నల్లారిది ముగిసింది.. ముగియాల్సింది నారావారిదే!
నల్లారిది ముగిసింది.. ముగియాల్సింది నారావారిదే!
Published Mon, May 5 2014 1:24 PM | Last Updated on Wed, Aug 29 2018 3:33 PM
ఆంధ్రప్రదేశ్ విభజన అంశంతో రాష్ట్ర రాజకీయాల్లో తలపండిన నాయకులు కనుమరుగైపోయారు. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కు అన్నివిధాల సహకరించిన అప్పటి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ తన పాత్ర పూర్తయిందని నిర్ఱారించుకున్న తర్వాత సమైక్య రాష్ట్రం కోసం తానే చాంఫియన్ అనే రీతిలో జై సమైక్యాంధ్ర అనే ఓ రాజకీయ దుకాణాన్ని తెరిచారు. మంత్రివర్గంలోని తన సహచరులంతా వెంటనడుస్తారనే అతివిశ్వాసంతో జనంలోకి వెళ్లిన నల్లారికి ఊహించని షాకే తగిలింది. నల్లారి దళంలో నేతలు ఒక్కొక్కరే జారుకోవడంతో నల్లారి పరిస్థితి రాష్ట్ర రాజకీయాల్లో అతి దయనీయంగా మారింది.
ఎలాగోలా కష్టపడి అభ్యర్ధులను నిలబెట్టి పాదరక్షలిచ్చిన నల్లారికి ఒక్కొక్కరు చేతులెత్తేశారు. పరిస్థితి చేజారిపోయిందనుకున్న నల్లారి స్వంత జిల్లాలో బరిలో సైతం నిలవకుండా తుస్సు మనిపించారు. ఇక జట్టు కెప్టెనే చేతులేత్తేసాక.. అభ్యర్ధులు, నేతలు ఏం చేస్తారు.. ఒక్కొక్కరు తమకు దొరికిన ఆసరాతో జంప్ జిలానీల జాబితాలో చేరారు.
ఇక చిత్తూరు జిల్లాలో మిగిలి ఉన్న నాయకుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పరిస్థితి కూడా దయనీయంగా ఉంది. సీమాంధ్ర ప్రాంతంలో బలంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎదుర్కొనేందుకు తన బలం సరిపోదనుకున్న నారా వారు నరేంద్ర మోడీ బలంతో నెగ్గుకు రావడానికి ప్రణాళిక రచించారు. వైస్ జగన్ ను ఢీకొట్టేందుకు మోడీ ప్రభావం సరిపోదనుకున్న చంద్రబాబు.. సినీ గ్లామర్ ను ఆశ్రయించారు. అప్పుడప్పుడే జనసేన అంటూ కొత్త దుకాణం తెరిచిన పవన్ కళ్యాణ్ ను గట్టేక్కించాలని వేడుకున్నారు. అయినా 'గడ్డంత్రయం' మోడీ, పవన్, చంద్రబాబు ల ప్రభావం అంతంతా మాత్రమే అని తేలిపోయింది.
పరిస్థితులు ఇలా ఉండగా.. ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడు ఇక కనిపించరని.. తెలుగుదేశం పార్టీ కూడా కనుమరుగై పోవడం ఖాయమని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఇప్పటికే పదేళ్లపాటు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు.. రాబోయే రోజుల్లో ఆయన పరిస్థితి దిగజారి పరిస్థితి ఉంది. అందుకే వైఎస్ఆర్ సీపీని ఎదుర్కొనేందుకు అన్ని అడ్డదారులు తొక్కుతూ, ఎల్లో మీడియా అసత్య ప్రచారాలు కూడా కాపాడలేకపోతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర రాజకీయాల్లో నల్లారి శకం ముగిసింది. ఇక ఎన్నికల తర్వాత నారావారి శకానికి ముగియడం ఖాయమని రాజకీయ వర్గాల్లో ప్రచారం జోరందుకుంది.
Advertisement
Advertisement