కాంగ్రెస్‌తో జతకట్టబోం: కిరణ్ | Will not pair with congress, says Kiran kumar reddy | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌తో జతకట్టబోం: కిరణ్

Published Tue, Mar 18 2014 4:46 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

కాంగ్రెస్‌తో జతకట్టబోం: కిరణ్ - Sakshi

కాంగ్రెస్‌తో జతకట్టబోం: కిరణ్

ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసిన ప్రతినిధులు
 విశాఖపట్నం, న్యూస్‌లైన్: తెలుగు ప్రజలను విడగొట్టిన కాంగ్రెస్ పార్టీతో ఎట్టి పరిస్థితుల్లో జత కట్టబోమని మాజీ ముఖ్యమంత్రి, జై సమైక్యాంధ్ర పార్టీ వ్యవస్థాపకుడు నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. విశాఖలో సోమవారం ముస్లింలు, న్యాయవాదులు, వైద్యులు, ఉత్తరాంధ్ర జర్నలిస్టులు, అర్చకుల జేఏసీ ప్రతినిధులతో తెలుగు జాతి ఆత్మగౌరవ సభ నిర్వహించారు. పలు జేఏసీల ప్రతినిధులు, విద్యార్థులు ఆయనను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. కాంగ్రెస్‌తో కలుస్తారా? అని ప్రశ్నించడంతో ఆ పార్టీతో కలిసేది లేదన్నారు. రాష్ట్ర విభజన జరిగిపోరుున తర్వాత సమైక్యాంధ్ర కోసం పోరాట ఫలితం ఉంటుందా..? అని అడిగితే విభజనకు సంబంధించి కోర్టులో ఉన్న కేసులకు తీర్పులు అనుకూలంగా వస్తాయన్న ఆశాభావం ఉందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement