- మొత్తం 65 మండలాల్లో 37 టీడీపీ కైవశం, 22 చోట్ల వైఎస్సార్‌సీపీ
- రెండు చోట్ల జేఎస్పీ..మరో చోట ఇండిపెండెంట్
- ఎర్రవారిపాళెం, నిమ్మనపల్లె, కేవీబీ పురం ఎన్నిక లు వాయిదా
మండలాలను ఏలే పాలకులు కొలువుదీరారు. జిల్లాలోని 65 మండల పరిషత్‌లలో శుక్రవారం 62 స్థానాలకు ఎన్నికలు ముగిశాయి. 37 మండలాల్లో టీడీపీ, 22 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ పాలకవర్గాలు కొలువుదీరాయి. కలికిరి, గుర్రంకొండలో జై సమైక్యాంధ్రపార్టీ పాలకవర్గాలను ఏర్పాటు చే సింది. పెద్దమండ్యంలో పాలకవర్గాన్ని స్వతంత్రులు ఏర్పాటు చేయడం గమనార్హం. కేవీబీ పురం, నిమ్మనపల్లె మండలాల ఎన్నికలు శనివారానికి వాయిదా పడ్డాయి. ఎర్రావారిపాళెంలో సభ్యులెవరూ రాకపోవడంతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ విషయూన్ని రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదించారు.
‘పుర’ పాలకవర్గాలతో పాటు ‘మండల పరిషత్’ పాలకవర్గాల ఎన్నికలు కూడా ముగిశాయి. జిల్లా వ్యాప్తం గా 65 మండలాలకు శుక్రవారం పాలకవర్గాల ఎన్నిక జరగాలి. అయితే చంద్రగిరి నియోజకవర్గం ఎర్రావారిపాళెం, సత్యవేడు నియోజకవర్గం కేవీబీ పురం, మదనపల్లె నియోజకవర్గంలోని నిమ్మనపల్లె మండలాల ఎన్నికలు అనివార్య కారణాలతో వాయిదా పడ్డాయి. తక్కిన అన్ని స్థానాలకు ప్రశాంతంగా ఎన్నికల తంతు ముగి సింది.
కేవీబీ పురం ఎన్నికలో చిక్కు ప్రశ్న
కేవీబీ పురం మండలంలో 12ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. అందులో 10 టీడీపీ, 2 స్థానాలను వైఎస్సార్‌సీపీ దక్కించుకున్నాయి. మండలాధ్యక్ష స్థానం ఎస్‌టీ సామాజికవర్గానికి రిజర్వ్ అయింది. అయితే పాలకవర్గాన్ని ఏర్పా టు చేసేందుకు మెజారిటీ దక్కించుకున్న టీడీపీలో ఎస్‌టీ సభ్యులు లేరు. వైఎస్సార్‌సీపీ నుంచి గెలిచిన ఇద్దరిలో సులోచన ఎస్టీ సామాజికవర్గానికి చెందిన ఎంపీటీసీ సభ్యురాలు. రిజర్వేషన్ల ప్రకారం సులోచనకు మండలాధ్యక్ష పదవి దక్కాలి. అయితే ఇందుకు టీడీపీ ససేమిరా అంటోంది. శుక్రవారం పాలకవర్గ ఎన్నికకు టీడీపీ సభ్యులు గైర్హాజరయ్యారు. దీంతో శనివారానికి ఎన్నిక వాయిదా పడింది. శనివారం కూడా ఇదే తంతు జరిగితే... కేవీబీ పురం ఎన్నిక సమస్యను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ దృష్టికి తీసుకెళ్లనున్నారు.
ఎర్రావారిపాళెంలో చిత్రమైన సమస్య
ఎర్రావారిపాళెంలో 8 ఎంపీటీసీ స్థానా లు ఉన్నాయి. ఇందులో 3 కాంగ్రెస్, 3 స్థానాలను వైఎస్సార్‌సీపీ దక్కించుకున్నాయి. టీడీపీ రెండు స్థానాల్లో గెలుపొందింది. వీరు ఏ పార్టీకి మద్దతు ఇవ్వలేదు. ఎవరూ ఎన్నికలకు వెళ్లలేదు. దీంతో ఎన్నిక వాయిదా పడింది.
సభ్యురాలి అనారోగ్యకారణంతో..
మదనపల్లె నియోజకవర్గంలో నిమ్మనపల్లె పాలకవర్గం ఎన్నిక శనివారానికి వాయిదా పడింది. ఇక్కడ పాలకవర్గాన్ని ఏర్పాటు చేసేందుకు వైఎస్సార్‌సీపీకి స్పష్టమైన మెజారిటీ ఉంది. అయితే ఆ పార్టీకి చెందిన ఎంపీటీసీ సభ్యురాలు హాజీరాంజీ అనారోగ్యకారణాలతో ఆస్పత్రికి వెళ్లారు. దీంతో ఎన్నిక వాయిదా పడింది.
4 నియోజకవర్గాల్లో క్లీన్ స్వీప్ :
జిల్లాలోని మొత్తం 14 నియోజకవర్గాలకుగాను మదనపల్లె నియోజకవర్గంలో మదనపల్లె, రామసముద్రం మండలాలను వైఎస్సార్‌సీపీ దక్కించుకున్నాయి. నిమ్మనపల్లె కూడా నేడు వైఎస్సార్‌సీపీ ఖాతాలోకి చేరనుంది. అలాగే శ్రీకాళహస్తి పరిధిలోని 4,కుప్పం నియోజకవర్గంలో 4,చిత్తూరు పరిధిలో 2 మండల పరిషత్‌లను టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది.
ఐరాల లక్కీగా టీడీపీకి ..:
పూతలపట్టు నియోజకవర్గంలోని ఐరాల మండలంలో 14 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. టీడీపీ, వైఎస్సార్‌సీపీ చెరో ఏడింటిలో నెగా్గాయి. దీంతో ఎంపీపీ ఎన్నికకు ఁలక్కీ డ్రిప్‌రూ. నిర్వహించారు. ఇందులో టీడీపీ అభ్యర్థి పేరు వచ్చింది. దీంతో ఁలక్కీరూ.గా ఐరాల స్థానం టీడీపీ వశమైంది.
జేఎస్సీ ఖాతాలో రెండు :
పీలేరు నియోజకవర్గంలోని కలికిరి, గుర్రంకొండలో జై సమైక్యాంధ్రపార్టీ పాలకవర్గాలను ఏర్పాటు చేసింది. ఈ పార్టీ సభ్యులు పీలేరు మండలంలో గెలిచినప్పటికీ పీలేరు పాలకవర్గం ఎన్నికకు గైర్హాజరయ్యారు. అలాగే తంబళ్లపల్లె నియోజకవర్గంలోని పెద్దమండ్యం మండల పాలకవర్గాన్ని స్వతంత్రులు ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రధానపార్టీలకు పూర్తిస్థాయి మెజారిటీ లేదు. దీంతో స్వతంత్ర అభ్యర్థికి ఎంపీపీ స్థానం దక్కింది.