రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ, సీమాంధ్రల్ల్లో శాఖల ఏర్పాటుకు సీపీఐ సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం ఈ నెల 22, 23 తేదీల్లో పార్టీ రాష్ట్ర కౌన్సిల్ భేటీ కానుంది.
హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ, సీమాంధ్రల్లో శాఖల ఏర్పాటుకు సీపీఐ సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం ఈ నెల 22, 23 తేదీల్లో పార్టీ రాష్ట్ర కౌన్సిల్ భేటీ కానుంది. ఈ క్రమంలో రాష్ట్ర కార్యదర్శివర్గం ఈ నెల 21న సమావేశమై దీనికి సంబంధించిన అజెండాను ఖరారు చేస్తుంది. వాస్తవానికి ఏప్రిల్‌లోనే రెండు శాఖల్ని ఏర్పాటు చేయాలని పార్టీ నిర్ణయించినప్పటికీ ఎన్నికలు రావడంతో వాయిదా వేశారు.
రెండు ప్రాంతాలకు ఎన్నికల కమిటీలను ఏర్పాటు చేసి ప్రస్తుత కార్యదర్శి కె. నారాయణను ఇప్పటి దాకా ఆ పదవిలో కొనసాగించారు. ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లో శాఖల ఏర్పాటు చేయనున్నారు. ఎన్నికల కమిటీలకు నాయకత్వం వహించిన చాడా వెంకటరెడ్డి తెలంగాణకు, సీమాంధ్రకు కె.రామకృష్ణ కార్యదర్శులుగా ఎంపికయ్యే అవకాశముంది.