విభజన తుఫాన్ ఆపుతాం: సీఎం కిరణ్
దేవగుడితోట: రాష్ట్ర విభజనను కచ్చితంగా ఆపుతామని ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్రానికి నష్టం కలిగించే విభజనను అడ్డుకుంటామని ఆయన స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో పై-లిన్ తుఫాన్ బాధిత ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా కవిటిమండలం దేవగుడితోటలో నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. సమైక్యాంధ్ర గురించి మాట్లాడే సమయం, సందర్భం కాదంటూ విభజనను అడ్డుకుంటామంటూ ఒక్కమాట చెప్పారు. పై-లిన్ తుఫాన్ను ఆపలేకపోయమని, కానీ ఈ సైక్లోన్(విభజన తుఫాన్)ను ఆపి తీరుతామని ఆయన ప్రకటించారు.
తుఫాన్ బాధితులను ఆదుకుంటామని సీఎం హామీయిచ్చారు. కొబ్బరి రైతులకు ఇచ్చే పరిహారం పెంచుతున్నట్టు ప్రకటించారు. బాధిలతులు తమ పేర్లను అధికారుల వద్ద నమోదు చేసుకోవాలని సూచించారు.