శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లా ఉద్ధానంలో ముందు జాగ్రత్త చర్యగా విద్యుత్, టెలిఫోన్ వ్యవస్థలను అధికారులు శనివారం నిలిపివేశారు. పై-లిన్ తుపాన్ ప్రభావంతో ఉద్దానంలో జోరుగా ఈదురు గాలులు వీస్తున్నాయి. కాగా ఇప్పటివరకూ జిల్లాలో 60వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు మంత్రి కొండ్రు మురళి తెలిపారు. ప్రతి మండలంలో నాలుగు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
హెల్ప్ లైను నెంబర్లు:
విజయనగరం: 0892-2236947 టోల్ ఫ్రీ: 1077
తూర్పుగోదావరి: 0884-2365506
పశ్చిమగోదావరి: 0881230617
నెల్లూరు: 08612331477
.....
కాగా పై-లిన్ తుఫాన్ ప్రభావంతో పలు రైళ్లు రద్దు
భువనేశ్వర్-తిరుపతి ఎక్స్ప్రెస్ రద్దు
(భువనేశ్వర్-సికింద్రాబాద్) విశాఖ ఎక్స్ప్రెస్ రద్దు
గుంటూరు- సింహాద్రి ఎక్స్ప్రెస్ రద్దు
హౌరా-భువనేశ్వర్ జనశతాబ్ధి ఎక్స్ప్రెస్ రద్దు
హౌరా-పూరి శతాబ్ది ఎక్స్ప్రెస్ రద్దు
భువనేశ్వర్-ఢిల్లీ రాజధాని ఎక్స్ప్రెస్ రద్దు
హౌరా-విశాఖ దారిలో ప్రయాణించే రైళ్లు రద్దు
హౌరా నుంచి చెన్నై వెళ్లాల్సిన పలు రైళ్లు దారి మళ్లింపు