'కిరణ్కుమార్ రెడ్డి చాలా ద్రోహం చేశారు' | kiran kumar reddy betrayed congress part, says raghuveera reddy | Sakshi
Sakshi News home page

'కిరణ్కుమార్ రెడ్డి చాలా ద్రోహం చేశారు'

Published Sun, Sep 28 2014 8:19 PM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

'కిరణ్కుమార్ రెడ్డి చాలా ద్రోహం చేశారు' - Sakshi

'కిరణ్కుమార్ రెడ్డి చాలా ద్రోహం చేశారు'

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి మాజీ సీఎం కిరణ్కుమార్ రెడ్డి చాలా ద్రోహం చేశారని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరా రెడ్డి విమర్శించారు. రాష్ట్ర విభజన జరుగుతుందని కిరణ్ కుమార్ రెడ్డికి ముందే స్పష్టంగా తెలుసునని అన్నారు. విభనకు అన్ని పార్టీలూ కారణమన్నారు.

ప్రజల కోసం తమ పార్టీ పోరాడుతుందన్నారు. అన్నివర్గాల ప్రజలకు కాంగ్రెస్ మాత్రమే న్యాయం చేయగలదని చెప్పారు. ప్రజల తరపున నిలబడి కాంగ్రెస్ కుపూర్వ వైభవం తీసుకొస్తామన్నారు.

పంట పొలాల్లో ఏపీ రాజధాని ఏర్పాటు చేయొద్దని కోరారు. ప్రభుత్వ భూముల్లోనే రాజధాని ఏర్పాటు చేయాలని సూచించారు. వ్యవసాయ రుణమాఫీ విషయంలో టీడీపీ సర్కారు పూటకో మాట మాట్లాడుతోందని రఘువీరా రెడ్డి విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement