'రాజధాని'పై పారదర్శకత లోపిస్తోంది
విజయవాడ: రుణమాఫీఫై ప్రభుత్వం రోజుకోమాట మాట్లాడుతోందని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరా రెడ్డి విమర్శించారు. సీఎం, మంత్రులు చెప్పే మాటలకు పొంతనలేదన్నారు. ప్రభుత్వ ప్రకటనలతో రైతులు, డ్వాక్రా మహిళలు అయోమయానికి గురౌతున్నారని చెప్పారు.
టీడీపీ హామీలన్నీ నెరవేర్చాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రభుత్వం మెడలు వంచైనా రైతు రుణమాఫీ చేయిస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను నీరుగార్చే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. రాజధాని విషయంలో పారదర్శకత లోపిస్తోందని ఆయన వాపోయారు.