ఏంచేయాలో అది చేస్తాం: చంద్రబాబు | chandrababu warns opposition in assembly | Sakshi
Sakshi News home page

ఏంచేయాలో అది చేస్తాం: చంద్రబాబు

Published Mon, Aug 31 2015 12:03 PM | Last Updated on Sat, Jul 28 2018 3:30 PM

ఏంచేయాలో అది చేస్తాం: చంద్రబాబు - Sakshi

ఏంచేయాలో అది చేస్తాం: చంద్రబాబు

హైదరాబాద్: తమకు అధికారం ముఖ్యం కాదని రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రత్యేక హోదాపై ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ రాజకీయం చేస్తోందని ఆయన ఆరోపించారు. ప్రత్యేక హోదా బలిదానాలు చేసుకున్నవారికి సంతాపం ప్రకటిస్తూ శాసనసభలో సోమవారం తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా విపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.... ప్రత్యేక హోదాపై చంద్రబాబు, బీజేపీ కేంద్ర మంత్రులు ఇష్టమొచ్చినట్టు మాట్లాడడం వల్లే ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆరోపించారు.

మధ్యలో కలగజేసుకున్న చంద్రబాబు తీవ్రస్థాయిలో విపక్ష పార్టీపై మండిపడ్డారు. ప్రతిపక్షం ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని అన్నారు. మీరిలాగే మాట్లాడితే.. మేం ఏంచేయాలో అది చేస్తాం అంటూ బెదిరింపు ధోరణిలో మాట్లాడారు. కేంద్రం నుంచి తమ మంత్రులను తప్పుకోవాలని అడిగే హక్కు వైఎస్సార్ సీపీకి లేదన్నారు. తమ మంత్రులు రాజీనామా చేస్తే... వైఎస్సార్ సీపీ వాళ్లు ఏమైనా కేంద్రంలో చేరతారా అని ప్రశ్నించారు. విభజన చట్టాన్ని సంపూర్ణంగా అమలు చేయాలని కేంద్రాన్ని కోరినట్టు చంద్రబాబు చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement