uddanam
-
ఉద్దానం ప్రాంతంలో ఎలుగు బంటి హల్ చల్
-
ఉద్దానం కిడ్నీ రోగులకు అన్ని విధాలుగా అండగా ఉంటాం: మంత్రి
-
రూ.900 కోట్ల తో ఇంటిఇంటికి మంచి నీరు సరఫరా
-
ఉద్దానమా ఊపిరి పీల్చుకో..జగనన్న మాట నెరవేర్చాడు
-
జగనన్నను ఉద్దానం మరచిపోదు
-
ఆరోగ్య ఉద్యానం.. వైఎస్సార్ సుజలధారను ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్
ఉత్తరాంధ్రలో కిడ్నీ వ్యాధుల బాధితులకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా పలాసలో కొత్తగా నెలకొల్పిన డాక్టర్ వైఎస్సార్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్, 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో కలసి పని చేస్తాయని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతాన్ని దశాబ్దాలుగా వేధిస్తున్న కిడ్నీ సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని చూపిస్తూ రూ.700 కోట్లతో నిర్మించిన వైఎస్సార్ సుజలధార ప్రాజెక్టును కంచిలి మండలం మకరాంపురంలో సీఎం జగన్ గురువారం తొలుత ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అనంతరం రూ.85 కోట్లతో పలాసలో నిర్మించిన డాక్టర్ వైఎస్సార్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్, 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో నిర్మించిన డాక్టర్ వైఎస్సార్ బాలుర వసతి గృహాన్ని వరŠుచ్యవల్గా ఆరంభించారు. నూతన పారిశ్రామికవాడ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పలాస రైల్వే గ్రౌండ్లో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడారు. నేను విన్నాను.. నేను చేశాను 2018 డిసెంబర్ 30న ఇదే పలాసలో పాదయాత్రలో మాటిచ్చా. నేను చూశాను.. నేను విన్నాను.. నేను ఉన్నాను అని ఆ రోజు చెప్పా. మన ప్రభుత్వం ఏర్పడ్డాక ఇక్కడే 200 పడకలతో కిడ్నీ రీసెర్చ్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని తెస్తామని చెప్పా. 2019 సెప్టెంబర్‌లో రూ.85 కోట్లతో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, 200 పడకల ఆస్పత్రిని మంజూరు చేశాం. పనులకు శంకుస్థాపన చేసి ఎక్కడా ఆలస్యం లేకుండా పూర్తి చేశాం. ఉద్దానం ప్రాంతానికి సురక్షిత మంచి నీటిని తెచ్చేందుకు హిర మండలం రిజర్వాయర్ నుంచి పైపులైన్లు వేసి ఇంటింటికి తాగునీరు అందించేందుకు 2020 సెప్టెంబర్‌లో సుజలధార పథకం మంజూరు చేశాం. ఈ రెండు పథకాలు ఈ రోజు పూర్తి చేసి జిల్లా ప్రజలకు అంకితం చేస్తూ మీ బిడ్డ మీ కళ్ల ఎదుట నిలబడ్డాడు. ఫిబ్రవరిలో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ కిడ్నీ వ్యాధిగ్రస్తులకు అత్యున్నత ప్రమాణాలతో వైద్య సేవలు అందించేలా జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో కలిసి ఇక్కడి కిడ్నీ రీసెర్చ్, సూపర్ స్పెషాలటీ ఆస్పత్రి పని చేస్తుంది. ఈ ఆస్పత్రిలో డయాలసిస్ బెడ్లు, నెఫ్రాలజీ, యూరాలజీ విభాగంలో ఐసీయూ బెడ్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. కాసేపటి క్రితం హెల్త్ సెక్రటరీ కృష్ణబాబుతో మాట్లాడా. ఈ ఫిబ్రవరిలోనే ఇక్కడ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ (మూత్రపిండాల మార్పిడి చికిత్స) కూడా చేసి కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్ ఎంత గొప్పగా పనిచేస్తోందో రాష్ట్రానికి, దేశానికి చూపించాలని చెప్పా. కచ్చితంగా ఈ ఫిబ్రవరిలో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ కార్యక్రమం జరుగుతుంది. మన ప్రాంతంలోనే బ్రహ్మాండమైన వైద్యం ఆస్పత్రిలో క్యాజువాలిటీ బ్లాక్, సెంట్రల్ ల్యాబ్ ఉంది. రేడియో డయోగ్నోసిస్, ఓటీ కాంప్లెక్స్, నెఫ్రాలజీ డయాలసిస్, యూరాలజీ వార్డులతో పాటు రీసెర్చ్ ల్యాబ్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. అత్యాధునిక సీటీ స్కాన్, డిజిటల్ ఎక్స్‌రే, యూరాలజీకి అవసరమైన హోల్మియం లేజర్, యూరో డైనమిక్ మిషన్ లాంటి సదుపాయాలన్నీ ఆస్పత్రిలో అందుబాటులో ఉన్నాయి. ఎక్కడికో పరుగెత్తాల్సిన అవసరం లేకుండా మన ప్రాంతంలోనే బ్రహ్మాండమైన వైద్యం అందుబాటులోకి వచ్చే పరిస్థితి ఈ రోజు పలాసలో ఉంది. ఇదే కిడ్నీ ఆస్పత్రిలో 42 మంది వైద్యులు, 154 మంది పారామెడికల్ సిబ్బందితో పాటు సెక్యూరిటీ, శానిటేషన్, పెస్ట్ కంట్రోల్ పోస్టుల్లో మరో 220 మంది పని చేస్తున్నారు. మొత్తంగా 375 మంది సేవలందించేందుకు ఈ రోజుమీ అందరికీ అందుబాటులో ఉన్నారు. 7 మండలాల్లో స్క్రీనింగ్ ఉద్దానం ప్రాంతంలో ప్రాథమిక దశలోనే వ్యాధిని గుర్తించగలిగితే వెంటనే మెరుగైన వైద్యం పేద ప్రజలకు అందించగలుగుతామనే తపన, తాపత్రయంతో కిడ్నీ ప్రభావిత మండలాల్లో స్క్రీనింగ్ కార్యక్రమం ఇప్పటికే చేపట్టాం. ఇచ్ఛాపురం, కవిటి, సోంపేట, కంచిలి, మందస, వజ్రపుకొత్తూరు, పలాసలో క్రమం తప్పకుండా స్క్రీనింగ్ చేయిస్తున్నాం. 25 ఏళ్లు పైబడిన వారిలో 2,32,898 మందిని స్క్రీనింగ్ చేయగా 19,532 మందికి సాధారణం కంటే సీరం క్రియాటిన్ స్థాయి ఎక్కువగా ఉన్నట్లు తేలింది. వీరిని గుర్తించి వైద్యం అందిస్తున్నాం. ఉద్దానంలో 10 పీహెచ్‌సీలు, 5 అర్బన్ పీహెచ్‌సీలు, 6 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో సెమీ ఆటో ఎనలైజర్లు అందుబాటులోకి తెచ్చాం. ఉచితంగా 37 రకాల మందులు కిడ్నీ వ్యాధుల చికిత్స కోసం నెఫ్రాలజిస్టులు, యూరాలజిస్టులు నిర్ధారించిన 37 రకాల ఔషధాలను అన్ని పీహెచ్సీలలో అందుబాటులోకి తెచ్చాం. వీటిని వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లకు అనుసంధానం చేస్తున్నాం. ఈ మందులన్నీ ప్రతి పేదవాడికీ గడప ముంగిటికే ఉచితంగా ఇచ్చేందుకు శ్రీకారం చుడుతున్నాం. ఇప్పటికే కవిటి, సోంపేట, పలాస, హరిపురం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో, టెక్కలి జిల్లా ఆస్పత్రిలో 69 డయాలసిస్ యంత్రాలను విస్తరించాం. బారువ, ఇచ్ఛాపురం, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, కంచిలి పీహెచ్సీలో కూడా ఏర్పాటు చేయబోతున్నాం. రోగులకు రూ.10 వేల పెన్షన్ కిడ్నీ వ్యాధిగ్రస్తులకు రూ.2,500 మాత్రమే ఉన్న పెన్షన్‌ను మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏకంగా రూ.10 వేలకు పెంచాడు. నాన్ డయాలసిస్ పేషెంట్లు, తీవ్ర కిడ్నీ వ్యాధులతో సీకేడీ డిసీజ్‌తో బాధపడుతున్న వారిని కూడా గుర్తించి వారికి రూ.5 వేల పింఛన్ ఇచ్చేలా చేసింది మనందరి ప్రభుత్వమే. గత సర్కారు హయాంలో కిడ్నీ పేషెంట్ల కింద డయాలసిస్ చేసుకుంటున్న వారు, పింఛన్లు పొందుతున్న వారు కేవలం 3,076 మంది మాత్రమే ఉన్నారు. వారి కోసం ఖర్చు చేసింది అప్పట్లో కేవలం నెలకు రూ.76 లక్షలు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకంగా 13,140 పింఛన్లు పెంచాం. నెలా నెలా ఇందుకు ఖర్చవుతున్న సొమ్ము రూ.12.54 కోట్లు. ఇలా 55 నెలలుగా ప్రతీ నెలా ఖర్చు చేస్తున్నాం. శాశ్వత పరిష్కారం దిశగా.. ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ సమస్యలకు కారణాలను అన్వేషించేందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థ ఐసీఎంఆర్‌తో పాటు జార్జ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ హెల్త్‌తో కలిసి రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర అధ్యయనం చేపట్టింది. నాలుగు దశల అధ్యయనంలో ఇప్పటికే మూడు దశలు పూర్తయ్యాయి. ప్రపంచంలో అత్యుత్తమ వైద్యసంస్థగా పేరు పొందిన హార్వర్డ్ మెడికల్ స్కూల్‌తో పాటు నార్త్ కరోలినా యూనివర్సిటీతో కలసి పనిచేసేలా మనందరి ప్రభుత్వం ఎంవోయూ చేసుకుంటోంది. ఈ కిడ్నీ రీసెర్చ్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఒక నోడల్ సెంటర్‌గా వ్యవహరించనుంది. ప్రకాశం జిల్లా మార్కాపురంలోనూ ఇలాంటి సమస్య ఉందని గుర్తించడంతో తాగునీటికి ఉపరితల జలాలను అందించేందుకు వెలుగొండ టన్నెళ్లను పరుగెత్తించాం. మార్కాపురంలో మెడికల్ కాలేజీ, కిడ్నీ సేవల కోసం నెఫ్రాలజీ, యూరాలజీ డివిజన్ కూడా ఏర్పాటు చేశాం. చిత్తశుద్ధితో శాశ్వత పరిష్కారం ఉద్దానంలో ఒక్క కిడ్నీ ఆస్పత్రితోనే సరిపుచ్చకుండా సమస్య శాశ్వత పరిష్కారం కోసం ఎవరి ఊహకూ అందని విధంగా రూ.700 కోట్లు ఖర్చు చేసి మరీ హిరమండలం నుంచి పైపుల ద్వారా నీళ్లు తెచ్చి ఈ ప్రాంతానికి మంచి చేసేలా అడుగులు వేశాం. ఇదీ మీపట్ల మీ జగన్‌కు ఉన్న కమిట్మెంట్. ఈ కమిట్మెంటే గత పాలకులకు, మనకు మధ్య తేడాను తెలియచేస్తుంది. మొత్తం 807 గ్రామాలకుగానూ ఈ నెలాఖరుకల్లా ప్రతి గ్రామం పూర్తిగా కనెక్ట్ అవుతుంది. 1.98 లక్షల కుటుంబాలు, 6.78 లక్షల జనాభాకు సురక్షిత తాగునీటిని అందించే ఒక గొప్ప పథకం ఈరోజు ప్రారంభమైంది. ఈ పథకాన్ని ఫేజ్ 2 కింద ఇంకా విస్తరించబోతున్నాం. రూ.265 కోట్లతో పాతపట్నం నియోజకవర్గంలో 448 గ్రామాలకు కూడా ఈ ప్రాజెక్టు ద్వారా మేలు చేసేలా అడుగులు ముందుకు వేస్తున్నాం. దీనికి టెండర్లు, అగ్రిమెంట్లు, సర్వే పూర్తైంది. సంక్రాంతి తర్వాత ఆ పనులు మొదలుపెడతారు. -
ఉద్దానానికి ఊపిరి పోసిన సీఎం జగన్
నాడు... ఉద్దానం ప్రాంతంలో ఎందుకు పుట్టామా అన్న అవేదనే నిత్యం వారిని వెంటాడుతుండేది. అప్పటికే దాదాపు ప్రతి ఇంటా ఒకరిద్దరు కిడ్నీ వ్యాధుల బారిన పడ్డారు. కదలలేక మంచానికే పరిమితమయ్యారు. వైద్యం పేరుతో ఇళ్లు గుల్లయిపోతున్నాయి. ఇళ్లూ, ఆస్తులు అమ్ముకున్నా, మందులకు, డయాలసిస్‌కు డబ్బు చాలని పరిస్థితి. 40 ఏళ్లగా ఉద్దానం ప్రాంతం దయనీయజీవితమిది. పాలకులు మారుతున్నారుగానీ అక్కడి సమస్యను ఎవరూ పరిష్కారించలేదు. రాష్ట్రంలో అత్యంత సుదీర్ఘకాలం సీఎంగా పని చేసిన చంద్రబాబు గొప్ప విజనరీగా ప్రచారమైతే చేసుకుంటారు కానీ, ఉద్దానం వైపు కన్నెత్తి చూడలేదు. అక్కడి ప్రజల సమస్యకు పరిష్కారానికి చూపలేదు. కనీసం విభజన అనంతరం ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా పనిచేసినా, ఉద్దానం వ్యధను పట్టించుకోలేదు. చంద్రబాబు ప్రభుత్వానికి ఎన్నికల ముందు, తర్వాత పూర్తిగా మద్దతిచ్చిన పవన్ కళ్యాణ్ కూడా ఒకసారి ఆ ప్రాంతానికి వెళ్లి వచ్చారు. చాలా మాటలే చెప్పారు. వచ్చేశారు. వారి సమస్య పరిష్కారానికి వీసమెత్తు పరిష్కారం చూపలేదు. పైగా, అక్కడి ప్రజల బాధలను రాజకీయంగా మాత్రమే వాడుకున్నారు. తన వల్లే ఆ ప్రజల సమస్య వెలుగులోకి వచ్చిందని ప్రచారం చేసుకొనే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఉద్దానం ఊసే మరిచారు. ఆ సమయంలో.. 2017లో అప్పటి రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడి హోదాలో వైఎస్ జగన్మోహన్రెడ్డి తన సుదీర్ఘ పాదయాత్రలో భాగంగా ఉద్దానం ప్రాంతానికి వచ్చారు. అక్కడి ప్రజలతో ముఖాముఖీ భేటీ అయ్యారు. వారి సమస్యలు స్వయంగా తెలుసుకున్నారు. అక్కడ కిడ్నీ వ్యాధులు ప్రబలడానికి కారణాలను లోతుగా పరిశీలించారు. ఏమి చేస్తే ఉద్దానం ప్రజల ఆరోగ్యం బాగుపడుతుందో ఓ ప్రణాళిక రూపొందించారు. ఏడాది కూడా గడవక ముందే.. 2018 డిసెంబరు 31న మరోసారి ఉద్దానానికి వెళ్లారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక, ఆ ప్రాంతంలోని ప్రతి కిడ్నీ బాధితుడికి తోడుగా ఉంటానని భరోసా ఇచ్చారు. అక్కడే సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కలుషిత నీరు కారణంగా ఈ సమస్య వస్తుందని, ఆ ప్రాంతానికి మంచి నీటిని అందించేందుకు ప్రత్యేకంగా రిజర్వాయర్ నిర్మిస్తామని చెప్పారు. అక్కడి నుంచి నీటిని పైపులైన్ ద్వారా సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. నేడు... 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించింది. జగన్ సీఎం అయ్యారు. బాధ్యతలు చేపట్టి నాలుగు నెలలు కూడా పూర్తి కాక మునుపే.. 2019 సెపె్టంబరు 6న రూ. 700 కోట్లతో ఉద్దానం ప్రాంతం రక్షిత మంచి నీటి పథకానికి శంకుస్థాపన చేశారు. ఈ ప్రాంతంలోనే సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, కిడ్నీ రీసెర్చి సెంటర్‌కు కూడా శంకుస్థాపన చేశారు. మధ్యలో.. కరోనా విపత్తు వచ్చి పనులేవీ ముందుకు సాగక ఆటంకాలు కలిగినా.. పట్టుదలగా నాలుగేళ్లలోనే భగీరధ ప్రయత్నం పూర్తి చేశారు. గురువారం రూ.700 కోట్లతో నిర్మించిన రక్షిత మంచి నీటి పథకానికి, రూ.85 కోట్లతో నిరి్మంచిన కిడ్నీ రీసెర్చి సెంటర్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి ప్రారం¿ోత్సవం చేశారు. పరిష్కారమూ సమగ్రంగా, శాశ్వతంగా.. సాధారణంగా.. వందల కోట్లు ఖర్చు పెట్టి రక్షిత మంచి నీటి పథకం నిర్మాణం చేపట్టినా, నీరు అందుబాటులో లేకపోతే అంతటి పథకమూ వృథా అవుతుంది. ఉద్దానం రక్షిత మంచి నీటి పథకం విషయంలోనూ అధికారులు ఇలాంటి సందేహాన్ని సీఎం జగన్ వద్ద ప్రస్తావించారు. మనం చూపే పరిష్కారం శాశ్వతంగా, సమగ్రంగా ఉండాలని సీఎం జగన్ వారికి స్పష్టం చేశారు. తక్కువ ఖర్చుతో ఉద్దానం ప్రాంత సమీపంలో ఉండే బహుదా, మహేంద్ర తనయ నదుల నుంచి రక్షిత నీటి సరఫరాకు అవకాశం ఉంది. అయితే, వేసవిలో ఆ నదులు ఎండిపోతే అక్కడి ప్రజలు బోరు నీటిని తాగక తప్పదని జగన్ సర్కారు ఆ ప్రతిపాదనను మొదట్లోనే పక్కనపెట్టింది. ఏడాది పొడవునా నీరు అందుబాటులో ఉండేలా ఖర్చు ఎక్కువైనా వెనుకాడకుండా ఆ ప్రాంతానికి 104 కి.మీ.కి పైగా దూరంలోని హిరమండలం రిజర్వాయర్ నుంచి నీటి తరలింపునకు ప్రణాళిక రూపొందించింది. ఉద్దానం ప్రాంతం మొత్తానికి ఏడాది పొడవునా ఒక టీఎంసీ కన్నా తక్కువ నీరు అవసరం ఉండగా.. ïహిరమండలం రిజర్వాయర్ కనీస నీటి మట్టం స్ధాయిలోనూ 2.67 టీఎంసీలు అందుబాటులో ఉంటుంది. అందువల్ల ఇక్కడి నుంచి నీటిని తరలించాలని నిర్ణయించారు. ఏకంగా 1,047 కి.మీ. పొడవున భూగర్భ పైపులైన్లు నిర్మించారు. ఇప్పుడు ఉద్దానం వాసులకు నీటి బెంగ లేదు. నిత్యం స్వచ్ఛమైన నీరు అందుతుంది. అందుబాటులో అత్యాధునిక ఆసుపత్రి ఉంది. కిడ్నీ వ్యాధుల రీసెర్చి సెంటరూ ఉంది. 40 ఏళ్ల ఉద్దానం ప్రాంత కిడ్నీ సమస్యకు పరిష్కారం చూపి, ఆ ప్రాంతానికి ఊపిరి పోసిన సీఎం జగన్‌కు ప్రజలు జేజేలు పలుకుతున్నారు. -
పవన్ కన్నా బర్రెలక్క ఎంతో బెటర్: సీఎం జగన్
సాక్షి, శ్రీకాకుళం జిల్లా: ఉద్దానంలో కిడ్నీ బాధితుల సమస్య ఒక్కరోజులో వచ్చింది కాదని.. గత పాలకుల హయాంలోనూ ఈ సమస్య ఉందని.. పేదల ప్రాణాలంటే చంద్రబాబుకు లెక్కే లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. కుప్పం నియోజవర్గానికి కూడా నీరు అందించలేదని, సొంత నియోజకవర్గాన్ని కూడా పట్టించుకోని చంద్రబాబుకు ఉత్తరాంధ్ర మీద ఏం ప్రేమ ఉంటుందంటూ సీఎం దుయ్యబట్టారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో రూ.85 కోట్ల వ్యయంతో నిర్మించిన డాక్టర్ వైఎస్సార్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్-200 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను సీఎం జగన్.. గురువారం ప్రారంభించారు. అలాగే రూ.700 కోట్ల వ్యయంతో నిర్మించిన వైఎస్సార్ సుజలధార ప్రాజెక్టును ప్రారంభించి, జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా పలాస బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ, ‘‘ఎన్నికలు వచ్చే సరికి ఎత్తులు, పొత్తులు, చిత్తులు మీద చంద్రబాబు ఆధారపడతారు. తెలంగాణలో తన దత్తపుత్రుడిని పోటీలో పెట్టారు. నాన్ లోకల్ ప్యాకేజీ స్టార్.. బాబు ఇంకో పార్ట్నర్. ఆంధ్రా పాలకులకు చుక్కలు చూపిస్తానని తెలంగాణలో డైలాగులు కొడతాడు. తెలంగాణలో ఆంధ్రా ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడిన దత్తపుత్రుడికి డిపాజిట్లు కూడా రాలేదు. ఉత్తరాంధ్రకు చంద్రబాబు, దత్తపుత్రుడు చేయని ద్రోహం లేదు. ఇండిపెండెంట్‌గా నిలబడిన చెల్లెమ్మ బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కూడా దత్తపుత్రుడికి రాలేదు’’ అని సీఎం ఎద్దేవా చేశారు. ‘‘విశాఖను పరిపాలన రాజధాని చేస్తామంటే అడ్డుకుంటున్నారు. విశాఖకు సీఎం వచ్చి ఉంటానంటే చంద్రబాబు, అనుంగు శిష్యులు ఏడుస్తున్నారు. నాన్ లోకల్స్ పక్క రాష్ట్రంలో ఉండి మన రాష్ట్రంలో ఏం చేయాలో నిర్ణయిస్తామంటారు’’ అంటూ సీఎం ధ్వజమెత్తారు. ‘‘ఉద్దానం అంటే ఉద్యానవనం అని అర్థం. ఉద్దానం ప్రజల బాధను పాదయాత్రలో చూశాను. ఇచ్చిన మాట ప్రకారం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ తీసుకువచ్చాం. ఉద్దానం సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చాం. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెరవేర్చాం. దాదాపు రూ.85కోట్లతో నిర్మాణాలు చేపట్టాం. సురక్షిత మంచి నీటి కోసం రూ.700కోట్లు ఖర్చు చేస్తున్నాం. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు కిడ్నీ రీసెర్చ్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ద్వారా అత్యున్నత ప్రమాణాలతో వైద్యసేవలు అందిస్తున్నాం. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేసే వ్యవస్థను కూడా అందుబాటులోకి తెస్తాం’’ అని సీఎం పేర్కొన్నాం. కిడ్నీ వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించేందుకు జిల్లాలోని ఏడు మండలాల్లో స్క్రీనింగ్ పరీక్షలు చేయిస్తున్నాం. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఉచితంగా మందులు అందిస్తున్నాం. విలేజ్ క్లినిక్, ఆరోగ్య సురక్ష ద్వారా పేదలకు అండగా ఉన్నామని సీఎం అన్నారు. పేదవాడిని ఎలా ఆదుకోవాలి, పేదవాడికి ఎలా తోడుగా ఉండాలి, పేదరికం నుంచి ఎలా లాగాలి, ఎలా బతుకులు మార్చాలని అనే తాపత్రయం మీ బిడ్డకు మాత్రమే ఉంది. తేడా ఇదీ అని గమనించాలి. సీఎం జగన్ ఏమన్నారంటే.. ఈ చంద్రబాబు నాయుడు గారికి పేదల ప్రాణాలంటే లెక్కే లేదు. తన సొంత నియోజకవర్గం కుప్పానికి గతంలో ఎప్పుడూ కూడా నీరిచ్చిన చరిత్రే లేదు. కుప్పానికి నీళ్లు ఇవ్వాలన్నా కూడా మళ్లీ అది జరిగేది మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే. మరి సొంత నియోజకవర్గం, తనను ఎమ్మెల్యేగా గెలిపించిన నియోజకవర్గాన్నే పట్టించుకోని ఈ వ్యక్తికి ఉత్తరాంధ్రపై ఏం ప్రేమ ఉంటుంది? ఉద్దానం మీద ఏం మమకారం ఉంటుంది ఆలోచన చేయాలి. ఇలా ఏ ఒక్కరి మీద కూడా మానవత్వం గానీ, మమకారం గానీ చూపించని ఈ చంద్రబాబు. 45 సంవత్సరాలు తన రాజకీయ జీవితం తర్వాత కూడా మూడు సార్లు తాను ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన తర్వాత కూడా తన వల్ల ఈ మంచి జరిగింది ప్రజలకు అని చెప్పి చెప్పుకొనే దానికి ఒక్క మంచిపనీ లేదు. తన హయాంలో ఈ మంచి స్కీమ్ చేశాను, ఈ మంచి స్కీమ్ తీసుకురావడం వల్ల ప్రజలకు మంచి జరిగింది అని చెప్పుకొనే దానికి ఒక్క స్కీమ్ కూడా లేని పరిస్థితి. తాను మాట ఇస్తే ఆ మాట మీద తాను నిలబడ్డాడని, మాట కోసం ఎందాకైనా పోయాడని, నిలబెట్టుకున్నాడని కనీసం చెప్పుకొనేందుకు ఒక్క విషయం అయినా లేదు. ఇలాంటాయన ఎన్నికలు వచ్చే సరికే పొత్తుల మీద, ఎత్తుల మీద, జిత్తుల మీద, కుయుక్తుల మీద తాను ఆధారపడతాడు. ఈ పెద్దమనిషి మరో వ్యక్తి మీద కూడా ఆధారపడతాడు. ఒక దత్తపుత్రుడిగా యాక్టర్‌ను పెట్టుకొని డ్రామాలు ఆడతాడు. ఈ దత్తపుత్రుడు ఎవరంటే, ఎలాంటి వాడు అంటే.. మొన్న తెలంగాణలో తాను పోటీ పెట్టాడు. అభ్యర్థులను నిలబెడుతూ, తెలంగాణలో అన్నమాటలు వింటే ఆశ్చర్యం అనిపించింది. తెలంగాణలో తాను పుట్టనందుకు తెగ బాధపడిపోతున్నానంటాడు. తన దురదృష్టం అంటాడు. ఇలాంటి వ్యక్తి, ఇలాంటి డైలాగులు కొట్టిన నాన్ లోకల్ ప్యాకేజీ స్టార్.. ఈ పెద్దమనిషి చంద్రబాబుకు ఇంకొక పార్టనర్. ఈ పెద్ద మనిషి ఆంధ్రా పాలకులకు చుక్కలు చూపిస్తానని తెంలగాణలో డైలాగులు కొడతాడు ఈ ప్యాకేజీ స్టార్, ఈ మ్యారేజీ స్టార్. ఆంధ్ర రాష్ట్రానికి వ్యతిరేకంగా కొట్టిన ఇన్నిన్ని డైలాగులకు ఆయన పడిన ఓట్లు ఎన్నో తెలుసా? చివరికి ఇండిపెండెంట్‌గా నిలబడిన చెల్లెమ్మ బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కూడా ఈ దత్తపుత్రుడికి రాలేదు. డిపాజిట్లు కూడా రాలేదు. ఈ పెద్దమనిషికి చంద్రబాబు ప్రయోజనవర్గం ఉంది తప్ప, ఆంధ్ర రాష్ట్రంపై ప్రేమే లేదు. సొంత నియోజకవర్గం లేదు. వీరిద్దరూ కలిసి 2014 నుంచి 2019 మధ్య ఎన్నికల్లో కలిసి వచ్చారు. 2014-2019 మధ్య ఈ ఉద్దానం ప్రాంతానికి మంచి నీరు ఇవ్వడం ఎలా అని కనీసం ఆలోచన అయినా చేశారా అంటే అదీ లేదు. కనీసం ఉద్దానం ప్రాంతం ఇంత దారుణంగా ఉంది, ఇక్కడ కిడ్నీ రీసెర్చ్, ఆస్పత్రి నిర్మించారా అంటే అది కూడా లేదు. వీళ్ల బాబు అధికారంలో ఉండగా ఉత్తరాంధ్రకు చేసిన మంచీ లేదు. ప్రతి పక్షంలో ఉండి కూడా వాళ్లు ఉత్తరాంధ్రకు చేయని ద్రోహం కూడా లేదు. రాష్ట్రంలో అతిపెద్ద నగరమైన విశాఖను పరిపాలన రాజధానిగా చేస్తాం అని మీ బిడ్డ అంటే ప్రతిపక్షంలో ఉండి అడ్డుకుంటున్న దుర్మార్గం వీరిది. ఉత్తరాంధ్రలో ఒక బిల్డింగ్ కట్టినా వీళ్లు ఏడుస్తాడు. మీ బిడ్డ నాలుగు ఆఫీసులు పెట్టినా ఏడుస్తారు. సీఎంగా నేను ఇక్కడికి వచ్చి ఉంటానన్నా ఏడుస్తారు. ఈ ప్రాంతంలో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు, పోర్టు వస్తుందన్నా ఏడుస్తారు. ఈ ప్రాంతానికి మెడికల్ కాలేజీలు, రీసెర్చ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామంటే ఏడుస్తారు. ఈ ఏడుపంతా వేరే రాష్ట్రంలో శాశ్వత నివాసం అక్కడ ఉంటూ ఒక దొంగల ముఠాగా తయారయ్యారు. ఓ చంద్రబాబు ఓ రామోజీరావు, దత్తపుత్రుడు, రాధాకృష్ణ, టీవీ5 వీళ్లంతా ఒక దొంగల ముఠాగా తయారై మనమీద పడి ఏడుస్తుంటారు. వీళ్లలో ఎవరూ కూడా మన రాష్ట్రంలో ఉండరు. వీళ్లంతా ఉండేది హైదరాబాద్‌లో.. ఇటువంటి నాన్ లోకల్స్ అంతా కూడా అక్కడుంటారు. కానీ మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి ఏం చేయాలి? ఎక్కడ ఉండాలి? మన రాజధానులు ఎక్కడ ఉండాలి అని ఈ నాన్ లోకల్స్ వేరే రాష్ట్రంలో ఉంటూ వాళ్లు నిర్ణయిస్తామని మనకు చెబుతారు. దానికి తగ్గట్టుగా ఈనాడులో పెద్ద పెద్ద అక్షరాలు రాస్తారు, ఈటీవీ, టీవీ5, ఏబీఎన్, చంద్రబాబు, దత్తపుత్రుడు.. ఇవే కథలు.. రోజూ ఈ డ్రామాలు. వీళ్లలో ఏ ఒక్కరూ ఆంధ్ర రాష్ట్రంలో ఉండరు. ఈ నాన్ లోకల్స్ చెప్పినట్లు ఆంధ్ర రాష్ట్రంలో ఉండాలట. నేనుచెప్పిన విషయాలు ఆలోచన చేయాలి. అధికారం పోయినందుకు వీళ్లకు ఏడుపు, వారు ఏనాడూ ఇవ్వని విధంగా ఇంటింటికీ పెన్షన్ ఇస్తుంటే కూడా ఏడుపు. వారి హయాంలో ఇచ్చిన వెయ్యి పించన్ మనం 2250తో ప్రారంభించి ఏకంగా 3 వేలు చేస్తుంటే ఏడుపు. వారి హయాంలో విచ్చలవిడి దోపిడీని అరికట్టి, జన్మభూమి కమిటీలు రద్దు చేసి ప్రతి గ్రామంలో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ తెచ్చి ప్రతి పేద వాడికీ తోడుగా ఉండి నడిపిస్తుంటే ఏడుపు. వారు ఇవ్వని విధంగా, ఏకంగా మీ బిడ్డ ప్రభుత్వంలో 2.10 లక్షల శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు మీ బిడ్డ ఇచ్చినందుకు ఏడుపు. వారి ఐదేళ్ల పాలనలో నష్టపోయిన రైతన్నకు మీ బిడ్డ హయాంలో వైఎస్సార్ రైతు భరోసా, సున్నా వడ్డీ, ఆర్బీకే వ్యవస్థ, పగటిపూటే నాణ్యమైన ఉచిత విద్యుత్, ఉచిత బీమా, సకాలంలో ఇన్ పుట్ సబ్సిడీ.. ఇవన్నీ రైతన్నకు మీ బిడ్డ అందిస్తున్నందుకు వీరంతా ఏడుపు. అక్కచెల్లెమ్మల్ని, పొదుపు సంఘాల్ని నిలువునా ముంచేసిన ఈ బాబుకు, వైఎస్సార్ ఆసరా, సున్నా వడ్డీ, వైఎస్సార్ చేయూత, జగనన్న అమ్మ ఒడి.. ఇవన్నీ కూడా పార్టీలు కూడా చూడకుండా మీ బిడ్డకు గతంలో ఓటు వేశారా లేదా అన్నది చూడకుండా ప్రతి అక్కచెల్లెమ్మకు మంచి చేయాలని అడుగులు వేస్తుంటే ఏడుపు. ఐదేళ్లు వాళ్లు అధికారంలో ఉండి కూడా కనీసం పేద వాడికి ఒక సెంటు ఇంటి స్థలం కూడా ఇవ్వలేదు నా అక్కచెల్లెమ్మలకు ఇళ్లు ఉండాలి, లక్షాధికారులు కావాలని తపన పడుతూ 31 లక్షల ఇంటి పట్టాలు వారి చేతిలో పెడితే ఏడుపు. ఏకంగా 22 లక్షల ఇళ్లు మీ బిడ్డ కట్టిస్తుంటే ఏడుపు. పేద పిల్లల బతుకులు మారాలి, వారి కుటుంబాల బతుకులు మారాలి, పేద పిల్లలు వెళ్తున్న గవర్నమెంట్ బడుల్లో ఇంగ్లీషు మీడియం చదువులు తీసుకొస్తే ఏడుపు. గోరుముద్ద, నాడు-నేడు కార్యక్రమాలు గవర్నమెంట్ బడుల్లో పెడితే ఏడుపు. 6వ తరగతి, ఆ పై తరగతుల పిల్లలకు, ప్రతి క్లాస్ రూమ్ డిజిటలైజ్ చేస్తూ ఐఎఫ్‌పీ ప్యానల్స్ తెస్తే ఏడుపు. 8వ తరగతి పిల్లలకు ట్యాబ్స్ ఇస్తే కూడా ఏడుపు. ఏకంగా 35 లక్షల ఎకరాలు హక్కులేని భూములకు, అసైన్డ్ భూముల మీద పేదవాడికి సర్వ హక్కులు మీ బిడ్డ కల్పిస్తే ఏడుపు. 2014-19 మధ్య వాళ్లు అధికారంలో ఉన్నారు. మేనిఫెస్టోలో 10 శాతం వాగ్గానాలు కూడా అమలు చేయని వీరు.. మీ బిడ్డ ఎన్నికల మేనిఫెస్టోను తెచ్చి ఖురాన్, భగవద్గీత, బైబిల్ గా భావిస్తూ 99 శాతం హామీలను అమలు చేస్తే ఏడుపు. దోచుకోవడం, పంచుకోవడం, తినుకోవడం మాత్రమే తెలిసిన ఈ చంద్రబాబు. బటన్ ఎలా నొక్కాలో తెలియని ఈ చంద్రబాబు. మీ బిడ్డ హయాంలో ఏకంగా 2.40 లక్షల కోట్లు మీ బిడ్డ హయాంలో నేరుగా బటన్ నొక్కుతున్నాడు. ఎక్కడా లంచాలు లేవు. వివక్ష లేదు. నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతున్నా ఏడుపే ఏడుపు. మరో 1.70 లక్షల కోట్లు నాన్ డీబీటీగా పేద వారి కోసం ఇస్తున్నా కూడా ఏడుపే ఏడుపు. ఈ ఏడుపులన్నింటినీ కూడా కేవలం మరో మూడు నెలలు భరించండి. ఈ క్యాన్సర్ గడ్డల్ని, వచ్చే ఎన్నికల్లో పూర్తిగా తొలగించండి అని తెలియజేస్తున్నా. ఇటువంటి నాన్ లోకల్స్ అంతా, పేదల వ్యతిరేకులంతా, పెత్తందార్లంతా కూడా శాశ్వతంగా మన రాష్ట్రం వైపు కన్నెత్తి చూడకుండా తీర్పు ఇవ్వాలని మిమ్మల్నందరినీ సవినయంగా కోరుతున్నా. రాబోయే రోజుల్లో ఇంకా అబద్ధాలు ఎక్కువ అవుతాయి, మోసాలు ఎక్కువ అవుతాయి. ఎవరు మాట ఇచ్చారు. మాట మీద నిలబడింది ఎవరు అనేది కచ్చితంగా గుర్తు పెట్టుకోండి మీ బిడ్డ ధైర్యంగా మీ ముందుకు వచ్చి చెప్ప గలుగుతున్నాడు. మీ ఇంటికి, మీ కుటుంబానికి మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీరే సైనికులుగా మీ బిడ్డకు నిలబడండి అని అడుగుతున్నాడు. ఇలా అడగగలిగే చిత్తశుద్ధి వాళ్లకు ఉందా? రాబోయే రోజుల్లో ఇంకా మోసాలు చేస్తారు. మీ బిడ్డ ఇంత ఇచ్చాడు, ఇంతకన్నా నాలుగింతలు ఎక్కువ చెబితే గానీ నమ్మరు అని చెప్పి.. ప్రతి ఇంటికీ కేజీ బంగారం, బెంచ్ కారు కొనిస్తామని చెబుతారు. మాటలు చెప్పడం చాలా సులభం, మాటలు చెప్పి మోసం చేసేవాళ్లను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నమ్మకండని కోరుతున్నా. మంచి చేసిన చరిత్ర మీ బిడ్డకు ఉంది. మీ బిడ్డకు మీరు తోడుగా ఉండండి. ఆశీర్వదించండి. దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలు ఎల్లకాలం ఉండాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. -
శ్రీకాకుళం : ఉద్దానంలో సీఎం జగన్ పర్యటన (ఫొటోలు)
-
ఉద్దానం కిడ్నీ బాధితులతో సీఎం వైఎస్ జగన్
-
Live: ఉద్దానంలో వైఎస్ఆర్ సుజల ధార ప్రాజెక్ట్ ప్రారంభం
-
ఉద్దానం ప్రాణహితుడు
-
అత్యున్నత వైద్యసేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం: సీఎం జగన్
Updates అత్యున్నత వైద్యసేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం: సీఎం జగన్ పలాసలో సీఎం జగన్ మాట్లాడుతూ.. పేదల బతుకులు మార్చాలి అనే తపన మీ బిడ్డకు మాత్రమే ఉంది. పేదల ప్రాణాలంటే చంద్రబాబుకు లెక్కే లేదు. చంద్రబాబు కుప్పం నియోజకవర్గానికి కూడా నీరు అందించలేదు. తన సొంత నియోజకవర్గాన్నే పట్టించుకోని చంద్రబాబు ఉత్తరాంధ్ర మీద ప్రేమ ఉంటుందా? ఎన్నికలు వచ్చే సరికి ఎత్తులు, పొత్తులు, చిత్తుల మీద చంద్రబాబు ఆధారపడతారు. తాను ఒక మంచి పని చేశాడని చెప్పుకోవడానికి చంద్రబాబు ఒక్క స్కీమ్ అయినా తెచ్చాడా? చంద్రబాబుకు నాన్‌లోకల్ ప్యాకేజీ స్టార్ ఇంకో పార్ట్నర్. ప్యాకేజీ స్టార్ ఆంధ్రా పాలకులకు చుక్కలు చూపిస్తానని తెలంగాణలో డైలాగ్‌లు కొడతాడు. తెలంగాణలో ఆంధ్రా ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడిన దత్తపుత్రుడికి డిపాజిట్లు కూడా రాలేదు. ఈ ప్యాకేజీ స్టార్, మ్యారేజీ స్టార్ దత్తపుత్రుడు. ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కూడా రాలేదు. ఉత్తరాంధ్రకు చంద్రబాబు, దత్తపుత్రుడు చేయని ద్రోహం లేదు. విశాఖను పరిపాలన రాజధాని చేస్తామంటే అడ్డుకుంటున్నారు. విశాఖకు సీఎం వచ్చి ఉంటానంటే ఏడుస్తున్నారు. నాన్ లోకల్స్ పక్క రాష్ట్రంలో ఉండి మన రాష్ట్రంలో ఏం చేయాలో నిర్ణయిస్తామంటారు. ఉద్దానం అంటే ఉద్యానవనం అని అర్థం ఉద్దానం ప్రజల బాధను పాదయాత్రలో చూశాను. ఇచ్చిన మాట ప్రకారం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ తీసుకువచ్చాం ఉద్దానం ప్రజలకు ఇచ్చిన మాట ఇప్పటికీ గుర్తుంది. ఉద్దానం సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చాం. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెరవేర్చాం. దాదాపు రూ.85కోట్లతో నిర్మాణాలు చేపట్టాం. సురక్షిత మంచి నీటి కోసం రూ.700కోట్లు ఖర్చు చేస్తున్నాం. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు అత్యున్నత ప్రమాణాలతో వైద్యసేవలు కిడ్నీ రీసెర్చ్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ద్వారా సేవలు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేసే వ్యవస్థను కూడా అందుబాటులోకి తెస్తాం. దేశ, విదేశాల నుంచి నిపుణులైన వైద్యుల పర్యవేక్షలో రీసెర్చ్. కిడ్నీ వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించేందుకు జిల్లాలోని ఏడు మండలాల్లో స్క్రీనింగ్ పరీక్షలు చేయిస్తున్నాం. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఉచితంగా మందులు అందిస్తున్నాం. విలేజ్ క్లినిక్, ఆరోగ్య సురక్ష ద్వారా పేదలకు అండగా ఉన్నాం. నాన్ డయాలసిస్ రోగులకు కూడా రూ.5వేలు ఇస్తున్నాం. కిడ్నీ వ్యాధిగ్రస్తులను ఆదుకునేందుకు మానవతా ధృక్పదంతో అడుగులు వేస్తున్నాం. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు పెన్షన్ రూ.10వేలకు పెంచాం. దేవుడి దయతో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, 200 పడకల ఆసుపత్రిని ప్రారంభించుకున్నాం. మన ప్రభుత్వంలో 13వేల మందికిపైగా డయాలసిస్ రోగులకు పెన్షన్ ప్రతీ నెల పెన్షన్ల కోసం 12కోట్ల 54లక్షలు ఖర్చు చేస్తున్నాం. ఉద్దానంలో కిడ్నీ సమస్యలకు మూల కారణం తెలుసుకునేందుకు సమగ్రంగా అధ్యయనం మొదలుపెట్టాం. మార్కాపురంలోనూ మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తున్నాం. కిడ్నీ వ్యాధిగ్రస్తులు రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా వారిని ఆదుకునేందుకు వేగంగా అడుగులు వేస్తున్నాం. పలాస బహిరంగ సభ: డాక్టర్ సీదిరి అప్పలరాజు, పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి అందరికీ నమస్కారం, చాలా సంతోషం, ఎన్నో ఏళ్ళుగా ఎదురుచూస్తున్న గొప్ప కల సాకారమవుతోంది. ఏదైనా మనం ఒక పని మొదలుపెట్టేటప్పుడు ముందు దేవుణ్ని మొక్కి మొదలుపెడతాం.పని పూర్తయిన తర్వాత అదే దేవుణ్ని మొక్కి కృతజ్ఞతలు తెలుపుకుంటాం. ఈ ప్రాంతంలో వేలాదిమంది ఎందుకు చనిపోతున్నారో తెలియని పరిస్ధితులు చూశాం నేను ఈ ప్రాంత వైద్యుడిగా ప్రత్యక్షంగా చూశాను, ఈ ప్రాంత ప్రజలకు ఆ దేవుడు పంపిన స్వరూపమే మన సీఎం కొన్ని వేల మంది ప్రాణాలు పోయాయి, వందల మంది ఉద్యమాల బాట పట్టారు, మా కష్టాలు, కన్నీళ్ళు ఎవరైనా తుడవకపోతారా ఎదురుచూసిన ప్రాంతం ఇది వారికి సంజీవనిలా మీరు వచ్చారు, ఇది అతిపెద్ద భగీరథ ప్రయత్నం మీరు చేశారు అనేక అడ్డంకులు దాటి పూర్తిచేసిన మీ సంకల్పానికి సలాం పలాస అంటే ప్రపంచానికి తెలిసేది ఒకటి జీడిపప్పు, రెండు కొబ్బరి పంట ఈ ప్రాంత ప్రజలకు ఉపాధి మార్గమైన అదనపు ఇండస్ట్రియల్ ఎస్టేట్‌కు సైతం శంకుస్ధాపన చేసిన మీకు కృతజ్ఞతలు ఈ రోజు ప్రతిపక్షం మాటలు, కొన్ని పత్రికలు చూపుతున్న వక్రబాష్యాలు చూస్తున్నాం వారందరికీ నేను ఒకటే చెబుతున్నా.. ఈ రాష్ట్రంలో ఉన్న ఏ గ్రామమైనా తీసుకోండి ఆ గ్రామంలో సచివాలయాలు, విలేజ్ హెల్త్ క్లీనిక్స్, ఆర్బీకేలు అభివృద్దిలో భాగం కాదా, విద్యావ్యవస్ధలో నాడు నేడు గొప్ప కార్యక్రమం, ఇవి అభివృద్ది కాదా, ఇక్కడ ప్రజలు వలసలు పోతున్నారంటున్నారు, కానీ ఇక్కడ మూలపేట పోర్టు పూర్తయితే ఈ జిల్లాకే వలసలు మొదలవుతాయి, భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖను రాజధాని చేయాలని, ఉత్తరాంధ్ర అభివృద్దికి మీరు చేస్తున్న సంస్కరణలు చిరస్మరణీయం రాబోయే దశాబ్ధానికి ఈ రాష్ట్రానికి సీఎంగా జగన్ గారే రావాలి, కావాలి, మీరు సీఎంగా కొనసాగడం ప్రతి పేదవాడికి అవసరం మీరు వెనక్కి తగ్గద్దు, గెలిచేవారికే టికెట్లివ్వండి, మా నియోజకవర్గమే కాదు రాష్ట్రంలో ఉన్న ప్రతి నియోజకవర్గంలో ఇదే సంకల్పం తీసుకోవాలి మన జగనన్న సీఎం కావడం కోసం మనమంతా నడుం బిగించాలి. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ అభివృద్ది కోసం ప్రత్యేకంగా రూ. 5 కోట్లు మంజూరు చేయాలని కోరుతున్నాను ఈ నియోజకవర్గంలో ఉన్న నౌపాడ, వెంకటాపురం రోడ్డును విస్తరించేందుకు ప్రతిపాదనలు అందజేశాం, మంజూరు చేయాలని కోరుతున్నాను. మాది వంశధార శివారు ప్రాంతం కాబట్టి హిరమండలం ఎల్ఐ స్కీమ్ ఇచ్చారు, దీనికి లింక్‌గా రూ. 8 కోట్లతో ప్రతిపాదనలు ఇచ్చాం, మంజూరు చేయగలరు వజ్రపుకొత్తూరు మండలంలోని శివారు ప్రాంతాలకు చిన్న లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌ను మంజూరు చేయాలని కోరుతున్నాం. అనేక పనులు పూర్తిచేయమని మీరు నిధులు ఇచ్చారు, మా పలాస ప్రజల తరపున మీకు కృతజ్ఞతలు. ధన్యవాదాలు ►పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్-సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభించిన సీఎం జగన్ ►మకరాంపురం నుంచి పలాస బయల్దేరిన సీఎం జగన్ ►కిడ్నీ రీసెర్చ్ సెంటర్-సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభించనున్న సీఎం జగన్ ►అనంతరం రైల్వే గ్రౌండ్ భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్న సీఎం జగన్.. ►వైఎస్సార్ సుజలధార డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం జగన్ ►రూ.700 కోట్ల వ్యయంతో నిర్మించిన సుజలధార ప్రాజెక్టు జాతికి అంకితం ►శ్రీకాకుళం: కంచిలి మండలం మకరాంపురం చేరుకున్న సీఎం జగన్ ►ఉద్దానం మంచినీటి పథకం, పలాస కిడ్నీ రిసెర్చ్ సెంటర్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించనున్న సీఎం ►విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న సీఎం జగన్ ►అక్కడ నుండి శ్రీకాకుళం జిల్లా పలాస వెళ్లనున్న సీఎం ►పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను ప్రారంభించనున్న సీఎం జగన్ తాడేపల్లి నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న సీఎం జగన్ ►గన్నవరం నుండి విశాఖపట్నం బయల్దేరిన సీఎం ►అక్కడ నుండి శ్రీకాకుళం జిల్లా పలాస వెళ్లనున్న సీఎం ►పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను ప్రారంభించనున్న సీఎం జగన్ ►ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం శ్రీకాకుళం జిల్లా పలాసలో పర్యటించనున్నారు. ఆయన గుంటూరు జిల్లా తాడేపల్లిలోని నివాసం నుంచి ఉదయం 8 గంటలకు బయలుదేరి 10.30 గంటలకు కంచిలి మండలం మకరాంపురం గ్రామానికి హెలికాప్టర్లో వస్తారు. అక్కడ ప్రజల నుంచి వినతులు స్వీకరించి 11.10 గంటలకు వైఎస్సార్ సుజలధార ప్రాజెక్టు పంప్‌హౌస్ స్విచ్ నొక్కి దాన్ని ప్రారంభిస్తారు. అక్కడి నుంచి పలాస వెళ్తారు. అక్కడ ప్రజల నుంచి వినతులు స్వీకరించి 11.40 గంటలకు కిడ్నీ పరిశోధన కేంద్రానికి చేరుకుంటారు. ►అక్కడ ఆస్పత్రిని ప్రారంభించి దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఇండ్రస్టియల్ కారిడార్‌కు శంకుస్థాపన చేస్తారు. అలాగే ఎచ్చెర్లలోని బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో కొత్తగా నిర్మించిన వసతి గృహ భవనాన్ని వర్చువల్ పద్ధతిలో ప్రారంభిస్తారు. ఆ తర్వాత పాత జాతీయ రహదారి మీదుగా పలాస రైల్వే క్రీడా మైదానానికి చేరుకుంటారు. సభా ప్రాంగణంలో స్టాల్స్‌ను పరిశీలించి బహిరంగ సభలో మాట్లాడతారు. మధ్యాహ్నం 2.40 గంటలకు తిరిగి హెలికాప్టర్లో విశాఖకు బయలుదేరతారు. ►ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తుల సమస్యకు రాష్ట్ర ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపుతోంది. దీంతో వారి కష్టాలు తీరనున్నాయి. ఈ మేరకు శ్రీకాకుళం జిల్లా పలాసలో రూ.85 కోట్ల వ్యయంతో నిర్మించిన డాక్టర్ వైఎస్సార్ కిడ్నీ రీసెర్చ్ – 200 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించనున్నారు. ►అలాగే రూ.700 కోట్ల వ్యయంతో నిర్మించిన వైఎస్సార్ సుజలధార ప్రాజెక్టును ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. ఉద్దానం ప్రాంతంలో కళ్లెదుటే కిడ్నీ సమస్య కనిపిస్తున్నా గతంలో ఎవరూ దీనికి పరిష్కారం చూపడానికి కూడా సాహసించలేదు. ఇలాంటి పరిస్థితిలో వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.785 కోట్లు భారీ వ్యయం చేసి మరీ.. ఉద్దానం వ్యాధిగ్రస్తుల సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపింది. వైఎస్సార్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్– 200 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.. ►ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తులకు మెరుగైన కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందించేందుకు, అలాగే అన్ని రకాల కిడ్నీ వ్యాధులపై పరిశోధనలు చేసేందుకు పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, 200 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, డయాలసిస్ యూనిట్ల ఏర్పాటు.. మూడు బ్లాకులుగా నాలుగు అంతస్తుల్లో ఆస్పత్రి నిర్మాణం. క్యాజువాలిటీ, రేడియో డయాగ్నోసిస్, పాథాలజీ, మైక్రో బయాలజీ, బయో కెమిస్ట్రీ ల్యాబ్స్, సెంట్రల్ ల్యాబ్స్, నెఫ్రాలజీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్, సర్జరీ, డయాలసిస్, పోస్ట్ ఆపరేటివ్, ఐసీయూ, రీసెర్చ్ ల్యాబ్‌తో ప్రత్యేక వార్డులు. ►సీటీ స్కాన్, 2డీ ఎకో, హై ఎండ్ కలర్ డాప్లర్, మొబైల్ ఎక్స్ రే (డిజిటల్), థూలియం లేజర్ యూరో డైనమిక్ మెషీన్ తదితర పరికరాలతో పాటు ఐసీయూ సౌకర్యాలు. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, యూరాలజీ, నెఫ్రాలజీ వంటి స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో ఇప్పటికే 42 స్పెషాలిటీ డాక్టర్ పోస్టులు, 60 స్టాఫ్ నర్సు పోస్టులు, 60 ఇతర సహాయ సిబ్బంది పోస్టుల భర్తీ. వైఎస్సార్ సుజలధార ప్రాజెక్ట్.. ►ఉద్దానం ప్రాంతంలో దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధులు (క్రానిక్ కిడ్నీ డిసీజెస్) ప్రబలంగా ఉన్న ఏడు మండలాల్లోని అన్ని గ్రామాలకు ‘వైఎస్సార్ సుజలధార‘ ప్రాజెక్టు ద్వారా శుద్ధి చేసిన రక్షిత తాగునీరు. హిరమండలం రిజర్వాయర్ నుంచి నీటిని తీసుకుని శుద్ధి చేసి పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల పరిధిలో 7 మండలాల్లోని 807 గ్రామాలకు రక్షిత నీటి సరఫరా. ►ఈ ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న 6.78 లక్షల జనాభా 2051 నాటికి 7.85 లక్షలకు చేరుతుందన్న అంచనాతో అప్పటి అవసరాలకు కూడా సరిపోయేలా ఒక్కొక్కరికి రోజుకు 100 లీటర్ల చొప్పున నీటి సరఫరా చేసేలా ప్రాజెక్టు నిర్మాణం. ఇప్పటికే 613 గ్రామాలకు నీటి సరఫరా.. ఈ నెలాఖరుకు మిగిలిన గ్రామాలకు. ఉద్దానం కిడ్నీ బాధితులకు అండగా ప్రభుత్వం చేపట్టిన చర్యలు.. ♦ గత ప్రభుత్వంలో డయాలసిస్ రోగులకు కేవలం రూ.2,500 చొప్పున పింఛన్ ఇస్తే వైఎస్సార్సీపీ ప్రభుత్వం దాన్ని ఏకంగా రూ.10 వేలకు పెంచింది. ప్రతి నెలా 1న ఠంఛన్‌గా లబ్ధిదారులకు వారి ఇళ్ల వద్దే వలంటీర్లతో అందజేస్తోంది. ♦ ఇప్పటికే టెక్కలి, పలాస, సోంపేట, కవిటి, హరిపురం ఆస్పత్రుల్లో 74 మెషీన్లతో డయాలసిస్ సేవలు. ఇలా వరుసగా 2019–20లో 37,454 సెషన్లు, 2020– 21లో 46,162 సెషన్లు, 2021–22లో 54,520 సెషన్లు, 2022–23లో 55,520 సెషన్లు, 2023–24లో (అక్టోబర్ నాటికి) 38,513 సెషన్ల చొప్పున కిడ్నీ బాధితులకు ప్రభుత్వం డయాలసిస్ సేవలు అందించింది. ఇప్పుడు దీనికి అదనంగా మరింత మెరుగైన సేవలు అందించేందుకు కిడ్నీ రీసెర్చ్ సెంటర్–సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ♦వైద్య పరీక్షల కోసం ఉద్దానం ప్రాంతంలోని 18 పీహెచ్‌సీలు, 5 యూపీహెచ్‌సీలు, 6 సీహెచ్‌సీల్లో సెమీ ఆటో ఎనలైజర్స్, ఎలక్ట్రోలైట్ ఎనలైజర్స్, యూరిన్ ఎనలైజర్స్ ఏర్పాటు. గత టీడీపీ ప్రభుత్వంలో డయాలసిస్ రోగులకు 20 రకాల మందులు మాత్రమే.. అది కూడా అరకొరగా అందజేశారు. ప్రస్తుతం ఇక్కడ ప్రతి ఆస్పత్రిలో 37 రకాల మందులను వైఎస్సార్సీపీ ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. కొత్త కేసుల గుర్తింపునకు నిరంతరాయంగా స్క్రీనింగ్ కొనసాగుతోంది. స్క్రీనింగ్ అనంతరం అనుమానిత లక్షణాలున్న వారి నుంచి రక్త నమూనాలు సేకరించి సీరమ్ క్రియాటినిన్ పరీక్షల కోసం సమీపంలోని పీహెచ్‌సీలకు తరలిస్తున్నారు. వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్‌లో పనిచేసే సీహెచ్‌వోలకు ప్రత్యేక యాప్. ఉద్దానం సమస్యలకు సంబంధించి ఏ రకమైన ఇబ్బందులు ఉన్నా.. జగనన్నకు చెబుదాం 1902 టోల్ ఫ్రీ నంబర్ -
ఉద్దానం సమస్యకు ఇక శాశ్వత పరిష్కారం
సాక్షి, అమరావతి: ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తుల సమస్యకు రాష్ట్ర ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపుతోంది. దీంతో వారి కష్టాలు తీరనున్నాయి. ఈ మేరకు శ్రీకాకుళం జిల్లా పలాసలో రూ.85 కోట్ల వ్యయంతో నిర్మించిన డాక్టర్ వైఎస్సార్ కిడ్నీ రీసెర్చ్ – 200 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించనున్నారు. అలాగే రూ.700 కోట్ల వ్యయంతో నిర్మించిన వైఎస్సార్ సుజలధార ప్రాజెక్టును ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. ఉద్దానం ప్రాంతంలో కళ్లెదుటే కిడ్నీ సమస్య కనిపిస్తున్నా గతంలో ఎవరూ దీనికి పరిష్కారం చూపడానికి కూడా సాహసించలేదు. ఇలాంటి పరిస్థితిలో వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.785 కోట్లు భారీ వ్యయం చేసి మరీ.. ఉద్దానం వ్యాధిగ్రస్తుల సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపింది. వైఎస్సార్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్– 200 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.. ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తులకు మెరుగైన కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందించేందుకు, అలాగే అన్ని రకాల కిడ్నీ వ్యాధులపై పరిశోధనలు చేసేందుకు పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, 200 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, డయాలసిస్ యూనిట్ల ఏర్పాటు.. మూడు బ్లాకులుగా నాలుగు అంతస్తుల్లో ఆస్పత్రి నిర్మాణం. క్యాజువాలిటీ, రేడియో డయాగ్నోసిస్, పాథాలజీ, మైక్రో బయాలజీ, బయో కెమిస్ట్రీ ల్యాబ్స్, సెంట్రల్ ల్యాబ్స్, నెఫ్రాలజీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్, సర్జరీ, డయాలసిస్, పోస్ట్ ఆపరేటివ్, ఐసీయూ, రీసెర్చ్ ల్యాబ్‌తో ప్రత్యేక వార్డులు. సీటీ స్కాన్, 2డీ ఎకో, హై ఎండ్ కలర్ డాప్లర్, మొబైల్ ఎక్స్ రే (డిజిటల్), థూలియం లేజర్ యూరో డైనమిక్ మెషీన్ తదితర పరికరాలతో పాటు ఐసీయూ సౌకర్యాలు. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, యూరాలజీ, నెఫ్రాలజీ వంటి స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో ఇప్పటికే 42 స్పెషాలిటీ డాక్టర్ పోస్టులు, 60 స్టాఫ్ నర్సు పోస్టులు, 60 ఇతర సహాయ సిబ్బంది పోస్టుల భర్తీ. వైఎస్సార్ సుజలధార ప్రాజెక్ట్.. ఉద్దానం ప్రాంతంలో దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధులు (క్రానిక్ కిడ్నీ డిసీజెస్) ప్రబలంగా ఉన్న ఏడు మండలాల్లోని అన్ని గ్రామాలకు ‘వైఎస్సార్ సుజలధార‘ ప్రాజెక్టు ద్వారా శుద్ధి చేసిన రక్షిత తాగునీరు. హిరమండలం రిజర్వాయర్ నుంచి నీటిని తీసుకుని శుద్ధి చేసి పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల పరిధిలో 7 మండలాల్లోని 807 గ్రామాలకు రక్షిత నీటి సరఫరా. ఈ ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న 6.78 లక్షల జనాభా 2051 నాటికి 7.85 లక్షలకు చేరుతుందన్న అంచనాతో అప్పటి అవసరాలకు కూడా సరిపోయేలా ఒక్కొక్కరికి రోజుకు 100 లీటర్ల చొప్పున నీటి సరఫరా చేసేలా ప్రాజెక్టు నిర్మాణం. ఇప్పటికే 613 గ్రామాలకు నీటి సరఫరా.. ఈ నెలాఖరుకు మిగిలిన గ్రామాలకు. ఉద్దానం కిడ్నీ బాధితులకు అండగా ప్రభుత్వం చేపట్టిన చర్యలు.. ♦ గత ప్రభుత్వంలో డయాలసిస్ రోగులకు కేవలం రూ.2,500 చొప్పున పింఛన్ ఇస్తే వైఎస్సార్సీపీ ప్రభుత్వం దాన్ని ఏకంగా రూ.10 వేలకు పెంచింది. ప్రతి నెలా 1న ఠంఛన్‌గా లబ్ధిదారులకు వారి ఇళ్ల వద్దే వలంటీర్లతో అందజేస్తోంది. ♦ ఇప్పటికే టెక్కలి, పలాస, సోంపేట, కవిటి, హరిపురం ఆస్పత్రుల్లో 74 మెషీన్లతో డయాలసిస్ సేవలు. ఇలా వరుసగా 2019–20లో 37,454 సెషన్లు, 2020– 21లో 46,162 సెషన్లు, 2021–22లో 54,520 సెషన్లు, 2022–23లో 55,520 సెషన్లు, 2023–24లో (అక్టోబర్ నాటికి) 38,513 సెషన్ల చొప్పున కిడ్నీ బాధితులకు ప్రభుత్వం డయాలసిస్ సేవలు అందించింది. ఇప్పుడు దీనికి అదనంగా మరింత మెరుగైన సేవలు అందించేందుకు కిడ్నీ రీసెర్చ్ సెంటర్–సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ♦వైద్య పరీక్షల కోసం ఉద్దానం ప్రాంతంలోని 18 పీహెచ్‌సీలు, 5 యూపీహెచ్‌సీలు, 6 సీహెచ్‌సీల్లో సెమీ ఆటో ఎనలైజర్స్, ఎలక్ట్రోలైట్ ఎనలైజర్స్, యూరిన్ ఎనలైజర్స్ ఏర్పాటు. గత టీడీపీ ప్రభుత్వంలో డయాలసిస్ రోగులకు 20 రకాల మందులు మాత్రమే.. అది కూడా అరకొరగా అందజేశారు. ప్రస్తుతం ఇక్కడ ప్రతి ఆస్పత్రిలో 37 రకాల మందులను వైఎస్సార్సీపీ ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. కొత్త కేసుల గుర్తింపునకు నిరంతరాయంగా స్క్రీనింగ్ కొనసాగుతోంది. స్క్రీనింగ్ అనంతరం అనుమానిత లక్షణాలున్న వారి నుంచి రక్త నమూనాలు సేకరించి సీరమ్ క్రియాటినిన్ పరీక్షల కోసం సమీపంలోని పీహెచ్‌సీలకు తరలిస్తున్నారు. వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్‌లో పనిచేసే సీహెచ్‌వోలకు ప్రత్యేక యాప్. ఉద్దానం సమస్యలకు సంబంధించి ఏ రకమైన ఇబ్బందులు ఉన్నా.. జగనన్నకు చెబుదాం 1902 టోల్ ఫ్రీ నంబర్ నేడు సీఎం పర్యటన ఇలా.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం శ్రీకాకుళం జిల్లా పలాసలో పర్యటించనున్నారు. ఆయన గుంటూరు జిల్లా తాడేపల్లిలోని నివాసం నుంచి ఉదయం 8 గంటలకు బయలుదేరి 10.30 గంటలకు కంచిలి మండలం మకరాంపురం గ్రామానికి హెలికాప్టర్లో వస్తారు. అక్కడ ప్రజల నుంచి వినతులు స్వీకరించి 11.10 గంటలకు వైఎస్సార్ సుజలధార ప్రాజెక్టు పంప్‌హౌస్ స్విచ్ నొక్కి దాన్ని ప్రారంభిస్తారు. అక్కడి నుంచి పలాస వెళ్తారు. అక్కడ ప్రజల నుంచి వినతులు స్వీకరించి 11.40 గంటలకు కిడ్నీ పరిశోధన కేంద్రానికి చేరుకుంటారు. అక్కడ ఆస్పత్రిని ప్రారంభించి దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఇండ్రస్టియల్ కారిడార్‌కు శంకుస్థాపన చేస్తారు. అలాగే ఎచ్చెర్లలోని బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో కొత్తగా నిర్మించిన వసతి గృహ భవనాన్ని వర్చువల్ పద్ధతిలో ప్రారంభిస్తారు. ఆ తర్వాత పాత జాతీయ రహదారి మీదుగా పలాస రైల్వే క్రీడా మైదానానికి చేరుకుంటారు. సభా ప్రాంగణంలో స్టాల్స్‌ను పరిశీలించి బహిరంగ సభలో మాట్లాడతారు. మధ్యాహ్నం 2.40 గంటలకు తిరిగి హెలికాప్టర్లో విశాఖకు బయలుదేరతారు. -
