వాకా బీజేపీలో చేరిక | vaka vasudevarao join in bjp | Sakshi
Sakshi News home page

వాకా బీజేపీలో చేరిక

Published Wed, May 28 2014 2:25 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

వాకా బీజేపీలో చేరిక - Sakshi

వాకా బీజేపీలో చేరిక

 పెడన, న్యూస్‌లైన్ : జై సమైక్యాంధ్ర పార్టీ పెడన నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి వాకా వాసుదేవరావు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాధ్‌సింగ్ సమక్షంలో మంగళవారం ఆయన పెడనకు చెందిన 15 మంది పార్టీ నాయకులతో కలసి ఢిల్లీలో పార్టీలో చేరారు.

ఈ విషయాన్ని స్థానిక విలేకరులకు ఫోన్‌లో వివరించారు. జిల్లాలో రైతులు, చేనేత కార్మికులు, మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలను రాజ్‌నాధ్‌సింగ్ దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన తెలిపారు. మాసాబత్తుల శ్రీనివాసరావు, బొర్రా నటేష్, మహాంతి ప్రసాదు, పిచ్చుక శంకర్, గోళ్ల రామాంజనేయులు తదితరులు బీజేపీలో చేరినవారిలో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement