'వయస్సు వేరైనా ఆయనతో అనుబంధం గొప్పది'
హైదరాబాద్: ఎలక్ట్రిసిటీ రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ కె.వి.రంగయ్య 87వ పుట్టిన రోజు వేడుకలను ఆదివారం ఖైరతాబాద్‌లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ కార్యాలయంలో అధికారులు, కుటుంబసభ్యుల మధ్య ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై రంగయ్య దంపతులను జ్ఞాపిక, పూలమాలతో సత్కరించారు.
ఈ సందర్భంగా కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ రంగయ్యతో తనకు మొదట్లో బ్రహ్మానందరెడ్డి పార్క్‌లో వాకర్స్‌గా పరిచయం ప్రారంభమైందన్నారు. వయస్సు వేరైనా ఆయనతో ఉన్న అనుబంధం చాలా గొప్పదన్నారు. తెలంగాణ జెన్‌కో అండ్ ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు మాట్లాడుతూ విద్యుత్ రంగానికి రంగయ్య పునాది లాంటివారన్నారు.
ఈ సందర్భంగా కె.కృష్ణయ్య రచించిన యువత కాపాడుకో నీ భవిత, మాతృభాష తెలుగుకు వెలుగు చూపు, ఎ గైడ్ టు ఈహెచ్‌టీ సబ్ స్టేషన్స్ అనే పుస్తకాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో రిటైర్డ్ ఐఏఎస్ జి.నారాయణరావు, ప్రొఫెసర్ టి.ఎల్.శంకర్, ఎస్‌ఆర్‌టీసీ ఎక్జిక్యూటివ్ డెరైక్టర్ బి.శేఖర్, నటుడు చలపతిరావు, వాసవి ఆస్పత్రి చైర్మన్ గంజి రాజమౌళిగుప్త, అవోపా అధ్యక్షుడు వి.రామకృష్ణలతో పాటు ఉద్యోగులు, రంగయ్య కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.