మాజీ ముఖ్యమంత్రి, జై సమైక్యాంధ్ర అధ్యక్షుడు కిరణ్ కుమార్ రెడ్డి సొంత మండలం కలిగిరిలో ఓటర్లు వినూత్నంగా తమ నిరసన తెలిపారు.
చిత్తూరు : మాజీ ముఖ్యమంత్రి, జై సమైక్యాంధ్ర అధ్యక్షుడు కిరణ్ కుమార్ రెడ్డి సొంత మండలం కలిగిరిలో ఓటర్లు వినూత్నంగా తమ నిరసన తెలిపారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఓటర్లు తమ సమస్యను ఓటర్ స్లిప్ల ద్వారా తెలిపారు. మంచినీళ్లు ఇవ్వని మీకు ఓట్లెందుకు వేయాలంటూ ఓటర్లు బ్యాలెట్ బాక్స్లో స్లిప్లు వేశారు.
కాగా చిత్తూరు జిల్లాలోని 65 జెడ్పీటీసీ, 887 ఎంపీటీసీ స్థానాలకు ప్రజలు ఇచ్చిన తీర్పు నేడు బహిర్గతం కానుంది. జెడ్పీ పీఠాన్ని అధిరోహించాలంటే 33 జెడ్పీటీసీ స్థానాలను కైవశం చేసుకోవాల్సి ఉంటుంది. బ్యాలెట్ పత్రాల రూపంలో ఇచ్చిన తీర్పును లెక్కించడానికి అధికారులు ఆరుచోట్ల కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లాలో స్థానిక సంస్థలకు గత నెల మదనపల్లె, తిరుపతి, చిత్తూరు డివిజన్లకు రెండు విడతలుగా ఎన్నికలు నిర్వహించిన విషయం తెలిసిందే.