Updates
అత్యున్నత వైద్యసేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం: సీఎం జగన్
- పలాసలో సీఎం జగన్ మాట్లాడుతూ..
- పేదల బతుకులు మార్చాలి అనే తపన మీ బిడ్డకు మాత్రమే ఉంది.
- పేదల ప్రాణాలంటే చంద్రబాబుకు లెక్కే లేదు.
- చంద్రబాబు కుప్పం నియోజకవర్గానికి కూడా నీరు అందించలేదు.
- తన సొంత నియోజకవర్గాన్నే పట్టించుకోని చంద్రబాబు ఉత్తరాంధ్ర మీద ప్రేమ ఉంటుందా?
- ఎన్నికలు వచ్చే సరికి ఎత్తులు, పొత్తులు, చిత్తుల మీద చంద్రబాబు ఆధారపడతారు.
- తాను ఒక మంచి పని చేశాడని చెప్పుకోవడానికి చంద్రబాబు ఒక్క స్కీమ్ అయినా తెచ్చాడా?
- చంద్రబాబుకు నాన్‌లోకల్ ప్యాకేజీ స్టార్ ఇంకో పార్ట్‌నర్.
- ప్యాకేజీ స్టార్ ఆంధ్రా పాలకులకు చుక్కలు చూపిస్తానని తెలంగాణలో డైలాగ్‌లు కొడతాడు.
- తెలంగాణలో ఆంధ్రా ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడిన దత్తపుత్రుడికి డిపాజిట్లు కూడా రాలేదు.
- ఈ ప్యాకేజీ స్టార్, మ్యారేజీ స్టార్ దత్తపుత్రుడు.
- ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కూడా రాలేదు.
- ఉత్తరాంధ్రకు చంద్రబాబు, దత్తపుత్రుడు చేయని ద్రోహం లేదు.
- విశాఖను పరిపాలన రాజధాని చేస్తామంటే అడ్డుకుంటున్నారు.
- విశాఖకు సీఎం వచ్చి ఉంటానంటే ఏడుస్తున్నారు.
- నాన్ లోకల్స్ పక్క రాష్ట్రంలో ఉండి మన రాష్ట్రంలో ఏం చేయాలో నిర్ణయిస్తామంటారు.
- ఉద్దానం అంటే ఉద్యానవనం అని అర్థం
- ఉద్దానం ప్రజల బాధను పాదయాత్రలో చూశాను.
- ఇచ్చిన మాట ప్రకారం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ తీసుకువచ్చాం
- ఉద్దానం ప్రజలకు ఇచ్చిన మాట ఇప్పటికీ గుర్తుంది.
- ఉద్దానం సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చాం.
- మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెరవేర్చాం.
- దాదాపు రూ.85కోట్లతో నిర్మాణాలు చేపట్టాం.
- సురక్షిత మంచి నీటి కోసం రూ.700కోట్లు ఖర్చు చేస్తున్నాం.
- కిడ్నీ వ్యాధిగ్రస్తులకు అత్యున్నత ప్రమాణాలతో వైద్యసేవలు
- కిడ్నీ రీసెర్చ్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ద్వారా సేవలు
- కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేసే వ్యవస్థను కూడా అందుబాటులోకి తెస్తాం.
- దేశ, విదేశాల నుంచి నిపుణులైన వైద్యుల పర్యవేక్షలో రీసెర్చ్.
- కిడ్నీ వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించేందుకు జిల్లాలోని ఏడు మండలాల్లో స్క్రీనింగ్ పరీక్షలు చేయిస్తున్నాం.
- కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఉచితంగా మందులు అందిస్తున్నాం.
- విలేజ్ క్లినిక్, ఆరోగ్య సురక్ష ద్వారా పేదలకు అండగా ఉన్నాం.
- నాన్ డయాలసిస్ రోగులకు కూడా రూ.5వేలు ఇస్తున్నాం.
- కిడ్నీ వ్యాధిగ్రస్తులను ఆదుకునేందుకు మానవతా ధృక్పదంతో అడుగులు వేస్తున్నాం.
- కిడ్నీ వ్యాధిగ్రస్తులకు పెన్షన్ రూ.10వేలకు పెంచాం.
- దేవుడి దయతో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, 200 పడకల ఆసుపత్రిని ప్రారంభించుకున్నాం.
- మన ప్రభుత్వంలో 13వేల మందికిపైగా డయాలసిస్ రోగులకు పెన్షన్
- ప్రతీ నెల పెన్షన్ల కోసం 12కోట్ల 54లక్షలు ఖర్చు చేస్తున్నాం.
- ఉద్దానంలో కిడ్నీ సమస్యలకు మూల కారణం తెలుసుకునేందుకు సమగ్రంగా అధ్యయనం మొదలుపెట్టాం.
- మార్కాపురంలోనూ మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తున్నాం.
- కిడ్నీ వ్యాధిగ్రస్తులు రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా వారిని ఆదుకునేందుకు వేగంగా అడుగులు వేస్తున్నాం.
పలాస బహిరంగ సభ:
డాక్టర్ సీదిరి అప్పలరాజు, పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి
- అందరికీ నమస్కారం, చాలా సంతోషం, ఎన్నో ఏళ్ళుగా ఎదురుచూస్తున్న గొప్ప కల సాకారమవుతోంది.
- ఏదైనా మనం ఒక పని మొదలుపెట్టేటప్పుడు ముందు దేవుణ్ని మొక్కి మొదలుపెడతాం.పని పూర్తయిన తర్వాత అదే దేవుణ్ని మొక్కి కృతజ్ఞతలు తెలుపుకుంటాం.
- ఈ ప్రాంతంలో వేలాదిమంది ఎందుకు చనిపోతున్నారో తెలియని పరిస్ధితులు చూశాం
- నేను ఈ ప్రాంత వైద్యుడిగా ప్రత్యక్షంగా చూశాను, ఈ ప్రాంత ప్రజలకు ఆ దేవుడు పంపిన స్వరూపమే మన సీఎం
- కొన్ని వేల మంది ప్రాణాలు పోయాయి, వందల మంది ఉద్యమాల బాట పట్టారు, మా కష్టాలు, కన్నీళ్ళు ఎవరైనా తుడవకపోతారా ఎదురుచూసిన ప్రాంతం ఇది
- వారికి సంజీవనిలా మీరు వచ్చారు, ఇది అతిపెద్ద భగీరథ ప్రయత్నం మీరు చేశారు
- అనేక అడ్డంకులు దాటి పూర్తిచేసిన మీ సంకల్పానికి సలాం
- పలాస అంటే ప్రపంచానికి తెలిసేది ఒకటి జీడిపప్పు, రెండు కొబ్బరి పంట
- ఈ ప్రాంత ప్రజలకు ఉపాధి మార్గమైన అదనపు ఇండస్ట్రియల్ ఎస్టేట్‌కు సైతం శంకుస్ధాపన చేసిన మీకు కృతజ్ఞతలు
- ఈ రోజు ప్రతిపక్షం మాటలు, కొన్ని పత్రికలు చూపుతున్న వక్రబాష్యాలు చూస్తున్నాం
- వారందరికీ నేను ఒకటే చెబుతున్నా.. ఈ రాష్ట్రంలో ఉన్న ఏ గ్రామమైనా తీసుకోండి ఆ గ్రామంలో సచివాలయాలు, విలేజ్ హెల్త్ క్లీనిక్స్, ఆర్బీకేలు అభివృద్దిలో భాగం కాదా, విద్యావ్యవస్ధలో నాడు నేడు గొప్ప కార్యక్రమం,
- ఇవి అభివృద్ది కాదా, ఇక్కడ ప్రజలు వలసలు పోతున్నారంటున్నారు, కానీ ఇక్కడ మూలపేట పోర్టు పూర్తయితే ఈ జిల్లాకే వలసలు మొదలవుతాయి,
- భోగాపురం ఎయిర్‌పోర్ట్, విశాఖను రాజధాని చేయాలని, ఉత్తరాంధ్ర అభివృద్దికి మీరు చేస్తున్న సంస్కరణలు చిరస్మరణీయం
- రాబోయే దశాబ్ధానికి ఈ రాష్ట్రానికి సీఎంగా జగన్ గారే రావాలి, కావాలి, మీరు సీఎంగా కొనసాగడం ప్రతి పేదవాడికి అవసరం
- మీరు వెనక్కి తగ్గద్దు, గెలిచేవారికే టికెట్లివ్వండి, మా నియోజకవర్గమే కాదు రాష్ట్రంలో ఉన్న ప్రతి నియోజకవర్గంలో ఇదే సంకల్పం తీసుకోవాలి
- మన జగనన్న సీఎం కావడం కోసం మనమంతా నడుం బిగించాలి. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ అభివృద్ది కోసం ప్రత్యేకంగా రూ. 5 కోట్లు మంజూరు చేయాలని కోరుతున్నాను
- ఈ నియోజకవర్గంలో ఉన్న నౌపాడ, వెంకటాపురం రోడ్డును విస్తరించేందుకు ప్రతిపాదనలు అందజేశాం, మంజూరు చేయాలని కోరుతున్నాను.
- మాది వంశధార శివారు ప్రాంతం కాబట్టి హిరమండలం ఎల్‌ఐ స్కీమ్ ఇచ్చారు, దీనికి లింక్‌గా రూ. 8 కోట్లతో ప్రతిపాదనలు ఇచ్చాం, మంజూరు చేయగలరు
- వజ్రపుకొత్తూరు మండలంలోని శివారు ప్రాంతాలకు చిన్న లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌ను మంజూరు చేయాలని కోరుతున్నాం. అనేక పనులు పూర్తిచేయమని మీరు నిధులు ఇచ్చారు,
- మా పలాస ప్రజల తరపున మీకు కృతజ్ఞతలు. ధన్యవాదాలు
►పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్-సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభించిన సీఎం జగన్
►మకరాంపురం నుంచి పలాస బయల్దేరిన సీఎం జగన్
►కిడ్నీ రీసెర్చ్ సెంటర్-సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభించనున్న సీఎం జగన్
►అనంతరం రైల్వే గ్రౌండ్ భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్న సీఎం జగన్..
►వైఎస్సార్ సుజలధార డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం జగన్
►రూ.700 కోట్ల వ్యయంతో నిర్మించిన సుజలధార ప్రాజెక్టు జాతికి అంకితం
►శ్రీకాకుళం: కంచిలి మండలం మకరాంపురం చేరుకున్న సీఎం జగన్
►ఉద్దానం మంచినీటి పథకం, పలాస కిడ్నీ రిసెర్చ్ సెంటర్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించనున్న సీఎం
►విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న సీఎం జగన్
►అక్కడ నుండి శ్రీకాకుళం జిల్లా పలాస వెళ్లనున్న సీఎం
►పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను ప్రారంభించనున్న సీఎం జగన్
తాడేపల్లి నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న సీఎం జగన్
►గన్నవరం నుండి విశాఖపట్నం బయల్దేరిన సీఎం
►అక్కడ నుండి శ్రీకాకుళం జిల్లా పలాస వెళ్లనున్న సీఎం
►పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను ప్రారంభించనున్న సీఎం జగన్
►ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం శ్రీకాకుళం జిల్లా పలాసలో పర్యటించనున్నారు. ఆయన గుంటూరు జిల్లా తాడేపల్లిలోని నివాసం నుంచి ఉదయం 8 గంటలకు బయలుదేరి 10.30 గంటలకు కంచిలి మండలం మకరాంపురం గ్రామానికి హెలికాప్టర్‌లో వస్తారు. అక్కడ ప్రజల నుంచి వినతులు స్వీకరించి 11.10 గంటలకు వైఎస్సార్ సుజలధార ప్రాజెక్టు పంప్‌హౌస్ స్విచ్ నొక్కి దాన్ని ప్రారంభిస్తారు. అక్కడి నుంచి పలాస వెళ్తారు. అక్కడ ప్రజల నుంచి వినతులు స్వీకరించి 11.40 గంటలకు కిడ్నీ పరిశోధన కేంద్రానికి చేరుకుంటారు.
