మంత్రులతో తన క్యాంపు కార్యాలయంలో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి నిర్వహించిన సమావేశం ముగిసింది.
మంత్రులతో తన క్యాంపు కార్యాలయంలో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి నిర్వహించిన సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రాజకీయాలు ప్రస్తావించ లేదని తెలిసింది. భేటీ ముగిసిన తర్వాత సీఎం కిరణ్.. గ్రాండ్ కాకతీయ హోటల్కు వెళ్లారు. 14వ ఆర్థిక సంఘం చైర్మన్ గౌరవార్థం ఇక్కడ సీఎం విందు ఏర్పాటు చేశారు.
ఈ విందుకు ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ సహా పలువురు తెలంగాణ మంత్రులు గైర్హాజరయ్యారు. తెలంగాణ నుంచి ఒక్క గీతారెడ్డి మాత్రమే హాజరయ్యారు. సమైక్యాంధ్రలో జరుగుతున్న ఉద్యమానికి సీఎం కిరణ్ పరోక్షంగా అండ దండలు అందిస్తున్నారని తెలంగాణ ప్రాంత నాయకులు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.