'కొత్త పార్టీ పెడుతున్నట్టు చెప్పలేదు'
హైదరాబాద్: కిరణ్కుమార్ రెడ్డితో ఎలాంటి రాజకీయాల గురించి చర్చించలేదని ఏపీఎన్జీవోల రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు తెలిపారు. మర్యాద పూర్వకంగానే కిరణ్ను కలిశామని చెప్పారు. ఈ సాయంత్రం కిరణ్కుమార్ రెడ్డితో సమావేశం ముగిసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. కొత్త పార్టీ పెడుతున్నట్టు కిరణ్ తమతో చెప్పలేదని తెలిపారు. ఒకవేళ పార్టీ పెట్టి మద్దతు తెలపాలని కోరితే తామంతా చర్చించి నిర్ణయం తీసుకుంటామని అశోక్‌బాబు చెప్పారు.
అత్యంత దుర్మార్గంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చీల్చిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను సీమాంధ్ర ప్రజలు క్షమించరని అంతకుముందు అన్నారు. జరిగిన అన్యాయం గురించి కలత చెంద కుండా, నష్టాన్ని పూడ్చుకోవడంపై దృష్టి పెడతామన్నారు. ప్రజలు ఎన్నుకున్న రాజకీయ నేతలు మోసం చేసినందున, వచ్చే ఎన్నికల్లో స్వార్థపరులైన నాయకులను దూరం పెట్టాలన్నారు.