►అక్కడ ఆస్పత్రిని ప్రారంభించి దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఇండ్రస్టియల్ కారిడార్‌కు శంకుస్థాపన చేస్తారు. అలాగే ఎచ్చెర్లలోని బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో కొత్తగా నిర్మించిన వసతి గృహ భవనాన్ని వర్చువల్ పద్ధతిలో ప్రారంభిస్తారు. ఆ తర్వాత పాత జాతీయ రహదారి మీదుగా పలాస రైల్వే క్రీడా మైదానానికి చేరుకుంటారు. సభా ప్రాంగణంలో స్టాల్స్‌ను పరిశీలించి బహిరంగ సభలో మాట్లాడతారు. మధ్యాహ్నం 2.40 గంటలకు తిరిగి హెలికాప్టర్‌లో విశాఖకు బయలుదేరతారు.
►ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తుల సమస్యకు రాష్ట్ర ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపుతోంది. దీంతో వారి కష్టాలు తీరనున్నాయి. ఈ మేరకు శ్రీకాకుళం జిల్లా పలాసలో రూ.85 కోట్ల వ్యయంతో నిర్మించిన డాక్టర్ వైఎస్సార్ కిడ్నీ రీసెర్చ్ – 200 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించనున్నారు.
►అలాగే రూ.700 కోట్ల వ్యయంతో నిర్మించిన వైఎస్సార్ సుజలధార ప్రాజెక్టును ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. ఉద్దానం ప్రాంతంలో కళ్లెదుటే కిడ్నీ సమస్య కనిపిస్తున్నా గతంలో ఎవరూ దీనికి పరిష్కారం చూపడానికి కూడా సాహసించలేదు. ఇలాంటి పరిస్థితిలో వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.785 కోట్లు భారీ వ్యయం చేసి మరీ.. ఉద్దానం వ్యాధిగ్రస్తుల సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపింది.
వైఎస్సార్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్– 200 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్..
►ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తులకు మెరుగైన కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందించేందుకు, అలాగే అన్ని రకాల కిడ్నీ వ్యాధులపై పరిశోధనలు చేసేందుకు పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, 200 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, డయాలసిస్ యూనిట్ల ఏర్పాటు.. మూడు బ్లాకులుగా నాలుగు అంతస్తుల్లో ఆస్పత్రి నిర్మాణం. క్యాజువాలిటీ, రేడియో డయాగ్నోసిస్, పాథాలజీ, మైక్రో బయాలజీ, బయో కెమిస్ట్రీ ల్యాబ్స్, సెంట్రల్ ల్యాబ్స్, నెఫ్రాలజీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్, సర్జరీ, డయాలసిస్, పోస్ట్ ఆపరేటివ్, ఐసీయూ, రీసెర్చ్ ల్యాబ్‌తో ప్రత్యేక వార్డులు.
►సీటీ స్కాన్, 2డీ ఎకో, హై ఎండ్ కలర్ డాప్లర్, మొబైల్ ఎక్స్ రే (డిజిటల్), థూలియం లేజర్ యూరో డైనమిక్ మెషీన్ తదితర పరికరాలతో పాటు ఐసీయూ సౌకర్యాలు. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, యూరాలజీ, నెఫ్రాలజీ వంటి స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో ఇప్పటికే 42 స్పెషాలిటీ డాక్టర్ పోస్టులు, 60 స్టాఫ్ నర్సు పోస్టులు, 60 ఇతర సహాయ సిబ్బంది పోస్టుల భర్తీ.
వైఎస్సార్ సుజలధార ప్రాజెక్ట్..
