కిరణ్‌కు సీఎం కుర్చీ ఇవ్వడం పొరపాటే | Wrong giving the chair CM Kiran | Sakshi
Sakshi News home page

కిరణ్‌కు సీఎం కుర్చీ ఇవ్వడం పొరపాటే

Published Tue, Apr 22 2014 3:08 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

కిరణ్‌కు సీఎం కుర్చీ ఇవ్వడం పొరపాటే - Sakshi

కిరణ్‌కు సీఎం కుర్చీ ఇవ్వడం పొరపాటే

ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి

 నెల్లూరు: ఎలాంటి అనుభవం లేని కిరణ్‌కుమార్‌రెడ్డిని సీఎం కుర్చీలో కూర్చోబెట్టడం తమ పార్టీ చేసిన పెద్ద పొరపాటని సీమాంధ్ర పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి అన్నారు. సోమవారం ఆయన నెల్లూరులో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్‌ను పలువురు నేతలు వీడటంతో పీడ విరగడైనందుకు సంతోషంగా ఉందన్నారు. విశ్వాస ఘాతకుడైన కిరణ్ గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిదన్నారు. స్వతంత్ర అభ్యర్థులకైనా నాలుగు ఓట్లు వస్తాయని, కిరణ్ పార్టీకి అవీ రావన్నారు.

విభజన విషయమై ప్రతిదీ ముందే తెలిసినప్పటికీ తమకెవరికీ చెప్పకుండా మభ్యపెట్టారని విరుచుకుపడ్డారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక అందజేశాక తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని కేంద్రం చెప్పినప్పుడు కిరణ్ అడ్డు తగిలారని, కేవలం సీఎంగా కొనసాగేందుకే కాలయాపన చేశారని మండిపడ్డారు. కిరణ్ గురించి మాట్లాడాలంటే తనకు సంస్కారం అడ్డువస్తోందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement