
ముఖ్యమంత్రులిద్దరిదీ పదవీ దాహం: నారాయణ
బెంగళూరు: పదవులు కాపాడుకునేందుకే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రశేఖర్‌రావు, చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని... ఆ క్రమంలోనే వారు ప్రజా సమస్యలను పట్టించుకోవటం మానేశారని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు నారాయణ విమర్శించారు.
బెంగళూరులో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. విద్యుత్ సమస్య తలెత్తకుండా చూడాలని, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ కల్పించాలని, ప్రజల మధ్య సఖ్యత పెంచే చర్యలు తీసుకోవాలని హితవు పలికారు.