►ఉద్దానం ప్రాంతంలో దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధులు (క్రానిక్ కిడ్నీ డిసీజెస్) ప్రబలంగా ఉన్న ఏడు మండలాల్లోని అన్ని గ్రామాలకు ‘వైఎస్సార్ సుజలధార‘ ప్రాజెక్టు ద్వారా శుద్ధి చేసిన రక్షిత తాగునీరు. హిరమండలం రిజర్వాయర్ నుంచి నీటిని తీసుకుని శుద్ధి చేసి పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల పరిధిలో 7 మండలాల్లోని 807 గ్రామాలకు రక్షిత నీటి సరఫరా.
►ఈ ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న 6.78 లక్షల జనాభా 2051 నాటికి 7.85 లక్షలకు చేరుతుందన్న అంచనాతో అప్పటి అవసరాలకు కూడా సరిపోయేలా ఒక్కొక్కరికి రోజుకు 100 లీటర్ల చొప్పున నీటి సరఫరా చేసేలా ప్రాజెక్టు నిర్మాణం. ఇప్పటికే 613 గ్రామాలకు నీటి సరఫరా.. ఈ నెలాఖరుకు మిగిలిన గ్రామాలకు.
ఉద్దానం కిడ్నీ బాధితులకు అండగా ప్రభుత్వం చేపట్టిన చర్యలు..
♦ గత ప్రభుత్వంలో డయాలసిస్ రోగులకు కేవలం రూ.2,500 చొప్పున పింఛన్ ఇస్తే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం దాన్ని ఏకంగా రూ.10 వేలకు పెంచింది. ప్రతి నెలా 1న ఠంఛన్‌గా లబ్ధిదారులకు వారి ఇళ్ల వద్దే వలంటీర్లతో అందజేస్తోంది.
♦ ఇప్పటికే టెక్కలి, పలాస, సోంపేట, కవిటి, హరిపురం ఆస్పత్రుల్లో 74 మెషీన్లతో డయాలసిస్ సేవలు. ఇలా వరుసగా 2019–20లో 37,454 సెషన్లు, 2020– 21లో 46,162 సెషన్లు, 2021–22లో 54,520 సెషన్లు, 2022–23లో 55,520 సెషన్లు, 2023–24లో (అక్టోబర్ నాటికి) 38,513 సెషన్ల చొప్పున కిడ్నీ బాధితులకు ప్రభుత్వం డయాలసిస్ సేవలు అందించింది. ఇప్పుడు దీనికి అదనంగా మరింత మెరుగైన సేవలు అందించేందుకు కిడ్నీ రీసెర్చ్ సెంటర్–సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.
♦వైద్య పరీక్షల కోసం ఉద్దానం ప్రాంతంలోని 18 పీహెచ్‌సీలు, 5 యూపీహెచ్‌సీలు, 6 సీహెచ్‌సీల్లో సెమీ ఆటో ఎనలైజర్స్, ఎలక్ట్రోలైట్ ఎనలైజర్స్, యూరిన్ ఎనలైజర్స్ ఏర్పాటు. గత టీడీపీ ప్రభుత్వంలో డయాలసిస్ రోగులకు 20 రకాల మందులు మాత్రమే.. అది కూడా అరకొరగా అందజేశారు. ప్రస్తుతం ఇక్కడ ప్రతి ఆస్పత్రిలో 37 రకాల మందులను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అందుబాటులో ఉంచింది.
కొత్త కేసుల గుర్తింపునకు నిరంతరాయంగా స్క్రీనింగ్ కొనసాగుతోంది. స్క్రీనింగ్ అనంతరం అనుమానిత లక్షణాలున్న వారి నుంచి రక్త నమూనాలు సేకరించి సీరమ్ క్రియాటినిన్ పరీక్షల కోసం సమీపంలోని పీహెచ్‌సీలకు తరలిస్తున్నారు. వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్‌లో పనిచేసే సీహెచ్‌వోలకు ప్రత్యేక యాప్. ఉద్దానం సమస్యలకు సంబంధించి ఏ రకమైన ఇబ్బందులు ఉన్నా.. జగనన్నకు చెబుదాం 1902 టోల్ ఫ్రీ నంబర్
Comments
Please login to add a commentAdd a comment