
శోభానాగిరెడ్డి సౌమ్యశీలి, స్నేహశీలి: చంద్రబాబు
హైదరాబాద్: దివంగత భూమా శోభానాగిరెడ్డికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సంతాపం తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ శోభానాగిరెడ్డి సేవలను కొనియాడారు. చిన్న వయస్సులోనే ఆమె ఎమ్మెల్యే అయ్యారని ప్రశంసించారు.
తాగునీటి సమస్య పరిష్కారంకోసం అనేక పోరాటాలు చేశారని, రైతు సమస్యలకోసం రాజీలేని పోరాటం చేశారని గుర్తు చేసుకున్నారు. అసెంబ్లీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నారని అన్నారు. శోభానాగిరెడ్డి సౌమ్యశీలి, స్నేహశీలి కొనియాడారు. శోభానాగిరెడ్డి కుటుంబానికి చంద్రబాబు తన ప్రగాఢ సంతాపం తెలిపారు.