మొహం చాటేసిన కిరణ్, బాబు: శోభా నాగిరెడ్డి
హైదరాబాద్: విభజన బిల్లు అసెంబ్లీకి వచ్చినప్పుడు చూసుకుందామన్న సీఎం కిరణ్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారని వైఎస్ఆర్ సీఎల్పీ ఉపనేత శోభా నాగిరెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ ముసాయిదా బిల్లు అసెంబ్లీకి వస్తే కిరణ్, చంద్రబాబు మొహం చాటేశారని విమర్శించారు. వారం రోజులుగా ప్రెస్‌మీట్‌లు పెట్టిన చంద్రబాబు నాయుడు ఇప్పుడెక్కడ అని అడిగారు.
కిరణ్, చంద్రబాబు కలిసి డ్రామాలాడుతున్నారని ఆరోపించారు. సోనియా అజెండాను బాబు, కిరణ్ కలిసి అమలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు అన్ని పార్టీల నేతలు ఐక్యంగా రావాలని వైఎస్ జగన్ చెప్పారని తెలిపారు. విభజనపై టీడీపీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని విమర్శించారు. టి.టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్‌పై అవిశ్వాస నాటకమాడుతున్నారని శోభా నాగిరెడ్డి అన్నారు.