రాష్ట్రాన్ని విభజిస్తే సమ్మెకు దిగుతాం: ఏపీ ఎన్జీవోస్ | AP NGO Movements to Against Telangana | Sakshi
Sakshi News home page

Published Sat, Jul 27 2013 12:50 PM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజిస్తే వెంటనే సమ్మెకు దిగుతామని ఏపీ ఎన్జీవోస్ సంఘం శనివారం యూపీఏ సర్కార్ను హెచ్చరించింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం చర్చల ప్రక్రియను పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర విభజన అంశంపై చర్చించేందుకు ఏపీ ఎన్జీవోస్ సంఘం శనివారం హైదరాబాద్లో సమావేశమైంది. సీమాంధ్రకు మద్దతు పలికే పార్టీలకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆ సంఘం ఈ సందర్భంగా తెలిపింది. అయితే రాష్ట్ర విభజనపై ఆలోచన విరమించుకోవాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు దశలవారీగా ఉద్యమాన్ని చేపడతామని ఏపీ ఎన్జీవోస్ సంఘం పేర్కొంది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement