state election
-
లక్ష దరఖాస్తుల పరిశీలన పూర్తి
హన్మకొండ అర్బన్ : రాష్ట్రప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు సామాజిక భద్రత పింఛన్ల మొత్తాన్ని రూ.200 నుంచి రూ.వెయ్యికి, వికలాంగుల పింఛన్లను రూ. 500 నుంచి రూ.1500కు పెంచిన విషయం విదితమే. ఈ మేరకు కొత్తగా ఆహార భద్రత కార్డులు, పింఛన్లు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించడమే కాకుండా ఈనెల 10నుంచి 20వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించింది. ఇందులో భాగంగా జిల్లావ్యాప్తంగా ఆహార భద్రత కార్డుల కోసం 10,24,000 దరఖాస్తులు రాగా, పింఛన ్లకోసం 5.25ల క్షల దరఖాస్తులు అందాయి. అయితే, వీటిలో ప్రభుత్వం పింఛన్ల మంజూరుకే తొలి ప్రాధాన్యమిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు పింఛన్ల కోసం అందిన దరఖాస్తులను పరిశీలించిన ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం దీన్ని నవంబర్ 2వ తేదీలోగా పూర్తిచేయాలని అధికార యంత్రాంగానికి సూచించింది. అంతేకాకుండా నవంబర్ 7వ తేదీన అర్హుల జాబితా రూపొందించి, 8న గ్రామ, మండల స్థాయిలో కార్యక్రమాలు ఏర్పాటు చేసి లబ్ధిదారులకు ఉత్తర్వులు అందజేయాలని నిర్ణయించారు. కాగా, బుధవారం నాటికి సుమారు లక్ష వరకు దరఖాస్తుల పరిశీలన పూర్తయినట్లు అధికారిక వర్గాల సమాచారం. 400 మందితో పరిశీలన.. తొలుత పింఛన్ల కోసం అందిన దరఖాస్తులనే పరిశీలించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. అన్ని రకాల పింఛన్ల కోసం జిల్లా వ్యాప్తంగా 5.25లక్షల దరఖాస్తులు అందగా అధికారులు ఇంటింటికీ వెళ్లి పరిశీలన చేపడుతున్నారు. దీనికోసం ఒక్కో మండలానికి ఆరుగురు ఆధికారులను నియమించగా.. వారిపై మండలస్థా యి, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి అధికారులను పర్యవేక్షణ కోసం ఏర్పాటు చేశారు. ఇలా మొత్తం 400మంది అధికారులు, ఉద్యోగులను పరిశీలన కోసం నియమించారు. అం తేకాకుండా నవంబర్ 8వ తేదీన పింఛన్లు మంజూరైన లబ్ధిదారులకు ఉత్తర్వులు ఇచ్చిన అనంతరం ఆహార భద్రత కార్డుల కోసం వచ్చి న దరఖాస్తుల పరిశీలనపై స్పష్టత వచ్చే అవకాశముంది. అయితే, ఒకే ఇంటి నుంచి ఆహార భద్రత, పింఛన్ కోసం దరఖాస్తు అందితే మాత్రం రెండింటి పరిశీలన పూర్తి చేస్తున్నారు. ఆశించిన దానికన్నా తక్కువే.. జిల్లావ్యాప్తంగా గతంలో 4.92ల క్షల సామాజిక భద్రతా పింఛన్లు అన్ని రకాలవి ఉన్నాయి. వీటితో పాటు మరో 40వేల దరఖాస్తులు అధికారుల వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. అయితే, కొత్తగా పింఛన్ల కోసం 7లక్షల దరఖాస్తులు వస్తాయని అంచనా వేయగా, 5.25లక్షల దరఖాస్తులే రావడం గమనార్హం. ఇక కుటుంబానికి ఒకే వృద్ధాప్య పింఛన్ అన్న ప్రభుత్వ నిర్ణయంతో పాటు వివిధ కారణాలతో దరఖాస్తుల్లో 25శాతం తిరస్కరణకు గురవుతాయని భావిస్తున్నారు. అంటే గతంతో పోలిస్తే పింఛన్ల సంఖ్య పెద్దగా పెరిగే అవకాశం ఉండదు. కాగా, ప్రస్తుతం నవంబర్ నుంచే పెరిగిన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినా క్షేత్రస్థాయి పరిస్థితుల్లో ఇది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. నవంబర్ 8వ తేదీ నాటికి ప్రొసీడింగ్సను సిద్ధం చేయడం ఇబ్బందేనని అధికారులు భావిస్తుండగా... నవంబర్‌లో ఇవ్వాల్సిన పింఛన్‌ను కూడా డిసెంబర్ పింఛన్‌తో కలిపి ఇచ్చే అవకాశముందని సమాచారం. -
మండలాధీశులు
మొత్తం 65 మండలాల్లో 37 టీడీపీ కైవశం, 22 చోట్ల వైఎస్సార్సీపీ రెండు చోట్ల జేఎస్పీ..మరో చోట ఇండిపెండెంట్ ఎర్రవారిపాళెం, నిమ్మనపల్లె, కేవీబీ పురం ఎన్నిక లు వాయిదా మండలాలను ఏలే పాలకులు కొలువుదీరారు. జిల్లాలోని 65 మండల పరిషత్‌లలో శుక్రవారం 62 స్థానాలకు ఎన్నికలు ముగిశాయి. 37 మండలాల్లో టీడీపీ, 22 స్థానాల్లో వైఎస్సార్సీపీ పాలకవర్గాలు కొలువుదీరాయి. కలికిరి, గుర్రంకొండలో జై సమైక్యాంధ్రపార్టీ పాలకవర్గాలను ఏర్పాటు చే సింది. పెద్దమండ్యంలో పాలకవర్గాన్ని స్వతంత్రులు ఏర్పాటు చేయడం గమనార్హం. కేవీబీ పురం, నిమ్మనపల్లె మండలాల ఎన్నికలు శనివారానికి వాయిదా పడ్డాయి. ఎర్రావారిపాళెంలో సభ్యులెవరూ రాకపోవడంతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ విషయూన్ని రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదించారు. ‘పుర’ పాలకవర్గాలతో పాటు ‘మండల పరిషత్’ పాలకవర్గాల ఎన్నికలు కూడా ముగిశాయి. జిల్లా వ్యాప్తం గా 65 మండలాలకు శుక్రవారం పాలకవర్గాల ఎన్నిక జరగాలి. అయితే చంద్రగిరి నియోజకవర్గం ఎర్రావారిపాళెం, సత్యవేడు నియోజకవర్గం కేవీబీ పురం, మదనపల్లె నియోజకవర్గంలోని నిమ్మనపల్లె మండలాల ఎన్నికలు అనివార్య కారణాలతో వాయిదా పడ్డాయి. తక్కిన అన్ని స్థానాలకు ప్రశాంతంగా ఎన్నికల తంతు ముగి సింది. కేవీబీ పురం ఎన్నికలో చిక్కు ప్రశ్న కేవీబీ పురం మండలంలో 12ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. అందులో 10 టీడీపీ, 2 స్థానాలను వైఎస్సార్సీపీ దక్కించుకున్నాయి. మండలాధ్యక్ష స్థానం ఎస్టీ సామాజికవర్గానికి రిజర్వ్ అయింది. అయితే పాలకవర్గాన్ని ఏర్పా టు చేసేందుకు మెజారిటీ దక్కించుకున్న టీడీపీలో ఎస్టీ సభ్యులు లేరు. వైఎస్సార్సీపీ నుంచి గెలిచిన ఇద్దరిలో సులోచన ఎస్టీ సామాజికవర్గానికి చెందిన ఎంపీటీసీ సభ్యురాలు. రిజర్వేషన్ల ప్రకారం సులోచనకు మండలాధ్యక్ష పదవి దక్కాలి. అయితే ఇందుకు టీడీపీ ససేమిరా అంటోంది. శుక్రవారం పాలకవర్గ ఎన్నికకు టీడీపీ సభ్యులు గైర్హాజరయ్యారు. దీంతో శనివారానికి ఎన్నిక వాయిదా పడింది. శనివారం కూడా ఇదే తంతు జరిగితే... కేవీబీ పురం ఎన్నిక సమస్యను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఎర్రావారిపాళెంలో చిత్రమైన సమస్య ఎర్రావారిపాళెంలో 8 ఎంపీటీసీ స్థానా లు ఉన్నాయి. ఇందులో 3 కాంగ్రెస్, 3 స్థానాలను వైఎస్సార్సీపీ దక్కించుకున్నాయి. టీడీపీ రెండు