congress protest, ananthpur, draught , కాంగ్రెస్ నిరసన, అనంతపురం
మడకశిరలో వినూత్న నిరసన
Published Wed, Apr 26 2017 3:14 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
మడకశిర: అనంతపురం జిల్లాలో కరువు తాండవిస్తోందని, పశువులు మేత దొరక్క అల్లాడుతున్నాయని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. మడకశిరలో బుధవారం ఆయన పార్టీ శ్రేణులతో కలిసి వినూత్నంగా ధర్నా చేపట్టారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఆవరణలోకి పెద్ద సంఖ్యలో పశువులతో తరలివచ్చారు. దీంతో అక్కడి వారంతా ఆశ్చర్యపోయారు. ఈ సందర్భంగా రఘువీరా.. వెంటనే గ్రామీణ ప్రాంతాల్లో గడ్డి కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం అధికారులకు వినతిపత్రం సమర్పించారు
Advertisement
Advertisement