగి గదబ, కత్తెర గదబ, కాపు గదబ కులాలు ఉప కులంగా నమోదయ్యాయి. అదేవిధంగా గోండుకు నాయక్‌పోడ్, రాజ్‌గొండు, కోయితూర్ కులాలున్నాయి. ఒకప్పుడు అటవీ ప్రాంతాలకే పరిమితమైన కొన్ని కులాలు ఇప్పుడు అంతటా వ్యాపించాయని పేర్కొన్నారు. వాటిలో కొండ కులం ఉన్నట్లు లెక్కల్లో చెప్పారు. -
ఏ రాష్ట్రానికి ప్రాధాన్యతో చెప్పండి
ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్లకు నమూనా పత్రం జారీ మెమో జారీ చేసిన సీఎస్ మహంతి {పాధాన్యత ప్రకారమే కేటాయింపు హక్కు కాదంటూ అండర్ టేకింగ్ హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏ రాష్ట్ర కేడర్‌కు ఇష్టపడతారో ఈ నెల 16వ తేదీలోగా చెప్పాల్సిందిగా అఖిల భార త సర్వీసు అధికారులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి కోరారు. ఈ మేరకు నమూనా పత్రంతో పాటు మెమోను శుక్రవారం జారీ చేశారు. రాష్ట్ర విభజన అనంతరం తొలి ప్రాధాన్యత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేడర్‌కు ఇస్తారో లేదా తెలంగాణ రాష్ట్ర కేడర్‌కు ఇస్తారో నమూనా పత్రంలో తెలియజేయాలని సూచించారు. రెండు రాష్ట్రాలకు సమాన ప్రాధాన్యత ఇస్తే ఆ విషయం కూడా తెలియజేయవచ్చునని స్పష్టం చేశారు. తమ ప్రాధాన్యతల ప్రకారమే ఆయా రాష్ట్రాల కేడర్లకు కేటాయింపులు జరగాలనే హక్కు ఎవరికీ ఉండదని పేర్కొంటూ ఆ మేరకు అండర్ టేకింగ్‌ను అధికారుల నుంచి నమూనా పత్రంలో తీసుకుంటున్నారు. దీన్నిబట్టి చూస్తే.. కేవలం ప్రాధాన్యతలు అడిగామని చెప్పుకోవడానికి తప్ప ఎటువంటి ప్రయోజనం ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒక పక్క ప్రాధాన్యతలను అడుగుతూ దాని కిందే ప్రాధాన్యతల ప్రకారం కేటాయింపులు చేయలేదని అడిగే హక్కు ఎవరికీ ఉండదని కూడా అండర్ టేకింగ్ తీసుకోవడం వల్ల ప్రయోజనం ఏమిటని అధికారులంటున్నారు. ఇలావుండగా సదరు నమూనా పత్రాలను పూరించి సీల్డ్ కవర్లో ఈ నెల 16వ తేదీన సాయంత్రం 5 గంటలకల్లా ఐఏఎస్‌లు అయితే సాధారణ పరిపాలన (రాజకీయ) శాఖ కార్యదర్శి శివశంకర్‌కు, ఐపీఎస్లైతే శాంతిభద్రతల అదనపు డీజీ వి.ఎస్.కె.కౌముదికి, ఐఎఫ్ఎస్లైతే అదనపు పీసీసీఎఫ్ ఆర్.జి. కలఘట్గికి సమర్పించాల్సిందిగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. డెరైక్ట్ రిక్రూటీలు, కన్ఫర్డ్ అధికారులు ఏ ప్రాంతం వారు ఆ ప్రాంతానికే అఖిల భారత సర్వీస్ అధికారుల పంపిణీకి సంబంధించిన మార్గదర్శక సూత్రాలను ఈ నెల 16వ తేదీన ప్రత్యూష సిన్హా కమిటీ ఖరారు చేయనుంది. అనంతరం ఈ నెల 17 లేదా 18వ తేదీన వాటిని బహిర్గత పరచనుంది. డెరైక్ట్ రిక్రూట్మెంట్ అధికారులను ఏ ప్రాంతానికి చెందిన వారిని ఆ ప్రాంతానికే కేటాయించాలని కమిటీ ప్రాథమికంగా నిర్ణరుుంచింది. అలాగే కన్ఫర్డ్ అధికారులను కూడా ఏ ప్రాంతం వారిని ఆ ప్రాంతానికే కేటాయించనున్నారు. రాష్ర్ట కేడర్‌కు చెందిన ఇతర రాష్ట్రాల అధికారులను మాత్రం రోస్టర్ విధానంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు పంపిణీ చేయనున్నారు. -
ఇంకా రాష్ట్రం విడిపోలేదు
విభజనకు సహకరించిన పార్టీలకు బుద్ధిచెప్పండి: కిరణ్ నెల్లూరు/గూడూరు, రాష్ట్ర విభజన ఇంకా పూర్తికాలేదని మాజీ ముఖ్యమంత్రి, జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు నల్లారి కిరణ్ కుమార్‌రెడ్డి అన్నారు. సోమవారం శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరుజిల్లా కేంద్రం లో, గూడూరులో నిర్వహించిన రోడ్‌షోలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర విభజనపై తాను సుప్రీంకోర్టును ఆశ్రయించానని, బిల్లును కోర్టు రద్దు చేస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించేందుకు సహకరించిన పార్టీలకు బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. విభజన పాపం కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలదేనని ఆరోపిం చారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రెండుసార్లు లేఖలు ఇచ్చారని పేర్కొన్నారు. తాను లేఖ ఇచ్చినందువల్లే రాష్ట్రం వచ్చిందని తెలంగాణ లోను.. లాగే, సీమాంధ్రలో తాను సమైక్యవాదిని అని చంద్రబాబు రెండునాల్కల ధోరణి అవలంబి స్తున్నారని విమర్శించారు. తన లేఖ కారణంగా తెలంగాణ వచ్చిందంటున్న బాబు.. చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు వచ్చి ఆ మాట చెప్పగలరా అని ప్రశ్నించారు. విభజన జరుగుతున్న నేపథ్యంలో నోరు మెదపకుండా మౌనం వహించిన పిరికిపంద బాబు అని దుయ్యబట్టారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం దీక్షచేసి అమరుడైన శ్రీపొట్టిశ్రీరాములు జిల్లాలో పుట్టిన వెంకయ్యనాయుడు సైతం అడ్డగోలు విభజనకు అనుకూలంగా మాట్లాడటం సమంజసం కాదన్నారు. ప్రాంతాలకు అనుగుణం గా మాట్లాడుతూ ప్రజలను వంచిస్తున్న చంద్రబాబును తనజిల్లా వాసిగా చెప్పుకునేం దుకు సిగ్గుపడుతున్నానని కిరణ్ పేర్కొన్నారు. -
విభజనపై సుప్రీంకోర్టుకు మరో పిటిషన్
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనపై సుప్రీం కోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. చనుమోలు లక్ష్మీఅనుపమ అనే వ్యక్తి దాఖలు చేసిన ఈ పిటిషన్ కూడా మే 5న ఇతర అన్ని పిటిషన్లతో కలిపి విచారిస్తామని జస్టిస్ హెచ్.ఎల్.దత్తు, ఎస్.ఎ.బాబ్డేలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ప్రతివాదులైన కేంద్ర ప్రభుత్వం, క్యాబినెట్ కార్యదర్శికి సంబంధిత వ్యవహారంపై నోటీసులు జారీచేసింది. -
చిరుద్యోగులకూ మే 24నే వేతనాలు
హైదరాబాద్: రాష్ర్ట విభజన నేపథ్యంలో మే నెల జీతాలు, పింఛన్లను అదే నెల 24వ తేదీన చెల్లించేయాలని నిర్ణయం తీసుకున్న ఆర్థిక శాఖ తాజాగా ఇప్పుడు ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు, హోంగార్డుల వేతనాలను కూడా మే 24వ తేదీనే చెల్లించేయాలని నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు చెల్లింపులు చేసి చిరుద్యోగులను వదిలేస్తే అన్యాయం అవుతుందనే భావనతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఒకటీ రెండురోజుల్లో ఉత్తర్వులు జారీ కానున్నాయి.54,598 మంది కాంట్రాక్టు, 12,882 మంది వర్క్ చార్జ్డ్, 36,952 