కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కసరత్తు
హైదరాబాద్: రాష్ట్ర విభజన తేదీని కొంత ముందుకు జరపనున్నట్లు ఉన్నతస్థాయి వర్గాల సమాచారం. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాలు ఏర్పాటు చేయకుండా జాప్యం చేయడం సమంజసం కాదనే వాదన అధికార వర్గాల్లో వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాన్ని విభజించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రాలు ఏర్పడే తేదీగా ఈ నెల 26ను (అపారుుంటెడ్ డే) నిర్ణయించే అవకాశం ఉందని తెలుస్తోంది. జూన్ 2వ తేదీని అపాయింటెడ్ డేగా ఇంతకుముందు నిర్ణయించిన విషయం తెలిసిందే. అరుుతే దీనివల్ల తెలంగాణ, సీమాంధ్రల్లో ప్రభుత్వాలు ఏర్పాటు చేయకుండా పక్షం రోజుల పాటు వేచి చూడాల్సి ఉంటుంది. ఈ కారణంగా అపాయింటెడ్ డేను ముందుకు జరపాలనే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నెల 21వ తేదీన ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నందున.. ఆ వెంటనే ఆపాయింటెడ్ డే ను ముందుకు జరిపేం దుకు ఆయన అనుమతి తీసుకోనున్నట్లు సమాచారం. మరోవైపు మోడీ ప్రమాణ స్వీకారంతో సంబంధం లేకుండా, ఆయనకు సమాచారం ఇవ్వడం ద్వారా కూడా విభజన తేదీని ముందుకు జరిపే యోచనలో కేంద్ర హోంశాఖ ఉన్నట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి.
26 నుంచి ప్రయోగాత్మకంగా అమలు!: ఇలా ఉండగా ముందుగా నిర్ణరుుంచిన రాష్ట్ర విభజన తేదీ జూన్ 2 కంటే ముందుగానే అంటే.. ఈ నెల 26వ తేదీ నుంచే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలను ప్రయోగాత్మకంగా పనిచేయించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. సచివాలయంతో పాటు రాజధానిలోని పలు ప్రభుత్వరంగ సంస్థలు, శాఖలు, కమిషనరేట్లు, డెరైక్టరేట్లలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలను ప్రయోగాత్మకంగా పని చేయించడం వల్ల అధికారులు, సిబ్బందికి సాధకబాధకాలు తెలిసివస్తాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే, అధికారికంగా ఎటువంటి నిర్ణయాలను తీసుకోరు. ఒక వేళ అపాయింటెడ్ డే ఈ నెల 26గా అధికారికంగా నిర్ణయమైతే రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆ రోజు నుంచి అధికారికంగానే పని ప్రారంభిస్తారుు.
విభజన తేదీ 26కు మారే అవకాశం!
Published Sun, May 18 2014 1:27 AM | Last Updated on Sat, Jun 2 2018 2:08 PM
Advertisement