Uddanam Hospital: పలాసలోని ఉద్దానం ఆసుపత్రి, కిడ్నీ రీసెర్చ్ సెంటర్ (ఫొటోలు)
-
ఉద్దానం సమస్యకు శాశ్వత పరిష్కారం
-
ఉద్దానానికి ఊపిరి
పచ్చటి ఉద్దానం కంట వెచ్చగా జారిన కన్నీటి బొట్లు.. దశాబ్దాలుగా గుండెలు పిండేసే కిడ్నీ బాధలు ఇక్కడెన్నో.. ఐదో తనం కోల్పోయిన తల్లులు, అమ్మనాన్నలకు దూరమైన పిల్లలు అడుగడుగునా కనిపిస్తారు. ఇక్కడ మనుషులకు కన్నీరు శాశ్వత నేస్తం. ఈ ఊళ్లకు ఉమ్మడి ఆస్తి కష్టం. ఈ కిడ్నీ వ్యాధి ఊళ్లకు ఊళ్లను తినేసింది. పరిస్థితి ఎక్కడికి వెళ్లిపోయిందంటే ఎంతకాలం రాసుంటే అంతకాలం బతుకుతాం, అప్పులు చేసి అనే వైరాగ్య పరిస్థితికి ఇక్కడి బాధితులు వెళ్లిపోయారు. నెలనెలా వేలకు వేలు ఖర్చుపెట్టి వైద్య పరీక్షలు, కిడ్నీ వైద్యం చేయించుకోలేక స్థానికంగా దొరికే మందు బిళ్లలో, ఆకులతోనో సరిపెట్టుకునేవారు. ఇది నిన్నటి వరకు ఉన్న పరిస్థితి. ఇప్పుడు ఈ చీకటి బతుకులకు సీఎం వైఎస్ జగన్ చరమగీతం పాడుతున్నారు. నాడు ప్రతిపక్ష నేత హోదాలో ఇచ్చిన హామీ మేరకు.. మూడు దశాబ్దాల సమస్యకు చెక్ చెబుతూ శాశ్వత పరిష్కారం చూపారు. రూ.742 కోట్లతో వైఎస్సార్ సుజలధార మంచినీటి ప్రాజెక్టు, రూ.85 కోట్లతో 200 పడకల డాక్టర్ వైఎస్సార్ కిడ్నీ రీసెర్చ్ ఆస్పత్రిని ఏర్పాటుచేశారు. ఈ రెండింటినీ ప్రారంభించే మహోన్నత ఘట్టాన్ని గురువారం సీఎం జగన్ ఆవిష్కరించనున్నారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం/సాక్షి, అమరావతి/వజ్రపుకొత్తూరు రూరల్/వజ్రపుకొత్తూరు/మందస: శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంత ప్రజలను నాలుగు దశాబ్దాలుగా పీల్చిపిప్పి చేస్తున్న కిడ్నీ సమస్య సృష్టిస్తున్న కల్లోలం అంతాఇంతా కాదు. ఏళ్ల తరబడి నుంచి చాపకింద నీరులా ఈ ప్రాంతాన్ని కబళిస్తోంది. ఇక్కడున్న జనాభాలో 21 శాతానికి పైగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థంచేసుకోవచ్చు. ఇప్పటికే 15వేల మంది చనిపోయినట్లు అంచనా. ఒక అంచనా ప్రకారం.. జిల్లాలో 112 గ్రామాలు కిడ్నీ బారినపడి విలవిల్లాడుతున్నాయి. సాధారణంగా రక్తంలో సీరం క్రియాటిన్ 1.2 మిల్లీగ్రామ్/డెసీలీటర్ కంటే ఎక్కువగా ఉంటే కిడ్నీ సరిగా పనిచేయడంలేదని అర్థం. కానీ, ఉద్దానం ప్రాంతంలో సీరం క్రియాటిన్ లెవెల్స్ చాలామందిలో 25 మిల్లీగ్రామ్/డెసీలీటర్ మేరకు ఉంది. క్రియాటినిన్ 5 దాటితే డయాలసిస్ తప్పనిసరి. ఇటువంటి వారిలో వ్యాధి తీవ్రత పెరుగుతుంది. వీరంతా విశాఖపట్నం వెళ్లాల్సి వచ్చేది. వారానికి రెండుసార్లు కూడా వెళ్లేవారున్నారు. ఇలా రోజుకు 500కి.మీ. దూరం ప్రయాణించాల్సి వచ్చేది. రవాణా, వైద్య ఖర్చులు తలకుమించిన భారంగా మారాయి. ఎంతోమంది డబ్బుల్లేక, వైద్యం చేసుకోలేక ప్రాణాలను కోల్పోయేవారు. మరోవైపు.. ఈ మహమ్మారిని పాలకులెవరూ పట్టించుకోలేదు. ఏళ్లుగా ఇక్కడి బీల నేలలో తెగిపడిన తాళిబొట్లు ఏ నేతనూ కదిలించలేదు. హామీలిచ్చిన వారు కొందరు, అన్నీ చేసేశామని ప్రచారం చేసుకున్న వారు ఇంకొందరు. ఇలాంటి ఆపత్కాలంలో ప్రతిపక్షనేత హోదాలో జగన్ కిడ్నీ బాధితులకు సాంత్వన చేకూర్చే కబురు చెప్పారు. చెప్పినట్లుగానే ఇప్పుడు ఆపన్నహస్తం అందిస్తున్నారు. డబ్బుల్లేక అల్లాడుతున్న అభాగ్యులకు నెలనెలా చేతిలో రూ.10వేలు పెడుతున్నారు. ఎక్కడో ఉన్న వంశధారను ఉద్దానానికి తీసుకొచ్చారు. తగ్గిపోతున్న ఉద్దానం ఆయష్షు రేఖకు ఊపిరిలూదుతున్నారు. అంతేకాదు.. రూ. వందల కోట్లతో మంచినీటి ప్రాజెక్టును.. కిడ్నీ పరిశోధనా ఆస్పత్రిని ఏర్పాటుచేశారు. గతమంతా పరిశోధనలకే పరిమితం.. నిజానికి.. ఉద్దానంలో కిడ్నీ వ్యాధి ఆనవాళ్లు 1990 దశకంలో కన్పించాయి. కానీ, 2000లో సోంపేటకు చెందిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వైద్యులు వై.కృష్ణమూర్తి, పి.శివాజీ కవిటి ప్రాంతంలో కిడ్నీవ్యా««ధి కేసులను గుర్తించారు. 2002 నుంచి వారే వ్యాధి తీవ్రత ఏ స్థాయిలో ఉందనే అంశంపై పరిశోధన ప్రారంభించారు. ♦ 2004లో నాటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కేజీహెచ్ హెచ్ఓడీ డాక్టర్ రవిరాజ్‌తో కవిటి ప్రాంతంలో పరిశోధన వైద్య శిబిరాలు ప్రారంభించారు. ♦ 2008 మే 24న నెఫ్రాలజిస్ట్ డాక్టర్ గంగాధర్, హైదరాబాద్ నిమ్స్ ఆర్ఎంఓ శేషాద్రి ఉద్దానంలో పర్యటించారు. అదే ఏడాది నాటి రాష్ట్ర నీటి విశ్లేషణ పరిశోధనా సంస్థ ఇక్కడ నీటి నమూనాలను తీసుకెళ్లింది. ♦ 2009లో న్యూయార్క్‌కు చెందిన కిడ్నీ వ్యాధుల నిపుణుడు డాక్టర్ శివప్రసాద్ ఈ ప్రాంతంలో పర్యటించి రోగుల ఆహార అలవాట్లు, నీరు, రక్తం తదితర నమూనాలను పరిశోధనకు తీసుకెళ్లారు. ♦ 2011లో డాక్టర్ రవిరాజ్, డాక్టర్ వెలగల శ్రీనివాస్, డాక్టర్ కల్యాణ్‌చక్రవర్తి, ఎ.వేణుగోపాల్ అనే నెఫ్రాలజీ నిపుణుల బృందం ఉద్దానం ఎండోమిక్ నెఫ్రోపతి (యూఈఎన్) పేరిట ఓ అధ్యయనం చేసింది. ♦ 2011లో న్యూయార్క్‌కు చెందిన స్టోనీబ్రూక్స్ యూనివర్సిటీ నుంచి డాక్టర్ అనూప్ గంగూలీ, డాక్టర్ నీల్ ఓలిక్‌ల నేతృత్వంలో ఓ బృందం వివిధ గ్రామాల ఆహారపు అలవాట్లు తెలుసుకుని రక్త, మూత్ర నమూనాలు తీసుకెళ్లింది. ♦ 2011లో హైదరాబాద్‌కు చెందిన పరిశోధకురాలు సీఐఎస్ఆర్ సుజాత ఈ ప్రాంతంలో నీటిని తీసుకెళ్లి దాని ద్వారా ఏఏ మార్పులు వస్తున్నాయో పరిశీలించారు. ♦ ఆ తర్వాత 2012లో జపాన్ బృందం, అమెరికన్ల బృందం పర్యటించింది. ♦ 2012 అక్టోబరు 1న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికల్ డిసీజెస్ బృందం పరిశీలించింది. 2013లో ఆంధ్రా యూనివర్సిటీ నుంచి పోతురాజు అనే రీసెర్చ్ స్కాలర్ పరిశోధన చేశారు. ♦ 2017 నుంచి భారతీయ వైద్య పరిశోధనా మండలి డాక్టర్ వివేక్ ఝా నేతృత్వంలో ప్రస్తుతం పరిశోధన సాగుతోంది. ♦ అయితే, ఇప్పటివరకు, శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు ఇక్కడి కిడ్నీ వ్యాధులకు కచ్చితమైన మూలకారణాన్ని గుర్తించలేకపోయారు. ♦ కొన్ని అధ్యయనాలు ఈ వ్యాధి నీటిలో అధిక సెలీనియం లేదా సీసం కారణంగా ఉండవచ్చని అనుమానించాయి. మరికొందరు దీనికి నేల స్వభావమే కారణమై ఉండొచ్చని నివేదించారు. ఉష్ణోగ్రత, తక్కువ నీటి వినియోగం, అధిక పెయిన్ కిల్లర్స్ వాడకం, జన్యుపరమైన లోపాలు కూడా వ్యాధికి కారణమని అధ్యయనాలు చెబుతూ ఉన్నాయి. కానీ, ఈ అధ్యయనాలు ఏవీ సరైన స్పష్టత ఇవ్వలేకపోయాయి. ♦ మరోవైపు.. రాష్ట్ర ప్రభుత్వం జార్జ్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్, టెక్నాలజీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (టీఆర్ఐ), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్)తో 2019లో సంయుక్తంగా సమగ్ర పరిశోధనలు నిర్వహించి వ్యాధిని గుర్తించేందుకు అవగాహన ఒప్పందం (ఎంఓయూ)పై సంతకం చేసింది. కిడ్నీ బాధితులపై ఆగ్రహంతోఊగిపోయిన బాబు.. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఏనాడూ ఉద్దానంలోని కిడ్నీ బాధితుల గురించి పట్టించుకోలేదు. తిత్లీ తుపాను సమయంలో మొక్కుబడిగా పర్యటించినప్పటికీ వారికెలాంటి భరోసా ఇవ్వలేదు సరికదా.. తుపానుతో సర్వం కోల్పోయిన బాధితులు తమ గోడు చెప్పుకునేందుకు వస్తే ఆగ్రహంతో ఊగిపోయారు.‘నాకు 40 ఏళ్ల అనుభవం ఉంది.. నాకు అడ్డొస్తే బుల్డోజర్తో తొక్కేస్తా.. తొక్కతీస్తా.. తోలు తీస్తా’ అని వ్యాఖ్యానించారు. కొంతమందిపై కేసులు కూడా పెట్టారు. డ్రామాలకే పవన్ పరిమితం.. ఇక పవన్‌కళ్యాణ్ అయితే 2017లో దీక్ష పేరుతో పెద్ద డ్రామా ఆడారు. టీడీపీతో కలిసి ఐదేళ్లు చెట్టాపట్టాలు వేసుకున్నా దానికొక పరిష్కారం చూపలేదు. ఎవరైనా అడిగితే.. అంతా తానే చేశానని, కిడ్నీ బాధల నుంచి విముక్తి కల్పిస్తానని హడావుడి చేయడం తప్ప నిజానికి ఆయన చేసిందేమీ లేదు. కిడ్నీ బాధితులకు ఇది పెద్ద ఊరట ఉద్దానంలో కిడ్నీ బాధితులకు కిడ్నీ రీసెర్చ్ సెంటర్ పెద్ద ఊరట కలిగిస్తుంది. వీరికోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండు ప్రధాన కార్యక్రమాలు చేపట్టడం గొప్ప విషయం. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటుచేయడంతోపాటు వంశధార నది నుంచి మంచినీటిని అందించేందుకు చర్యలు చేపట్టడం, అది కూడా హామీ ఇ చ్చిన ఐదేళ్లలో పనులు పూర్తిచేయడం చరిత్రాత్మకం. ఆస్పత్రి పరంగా మూలాల శోధనకు ప్రాధాన్యత ఇవ్వడం, పరిశోధనతోనే కిడ్నీ ఇబ్బందులకు పరిష్కారం దొరుకుతుంది. – డాక్టర్ ప్రధాన శివాజీ, రిటైర్డ్ ప్రభుత్వ వైద్యుడు, సోంపేట వైఎస్ జగన్ సీఎం అయ్యాక తీసుకున్న చర్యలు వైఎస్ జగన్ అధికారం చేపట్టిన తర్వాత కిడ్నీ రోగులకు అండగా ఉండేందుకు పింఛన్ పెంచారు. అప్పటివరకు రూ.3,500 ఉన్న పింఛన్‌ను రూ.10వేలకు పెంచారు. వ్యాధి తీవ్రత ఆధారంగా రెండు రకాలుగా పింఛన్లు అందజేస్తున్నారు. 5కు పైబడి సీరం క్రియాటిన్ ఉన్న వారికి రూ.5వేలు, డయాలసిస్ రోగులకు రూ.10వేల పింఛన్ ఇస్తున్నారు. ఈ లెక్కన ప్రస్తుతం రూ.10వేలు చొప్పున 792 మందికి.. రూ.5 వేలు చొప్పున 451 మందికి పింఛన్లు ఇస్తున్నారు. అవసరమైతే ఎంతమందికైనా మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ♦ ప్రస్తుతం టెక్కలి, పలాస, సోంపేట, కవిటి, హరిపురం ఆసుపత్రుల్లో డయాలసిస్ సెంటర్లు ఉన్నాయి. 63 మెషిన్లతో 68 పడకలపై డయాలసిస్ అందిస్తున్నారు. ♦ సోంపేట సీహెచ్‌సీ డయాలసిస్ సెంటర్లో 13 పడకలుండేవి. వాటిని 21కి పెంచారు. ♦ కవిటి సీహెచ్‌సీ డయాలసిస్ సెంటర్లో 10 పడకలు ఉండగా, 19కి పెంచారు. ♦ హరిపురంలో కొత్తగా 10 పడకలతో డయాలసిస్ సెంటర్ ఏర్పాటుచేశారు. రెండు కంటైన్డ్ బేస్డ్ సర్విసెస్ డయాలసిస్ యూనిట్లను ఏర్పాటుచేశారు. ♦ ఇవికాక.. కొత్తగా గోవిందపురం, కంచిలి, అక్కుపల్లి, బెలగాంలో 25 మెషిన్లతో డయాలసిస్ సెంటర్లు మంజూరయ్యాయి. ♦ ఇచ్ఛాపురం సీహెచ్‌సీ, కంచిలి పీహెచ్సీలో 25 మెషిన్లతో డయాలసిస్ సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి చ్చింది. ♦ టీడీపీ హయాంలో డయాలసిస్ రోగులకు 20 రకాల మందులే అందుబాటులో ఉండేవి. ఇప్పుడు 37 రకాల మందులను అందుబాటులో ఉంచారు. అవసరమైతే ఇంకా మందులు కొనుగోలు చేసే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. ♦ కిడ్నీ రోగులకు నిరంతరం వైద్య పరీక్షల కోసం సెమీ ఆటో ఎనలైజర్స్, ఎలక్ట్రోలైట్ ఎనలైజర్స్, యూరిన్ ఎనలైజర్స్‌ను ఉద్దానం పరిధిలో ఉన్న 29 ల్యాబ్‌లలో అందుబాటులో ఉంచారు. ♦ కిడ్నీ సమస్యలను ప్రాథమిక దశలోనే గుర్తించి, బాధితులకు మెరుగైన వైద్యం అందించడం ద్వారా మరణాలను నియంత్రించేందుకు నిరంతర స్క్రీనింగ్‌ను ప్రభుత్వం చేపడుతోంది. వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్‌లలో పనిచేసే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ (సీహెచ్ఓ)లకు ప్రత్యేకంగా ఒక యాప్‌ను రూపొందించారు. ఇప్పటివరకూ ఉద్దానం ప్రాంతంలోని 2.32లక్షల మందిని స్క్రీన్ చేయగా 19,532 మందిలో సీరమ్ క్రియాటిన్ 1.5 ఎంజీ/డీఎల్ కన్నా ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. వీరందరికీ వైద్య సాయం అందించారు. ♦ టీడీపీ హయాంలో జిల్లా నెఫ్రాలజీ విభాగమే లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక శ్రీకాకుళం రిమ్స్‌లోనెఫ్రాలజీ విభాగం ఏర్పాటుచేశారు. ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించారు. ప్రతి శనివారం పలాస సీహెచ్‌సీకి వెళ్లి రోగులకు వైద్యం అందిస్తున్నారు. ♦ కిడ్నీ బాధితులకు అత్యంత నాణ్యమైన కార్పొరేట్ వైద్యాన్ని పూర్తి ఉచితంగా చేరువలో అందించడం కోసం రూ.85 కోట్ల అంచనాలతో పలాసాలో రీసెర్చ్ సెంటర్‌తోపాటు 200 పడకలతో సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మించారు. ఇందులో రూ.60 కోట్లు ఆస్పత్రి నిర్మాణానికి, రూ.25 కోట్లు అధునాతన వైద్య పరికరాలు, ఇతర వనరుల కల్పనకు కేటాయించారు. రూ.742కోట్లతో భారీ రక్షిత మంచినీటి పథకం ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధులకు ప్రధాన కారణం తాగునీరుగా భావిస్తున్న నేపథ్యంలో నిపుణుల సూచనల మేరకు వంశధార నదీ జలాలను భూ ఉపరితల తాగునీరుగా అందించేందుకు రూ.742 కోట్లతో వైఎస్సార్ సుజలధార ప్రాజెక్టును సీఎం జగన్ మంజూరు చేశారు. దీనికింద ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాల పరిధిలో ఉన్న ఏడు మండలాల్లోని 807 గ్రామాలకు ఇంటింటికీ కుళాయిల ద్వారా నిరంతరం స్వచ్ఛమైన తాగునీరు అందించనున్నారు. ఈ మంచినీటి పథకానికి 2019 సెపె్టంబరు 6న సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. 2050 నాటికి ఆ ప్రాంతంలో పెరిగే జనాభా అంచనాతో ఒక్కొక్కరికి రోజుకు వందలీటర్ల చొప్పున అందేలా ఈ పథకాన్ని రూపొందించారు. భవిష్యత్‌లో శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం, మెలియాపుట్టి మండలాల్లోని 170 గ్రామాలకు కూడా ఈ పైపులైన్ ద్వారా అదనంగా తాగునీరు అందించే వీలుగా ఈ పథకాన్ని డిజైన్ చేశారు. నిజానికి.. ఉద్దానం సమీపంలో ఉన్న బాహుదా, మహేంద్రతనయ నదుల నుంచి తక్కువ ఖర్చుతోనే రక్షితనీటి సరఫరాకు అవకాశమున్నా వేసవిలో ఆ నదులు ఎండిపోతే ఇక్కడి ప్రజలు బోరు నీటిని తాగక తప్పదన్న భావనతో జగన్ సర్కార్ ఆ ప్రతిపాదనను మొదట్లోనే పక్కనపెట్టింది. ఏడాది పొడవునా నీరు అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో ఖర్చు ఎక్కువైనా ఈ ప్రాంతానికి 104 కిలోమీటర్ల దూరంలోని హిరమండలం రిజర్వాయర్ నుంచి నీటి తరలింపునకు పూనుకుంది. ఈ ప్రాంతం మొత్తానికి ఏడాది పొడవునా తాగునీటి అవసరాలకు ఒక టీఎంసీ కన్నా తక్కువ నీరు అవసరం ఉండగా.. హిరమండలం రిజర్వాయర్‌లో కనీస నీటిమట్టం స్థాయిలోను 2.67 టీఎంసీల నీరు అందుబాటులో ఉంటుంది. ఇక్కడ నుంచి మూడు భారీ మోటార్ల ద్వారా 32 కిలోమీటర్ల దూరంలోని మెలియాపుట్టి మండల కేంద్రం వద్దకు చేరుతుంది. అక్కడ నీటిని శుద్ధిచేసి ఉద్దానానికి సరఫరా చేస్తారు. ఇదీ కిడ్నీ పరిశోధనా కేంద్రం స్వరూపం.. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సహకారంతో ఈ పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. ♦ ఇందులో.. మొదటి అంతస్తులో అత్యాధునిక సౌకర్యాలతో ఓపీ విభాగం, రీనల్ ల్యాబ్, పాలనా విభాగం, మీటింగ్ హాల్, మెడిసిన్ స్టోర్సు ఉన్నాయి. ♦ రెండో అంతస్తులో నెఫ్రాలజీ విభాగం, పేమెంట్ రూములు, కీలకమైన డయాలసిస్ విభాగాన్ని ఏర్పాటుచేశారు. ♦ మూడో అంతస్తులో ఆపరేషన్ థియేటర్ కాంప్లెక్స్, సీఎస్ఎస్ డి, అదనపు వసతులతో ఉన్న పే రూములు, ప్రీ, పోస్ట్ ఆపరేటివ్ వార్డులు, ఐసోలేషన్ గది, బ్లడ్ బ్యాంకు ఉన్నాయి ♦ నాలుగో అంతస్తులో యూరాలజీ వార్డు, పే రూములు, రీసెర్చ్ లేబొరేటరీలు ఏర్పాటుచేశారు. సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు.. ఈ కేంద్రంలో అందించే వైద్యసేవల్ని పరిశీలిస్తే యూరాలజీ, రేడియాలజీ, ఎనస్తీషియా, నెఫ్రాలజీ, వ్యాస్కులర్ సర్జన్, పల్మనాలజీ, కార్డియాలజీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, బయో కెమిస్ట్రీ లాంటి సూపర్ స్పెషాలిటీస్ సేవలు.. జనరల్ సర్జన్, జనరల్ మెడిసిన్ సేవలు అందిస్తారు. ఈ ఆస్పత్రిలో 41 మంది సూపర్ స్పెషలిస్టులు, స్పెషలిస్టులు, వైద్యాధికారులను రెగ్యులర్ ప్రాతిపదికన నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జూలై 3న ఉత్తర్వులు జారీచేసింది. వీరితోపాటు స్టాఫ్ నర్సు పోస్టులు 60, ఇతర సహాయ సిబ్బంది పోస్టులు కలిపి 154 పోస్టులను కొత్తగా మంజూరు చేసి భర్తీ చేపట్టారు. మరోవైపు.. ఇందులో ప్రపంచస్థాయి, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన యంత్ర పరికరాలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సిద్ధంచేసింది. గత 20 రోజులుగా వీటితో ఇప్పటికే రోగులకు చికిత్స చేస్తున్నారు. ఎక్స్‌రే (300ఎంఎ), సిటీస్కాన్, అల్ట్రా సౌండ్ మెషిన్, ఆటోమెటిక్ టిష్యూ ప్రాసెసర్, క్రయోస్టాట్, ఆటోమేటిక్ బయో కెమిస్ట్రీ ఎనలైజర్, సి–ఆర్మ్ మిషన్, ఈఎస్డబ్ల్యూ మిషన్, ఆటోమేటిక్ ఓటి టేబుల్స్, –80 నుంచి –40 సెంటీగ్రేడ్ల డీప్ ఫ్రీజర్లు, వెంటిలేటర్లు ఇప్పటికే సిద్ధంచేశారు. జీవితంపై ఆశ కలిగింది.. కూలీ పనిచేసే నాకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆరేళ్ల క్రితం కిడ్నీ వ్యాధి బారినపడ్డాను. అప్పట్లో సరైన వైద్యం అందక డయాలసిస్ కోసం మరొకరి సాయంతో విశాఖపట్నం వెళ్లాల్సి వచ్చేది. బోలెడంత డబ్బు ఖర్చేయ్యేది. ఇక్కడ సరైన వైద్య సదుపాయాల్లేక మా కళ్ల ముందే మా స్నేహితులు, బంధువులు ఎందరో మృత్యువాత పడ్డారు. ఎవ్వరూ పట్టించుకునే వారు కాదు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఆయన దయవల్ల ప్రతినెలా రూ.10 వేలు పింఛన్ అందుకుంటున్నాను. విశాఖకు వెళ్లే పని తప్పింది. పలాసలోనే డయాలసిస్, మందులు అందుతున్నాయి. పెద్ద ఆసుపత్రిని కూడా సిద్ధం చేశారు. ఇప్పుడు జీవితంపై ఆశ కలుగుతోంది. సీఎంకు ఉద్దానం వాసులంతా రుణపడి ఉంటారు. – గేదెల కోదండరావు, చినడోకులపాడు గ్రామం, వజ్రపుకొత్తూరు మండలం, శ్రీకాకుళం జిల్లా ప్రభుత్వం మాలాంటి వారికి ప్రాణం పోస్తోంది చికిత్స కోసం నాకు లక్షల రూపాయలు ఖర్చేయ్యేవి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంది. 108 అంబులెన్స్‌లో ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్లి, డయాలసిస్ అయ్యాక మళ్లీ ఇంటి వద్ద దిగబెడుతున్నారు. రూ.10వేలు పింఛను కూడా అందుతోంది. పౌష్టికాహారం, పండ్లు, మందులు కొనడానికి ప్రభుత్వం సహకరిస్తోంది. నాలాంటి ఎంతోమందికి జగన్ ప్రభుత్వం ప్రాణం పోస్తోంది. – నర్తు సీతారాం, లోహరిబంద, మందస మండలం, శ్రీకాకుళం జిల్లా ఇంటింటికీ కుళాయి ఇచ్చారు..జగనన్న చల్లగా ఉండాలి మా ప్రాంత వాసుల కష్టాల తీర్చేందుకు.. కిడ్నీ మహమ్మారి బారినపడిన ఉద్దానం వాసుల్ని రక్షించేందుకు జగనన్న మంజూరు చేసిన వైఎస్సార్ సుజలధార ప్రారంభానికి సిద్ధమయ్యిందనే విషయం తెలియగానే చాలా ఆనందం అనిపించింది. రోజూ కిడ్నీ వ్యాధులకు భయపడి 20 లీటర్ల క్యాన్లను కొనుగోలు చేస్తున్నాం. జగనన్న దయవల్ల ఇంటింటికీ కుళాయిలను ఇప్పటికే అమర్చారు. మా ప్రాంత వాసుల కష్టాలు తీరుస్తున్న జగనన్న చల్లగా ఉండాలి. – కర్ని సుహాసిని, గృహిణి, అమలపాడు, వజ్రపుకొత్తూరు మండలం -
ఉద్దానానికి ఆరోగ్య రక్షణ
-
ఉద్దానం కిడ్నీకి రక్షణ కవచం
సాక్షి, అమరావతి: శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంత కిడ్నీ బాధితులకు మెరుగైన, నాణ్యమైన వైద్యసేవలు అందించేందుకు శ్రీకాకుళం జిల్లా పలాసలో 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, కిడ్నీ రీసెర్చ్ సెంటర్‌ను సీఎం జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ సెంటర్‌కు “డాక్టర్ వైఎస్సార్ కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్’గా నామకరణం చేసింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కిడ్నీ బాధితులకు కార్పొరేట్ వైద్యాన్ని పూర్తి ఉచితంగా అందించే లక్ష్యంతో రూ.50 కోట్లు వెచ్చించి రీసెర్చ్ ఆస్పత్రిని నిర్మి0చారు. ర్యాంప్ బ్లాక్‌తో కలిపి మూడు బ్లాక్‌లుగా నాలుగు అంతస్తుల్లో ఆస్పత్రి నిర్మాణం చేపట్టారు. మొదటి అంతస్తులో క్యాజువాలిటీ, రేడియో డయాగ్నోసిస్, హాస్పిటల్ స్టోర్స్, సెంట్రల్ ల్యాబ్స్ ఉంటాయి. రెండో అంతస్తులో నెఫ్రాలజీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్, సర్జరీ, మూడో అంతస్తులో డయాలసిస్, నెఫ్రాలజీ వార్డులు, నాలుగో అంతస్తులో ఓటీ కాంప్లెక్స్, పోస్ట్ ఆపరేటివ్/ఐసీయూ, యూరాలజీ వార్డ్స్, రీసెర్చ్ ల్యాబ్స్ ఉంటాయి. అందుబాటులో అన్నిరకాల చికిత్సలు కిడ్నీ వ్యాధులకు సంబంధించి అన్నిరకాల చికిత్సలతో పాటు పరిశోధనలు చేయడానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం పరికరాలను సమకూరుస్తోంది. ఎంఆర్ఐ, సీటీ స్కాన్, 2డీ ఎకో, హై ఎండ్ కలర్ డాప్లర్, మొబైల్ ఎక్సరే (డిజిటల్), ఏబీజీ అనలైజర్ పరికరాలతో పాటు పూర్తిగా రిమోట్ కంట్రోల్ ఐసీయూ సౌకర్యాలను కిడ్నీ రీసెర్చ్ సెంటర్లో అందుబాటులోకి రానున్నాయి. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, యూరాలజీ, నెఫ్రాలజీ, వంటి వివిధ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వైద్య పోస్టులు 46, స్టాఫ్ నర్సు పోస్టులు 60, ఇతర సహాయ సిబ్బంది పోస్టులు 60 చొప్పున మంజూరు చేశారు. ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ కూడా దాదాపు పూర్తయింది. త్వరలోనే సీఎం జగన్ చేతుల మీదుగా ఆస్పత్రిని ప్రారంభించనున్నట్టు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు పేర్కొన్నారు. ఇప్పటికే తీసుకున్న చర్యలివీ ♦ గత ప్రభుత్వ హయాంలో తీవ్రమైన కిడ్నీ వ్యాధిగ్రస్తులకు రూ.2,500 చొప్పున ఇచ్చే పెన్షన్‌ను సీఎం జగన్ ప్రభుత్వం ఏకంగా రూ.10వేలకు పెంచింది. ప్రతినెలా 1వ తేదీనే లబి్ధదారుల గుమ్మం చెంతకు రూ.10 వేల చొప్పున పెన్షన్‌ను వలంటీర్లు అందజేస్తున్నారు. ♦ టెక్కలి, పలాస, సోంపేట, కవిటి, హరిపురం ఆస్పత్రుల్లో 69 మెషిన్లతో డయాలసిస్ సేవలు అందిస్తున్నారు. హరిపురంలో డయాలసిస్ సెంటర్‌ను 2020లో ప్రారంభించారు. మరో 25 మెషిన్లతో కొత్తగా గోవిందపురం, అక్కుపల్లి, కంచిలి, బెలగాంలో డయాలసిస్ సెంటర్లు మంజూరయ్యాయి. ఇలా వరుసగా 2019–20లో 37,454 సెషన్లు, 2020–21లో 46,162 సెషన్లు, 2021–22లో 54,520 సెషన్లు, 2022–23లో (మే నాటికి) 55,708 సెషన్ల చొప్పున కిడ్నీ బాధితులకు డయాలసిస్ చేశారు. ♦ ఇచ్చాపురం, కంచిలీ సీహెచ్‌సీ, కంచిలి పీహెచ్‌సీల్లో 25 మెషిన్లతో డయాలసిస్ సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ♦ వైద్య పరీక్షల కోసం ఉద్దానం ప్రాంతంలోని 18 పీహెచ్‌సీలు, 5 యూపీహెచ్‌సీలు, 6 సీహెచ్‌సీల్లో సెమీ ఆటో ఎనలైజర్స్, ఎలక్ట్రోలైట్ ఎనలైజర్స్, యూరిన్ ఎనలైజర్స్‌ను అందుబాటులో ఉంచారు. ♦ టీడీపీ హయాంలో డయాలసిస్ రోగులకు 20 రకాల మందులు మాత్రమే అరకొరగా ఇక్కడి ఆస్పత్రుల్లో అందించేవారు. ప్రస్తుతం ప్రతి ఆస్పత్రిలో 37 రకాల మందులు అందుబాటులో ఉంటున్నాయి. ♦కొత్త కేసుల గుర్తింపునకు వైద్య శాఖ నిరంతరాయంగా స్క్రీనింగ్ కొనసాగిస్తోంది. ఇందుకోసం వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లలో పనిచేసే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్(సీహెచ్‌వో)లకు ప్రత్యేకంగా ఒక యాప్ రూపొందించారు. వీరు ఈ ప్రాంతంలోని ప్రజలను స్క్రీనింగ్ చేసి అనుమానిత లక్షణాలున్న వారి నుంచి రక్త నమూనాలు సేకరించి సమీపంలోని పీహెచ్‌సీలకు సీరమ్ క్రియాటినిన్ పరీక్షలకు తరలిస్తున్నారు. -
ఉద్దానంలోని మరణాలకు అదే ప్రధాన కారణం! కనుగొన్న పరిశోధకులు
'ఉద్దానం' ఈ పేరు చెప్పగానే అందరూ ఉలిక్కిపడతారు. ఎందుకంటే? కిడ్నీ వ్యాధి కారణంగానే దాదాపు వందలాది మంది ప్రాణాలు కోల్పోయిన ఊరుగా వార్తల్లో నిలిచింది. అక్కడ అందరి చావులు ఒకేలా ఉండటం. ఎక్కువ మంది కిడ్నీ వ్యాధి బారినేపడటం అందర్నీ షాక్‌కి గురిచేసింది. ఇప్పటి వరకు ఎంతమంది చనిపోయారో నిర్థారించేరే తప్ప అందుకు గల కారణాలపై అధ్యయనం చేయలేదు. ఇప్పుడిప్పుడూ ప్రభుత్వం చొరవ తీసుకుని ఆరోగ్య క్యాంపులతో అక్కడి ప్రజలకు వైద్యం అందిస్తోంది. ఆరోగ్య శ్రీ కింద వైద్యం చేయించుకోలేని వారందరికీ ఉచిత వైద్యం అందించే యత్నం చేస్తోంది. కానీ అందరూ కిడ్నీ వ్యాధినే బారిన పడటానికి కారణం ఏంటీ? ఆ వ్యాధి తీరు ఏంటన్నది అంతు చిక్కని మిస్టరీలా మిగిలిపోయింది. ఐతే తాజగా జార్జ్ ఇనిస్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్ పరిశోధకుల బృందం అందుకు గల కారణాన్ని కనుగొనడమే గాక పరిష్కార మార్గాల గురించి వెల్లడించింది. వివరాల్లోకెళ్తే..జార్జ్ ఇనిస్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్ పరిశోధకుల బృందం ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా, ఉద్దానంలో జరగుతున్న మరణాలకు ప్రధాన కారణం మూత్ర పిండాల పనితీరుని క్రమంగా కోల్పోయే క్రానిక్ కిడ్నీ డిసిజీ(సీకేడీ) అని తేల్చి చెప్పారు. సీకేడీ కారణంగానే అధిక సంఖ్యలో ప్రజలు చనిపోయినట్లు చెప్పుకొచ్చారు. సాధారణ కిడ్నీ వ్యాధికి ఈ క్రానిడ్ కిడ్నీ డిసీజ్‌కి చాలా తేడా ఉంది అందేంటంటే. సాధారణ కిడ్నీ వ్యాధీ.. కిడ్నీలు సరిగా పనిచేయకపోవడం లేదా వాటి పనితీరును కోల్పోతే దీన్ని సాధారణ కిడ్నీ వ్యాధి అంటారు. అలా కాకుండా కాల క్రమేణ మూత్ర పిండాలు తమ పనితీరును కోల్పోతే దాన్ని క్రానిక్ కిడ్నీ డిసీజ్ లేదా దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి అని అంటారు. ముఖ్యంగా రక్తపోటు, మదుమేహం వంటి దీర్ఘకాలి వ్యాధుల కారణంగానే ఈ సీకేడీ మూత్రపిండాల వ్యాధి వస్తుంది. ఇక ఉద్ధానంలోని ప్రజల మరణాలకు కారణమైన ఈ క్రానిక్ కిడ్నీ డిజీజ్పై అధ్యయనం చేసేందుకు స్మార్ట్ వెర్బల్ శవపరీక్ష సాధనాన్ని వినయోగించింది పరిశోధకుల బృందం. ఔదీని సాయంతోనే మరణించిన వ్యక్తు డేటా తోపాటు బతికి ఉన్న బాధిత కుటుంబ సభ్యుల ఆరోగ్య డేటాను తీసుకుని విశ్లేషించారు. అలాగే వారందరి తోపాటు చనిపోయిన మిగతా ప్రజల ఆరోగ్య డేటాను కూడా తీసుకుని కంప్యూటర్ అల్గారిథమ్ సాయంతో ఆ మొత్తాన్ని విశ్లేషించి ఈ పరిస్థితి గల కారణల గురించి వెల్లడించారు. దాదాపు రెడు వేలకు పైగా వ్యక్తుల డేటా అధారంగా ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్(సీకేడీ) ప్రధాన కారణమని నిర్థారించామని పరిశోధకులు తెలిపారు. ఉద్ధానంలోని ప్రజలపై ఈ సీకేడీ ప్రభావం ఏ స్థాయిలో ఉందో కూడా ఈ పరిశోధన వెల్లడించినట్లు పేర్కొన్నారు. అధ్యయనంలోని ముఖ్యాంశాలు.. ఉద్ధానంలో మరణించిన మరణాల్లో దాదాపు 45% వరకు ఈ సీకేడీ వల్లనే అని పరిశోధకులు వెల్లడించారు. దాదాపు 5.5 మరణాల రేటు దీని కారణంగానే సంభవించాయి. వయసు సుమారుగా 20 అంతకు పైబడిన వారే ఈ వ్యాధి బారిన పడటం అనేది కలవరపరిచే అంశంగా చెప్పుకొచ్చారు అక్కడ జరగుతున్న మరణాలకు ప్రధాన కారణం సీకేడీ అని నిర్ధారణ అయ్యింది స్మార్ట్ వెర్బల్ శవపరీక్ష (SmartVA) సాయంతో ఈసమస్యను చక్కబెట్టగలమన్నారు. ఈ సాధనం సాయంతో మరణాల డేటాతోపాటు ఉద్దనంలో ఉన్న మిగతా ప్రజల ఆరోగ్య డేటాను తీసుకుని సాధ్యమైనంత వరకు మళ్లీ మరణాలు పునరావృత్తం కాకుండా ఉండేలా చర్యలు తీసుకోవచ్చని చెప్పారు పరిశోధకులు. ఈ మేరకు జార్జ్ ఇనిస్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్, ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రోఫెసర్ వివేకానంద ఝూ మాట్లాడుతూ.. ఇది దీర్ఘకాలిక అనారోగ్య సమస్య మాత్రమే కాదు ఉద్ధానంలో మరణానికి ప్రధాన కారణమని తమ అధ్యయనం వెల్లడించిందని తెలిపారు. ఈ సీకేడీ వ్యాధిని నివారించాలంటే..ముందుగా ఈ వ్యాధిని సక్రమంగా నిర్ధారించడం తోపాటు తక్షణమే సరైన చికిత్స అందించి నివారించడం అత్యంత ముఖ్యం అని చెప్పారు. ఈ విషయమై రాష్ట్ర ఆరోగ్య అధికారులతో తాము కలిసి పనిచేస్తున్నామని చెప్పారు. అలాగే బాధితులకు కూడా మెరుగైన చికిత్స అందించేలా ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఇక ఈ పరిశోధనలో డాక్టర్ బాలాజీ గుమ్మిడి, డాక్టర్ వైశాలి గౌతమ్, డాక్టర్ రేణు జాన్, డాక్టర్ రోహినా జోషి, డాక్టర్ ఊమెన్ జాన్ తదితరలు పాలుపంచుకున్నారు. (చదవండి: ఎక్స్ట్రీమ్ వెయిట్ లాస్ స్టార్ జస్ట్ 40 ఏళ్లకే నూరేళ్లు.. బరువు తగ్గడం ఇంత ప్రమాదమా?) -
ఉద్దానంలో పెద్దపులి
కంచిలి/కవిటి: శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో పెద్దపులి మంగళవారం రాత్రి పశువులపై పంజా విసిరింది. కవిటి మండలం సహలాల పుట్టుగలో ఓ ఆవుపై దాడిచేసి చంపేసింది. అదే మండలంలోని కొండిపుట్టుగలో ఓ గేదె దూడను హతమార్చింది. గుజ్జుపుట్టుగలో ఓ ఆవు దూడ తలపై దాడిచేసి గాయపరిచింది. మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో కవిటి–నెలవంక మార్గంలో శీమూరు–నెలవంక గ్రామాల మధ్య రోడ్డు దాటుతూ బస్సు ప్రయాణికులకు కనిపించింది. ఈ ఘటనలతో ఉద్దానం ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కంచిలి మండలం మండపల్లిలో ఆవుపై దాడిచేసిన పులి, కవిటి మండలంలో కనిపించిన పులి ఒక్కటేనా.. వేర్వేరా అనే విషయం తెలియడం లేదు. అటవీ శాఖ అధికారులు ఒక పులి మాత్రమే తిరుగుతోందంటున్నారు. పులికి ఒక రోజులో గరిష్టంగా 70 కిలోమీటర్ల దూరం ప్రయాణించే సామర్థ్యం ఉంటుందని చెబుతున్నారు. ఈ ఘటనపై పలాస ఆర్డీవో భరత్‌నాయక్ మాట్లాడుతూ.. పులి సంచారంపై రెవెన్యూ, పోలీస్, అటవీ, పంచాయతీ అధికారులతో ఇప్పటికే సమీక్షించామన్నారు. పులి సంచరిస్తున్న గ్రామాలతోపాటు సమీప గ్రామాల ప్రజలు రాత్రిపూట బయట తిరగొద్దని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో తోడు లేకుండా బయటకు రావొద్దన్నారు. ఒడిశా నుంచి రాక! పెద్దపులి ఒడిశాలోని గజపతి జిల్లా గండాహతి అటవీ ప్రాంతం నుంచి అక్టోబర్ 21న శ్రీకాకుళం జిల్లా పలాస మండలం లొత్తూరు వరి పొలాల్లో సంచరించినట్టు అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. తరువాత పలాస మండలం టబ్బుగాం, మందస మండలం కొండలోగాం, పట్టులోగాం గ్రామాల్లో తిరిగిందని తెలిపారు. 27న రాత్రి కంచిలి మండలం మండపల్లి పంచాయతీ పరిధి అమ్మవారిపుట్టుగ వచ్చిన పులిని 28న గ్రామస్తులు గుర్తించారు. అక్కడి నుంచి ఆందోళన మొదలైంది. నవంబర్ 1న కంచిలి మండలం మండపల్లి పరిసరాలు, సోంపేట కొబ్బరితోటల్లో సంచరించిందని స్థానికులు చెప్పడంతో అటవీ అధికారులు పరిశీలించారు. -