స్థానాల్లో గెలుపొందింది. వీరు ఏ పార్టీకి మద్దతు ఇవ్వలేదు. ఎవరూ ఎన్నికలకు వెళ్లలేదు. దీంతో ఎన్నిక వాయిదా పడింది. సభ్యురాలి అనారోగ్యకారణంతో.. మదనపల్లె నియోజకవర్గంలో నిమ్మనపల్లె పాలకవర్గం ఎన్నిక శనివారానికి వాయిదా పడింది. ఇక్కడ పాలకవర్గాన్ని ఏర్పాటు చేసేందుకు వైఎస్సార్సీపీకి స్పష్టమైన మెజారిటీ ఉంది. అయితే ఆ పార్టీకి చెందిన ఎంపీటీసీ సభ్యురాలు హాజీరాంజీ అనారోగ్యకారణాలతో ఆస్పత్రికి వెళ్లారు. దీంతో ఎన్నిక వాయిదా పడింది. 4 నియోజకవర్గాల్లో క్లీన్ స్వీప్ : జిల్లాలోని మొత్తం 14 నియోజకవర్గాలకుగాను మదనపల్లె నియోజకవర్గంలో మదనపల్లె, రామసముద్రం మండలాలను వైఎస్సార్సీపీ దక్కించుకున్నాయి. నిమ్మనపల్లె కూడా నేడు వైఎస్సార్సీపీ ఖాతాలోకి చేరనుంది. అలాగే శ్రీకాళహస్తి పరిధిలోని 4,కుప్పం నియోజకవర్గంలో 4,చిత్తూరు పరిధిలో 2 మండల పరిషత్‌లను టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఐరాల లక్కీగా టీడీపీకి ..: పూతలపట్టు నియోజకవర్గంలోని ఐరాల మండలంలో 14 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. టీడీపీ, వైఎస్సార్సీపీ చెరో ఏడింటిలో నెగా్గాయి. దీంతో ఎంపీపీ ఎన్నికకు ఁలక్కీ డ్రిప్రూ. నిర్వహించారు. ఇందులో టీడీపీ అభ్యర్థి పేరు వచ్చింది. దీంతో ఁలక్కీరూ.గా ఐరాల స్థానం టీడీపీ వశమైంది. జేఎస్సీ ఖాతాలో రెండు : పీలేరు నియోజకవర్గంలోని కలికిరి, గుర్రంకొండలో జై సమైక్యాంధ్రపార్టీ పాలకవర్గాలను ఏర్పాటు చేసింది. ఈ పార్టీ సభ్యులు పీలేరు మండలంలో గెలిచినప్పటికీ పీలేరు పాలకవర్గం ఎన్నికకు గైర్హాజరయ్యారు. అలాగే తంబళ్లపల్లె నియోజకవర్గంలోని పెద్దమండ్యం మండల పాలకవర్గాన్ని స్వతంత్రులు ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రధానపార్టీలకు పూర్తిస్థాయి మెజారిటీ లేదు. దీంతో స్వతంత్ర అభ్యర్థికి ఎంపీపీ స్థానం దక్కింది. -
12 చోట్ల నేడు రీపోలింగ్
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ర్టంలో 12 బూత్‌లలో మంగళవారం రీపోలింగ్‌ను చేపట్టనున్నారు. ఈ నెల 17న పోలింగ్ సందర్భంగా ఈవీఎంలు మొరాయించడం, ఒక చోట పోలింగ్ సిబ్బంది తప్పిదాల వల్ల రీపోలింగ్‌ను నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి అనిల్ కుమార్ ఝా సోమవారం తెలిపారు. మొత్తం తొమ్మిది లోక్‌సభ నియోజక వర్గాల పరిధిలో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు వరకు రీపోలింగ్‌ను నిర్వహించనున్నారు. హావేరి నియోజక వర్గంలోని రాణిబెన్నూరు, బాలగలకోటెలోని జమఖండి, బాగలకోటె, బిజాపురలోని సిందగి, గుల్బర్గలోని సేడం, రాయచూరులోని షాపూర్, యాదగిరి, బీదర్‌లో రెండు, శివమొగ్గలోని బైందూరు, హాసనలోని అరసికెరె, తుమకూరు నియోజక వర్గంలోని తురువెకెరె బూత్‌లలో రీపోలింగ్ జరుగనుంది. కాగా రాష్ట్రంలో ఒకే దశలో ఈ నెల 17న ముగిసిన ఎన్నిక్లలో 67.3 శాతం మంది ఓటు హక్కును వినియోగించుకున్న సంగతి తెలిసిందే.