'రాజీనామాలతో రాష్ట్రం సమైక్యంగా ఉంటుందనుకోను' | my Resignation can't stop it State Bifurcation - Killi Kruparani | Sakshi
Sakshi News home page

'రాజీనామాలతో రాష్ట్రం సమైక్యంగా ఉంటుందనుకోను'

Published Thu, Oct 17 2013 11:36 AM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM

'రాజీనామాలతో రాష్ట్రం సమైక్యంగా ఉంటుందనుకోను' - Sakshi

'రాజీనామాలతో రాష్ట్రం సమైక్యంగా ఉంటుందనుకోను'

న్యూఢిల్లీ : రాజీనామాలతో రాష్ట్రం సమైక్యంగా ఉంటుందనుకోనని కిల్లి కృపారాణి మళ్లీ పాత పాటే పాడారు. ఆమో గురువారం పార్టీ అధినేత్రి సోనియాగాంధీతో భేటీ అయ్యారు. సమావేశం అనంతరం కృపారాణి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రం సమైక్యంగా ఉంటుందని ప్రజలను మభ్య పెట్టడం సమంజసం కాదన్నారు.రాష్ట్రం సమైక్యంగా ఉంటుందంటే తాను రాజీనామా చేయటానికి సిద్ధంగా ఉన్నానన్నారు.

సీడబ్ల్యూసీ తీర్మానానికి లోబడే వ్యవహరించాలని ఆమె అన్నారు. ఈ నెల 18, 19 తేదీల్లో జీవోఎంను కలుస్తామని కిల్లి కృపారాణి తెలిపారు. తుపాను బాధితుల కోసం ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని సోనియా గాంధీని కోరినట్లు ఆమె తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement