వివక్ష లేకుండా కేంద్రం సాయం: వెంకయ్య | centre to give equal importance to andhra, telangana | Sakshi
Sakshi News home page

వివక్ష లేకుండా కేంద్రం సాయం: వెంకయ్య

Published Wed, Jun 4 2014 5:54 PM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM

వివక్ష లేకుండా కేంద్రం సాయం: వెంకయ్య - Sakshi

వివక్ష లేకుండా కేంద్రం సాయం: వెంకయ్య

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు కేంద్ర సాయం ఉంటుందని కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు తెలిపారు. వివక్ష లేకుండా రెండు రాష్ట్రాలకు కేంద్రం సాయం అందిస్తుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా, రాజధాని నిర్మాణం వంటి సమస్యలు న్నాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని అంశాలను  పేర్కొంటూ పోలవరం, ప్రత్యేక హోదాను వెంటనే అమలు చేయాలని కోరుతూ ప్రధానికి సోనియా లేఖ రాశారని వెంకయ్య తెలిపారు. వీటిపై అధికారం ఉన్నప్పుడే సోనియా సరైన నిర్ణయం తీసుకుంటే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు.

యూపీఏ నిర్లక్ష్య వైఖరే సమస్యలకు కారణమని విమర్శించారు. విశ్వసనీయత లేక రెండు ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల అభివృద్ధికి అవసరమయ్యే అన్ని చర్యలు తమ ప్రభుత్వం తీసుకుంటుందని ఆయన హామీయిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement