సోనియాకు రాష్ట్రాన్ని తాకట్టుపెట్టారు
Published Mon, Oct 7 2013 5:02 AM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM
పొందూరు, న్యూస్‌లైన్: ఆంధ్రప్రదేశ్‌ను సీఎం కిరణకుమార్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడులు సోనియాగాంధీకి తాకట్టుపెట్టేశారని వైఎస్సార్ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి తమ్మినేని సీతారాం విమర్శించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా పొందూరులో ఆదివారం ఏర్పాటు చేసిన ప్రజాగర్జన సభకు హాజరైన వారికి తమ్మినేని ముందుగా శిరస్సువంచి పాదాభివందనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల అభీష్టం మేరకు వైఎస్ తనయ షర్మిల సమ్య్యై శంఖారావం పూరిస్తే, తనయుడు జగన్‌మోహన్ రెడ్డి సమైక్యాంధ్ర కోసం ఆమరణ దీక్ష చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రజలకు వెన్నుంటి నిలిచి నిరాహార దీక్షకు పూనుకోవడం నిజంగా గర్వించదగ్గ విషయమని అభివర్ణించారు.
తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని చంద్రబాబు నాయుడు మంటగలుపుతుంటే ఎన్‌టీఆర్ కుమారులు చూస్తూ ఉండటం విడ్డూరంగా ఉందన్నారు. తెలుగు రాష్ట్రం ఒక్కటిగా ఉండాలనే ఆశయం ఎన్‌టీఆర్, వైఎస్ రాజశేఖర్‌రెడ్డిలదని చెప్పారు. తాత వారసత్వం తీసుకున్నానంటూ జూనియర్ ఎన్‌టీఆర్ ప్రగల్భాలు పలకడమే తప్ప ఎదిరించేదేమీ లేదన్నారు. తక్షణమే చంద్రబాబుకు వ్యతి రేకంగా ఉద్యమాల్లో భాగస్వాలు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా నాయకుడు కణితి విశ్వనాథం, పాలవలస రాజశేఖరం, హనుమంతు కిరణ్, ఎచ్చెర్ల సూర్యనారాయణ, వరుదు కల్యాణి, బల్లాడ హేమమాలినీ రెడ్డి, జనార్దనరెడ్డి, కూన మం గమ్మ, పైడి కృష్ణప్రసాద్, టి.శివప్రసాదరావు, మార్పు ధర్మారావు తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీలో పలువురి చేరిక
జగన్‌మోహన్‌రెడ్డి ఆమరణ నిరాహార దీక్షకు మద్దతుగా ప్రజాగర్జన సాక్షిగా కాంగ్రెస్, టీడీపీలకు చెందిన సర్పంచ్‌లు 8 మంది, మాజీ సర్పంచ్‌లు 16 మంది, ఎంపీటీసీ మాజీ సభ్యులు 8 మంది మూకుమ్మడిగా వైఎస్సార్ సీపీలో చేరారు.
పార్టీలో చేరిన వారిలో సర్పంచ్‌లు మజ్జి గోపాలకృష్ణ(నందివాడ), సీపాన అనిత (గోకర్ణపల్లి), పప్పల సత్యవతి(తోలాపి), గురుగుబెల్లి సరోజనమ్మ(పిల్లలవలస), బడి మణి(దల్లిపేట), గురుగుబెల్లి ఉషామతి(కోటిపల్లి), చల్ల ముఖలింగం(ధర్మపురం), పెద్దింటి రవి(బాణాం), టీడీపీ మాజీ ఎంపీపీ, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు బి.ఎల్.నాయుడు, మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు సింగూరు అమ్మడు, కూన అయ్యపునాయుడు, పైడి గోవిందరావు, పి. సింహాచలం, పొన్నాడ అప్పన్న, రామారావు, సింహాచలం, మెట్ట రమణభట్లు తదితరులు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
అలాగే, కాంగ్రెస్ చెందిన మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు సీపాన శ్రీరంగ నాయకులు, గురుగుబెల్లి మధుసూదనరావు, వాసుదేవరావు, మజ్జి నరేంద్రనాయుడు, పెయ్యల తవిటిరాజు, సీపాన చక్రధరనాయుడు, పెద్దింటి శ్రీను, బొడ్డేపల్లి ప్రసాదరావు, కొండమ్మ, వండాన తవిటినాయుడు, పోతురాజు సూర్యారావు, జ్యోతి, మెదలవలస పాపారావు, దుంపల సత్యవతి తదితరులతో సుమారు 5000 మంది వరకు పార్టీలో చేరారు.
Advertisement
Advertisement