మొండి‘చెయ్యి’
అనంతపురం: రాష్ట్ర విభజనతో ప్రజాగ్రహానికి గురైన కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులే కరువయ్యారు. అరకొరగా పోటీ చేసిన వారికీ ఆపార్టీ అన్ని విధాలా మొండిచేయి చూపింది. పార్టీపై ఉన్న అభిమానంతో అనంతపురం కార్పొరేషన్‌లోని 18వ డివిజన్‌కు కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థినిగా కూరగాయల వ్యాపారి లక్ష్మీదేవి పోటీకి దిగారు.
రూ. మూడు లక్షలు పార్టీ ఫండ్‌గా ఇస్తామని పార్టీ నాయకులు చెప్పారని ఆమె పేర్కొన్నారు. ఆ డబ్బు వస్తుందనే భరోసాతో సొంత డబ్బు రూ. 20 వేలు ఖర్చు పెట్టుకుని పది రోజుల పాటు ప్రచారం చే స్తే.. తీరా పార్టీ పెద్దలు చేతులెత్తేశారని ఆమె వాపోయారు. ఆదివారం ఉదయం కాసేపు పోలింగ్ సరళి గమనించాక.. ఇక గెలవడం కష్టమని భావించి ‘కూరగాయలమ్మో..’ అంటూ బండి తోసుకుంటూ వీధుల్లోకెళ్లారు.