కిరణ్.. అభ్యర్థులను ప్రకటించే దమ్ముందా ?
- ధైర్యంవుంటే నాపై పోటీ ఎవరో చెప్పండి
- సవాల్‌విసిరిన పెద్దిరెడ్డి
- జైసమైక్యాంధ్రకు డిపాజిట్లూ దక్కవు
పుంగనూరు, న్యూస్‌లైన్:మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, జైసమైక్యాంధ్రపార్టీ అధ్యక్షుడు కిరణ్‌కుమార్‌రెడ్డికి ధైర్యం ఉంటే ముందుగా సొంత జిల్లాలో ఆ పార్టీ అభ్యర్థులను ప్రకటించాలని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. మూడు సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించిన కిరణ్‌కు దమ్ముం టే పార్టీకి అభ్యర్థులను నిలబెట్టి డిపాజిట్లు దక్కించుకోవాలని, లేకపోతే... పార్టీని రద్దు చేసి, ఏ పార్టీకైనా మద్దతివ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
అభ్యర్థులను ప్రకటించకుండా చవట దద్దమ్మలా....రోడ్‌షోలు నిర్వహించేందుకు సిగ్గులేదా ? అని ప్రశ్నించారు. శనివారం పుంగనూరులో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తనపై వ్యక్తిగత కక్షతో పుంగనూరులో మూడేళ్లుగా అభివృద్ధిని అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కిరణ్‌కు దమ్ము,ధైర్యం వుంటే తన మీద పోటీకి అభ్యర్థిని నియమించాలని పెద్దిరెడ్డి సవాల్ విసిరారు. జిల్లాలో రోడ్‌షోలకు ప్రజలు రాకపోవడంతో కిరణ్‌కుమార్‌రెడ్డి మీద ఉన్న ప్రేమ తేటతెల్లమైందన్నారు. కిరణ్ సీఎంగా రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారని మండిపడ్డారు.
రాష్ట్ర విభజనకు బిల్లుపెడితే పదవికి రాజీనామా చేస్తానని తొలుత గొప్పలు చెప్పిన కిరణ్, ఆ తరువాత సీఎం కుర్చీకాపాడుకోవడానికి తెలుగుదేశం, కాంగ్రెస్, బీజీపీలతో కలిసి కుట్రలుపన్ని రాష్ర్ట విభజనకు పూనుకున్నారని దుయ్యబట్టా రు. రాష్ట్ర అభివృద్ధి పట్టించుకోని కిరణ్‌కుమార్‌రెడ్డి అవినీతితో వేలాది కోట్లు సంపాదించి, పార్టీ పెట్టే స్థాయి కి ఎదిగారని ఆరోపించారు. తెలుగు ప్రజలను విడగొట్టిన కిరణ్ తప్పులు కప్పిపుచ్చుకునేందుకు పార్టీ ఏర్పాటు చేసి, డ్రామాలాడుతున్నారని విమర్శించారు.
సిగ్గూఎగ్గూలేకుండా పార్టీ గుర్తుగా పాదరక్షలను ఎంపికచేసుకున్నారని ఎద్దేవాచేశారు. జైసమైక్యాంధ్ర అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కవన్నారు. రాష్ట్ర విభజనను అడ్డుకోలేని కిరణ్ రోడ్‌షోల్లో సమైక్యం పేరుతో ప్రజలను ఆకట్టుకునేందుకు డ్రామాలాడితే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. జగన్‌మోహన్‌రెడ్డిని, వైఎస్‌ఆర్‌సీపీని విమర్శించే అర్హత కిరణ్‌కు లేదన్నారు.
విశేష ప్రజాభిమానం ఉన్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రానున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రి కావడం ఖాయమని ధీమావ్యక్తంచేశారు. వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం రాగానే కిరణ్‌కుమార్‌రెడ్డి అవినీతి అక్రమాలపై విచారణ జరిపించి, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో నేతలు రెడ్డెప్ప, వెంకటరెడ్డి యాదవ్, కొండవీటి నాగభూషణం, నాగరాజరెడ్డి, జింకా వెంకటాచలపతి, బెరైడ్డిపల్లె కృష్ణమూర్తి, బాబ్‌జాన్ తదితరులు పాల్గొన్నారు.
మూడేళ్లు రెడ్డెప్పరెడ్డి ఏమైనా పట్టించుకున్నారా ?
జిల్లాలో కిరణ్‌కుమార్‌రెడ్డి అనుచరుడుగా ఉన్న ఎమ్మెల్సీ రెడ్డెప్పరెడ్డి ఏనాడైనా పుంగనూరు అభివృద్ధి గురించి పట్టించుకున్నారా..? అంటూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు సంవత్సరాలు పుంగనూరు అభివృద్ధిని కిరణ్ అడ్డుకోగా.. ఆయన ఏమి చేశారు..? అప్పుడు అభివృద్ధి గురించే మరిచిపోయూరా...? అంటూ నిలదీశారు. సమైక్యాంధ్ర పేరుతో ఓట్ల కోసం వస్తున్న ఇలాంటి అవకాశవాదులకు తగిన గుణపాఠం నేర్పాలని ప్రజలను కోరారు.