మామూలు కుటుంబంలో పుట్టి.... | chandrababu introduce condolence motion on APJ Abdul Kalam | Sakshi
Sakshi News home page

మామూలు కుటుంబంలో పుట్టి....

Published Mon, Aug 31 2015 10:06 AM | Last Updated on Sat, Jul 28 2018 3:30 PM

మామూలు కుటుంబంలో పుట్టి.... - Sakshi

మామూలు కుటుంబంలో పుట్టి....

హైదరాబాద్: రాష్ట్రపతి పదవికి వన్నె తెచ్చిన వ్యక్తి అబ్దుల్ కలాం అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. దేశాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు ఆయన కృషి చేశారని కొనియాడారు. సోమవారం శాసనసభలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంపై సంతాప తీర్మానాన్ని ఆయన ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... యువతలో స్ఫూర్తి నింపేందుకు కలాం అనునిత్యం ప్రయత్నం చేశారని చెప్పారు.

మామూలు కుటుంబంలో పుట్టి అసాధారణ వ్యక్తిగా ఎదిగారని ప్రశంసించారు. రాష్ట్రపతిగా నదుల అనుసంధానికి కృషి చేశారని వెల్లడించారు. కలాం పేరుతో పురస్కారాలు ఇవ్వనున్నామని, నాగార్జున వర్సిటీలో కలాం విగ్రహం పెడతామని తెలిపారు. ఒంగోలు ట్రిపుల్ ఐటీకి కలాం పేరు పెడతామన్నారు. కలాం ఆశయ సాధన కోసం కృషి చేయడమే ఆయనకు నిజమైన నివాళి అని చంద్రబాబు అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement