సీమాంధ్రలో పోటీ చేసేందుకు జై సమైక్యాంధ్ర పార్టీ(జేఎస్పీ), సీపీఎంల మధ్య ఎన్నికల పొత్తు కుదిరింది. సీపీఎంకు 18 అసెంబ్లీ, 2 లోక్‌సభ స్థానాల్లో జేఎస్పీ మద్దతు ప్రకటించింది.
18 అసెంబ్లీ, 2 లోక్‌సభ స్థానాల్లో సీపీఎంకు జేఎస్పీ మద్దతు
కిరణ్‌కుమార్‌రెడ్డి, మధు వెల్లడి
హైదరాబాద్: సీమాంధ్రలో పోటీ చేసేందుకు జై సమైక్యాంధ్ర పార్టీ(జేఎస్పీ), సీపీఎంల మధ్య ఎన్నికల పొత్తు కుదిరింది. సీపీఎంకు 18 అసెంబ్లీ, 2 లోక్‌సభ స్థానాల్లో జేఎస్పీ మద్దతు ప్రకటించింది. ఇరుపార్టీల మధ్య పరస్పర అవగాహన కుదిరిందని బుధవారం జేఎస్పీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు కిరణ్‌కుమార్‌రెడ్డి, సీపీఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి పి.మధులు ప్రకటించారు.
కిరణ్ మాట్లాడుతూ తమ ఆలోచనలకు, సిద్ధాంతాలకు దగ్గరగా ఉన్నందునే సీపీఎంతో ఎన్నికల సర్దుబాటు చేసుకున్నామన్నారు. రాష్ట్ర విభజనకు కారణమైన కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా తాము పనిచేస్తామన్నారు. కాగా, ఎన్నికల్లో తన పోటీపై కిరణ్ దాటవేశారు. మధు మాట్లాడుతూ ఇప్పటివరకు 18 అసెంబ్లీ, 2 లోక్‌సభ స్థానాల్లో సీపీఎం పోటీ చేసేందుకు జేఎస్పీతో సూత్రప్రాయంగా పొత్తు కుదిరింద ని చెప్పారు.