ఉద్దానం తాగునీటి ప్రాజెక్టు.. చరిత్ర సృష్టించిన సీఎం జగన్
-
ఇక ఉద్దానం ‘సురక్షితం’
సాక్షి, అమరావతి: నలభై ఏళ్లుగా కిడ్నీ వ్యాధుల భయాలు వెంటాడుతున్న ఉద్దానం ప్రాంత ప్రజలకు భరోసా కల్పిస్తూ అక్కడకు వంద కి.మీ.పైగా దూరంలోని హిర మండలం రిజర్వాయర్ నుంచి సురక్షిత జలాలు కదిలాయి. భూగర్భ పైపులైన్ల ద్వారా ఉద్దానానికి నీటి తరలింపుపై గ్రామీణ మంచినీటి సరఫరా (ఆర్డబ్ల్యూఎస్) అధికారులు వారం రోజులుగా నిర్వహిస్తున్న తొలిదశ ట్రయల్ రన్ విజయవంతమైంది. దాదాపు 132 కి.మీ. మేర భూగర్భ పైపు లైన్‌ను నిర్మించగా మార్గమధ్యంలో మెలియాపుట్టి వద్ద నీటి శుద్ధి కేంద్రం ఏర్పాటైంది. మొదటి దశలో 32 కి.మీ. పొడవున భూగర్భ పైపులైన్ ద్వారా నీటిని తరలించారు. రానున్న 15 రోజులలో నీటి శుద్ధి కేంద్రం నుంచి ఉద్దానం చివరి ప్రాంతం ఇచ్ఛాపురం వరకు వంద కిలోమీటర్ల పొడవున ప్రధాన భూగర్భ పైపు లైన్ ద్వారా నీటి తరలింపు ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. ఏడాది పొడవునా ప్రతి ఇంటికీ.. దాదాపు 807 నివాసిత ప్రాంతాలకు కొళాయిల ద్వారా తాగునీటి సరఫరాకు ఉద్దానం ప్రాంతాన్ని పది క్లస్టర్లుగా వర్గీకరించారు. అక్కడ నివసిస్తున్న దాదాపు 8 లక్షల మంది ప్రజలకు ఏడాది పొడవునా ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీటి సరఫరాకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ట్రయల్ రన్‌కు ఐదు కోట్ల లీటర్లు.. ఉద్దానం తాగునీటి అవసరాల కోసం రోజూ 8.40 కోట్ల లీటర్ల చొప్పున హిర మండలం నుంచి తరలిస్తారు. ఇందుకోసం 1,300 హెచ్‌పీ సామర్థ్యంతో మూడు భారీ నీటి పంపింగ్ మోటార్లను హీర మండలం రిజర్వాయర్ వద్ద ఏర్పాటు చేశారు. మొదటి దశ ట్రయల్ రన్ కోసం ఐదు కోట్ల లీటర్లను మెలియాపుట్టి నీటి శుద్ధి కేంద్రం వద్దకు తరలించినట్లు అధికారులు తెలిపారు. మూడు మోటార్ల పనితీరును కూడా పరీక్షించారు. మాట ప్రకారం.. ఖర్చుకు వెనుకాడకుండా శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం, పలాస అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని దాదాపు ఏడు మండలాల పరిధిలో ఉద్దానం ప్రాంతం విస్తరించి ఉంటుంది. స్థానికులను దశాబ్దాలుగా పట్టి పీడిస్తున్న కిడ్నీ వ్యాధుల సమస్యను పరిష్కరించేందుకు సీఎం జగన్ రూ.700 కోట్లతో ఉద్దానానికి సమగ్ర రక్షిత మంచినీటి పథకాన్ని మంజూరు చేయడం తెలిసిందే. ఏడాది పొడవునా నీరు అందుబాటులో ఉండటంతో ఖర్చుకు వెనుకాడకుండా హిర మండలం రిజర్వాయర్ నుంచి నీటి తరలింపు చేపట్టాలని నిర్ణయించారు. ఏడాది పొడవునా ఉద్దానం నీటి అవసరాలను తీర్చేందుకు ఒక టీఎంసీ కన్నా తక్కువ అవసరం కాగా హిర మండలం రిజర్వాయర్‌లో కనీస మట్టం స్ధాయిలోనూ 2.67 టీఎంసీల నీరు అందుబాటులో ఉంటుంది. ఈ పథకంలో భాగంగా రెండు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో వివిధ గ్రామాల్లో మొత్తం 571 ఓవర్ హెడ్ ట్యాంకులను ప్రభుత్వం నూతనంగా నిర్మించింది. -
ఉద్దానం ఫేజ్–2కు రెడీ
సాక్షి, అమరావతి: దశాబ్దాల తరబడి కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతానికి చెందిన పాతపట్నం నియోజకవర్గంలోని ఐదు మండలాల ప్రజలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏడాది పొడవునా సురక్షిత తాగునీరు అందించనుంది. ఇందుకోసం రూ.265 కోట్లతో ఉద్దానం ఫేజ్–2 ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టబోతోంది. తద్వారా పాతపట్నం, మెలియపుట్టి, హిరమండలం, కొత్తూరు, లక్ష్మీనరసపేట మండలాల పరిధిలోని 448 నివాసిత ప్రాంతాల్లో ఉంటున్న దాదాపు మూడున్నర లక్షల మందికి తాగునీటి ఇబ్బందులు పూర్తిస్థాయిలో తొలగిపోతాయి. ఉద్దానం, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోని భూగర్భ జలాల్లో కొన్ని ప్రమాదకర లోహాలు కారణంగానే ఆ నీటిని తాగే అక్కడి ప్రజలు ఏళ్ల తరబడి కిడ్నీ సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నట్లు నిపుణులు గుర్తించారు. ఈ సమస్య పరిష్కారానికి గత చంద్రబాబు ప్రభుత్వం మాయమాటలు చెబుతూ కాలక్షేపం చేస్తే.. జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన వెంటనే ఈ సమస్య పరిష్కారంపై దృష్టిపెట్టారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన మూడునెలలకే రూ.700 కోట్లతో పలాస, ఇచ్ఛాపురం రెండు మున్సిపాలిటీలతో పాటు ఆ ప్రాంతంలోని ఏడు మండలాల పరిధిలోని 807 గ్రామాలకు సురక్షిత తాగునీరు అందించే ఉద్దానం ఫేజ్–1 రక్షిత మంచినీటి పథకానికి 2019 సెప్టెంబరు 6న ప్రభుత్వం మంజూరు చేసింది. 2020 ఆరంభంలోనే పనులను కూడా మొదలుపెట్టింది. ఇప్పటికే ఈ పనులు 90 శాతానికి పైగా పూర్తయి, ప్రారంభానికి సిద్ధంగా ఉంది. దీనికి అనుసంధానంగా ఇప్పుడు ఆ ప్రాంతంలోని మరో ఐదు మండలాల ప్రజలకు కూడా తాగునీరు అందించే పథకానికి ప్రభుత్వం తాజాగా ఆమోదం తెలిపింది. గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ (ఆర్డబ్ల్యూఎస్) ఆ పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియను కూడా మొదలుపెట్టింది. రూ.265 కోట్లతో చేపట్టే ఉద్దానం ఫేజ్–2 పనుల టెండరు డాక్యుమెంట్ ప్రస్తుతం జ్యుడీషియల్ ప్రివ్యూ పరిశీలనలో ఉంది. మే 4 వరకు అభ్యంతరాల స్వీకరణ అనంతరం జ్యుడీషియల్ ప్రివ్యూ తుది ఆమోదం అనంతరమే టెండర్ల దాఖలు ప్రక్రియ ప్రారంభమవుతుందని ఆర్డబ్యూఎస్ అధికారులు ‘సాక్షి’కి వివరించారు. ‘హిరమండలం’ నుంచి నీటి తరలింపు.. ఉద్దానం మొదటి దశ, రెండో దశ మంచినీటి ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక ముందస్తు జాగ్రత్తలు కూడా తీసుకుంటోంది. ఉద్దానానికి అతి సమీపంలో ఉండే బహుదా, మహేంద్రతనయ నదుల నుంచి రక్షిత నీటి సరఫరాకు అవకాశమున్నా వేసవిలో ఆ నదులు ఎండిపోతుండడంవల్ల అక్కడ ప్రజలు తిరిగి బోరు నీటినే తాగక తప్పని పరిస్థితి ఉంటుందేమోనని ప్రభుత్వం అనుమానిస్తోంది. దీంతో కొంత అదనపు ఖర్చయినా ఏడాది పొడవునా నీరు అందించే అంశంపై దృష్టిపెట్టింది. దీంతో ఉద్దానానికి దాదాపు వంద కిలోమీటర్ల దూరంలోని హిరమండలం రిజర్వాయర్ నుంచి పైపులైను ద్వారా నీటిని తరలించి మిలియకుట్టి మండల కేంద్రం వద్ద ఆ నీటిని ఇసుక ఫిల్టర్ల ద్వారా శుద్ధిచేసి, అక్కడి ప్రజలకు ఏడాది పొడువునా తాగునీరు అందించాలని సంకల్పించింది. ఇప్పుడు రెండో దశ ప్రాజెక్టులో కొన్ని ప్రాంతాలకు కూడా నేరుగా రిజర్వాయర్ నుంచే తాగునీటి సరఫరాకు ఏర్పాట్లుచేశారు. హిరమండలం రిజర్వాయర్‌లో ఏటా 19.5 టీఎంసీల నీరు అందుబాటులో ఉంటుందని, అందులో 1.12 టీఎంసీల నీటిని ఉద్దానం ఫేజ్–1 ద్వారా ఆ ప్రాంత ప్రజల తాగునీటి అవసరాలకు సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పుడు కొత్తగా రూ.265 కోట్లతో చేపట్టే ఉద్దానం రెండో దశ ప్రాజెక్టుకు 0.291 టీఎంసీల నీటిని వినియోగించుకోనున్నారు. వచ్చే 30ఏళ్లలో పెరిగే జనాభాకు తగ్గట్లుగా ఈ ప్రాజెక్టును డిజైన్ చేశారు. -
ఉద్దానం కిడ్నీకి రక్షణ కవచం... కిడ్నీభూతంపై సర్కారు యుద్ధం
ఉద్దానం అంటే కొబ్బరి, జీడి తోటలే గుర్తుకొస్తాయి. పరిమళించే పచ్చదనం.. సేదదీర్చే ప్రశాంత వాతావరణమే గుర్తుకొస్తాయి. అయితే ఆ ప్రశాంతత వెనుక గూడు కట్టుకున్న విషాదం ఉంది. గుండెలు పిండేసే కిడ్నీ బాధలు ఉన్నాయి. దశాబ్దాలుగా కబళిస్తున్న కిడ్నీ మహమ్మారిని గత పాలకులు పట్టించుకోలేదు. బాధితులను గాలికి వదిలేశారు. కానీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక పరిస్థితి మారింది. వ్యాధిగ్రస్తుల పాలిట ప్రభుత్వమే పెద్ద రక్షణ కవచంలా నిలిచింది. డయాలసిస్ కేంద్రాలు, రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుతో పాటు బాధితులకు నిరంతర వైద్య సేవలు, నెలనెలా రూ.పది వేల భృతితో కొండంత అండగా నిలుస్తోంది. భవిష్యత్తుపై భరోసా ఇస్తోంది. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఉద్దానాన్ని కిడ్నీ వ్యాధి కబళిస్తోంది. కొన్నేళ్లుగా మరణ మృదంగం మోగుతోంది. ఏ ఊరు వెళ్లినా కిడ్నీ రోగులు కనిపిస్తూనే ఉంటారు. వ్యాధి నియంత్రణకు గత పాలకులు పూర్తిస్థాయిలో దృష్టి సారించలేదు. 2019 వరకు కిడ్నీ వ్యాధిపై పరిశోధనలు, పరిశీలనలకే పరిమితయ్యారు తప్ప వ్యాధి నియంత్రణకు సరైన చర్యలు తీసుకోలేదు. తొలిసారిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చాక నియంత్రణ చర్యలు చేపట్టారు. ఏకంగా కిడ్నీ వ్యాధిపై యుద్ధమే ప్రకటించారు. ఉద్దానానికి ఆరోగ్య భరోసా కల్పించేందుకు నడుంబిగించారు. ఖర్చుకు వెనకాడకుండా ఏం చేయాలో, ఎన్ని చేయాలో అన్నీ చేస్తున్నారు. నేడు ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం. పెరిగిన మందుల సరఫరా.. టీడీపీ హయాంలో డయాలసిస్ రోగులకు 20 రకాల మందులే అందుబాటులో ఉండేవి. ఇప్పుడు 37 రకాల మందులను అందుబాటులో ఉంచారు. అవసరమైతే ఇంకా మందులు కొనుగోలు చేసే వెసులుబాటును అక్కడి అధికారులకు ప్రభుత్వం కల్పించింది. కిడ్నీ రోగులకు వైద్య పరీక్షల కోసం సెమీ ఆటో ఎనలైజర్స్, ఎలక్ట్రోలైట్ ఎనలైజర్స్, యూరిన్ ఎనలైజర్స్‌ను ఉద్దానం పరిధిలో ఉన్న 29 ల్యాబ్‌లలో అందుబాటులో ఉంచారు. పాతవి పాడైతే ఎప్పటికప్పుడు కొత్తవి కొనుగోలు చేసి అందుబాటులోకి తీసుకొస్తున్నారు. టీడీపీ హయాంలో జిల్లా నెఫ్రాలజీ విభాగమే లేదు. ఈ ప్రభుత్వం వచ్చాక శ్రీకాకుళం జీజీహెచ్‌లో నెఫ్రాలజీ విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించారు. ప్రతీ శనివారం పలాస సీహెచ్‌సీలో సేవలుందిస్తున్నారు. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. మూత్ర పిండాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎంత ఎక్కువ నీరు తాగితే ఆరోగ్యానికి అంత మంచిది. పెయిన్ కిల్లర్ వినియోగం తగ్గించాలి. మద్యం, సిగరెట్లు అధికంగా తాగడం వల్ల శరీరంలో టాక్సిన్లు పెరుగుతాయి. మూత్ర పిండాలకు రక్త ప్రవాహం తగ్గుతుంది. దీనివల్ల కిడ్నీలపై ఒత్తిడి పెరిగి, వాటి పనితీరు మందగిస్తుంది. అధిక బరువు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. రక్తంలో సుగర్ లెవెల్స్ అధికంగా ఉంటే కిడ్నీలకు వడపోత క్లిష్టంగా మారుతుంది. బీపీ కారణంగా శరీరంలో రక్తం ప్రవహించే వేగం పెరుగుతుంది. కిడ్నీలకు వేగంగా రక్తం రావడం వల్ల ఫిల్టర్లు దెబ్బతినే ప్రమాదం ఉంది. పింఛన్లతో ఆసరా.. టీడీపీ ప్రభుత్వంలో రూ.3,500 పింఛన్‌ను ఇచ్చేవారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక దానిని రూ.10వేలకు పెంచారు. వ్యాధి తీవ్రత ఆధారంగా సీరం క్రియేటినైన్ 5కుపైబడి ఉన్న వారికి రూ.5వేలు, డయాలసిస్ రోగులకు రూ.10వేల పింఛన్ ఇస్తున్నారు. ఈ లెక్కన 393 మందికి రూ.10వేలు చొప్పున, 367 మందికి రూ.5వేలు చొప్పున పింఛన్లు ఇస్తున్నారు. ఇచ్ఛాపురం మండలం సన్యాసిపుట్టుగకు చెందిన నీలాపు కేదారి పదేళ్లుగా ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. నాలుగేళ్లుగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎటువంటి వైద్య సహాయం అందకపోవడంతో బరంపురం, విశాఖపట్నంలోని కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకుని లక్షల రూపాయల అప్పుల పాలయ్యారు. వైఎస్సార్సీపీ అధికారంలో వచ్చాక మందుల ఖర్చులకు నెలకు రూ.5వేలు ఇవ్వడంతో కొంత ఆర్థిక భారం తగ్గింది. ఏడాదిన్నర నుంచి సోంపేటలో డయాలసిస్ చేయించుకుంటున్నారు. ఇప్పుడు నెలకు రూ.10 వేలు పింఛన్‌తో పాటు ఉచితంగా మందులు అందిసున్నారు. వారానికి మూడు సార్లు 108 సిబ్బంది 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న సోంపేటకు తీసుకెళ్తున్నారు. బాధితులకు అండగా.. ఓ వైపు వ్యాధి మూలాలు కనుగొనేందుకు కిడ్నీ రీసెర్చ్ ఆస్పత్రిని నిర్మించడం, మరోవైపు వ్యాధిగ్రస్తులకు మెరుగైన వైద్యంతో పాటు డయాలసిస్, ఉచిత మందులను పూర్తిస్థాయిలో అందించడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇంకోవైపు వ్యాధి ప్రబలడానికి ప్రధాన కారణం తాగునీరై ఉండొచ్చన్న నిపుణుల సూచనల మేరకు రూ.700కోట్లతో భారీ మంచినీటి పథకాన్ని నిర్మిస్తోంది. పథకం అందుబాటులోకి వస్తే ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాల పరిధిలోని ఏడు మండలాల్లో 807 గ్రామాల్లో 7,82,707 మందికి ఇంటింటికీ కుళాయిల ద్వారా నిరంతరం స్వచ్ఛమైన తాగునీరు అందనుంది. దీనికోసం వంశధార నుంచి 1.12టీఎంసీల వినియోగించనున్నారు. 84 ఎంఎల్ ఫిల్టర్ సామర్ధ్యంతో 571 ట్యాంకుల ద్వారా ఊరూరు తాగునీరు అందించనున్నారు. 50 కిలోమీటర్ల పొడవునా మైగా పైపు లైను నిర్మించి, వాటి కింద మరో 134.818 కిలోమీటర్ల పైపులైన్ వేసి ఇంటింటికీ నీరందించే పనులు చివరి దశకు చేరుకున్నాయి. కిడ్నీ వ్యాధి మూలాలను తెలుసుకునేందుకు రీసెర్చ్ సెంటర్‌తో పాటు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కూడా మంజూరు చేశారు. రూ.50కోట్ల వ్యయంతో చేపడుతున్న పనులు దాదాపు పూర్తి కావొచ్చాయి. త్వరలోనే ప్రారంభించనున్నారు. పెంచిన డయాలసిస్ సేవలు.. ప్రస్తుతం టెక్కలి, పలాస, సోంపేట, కవిటి, హరిపురం ఆసుపత్రుల్లో డయాలసిస్ సెంటర్లు ఉన్నాయి. 63 మెషిన్లతో 68 పడకలపై డయాలసిస్ సేవలు అందిస్తున్నారు. సోంపేట సీహెచ్‌సీ డయాలసిస్ సెంటర్లలో గతంలో 13 పడకలుండేవి. ఇప్పుడు వాటి సంఖ్య 19కి పెంచారు. కవిటి సీహెచ్‌సీ డయాలసిస్ సెంటర్లలో గతంలో 10 పడకలుండేవి. ఇప్పుడవి 15కి పెరిగాయి. హరిపురంలో కొత్తగా 10 పడకలతో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేశారు. కొత్తగా గోవిందపురం, అక్కుపల్లి, కంచిలి, బెల గాంలో డయాలసిస్ సెంటర్లు మంజూరయ్యాయి. ఇవి కాకుండా ఇచ్ఛాపురం సీహెచ్‌సీలో 10 పడకలు, బారువ సీహెచ్‌సీలో 10 పడకలతో డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. రెండు కంటైన్డ్ బేస్డ్ సర్వీసెస్ డయాలసిస్ యూనిట్లను సైతం ఏర్పాటు చేశారు. ఒక్కొక్క యూనిట్లలో ఏడేసి పడకలు ఉన్నాయి. పింఛన్‌తో భరోసా కిడ్నీ సమస్య ఉందని, డయాలసిస్ చేసుకోవాలని ఏడాది క్రితం వైద్యులు సూచించారు. దీంతో పలాస ప్రభుత్వ అసుపత్రిలో డయాలసిస్ చేసుకుంటున్నాను. ఐదు నెలలుగా రూ.10 వేలు పింఛన్ వస్తుంది. మందులు, ఇతర ఖర్చులకు పింఛన్ కొంత వరకు సరిపోతుంది. – పి.కుసమయ్య, కిడ్నీ బాధితుడు, పెద్దబొడ్డపాడు, వజ్రపుకొత్తూరు సర్కారు అండతో.. కూలి పనులు చేసుకుంటూ జీవనోపాధి సాగిస్తున్న నేను రెండేళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాను. జగనన్న పుణ్యమా అని నాకు రూ.5వేలు పింఛన్ గత నెల వరకు వచ్చేది. ప్రస్తుతం మరో రూ.5 వేలు పింఛన్ అదనంగా ఈ నెల నుంచి వస్తుంది. ఈ మొత్తంతో కొంత వరకు ఆర్థిక ఇబ్బందులు తీరుతున్నాయి. – సిర్ల కాంతమ్మ, పింఛన్ లబ్ధిదారు, వజ్రపుకొత్తూరు -
ఈ ప్రశ్నలకెవురు జెబాబు సెప్తారు?