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, 21,050 ఎన్‌ఎంఆర్‌లు, 2,59,368 మంది హోంగార్డులు కలిపి మొత్తం 3.84 లక్షల మందికి పైగా రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి వేతనాలను పొందుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వీరికి మే నెల వేతనాలను చెల్లించకపోతే జూన్ 2వ తేదీన రెండు రాష్ట్రాలు ఏర్పాటయ్యాక ఆ నెల వేతనాన్ని ఏ రాష్ట్రం చెల్లించాలనే సమస్య ఉత్పన్నమవుతుందని, దీంతో ఉద్యోగులు ఇబ్బంది పడతారనే ఆలోచనతో ఆర్థిక శాఖ పై నిర్ణయం తీసుకుంది. ఇలావుండగా.. ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ల సంబంధిత బిల్లులను మే 17వ తేదీలోగా సమర్పించాల్సిందిగా ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి అజేయ కల్లం అన్ని శాఖలకు మెమో జారీ చేశారు. మిగతా అన్ని రకాల బిల్లుల సమర్పణకు కూడా మే 15 చివరితేదీగా ఆర్థిక శాఖ నిర్ణయించింది. -
కమలనాథన్ కమిటీలో భిన్నాభిప్రాయాలు
ఉద్యోగుల పంపిణీపై ఏకాభిప్రాయానికి రాని సభ్యులు ఏ ప్రాంతం వారిని ఆ ప్రాంతానికి తొలుత పంపేయాలన్న మెజారిటీ సభ్యులు ముందే ఆప్షన్లు ఇవ్వాలన్న మరో సభ్యుడు ఏ అభిప్రాయం చెప్పని కమలనాథన్, అర్చన వర్మ హైదరాబాద్: రాష్ట్ర విభజన మాటెలా ఉన్నా, రాష్ట్రస్థాయి ఉద్యోగుల పంపిణీ మార్గదర్శకాల రూపకల్పనపై కమలనాథన్ కమిటీలో ఏకాభిప్రాయం కొరవడింది. కమిటీ శుక్రవారం సమావేశమై ఉద్యోగుల పంపిణీ మార్గదర్శకాలపై విస్త్రృతంగా చర్చించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి, ఉన్నతాధికారులు పి.వి.రమేశ్, నాగిరెడ్డి, జయేశ్ రంజన్, కేంద్ర అధికారి అర్చన వర్మ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఉద్యోగుల స్థానికత ఆధారంగా ఏ ప్రాంతానికి చెందిన వారిని ఆ ప్రాంతానికి ప్రొవిజనల్ జాబితా ప్రకారం కేటాయిద్దామని, జూన్ 2న కొత్త ప్రభుత్వాలు వచ్చాక ఆప్షన్ల విధానాన్ని అమలు చేద్దామని కమిటీలోని మెజారిటీ సభ్యులు చెప్పారు. మరో సభ్యుడు మాత్రం ఇప్పుడే ఆప్షన్లు ఇవ్వాలని అన్నారు. కొత్త ప్రభుత్వాలు, కొత్త ముఖ్యమంత్రులు వచ్చాక పూర్తి రాజకీయం అవుతుందని, అప్పుడు ఆప్షన్లు అంటే సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు. కమిటీ చైర్మన్ కమలనాథన్ మాత్రం ఎటువంటి అభిప్రాయం వ్యక్తంచేయలేదు. కమిటీలోని మరో సభ్యురాలు, కేంద్ర సిబ్బంది వ్యవహారాల విభాగం సంయుక్త కార్యదర్శి అర్చన వర్మకు రాష్ట్రంలోని పరిస్థితులపై అవగాహన లేకపోవడంతో ఏమీ మాట్లాడలేదు. అయినప్పటికీ, మార్గదర్శకాలకు తుదిరూపు ఇచ్చి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపాలని కమలనాథన్ ప్రయత్నిస్తున్నారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 76 (1), 76 (2)లో తొలుత జూన్ 2కన్నా ముందుగానే తెలంగాణ ఉద్యోగులను కేటాయించాలని ఉంది. దీనిప్రకారం స్థానికత ఆధారంగా తెలంగాణ ప్రాంతం వారిని తెలంగాణకు, సీమాంధ్ర ఉద్యోగులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేటాయించనున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. -
మొండి‘చెయ్యి’
అనంతపురం: రాష్ట్ర విభజనతో ప్రజాగ్రహానికి గురైన కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులే కరువయ్యారు. అరకొరగా పోటీ చేసిన వారికీ ఆపార్టీ అన్ని విధాలా మొండిచేయి చూపింది. పార్టీపై ఉన్న అభిమానంతో అనంతపురం కార్పొరేషన్‌లోని 18వ డివిజన్‌కు కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థినిగా కూరగాయల వ్యాపారి లక్ష్మీదేవి పోటీకి దిగారు. రూ. మూడు లక్షలు పార్టీ ఫండ్‌గా ఇస్తామని పార్టీ నాయకులు చెప్పారని ఆమె పేర్కొన్నారు. ఆ డబ్బు వస్తుందనే భరోసాతో సొంత డబ్బు రూ. 20 వేలు ఖర్చు పెట్టుకుని పది రోజుల పాటు ప్రచారం చే స్తే.. తీరా పార్టీ పెద్దలు చేతులెత్తేశారని ఆమె వాపోయారు. ఆదివారం ఉదయం కాసేపు పోలింగ్ సరళి గమనించాక.. ఇక గెలవడం కష్టమని భావించి ‘కూరగాయలమ్మో..’ అంటూ బండి తోసుకుంటూ వీధుల్లోకెళ్లారు. -
కాంగ్రెస్ నేతలతో టీడీపీ బలోపేతం
ప్రజాగర్జనలో చంద్రబాబు కూరగాయల బేరంలాగే.. నేతల చేరికలు కూడా శ్రీకాకుళం, ‘రాష్ట్ర విభజన నిర్ణయంతో కాంగ్రెస్ పార్టీ దివాలా తీసింది. దాంతో ఆ పార్టీ నేతలు రాజీనామాలు చేస్తున్నారు. టీడీపీ బలాన్ని పెంచుకునేందుకే కాంగ్రెస్ నేతలను పార్టీలో చేర్చుకుంటున్నాం. లేదంటే వారు మరో పార్టీలోకి వెళ్తారు’ అని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చెప్పారు. బుధవారం రాత్రి శ్రీకాకుళంలో జరిగిన ప్రజాగర్జన ర్యాలీ, సభలో ఆయన మాట్లాడుతూ.. కూరగాయలు కొనాలన్నా బేరమాడి కొంటాం కదా.. ఇదీ అంతేనని చెప్పుకొచ్చారు. తనను ఇబ్బంది పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నించినందునే రాష్ట్ర విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చానని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీలు విభజనకు నిర్ణయించాయని, తాను కూడా అనుకూలంగా లేఖ ఇచ్చానని, అందువల్లే విభజన జరిగిందని తెలిపారు. సీమాంధ్రను సింగపూర్‌లా అభివృద్ధి చేసేందుకు తనకు అధికారమివ్వాలని కోరారు. తెలంగాణలో బీసీ నేతను సీఎం చేస్తానని చెప్పానని, సీమాంధ్రలో మాత్రం తననే సీఎంను చేయాలని ప్రజలను కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం 15 లక్షల కోట్ల అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. 2జీ, కామన్వెల్త్, బొగ్గు తదితర కుంభకోణాలతో దేశ ఆర్థిక వ్యవస్థను కాంగ్రెస్ నాశనం చేసిందని విమర్శించారు. అలాంటి కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలని పిలుపునిచ్చారు. ఒకటి, రెండు శాతం ఓట్ల కోసం కిరణ్‌కుమార్ రెడ్డి పార్టీ పెట్టారని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు కళా వెంకట్రావు, కావ లి ప్రతిభాభారతి, గుండ అప్పలసూర్యనారాయణ, గౌతు శివాజీ, కింజరాపు అచ్చెన్నాయుడు, శత్రుచర్ల విజయరామరాజు, కింజరాపు రామ్మోహన్నాయుడు, గుండ లక్ష్మీదేవి, చౌదరి బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రాన్ని విభజిస్తే సమ్మెకు దిగుతాం: ఏపీ ఎన్జీవోస్