ఆగండాగండి. దండయాత్ర కాదు, ధర్మయాత్ర అంటన్నారు కదా, యీ ప్రశ్నలకి జెబాబులు చెప్తారా? ఒకప్పుడు గోదావరి నుంచి మహానది దాకా కళింగదేశమట. ఇప్పుడంత లేదు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం మూడు జిల్లాల ఉత్తరాంధ్ర వుండీది, అదిపుడు ఆరుజిల్లాల ఉత్తరాంధ్ర అయ్యింది. ఈ ఆరుజిల్లాల ఉత్తరాంధ్ర ఈనాటి ఆంధ్రప్రదేశ్‌లో విద్య, వైద్యం, ఉపాధి, పశుసంపద, భూమి, సాగు నీటివసతులు, రోడ్లు, విద్యుత్... ఇలాగ యే రంగం తీసుకోండి... అన్ని జిల్లాలకంటే యెందుకు ఆఖరిస్తానాల్లో వున్నాయి? నాగావళి, వంశధార, జంఝావతి, వేగావతి, మహేంద్రతనయ వంటి పద్దెనిమిది జీవనదులుండగా మా సాగుభూముల్లో మూడు వంతుల నేలకి సాగునీటి సదుపాయాలెందుకు లేవు? రాష్ట్రంలోని యే ప్రాంతానికీ లేని మూడు వందల యాభయి కిలోమీటర్ల సముద్రతీర మున్నాది. వేలకోట్ల రూపాయల మత్స్యసంపద దొరక తాది? అయితే మా మత్స్యకారులెందుకు గుజరాత్, భివాండీ వంటి ప్రాంతాలకు వలసలు పోవాల్సివచ్చింది? గుడిసెల్లో గుండెలరచేతిల పెట్టుకొని మా మత్స్యకార మహిళలు సముద్రానికెందుకు దీనంగా మొక్కవల సొస్తన్నాది? ఎక్కడా లేని అయిదు వందల కిలోమీటర్ల అడవులున్నాయి మా ఆరు జిల్లాలలోన. రాష్ట్రంలోని మిగిలిన చోటనున్న ఆదివాసీలకంటే ఎక్కువ ఆదివాసీలున్నారు. అయినా ఎందుకక్కడ యింకా రోడ్లు లేవు, ఆసుపత్రులు లేవు. స్కూళ్లు లేవు, విద్యుత్ లేదు, ఉపాధి లేదు. ఆది వాసీలు కూడా ఎందుకు రెక్కలు కొట్టుకొని వలసలు పోవల సొస్తంది? పాతిక లక్షల ఎకరాల సారవంతమయిన సాగుభూమి వుంది. అయితే ఎందుకీ జిల్లాల రైతులు అప్పులపాలయి నారు? కారు చవగ్గా యీ భూముల్ని అటునిండొచ్చిన మీ జిల్లాల పెద్దరైతులు కొనేసి, పెద్దపెద్ద కమతాలు కట్టు కోలేదా? మా నేలలో మా రైతోళ్లని పాలేర్లు చేయలేదా? మాకున్న యేకైక నగరం విశాఖపట్నం. అదిపుడు మీ జిల్లాల నుండొచ్చిన వ్యాపారస్తుల దుకాణమయిపోలేదా? అక్కడి ఆసుపత్రులెవురివి? అక్కడి లాడ్జింగులెవురివి? అక్కడి కాలేజీలు, యూనివర్సిటీ లెవురివి? కాంట్రాక్టు లెవురివి? కంపెనీ లెవురివి? విశాఖపట్నంలో పాలనా రాజధాని యేర్పాటు మాత్రమే కాదు... ఉత్తరాంధ్ర జిల్లాల అభివృధ్దికి యీ ప్రాంతానికి చెందిన ప్రతినిధులతో ఒక ప్రత్యేక పాలనా వ్యవస్థ యేర్పాటు కావాలని కూడా అడుగుతున్నాం, తప్పంటారా? డార్జిలింగ్ అటానమస్ హిల్ కౌన్సిల్ పద్ధతిలో ఉత్తరాంధ్రాలోని ఆదివాసీ ప్రాంతాలైన భద్రగిరి, సీతంపేట, అరకు, పాడేరు, సాలూరు, మందస వంటి ప్రాంతాలతో హిల్ యేరియా కౌన్సిల్ యేర్పాటు చేయాలంటున్నాం, తప్పంటారా? ఆదివాసీ ప్రాంత సహజ వనరులనూ, ఖనిజాలనూ రకరకాల అభివృద్ధి ప్రణాళికల పేరిట కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పే చర్యలను విరమించుకోవాలి. గిరిజన యూనివర్సిటీని పూర్తిస్ధాయిలో ప్రారంభించాలంటున్నాం, తప్పంటారా? ఉత్తరాంధ్రా వెనకబడడానికి కారణం పారిశ్రామికీకరణ జరగకపోవడం. అందుచేత మూడు జిల్లాల్లో వ్యవసాయాధార పరిశ్రమలు, సహజ వనరుల వెలికిదీసే పరిశ్రమలు, ప్రాసెసింగ్ యూనిట్లు యేర్పాటు చేయాలి. మూసివేతకు గురయిన కర్మాగారాలనన్నీటినీ తెరిపించాలని నినదిస్తన్నాం, తప్పంటారా? ఉత్తరాంధ్రాకు ప్రత్యేక ప్రాంతమయిన ఉద్దానంలో... జీడి, మునగ, కొబ్బరి, పనస వంటి పంటలకు కిట్టుబాటు ధర కల్గించడమేగాక, జీడి, కొబ్బరి వంటి పంటలకు ప్రాసెసింగ్ యూనిట్లు, అనుబంధ కర్మాగారాలూ నిర్మిస్తే, ఉపాధి అవకాశాలూ కలుగుతాయి. ఉద్దానం మంచినీటి సమస్యను పరిష్కరించాలి. ఉద్దానం కిడ్నీవ్యాధికి సంబం ధించిన పరిశోధనలు జరపాలి. వ్యాధిగ్రస్తులకు ఉచిత వైద్యసదుపాయాలు అందించాలంటన్నాం, తప్పంటారా? మొత్తం కోస్తాంధ్రాలో 72 శాతం భూమికి సాగునీరు అందుతుండగా, ఉత్తరాంధ్రకు 42 శాతం భూమికి మాత్రమే సాగు నీరందుతుంది. 7 శాతం భూమి మాత్రమే రెండు పంటలకు అనువుగా వుంది. పెండింగులో వున్నటు వంటి అన్ని సాగునీటి ప్రాజెక్టులనూ తక్షణమే పూర్తిచేసే చర్యలను చేపట్టాలంటున్నాం తప్పా? పంటలకు గిట్టు బాటు ధరలు కావాలంటన్నాం. వేయికోట్లకు పైగా ఆదాయమొచ్చే మత్స్యసంపదను మల్టీనేషనల్ కంపెనీలు కాజేస్తున్నాయి. మత్స్యకారులకు తీరని నష్టం జరుగు తోంది. సముద్రజలాల్లో మత్స్యకారుల వేటకు సంబంధించిన ప్రాంతంపై మత్స్యకారులకే అధికారముండాలి. కోల్డ్‌స్టోరేజీలు నిర్మించాలి. తుఫానుషెల్టర్లు నిర్మించాలంటన్నాం, తప్పంటారా? విశాఖలో రైల్వే జోన్ ఉత్తరాంధ్రకు లబ్ది జరిగేవిధంగా యేర్పాటు కావాలంటున్నాం, తప్పా? ఏటకేటా ఉత్తరాంధ్ర నుంచి యాభయి వేలమంది ఉపాధికోసం వలసపోతన్నారు. వలసలు ఆగాలనడుగుతున్నాం. తప్పంటారా? మా నేల ఎవరెవరి పుణ్యానోయిన్నేళ్లు నిరాదరణకు గురయ్యింది, ఇంకా నిరాదరణకు గురి చేస్తామంటే ఎలా సహిస్తాం? పాలనా రాజధాని విశాఖకు వస్తే వైసీపీ నేతల రియలెస్టేట్కి లాభమంటన్నారుకదా, మరి అమరావతిలో రియలెస్టేట్ జరిగిందని అర్థం కదా మీ మాటలకి? (క్లిక్ చేయండి: ఏనాడైనా మంచిని చూస్తున్నారా?) అసలు విశాఖకు పాలనాకేంద్ర రావడం వలన మీకొచ్చిన నష్టమేమిటి? మీకు వచ్చే దేనిని మేము తీసుకుంటున్నాం? మీరిచ్చిన భూములకు ధరలు తగ్గించమని మేమడిగినామా? మీకిచ్చిన ప్లాటులను ప్రభుత్వం వెనక్కి తీసుకోమని అనంటన్నామా? మీ అమరావతిలో అసెంబ్లీ వొద్దుగాక వొద్దని మీలాగ మీ అమరావతికి యాత్ర తీసినామా? మీ జోలికి రాలేదు, మీ ఊసెత్తలేదు, మీ ముక్కు మీద మసి అననలేదు. మరేల మా నేల మీదకి దండయాత్ర కొస్తన్నారు? మీకిది దరమ్మా? మీకిది నేయమా? మీకిది తగునా? ‘విశాఖ ఉక్కు’ కోసం పోరాడుతున్నట్టే పాలనాకేంద్రం కోసమూ పోరాడతా.. అడ్డుగా వొస్తన్న మిమ్మళ్ని ఎందుకొదిలేస్తాం? ఎందుకొదిలీయాలి? (క్లిక్ చేయండి: ‘అలా’ అనకూడదంటే ఎలా?) – కళింగ కరువోడు -
శ్రీకాకుళం.. ఆకట్టుకునేలా పర్యాటక రంగం
ఆర్థిక చోదక శక్తుల్లో పర్యాటక రంగం ఒకటి. ప్రపంచంలో చాలా దేశాలు కేవలం టూరిజం పరిశ్రమపైనే ఆధారపడి అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయి. మన దేశం, రాష్ట్రంలో పర్యాటక రంగం కొంత పురోగతి సాధిస్తున్నా.. ప్రకృతి అందాలకు నెలవైన చాలా ప్రాంతాలు ఇప్పటికీ గుర్తింపునకు, అభివృద్ధికి నోచుకోవడం లేదు. వాటిలో శ్రీకాకుళం జిల్లా ఒకటి. అతి పొడవైన సముద్ర తీరం, కోనసీమ లాంటి ఉద్దానం, చరిత్ర ప్రసిద్ధి చెందిన ఆలయాలు తదితర ఎన్నో ప్రత్యేకతలు ఉన్నా.. పర్యాటకంగా వాటిని తీర్చిదిద్దే కృషి ఇప్పుడిప్పుడే మొదలైంది. టెంపుల్ టూరిజం, బీచ్ టూరిజం పేరుతో పర్యాటకులను ఆకట్టుకునేందుకు ప్రభుత్వం ప్రణాళికలు అమలు చేస్తోంది. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఓవైపు సాగర తీరం.. మరోవైపు మన్యం.. మధ్యలో కొండలు తదితర ఆహ్లాదకర అందాలతో జిల్లా పర్యాటక రంగంలో దూసుకుపోతోంది. ఏటా ఎంతోమంది పర్యాటకులను ఆకట్టుకుంటోంది. దీంతో ప్రభుత్వం జిల్లా లోని టూరిస్ట్ స్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. కొత్త పర్యాటక ప్రదేశాలను గుర్తించడమే కాకుండా అభివృద్ధి పనులు చేపట్టేందుకు అడుగులు వేస్తోంది. ఆధ్మాత్మిక ప్రదేశాలను సైతం అభివృద్ధి చేయాలని సంకల్పించింది. ఉన్న చారిత్రక ప్రదేశాలకు కొత్త హంగులద్ది పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిపేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అభివృద్ధి పథంలో... ► ఇప్పటికే శాలిహుండాన్ని పర్యాటక సౌకర్యాల కేంద్రంగా రూ.2.27 కోట్లతో అభివృద్ధి చేశారు. దీనిని త్వరలోనే ప్రారంభించనున్నారు. ► పాతపట్నం నీలమణి అమ్మవారి ఆలయాన్ని రూ. 50లక్షలతో అభివృద్ధి చేశారు. ► తాజాగా శ్రీముఖలింగం క్షేత్రాన్ని ప్రసాదం స్కీమ్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో రూ.56 కోట్లతో అభివృద్ధి చేసేందుకు అడుగులు పడుతున్నాయి. ► శ్రీకూర్మం క్షేత్రాన్ని రూ.20 కోట్లతో, అరసవిల్లి క్షేత్రాన్ని రూ.30కోట్లతో ప్రసాదం స్కీమ్‌లో అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు రూపొందించింది. అరసవిల్లిలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో సమాచారం కేంద్రం, పర్యాటకుల సౌకర్యాల కేంద్రం ఏర్పాటుకు ఏడు సెంట్లు భూమిని దేవదాయ శాఖ ఇప్పటికే కేటాయించింది. దీనిలో 32 గదులు కొత్తగా నిర్మాణాలు చేపట్టనున్నారు. రోప్‌వే ద్వారా అందాలు.. రోప్ వేలతో జిల్లా అందాలను తిలకించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జిల్లాలో తొమ్మిది రోప్‌వే మార్గాలను ప్రాథమికంగా గుర్తించారు. వీటిలో నాలుగింటి కోసం రూ.119.34 కోట్లతో అంచనా నివేదిక ఇప్పటికే కేంద్రానికి వెళ్లింది. రెండో విడతలో మిగతా ఐదింటికి ప్రతిపాదనలు పంపించనుంది. ► శ్రీకాకుళం కలెక్టర్ బంగ్లా నుంచి పొన్నాడ కొండ వరకు రూ. 32.40 కోట్లతో, శాలిహుండం బుద్ధు ని కొండ నుంచి వేణుగోపాలస్వామి ఆలయం వరకు రూ.25.56 కోట్లతో, పలాసలో నెమలికొండ వద్ద రూ. 22.68 కోట్లతో, ఇచ్ఛాపురంలో రూ.17.64 కోట్లతో రోప్‌వే వేసేందుకు ప్రతిపాదనలు వెళ్లాయి. ఇవన్నీ మంజూరైతే జిల్లా పర్యాటకంగా మరింత ప్రగతి సాధించనుంది. పర్యాటక ప్రదేశాలెన్నో... ► జిల్లాలో పర్యాటక ప్రదేశాలకు కొదవ లేదు. అరసవల్లి, శ్రీకూర్మం, శాలిహుండం, శ్రీముఖలింగం, రావివలస ఎండల మల్లికార్జునస్వామి తదితర ప్రముఖ ఆధ్యాత్మిక ప్రదేశాలు ఉన్నాయి. ► తేలుకుంచి, బారువ, తేలినీలాపురం, దంతపురి, పొందూరు, కొరసవాడ, మందస, గొట్టా బ్యారేజీ, శాలిహుండం, పొన్నాడ కొండ తదితర చారిత్రక ప్రదేశాలు ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. ► తేలినీలాపురం, తేలుకుంచి గ్రామాలు విదేశీ పక్షుల విడిది కేంద్రంగా ఆకట్టుకుంటున్నాయి. ► రాష్ట్రంలో అత్యంత పొడవైన తీరరేఖ జిల్లాలోనే ఉంది. 193 కిలోమీటర్ల మేర విస్తరించిన తీరంలో పర్యాటకులు విహరించడానికి అనువైన ప్రదేశాలెన్నో. కళింగపట్నం, బారువ, శివసాగర్, గనగళ్లవానిపేట, మొగదలపాడు వంటి బీచ్‌లు టూరిస్టులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. వీటిలో కొన్ని ప్రదేశాలను మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం నిమగ్నమైంది. శాలిహుండం, బారువ బీచ్‌ను పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ధి చేస్తోంది. శివసాగరం, గనగలవానిపేట, కళింగపట్నం బీచ్‌లను కూడా పీపీపీ పద్ధతిలో అభివృద్ధి చేసేందుకు అడుగులు వేస్తోంది. -
పరాయి దేశాల్లో పడరాని పాట్లు
శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం లొద్దపుట్టికి చెందిన 24 మంది, కేదారిపురం గ్రామానికి చెందిన 13 మంది, ఆంధ్రా–ఒడిశా సరిహద్దు గ్రామాలకు చెందిన మరో ఏడుగురు నిరుద్యోగులు గత ఏడాది డిసెంబర్లో ఓ ప్రకటన చూసి ‘అరౌండ్ ద వరల్డ్’ అనే ట్రావెల్ ఏజెన్సీని సంప్రదించారు. డిసెంబర్ 18, 20, 22 తేదీల్లో గాజువాక గ్రాన్ ఆపిల్ హోటల్లో దుబాయ్ డ్రాగన్ కంపెనీ, అబుదాబీ శాంసంగ్ కంపెనీల్లో వెల్డర్, ఫిట్టర్, స్టోర్‌మెన్ ఉద్యోగాలకు ఎంపిక చేశారు. వీసా, పాస్‌పోర్ట్, విమానం టికెట్ల కోసం రూ.45వేలు నుంచి రూ.55వేలు వరకు వసూలుచేశారు. ఈ ఏడాది జనవరి 24న ముంబై చేరుకోవాలని, అక్కడ నుంచి 28న విమానంలో విదేశాలకు వెళ్లాలంటూ చెప్పిన ట్రావెల్ ఏజెంట్లు ఆ తర్వాత ఆఫీసుకు తాళాలు వేసి ఉడాయించారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: .. ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్లాలనుకునే వారికి శ్రీకాకుళం జిల్లాలో ఈ తరహా మోసాలు సర్వసాధారణం. ఇక్కడి ఉద్దానం ప్రాంతంతో పాటు జిల్లాలో వందలాది మంది యువత తరచూ ఈ తరహా మోసాలకు గురవుతున్నారు. వివిధ శిక్షణా సంస్థలకు లక్షల్లో ముట్టజెప్పి లబోదిబోమంటున్నారు. తీరా విదేశాలకు వెళ్లాక చెప్పిన ఉద్యోగం చూపించకపోవడం, టూరిస్ట్ వీసాలంటూ వెనక్కి పంపడం.. నకిలీ ఆర్డర్లతో ఉద్యోగాలే ఇవ్వకపోవడంతో యువకులు పరాయి దేశంలో పడరాని పాట్లు పడుతున్నారు. మోసం జరుగుతోందిలా.. సిక్కోలు (శ్రీకాకుళం) జిల్లాకు చివర్లో ఉన్నటువంటి ఉద్దానం ప్రాంతంలో ఎటువంటి ఉపాధి అవకాశాలు లేకపోవడంతో ఇక్కడి నిరుద్యోగ యువకులకు పలు సంస్థలు విదేశీ ఉద్యోగాల ఎరచూపి దోపిడీకి పాల్పడుతున్నాయి. గ్రామాల్లో ఉద్యోగ ప్రకటనను అతికించి కొంతమంది, మధ్యవర్తుల ద్వారా కార్మికులను మాయమాటలతో నమ్మించి మరికొందరూ మోసాలకు పాల్పడుతుంటే.. సైబర్ నేరగాళ్లు ఆన్లైన్లో.. ఆకర్షణీయమైన జీతాలు అందిస్తామంటూ నిరుద్యోగ యువతకు ఎరవేస్తూ లక్షలాది రూపాయలు లాగేస్తున్నారు. ఏసీ గదుల్లో ఇంటర్వ్యూలు ఏర్పాటుచేసి పెద్దలతో మాట్లాడుతున్నట్లు ఫోన్‌చేసి కళ్లెదుటే సినిమా చూపిస్తారు. తీరా డబ్బులు చేతికి అందాక చుక్కలు చూపిస్తున్నారు. మోసపోతున్నదిక్కడే.. ఇచ్ఛాపురం నియోజకవర్గం పరిధిలో ఇచ్ఛాపురం, కంచిలి ప్రాంతాలతోపాటు, ఒడిశా సరిహద్దుల్లో ఉన్న సుర్లారోడ్, బరంపుర్, ఛత్రపూర్ వంటి ప్రాంతాల్లో వెల్డింగ్ ఇన్స్టిట్యూట్లను ఏర్పాటుచేసి, నిరుద్యోగ యువతకు శిక్షణనిచ్చి, విదేశాల్లో ప్ల్లంబింగ్, ఎలక్ట్రీషియన్, రిగ్గర్, టిగ్ అండ్ ఆర్క్ వెల్డర్, ఫిట్టర్, గ్యాస్ కట్టర్, ఫ్యాబ్రికేటర్ తదితర పోస్టులను బట్టి రూ.50వేల నుంచి రూ.3లక్షలు వసూలుచేస్తున్నారు. సింగపూర్, మలేసియా, దుబాయ్, మస్కట్, ఖతార్, కువైట్, అబుదాబి, ఒమెన్, ఇరాక్, సౌదీ అరేబియా, సూడాన్, రష్యా, పోలండ్ తదితర ప్రాంతాలు ఇక్కడి నిరుద్యోగుల యువత కష్టాలకు కేంద్రంగా మారాయి. నా భర్త ఏమయ్యాడో.. నా పేరు పుచ్చ అనుసూయమ్మ. మాది వజ్రపుకొత్తూరు మండలం పెద్దబొడ్డపాడు పంచాయతీ కొల్లిపాడు గ్రామం. నా భర్త కుర్మారావు 2019లో సౌదీకి ఉపాధి కోసం వెళ్లాడు. అల్ మసాలిక్ కంపెనీలో చేరాడు. రెండు నెలలుగా అచూకీలేదు. నా భర్తకు ఏమైందో, అసలు ఉన్నాడో లేడో కూడా తెలీడంలేదు. ఎస్పీ, జిల్లా కలెక్టర్లను ఆశ్రయించాం. చివరికి నా భర్త పనిచేస్తున్న కంపెనీని మెయిల్ ద్వారా సమాచారం కోరాం. ఎలాంటి సమాచారంలేదు. మన వారిని చూసి కన్నీళ్లొచ్చాయి.. విదేశాల్లో మనవారు పడుతున్న కష్టాలు చూసి కన్నీళ్లు వచ్చాయి. టూరిస్ట్ వీసాలతో మోసపోయి సుమారు 60 మంది దుబాయ్‌లో అనేక కష్టాలుపడ్డారు. కడుపు నింపుకోవడం కోసం ప్రతీ శుక్రవారం మసీదుల వద్ద ఉచితంగా అందించే రొట్టెలు, పండ్లు కోసం క్యూ కట్టేవారు. రాత్రి సమయంలో ఇసుక తిన్నెలపై పడుకునేవారు. పోలీసుల కంటపడకుండా బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఇవన్నీ కళ్లారా చూసి చలించిపోయా.. – హెచ్చర్ల కుమారస్వామి, బాధితుడు, సీతాపురం, వజ్రపుకొత్తూరు మండలం. ఉద్యోగాలివ్వకుండా మోసం.. సింగపూర్‌లోని రొమేనియాలో ఉద్యోగాలిప్పిస్తామని కంచిలి మండల పరిధి కత్తివరం రోడ్డులోగల శ్రీ గణేష్ వెల్డింగ్ ఇన్స్టిట్యూట్ యజమాని బసవ వెంకటేష్ మోసం చేశాడు. మా వద్ద ఒక్కొక్కరి నుంచి రూ.65వేలు చొప్పున వసూలుచేశాడు. డబ్బులు కట్టినప్పటికీ ఉద్యోగాలకు పంపించలేదు. రెండేళ్లుగా మేం కట్టిన డబ్బులు తిరిగి ఇవ్వమని అడుగుతున్నప్పటికీ ఇవ్వడంలేదు. పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాం. మోసగాడు తప్పించుకు తిరుగుతున్నాడు. – దుంగ తారకేశ, ఇన్నీసుపేట, ఈరోతు తారకేశ్వరరావు, సన్యాసిపుట్టుగ, సంగారు సురేష్, కపాసుకుద్ది మోసాలు అనేకం.. మచ్చుకు కొన్ని.. ► ఇటీవల వజ్రపుకొత్తూరు మండలం పూండిలో ఓ ఏజెంట్ 150 మంది నుంచి దాదాపు రూ.2కోట్లు వసూలు చేసి రష్యా స్టాంపుతో నకిలీ వీసాలిచ్చి మోసం చేశాడు. వాస్తవానికి వీసా అనేది పాస్‌పోర్టుపై అతికించి ఇవ్వాలి. కానీ, ఈ ఏజెంట్ 150 మందిని పట్టుకుని ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు తీసుకెళ్లగా అక్కడ భారత ఎంబసీ ఇమ్మిగ్రేషన్ అధికారులు నకిలీ వీసాలుగా తేల్చి వెనక్కి పంపించేశారు. ► కంచిలి మండల పరిధిలోని కత్తివరం రోడ్డులో శ్రీ గణేష్ వెల్డింగ్ ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు సుమారు 150 మంది నిరుద్యోగ యువకులకు విదేశాల్లో ఉద్యోగాలిప్పిస్తామని చెప్పి మోసంచేసి, ఒక్కొక్కరి నుంచి రూ.60 వేల నుంచి 70 వేలు చొప్పున వసూలు చేసి, దుకాణం మూసేశారు. బాధితుల్లో ఇన్నీసుపేట, సన్యాసిపుట్టుగ, కపాసుకుద్ది, ఒడిశా సరిహద్దు గ్రామాలకు చెందిన వారున్నారు. ► అలాగే, ఇదే మండలంలోని డోలగోవిందపురం గ్రామానికి చెందిన మట్ట దున్నయ్య అనే వ్యక్తి డోలగోవిందపురం, గంగాధరపురం, ఒడిశాకు చెందిన నరేంద్రపురం తదితర గ్రామాలకు చెందిన ఆరుగురి నుంచి రూ.65వేలు చొప్పున వసూలుచేసి, మరో ఏజెంటు ద్వారా వీరికి శ్రీలంకలో నెలకు రూ.18,500 చొప్పున జీతంతోపాటు, ఓటీ, భోజనం, వసతి సౌకర్యం కల్పించే ఉద్యోగం ఇస్తానని చెప్పి నమ్మబలికి, తీరా యువకులను శ్రీలంక పంపించి, అక్కడ కేవలం రూ.12వేలు మాత్రమే జీతం ఇచ్చే ఉద్యోగాలు ఇప్పించాడు. దీంతో ఆయా యువకుల కుటుంబసభ్యులు లబోదిబోమంటున్నారు. ఒక ఉద్యోగం అని చెప్పి.. వేరే ఉద్యోగం ఇచ్చి.. శ్రీలంకలో నెలకు రూ.18,500 చొప్పున జీతంతోపాటు ఓటీతో కలిపి రూ.25వేలు వరకు వచ్చే ఉద్యోగాలిప్పిస్తామని చెప్పి ఒక్కొక్కరి నుంచి రూ.65వేలు చొప్పున వసూలుచేశారు. తీరా వారం రోజుల క్రితం శ్రీలంకకు వెళ్లి అక్కడి గమేజ్ ట్రేడింగ్ కంపెనీలో నెలకు రూ.12వేలు మాత్రమే జీతం ఇచ్చే ఉద్యోగాలిచ్చి మోసంచేశారు. ఏజెంట్ చెప్పిన ప్రకారం ఏదిలేదు. మాకు జరిగిన మోసంపై పోలీసులు చర్యలు తీసుకోవాలి. మేం కట్టిన డబ్బులు తిరిగి ఇప్పించాలి. – శ్రీలంక నుంచి బాధితులు పురుషోత్తం, బినోద్ నాయక్, శివ -
ఉద్దానం స్కందఫలం.. ఉత్తరాదికి వరం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానపు ప్రాంత ఉద్యాన పంటలకు అన్ని ప్రాంతాల్లోనూ ఆదరణ లభిస్తుంటుంది. అద్భుతమైన రుచితో పండే ఇక్కడి ఉత్పత్తులకు మార్కెట్లో గిరాకీ ఎక్కువ. ముఖ్యంగా సీజనల్‌గా పండే పనస (స్కంద) పంట ఉత్తరాది ప్రాంతాలకు సైతం ఎగుమతి అవుతూ రైతుకు సిరులు కురిపిస్తోంది. ఏటా ఏప్రిల్, మే నెలల్లో పూతకు వచ్చే ఈ పంట ఈ ఏడాది మాత్రం ఫిబ్రవరి మధ్య నుంచే కాయలు దిగుబడి రావడంతో ఇతర ప్రాంతాలకు ఎగుమతి అవుతున్నాయి. పనసకాయలతో పకోడి.. పండుగలు.. సాధారణ రోజుల్లోనూ పనసకాయలతో చేసే పకోడిని ఇష్టంగా ఆరగిస్తారు. కొన్ని ప్రాంతాల్లో పనసతో పచ్చళ్లు, కూరలు, గూనచారు తయారు చేస్తారు. ఒడిశా, బీహార్, ఉత్తరప్రదేశ్, కోల్‌కతా తదితర ప్రాంతాలకు రోజుకు 40 టన్నుల వరకు పనసకాయలు ఎగుమతి అవుతున్నాయి. ప్రస్తుతం కేజీ పనసకాయ రూ.20 నుంచి రూ. 25 వరకు ధర పలుకుతోంది. మే నెల వరకు భారీ ఎగుమతులు జరుగుతాయి. తిత్లీ తుఫాన్ సమయంలో పనస చెట్లు విరిగిపోవడంతో నాలుగేళ్లుగా అంతంతమాత్రంగానే దిగుబడి వచ్చింది. జిల్లాలో సుమారు 25 వేల హెక్టార్లలో పనసకాయలు పండిస్తున్నారు. ముఖ్యంగా ఉద్దానం ప్రాంతంలోని పలాస, వజ్రపుకొత్తూరు, మందస, ఇచ్ఛాపురం, కంచిలి, కవిటి, నందిగాం తదితర మండలాల్లో వీటి సాగు ఎక్కువ. వివిధ వంటకాలు.. పనస ముక్కల బిర్యానీ, పొట్టు కూర, హల్వా, పొట్టు పకోడీ, గింజల కూర, గూనచారు, కుర్మా, ఇడ్లీ, పచ్చళ్లు, బూరెలు వంటి విభిన్న రకాల ఆహార పదార్థాలు పనసకాయలతో చేస్తారు. ఆదాయం ఘనం.. ఇచ్చాపురం, పలాస నియోజకవర్గాలతో పాటు టెక్కలి నియోజకవర్గం నందిగాం మండలంలో పనసకాయల దిగుబడి ఎక్కువ. ఒక్కోచెట్టు నుంచి ఏడాదికి రూ. 800 నుంచి రూ.1500 వరకు ఆదాయం వస్తుంది. కేవలం పొలంగట్లపై చెట్లు వేసుకుంటేనే ఏడాదికి రూ.10 వేల వరకు ఆదాయం సంపాదించవచ్చు. – జె.సునీత, ఉద్యానవన అధికారి, పలాస -
ఒక్క చెట్టు.. వెయ్యి వరాల పెట్టు
శ్రీకాకుళం: వేరు నుంచి ఈనె వరకు.. నీరు నుంచి పీచు వరకు.. కాండం నుంచి కమ్మల వరకు.. వ్యర్థమంటూ లేదు. ఉద్దానాన్ని దశాబ్దాలుగా పెంచి పోషిస్తున్న కొబ్బరి స్పెషాలిటీ ఇది. నారికేళ వృక్షమంటే కొబ్బరి కాయ ఒక్కటే కాదు... తరచి చూస్తే ఈ తరువు నిలువెల్లా ఉపయోగకారిణే. ఇక్కడి కొబ్బరి ఉత్తరాదికి ఎగుమతి అవుతుంది. కాయతోపాటు కమ్మలు, ఈనెలకు కూడా ఆ లారీల్లో స్థానం ఉంటుంది. అక్కడితో అయిపోలేదు. కొబ్బరి పీచు దొరకడం ఆలస్యం.. తాళ్ల నుంచి సోఫాల వరకు బోలెడు వస్తువులు తయారైపోతాయి. అదృష్టం ఉండి కొబ్బరి కాండం దొరికిందా.. అల్మరా బల్లల నుంచి దూలాల వరకు ఎన్నింటినో తయారు చేసుకోవచ్చు. ఇన్ని సద్గుణాలు ఉన్నాయి కాబట్టే ఉద్దానం పెద్ద కొడుకుగా దీనికి పేరు వచ్చింది. పోషకాలు మెండు.. ఆరోగ్య పరిరక్షణలో కొబ్బరి పా త్ర కీలకం. చక్కటి పోషక విలు వలున్న ఆహారం. బీ6, ఐరన్, మెగ్నీషియం, జింక్ లాంటి శక్తినిచ్చే పోషకాలు దీనిలో ఉన్నాయి. గుండె పనితీరును మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుందని చెబుతున్నారు వైద్య నిపుణులు. పీచుతో గృహ‘షో’భ.. కొబ్బరి కాయల్లో ఉండే పీచు పర్యావరణ హితమైంది. అందుకే దీనిని చాలా రకాల వస్తువుల తయారీలో వినియోగిస్తున్నారు. ముఖ్యంగా సోఫాలు, దిండ్లు, ఫ్లోర్‌మ్యాట్‌లు, పరుపుల తయారీలో అధికంగా వినియోగిస్తున్నారు. అలాగే తాళ్ల తయారీకి అధిక శాతం పీచును వినియోగిస్తున్నారు. ఆహా..రం.. కొబ్బరి గుజురుతో కొబ్బరి పాలు, నూనె, బిస్కెట్లు, పాలపొడి, తినుబండారాల తయారీలతో పాటు వంటల్లో అదనపు రుచుల కోసం దీనిని వినియోగిస్తున్నారు. ఔ కమ్మలు, ఈనెలు.. బోలెడు ఉపయోగాలు కొబ్బరి ఈనెల నుంచి చీపుర్లను తయారు చేస్తు న్నారు. ఉద్దానం ప్రాంతంలో తయారైన చీపుళ్లకు వి విధ రాష్ట్రాల్లో ఫుల్ డిమాండ్ ఉంది. ఎండు ఈనెలు, పచ్చి ఈనెల్ని వేర్వేరుగా అమ్మకాలు చేస్తున్నారు. ఎండు ఈనెల్ని చీపుర్ల తయారీకి వినియోగిస్తున్నా రు. వీటికి ఒడిశా, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్టాలకు ఎగుమతి చేస్తున్నారు. పచ్చి ఈనెల్ని పైకప్పులకు, ఊటబావుల్లో నీటి నిల్వకోసం, అగ్గిపుల్లల తయారీ, ఐస్‌క్రీం తయారీలో వినియోగిస్తున్నారు. ఒడిశా, ప శ్చిమ బెంగాల్‌లకు ఇవి ఎగుమతి అవుతున్నాయి. శుభకార్యమేదైనా కొబ్బరి కమ్మల పందిళ్లు వేయడం ఆనవాయితీ. వేసవి వచ్చిందంటే చాలు జిల్లాలోని ప్రతి ఏరియాలోనూ చలవ పందిళ్లు వేసి ప్రజలు సేదతీరు తుంటారు. కొబ్బరి కాండాన్ని దూలాలు గా, వంటచెరుకుగా, ఇంటిలోని అల్మారా బల్లలుగా, ఇంటి నిర్మాణంలో కలపగా వినియోగిస్తున్నారు. సీడీబీ, ఉద్యానశాఖలు ఆధ్వర్యంలో.. కొబ్బరి పునరుద్ధరణ పథకం(ఆర్అండ్ఆర్జే): రైతు లు సాగుచేస్తున్న కొబ్బరితోటల్లో పురుగుపట్టి పాడై న చెట్లు, అనుత్పాదక చెట్లు తొలగించి కొత్త మొ క్కల పెంపకానికి రాష్ట్ర ప్రభుత్వం కొబ్బరి తోటల పునరుద్ధరణ పథకం(ఆర్అండ్ఆర్ జే ) సీడీబీ (కోకోనెట్ డెవలప్మెంట్ బోర్డ్) సాయంతో అమలు చేస్తోంది. దీనికోసం హెక్టారుకు రూ. 35000 వరకు ఆర్థిక ప్రోత్సాహాన్ని రైతులకు అందజేస్తోంది. కొబ్బరి రైతు సంఘాలు(సీపీఎస్): 1000 చెట్లు సాగు చేసే రైతులు ఓ సమాఖ్యగా, 10 సమాఖ్యలు ఓ ఫెడరేషన్‌గా, 10 ఫెడరేషన్లు ఓ కంపెనీగా ఏర్పా టు చేయడం ఈ పథకం ఉద్దేశం. ఈ సీపీఎస్ సంఘాలకు కొబ్బరి అభివృద్ధి బోర్డు గుర్తింపు ఇస్తుంది. గుర్తింపు పొందిన కంపెనీలు, ఫెడరేషన్లకు ప్రత్యేక రాయితీలు, వ్యాపారంలో భాగస్వామ్యాలు కల్పించడం వంటి వెసులుబాటు ఉంది. కొబ్బరిమొక్కల ఉత్పత్తి కేంద్రం కూడా బారువలోఉంది. సర్కారు సాయం ఇలా... వడ్డీలేని రుణం: కొబ్బరి రైతులకు లక్ష రూపాయల వరకు పంటరుణంగా(క్రాప్ లోన్) స్వల్ప వడ్డీకే ప్రభుత్వం అందిస్తోంది. గరిష్టంగా రూ.1.60 లక్షల వరకు అందిస్తున్నారు. కిసాన్ గోల్డ్‌కార్డ్ పేరిట కొబ్బరితోటల అభివృద్ధి పథకం కింద రుణాన్ని కూడా అందజేస్తున్నారు. డీసీసీబీ ద్వారా షార్ట్‌టెర్మ్, లాంగ్‌టెర్మ్ రుణాలపేరిట భారీ మొత్తంలో రుణాలు మంజూరు చేస్తున్నారు. విశేషాలెన్నో... ► ఎనిమిదేళ్లకు దిగుబడి మొదలై ఇరవై ఐదేళ్ల పాటు నిరంతరాయంగా కాయల్ని అందిస్తుంది. ► అతి తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ ఆదాయం సాధించే పంట. ► రాష్ట్రంలో ఉభయ గోదావరి జిల్లాల తర్వాత సిక్కోలులోనే కొబ్బరి పంట విస్తారంగా సాగవుతోంది. నాణ్యమైన కొబ్బరి ఉద్దానం కొబ్బరికి ప్రపంచ స్థాయిలో నాణ్య త విషయంలో ఎంతో గుర్తింపు ఉంది. కోకోనట్ ఫుడ్‌పార్క్ ఇక్కడ ఏర్పాటు చేయగలిగితే రైతుకు ప్రస్తుత ధర కంటే పది రెట్ల ఆదాయం దక్కుతుంది. కొబ్బరి ఉప ఉత్పత్తుల పరిశ్రమ ఏర్పాటు అయితే జిల్లా రాష్ట్రానికే తలమానికంగా నిలుస్తుంది. – జోహర్‌ఖాన్, చిక్కాఫ్ చైర్మన్, కవిటి కోకోనట్ ఫుడ్‌పార్క్‌కు సీఎం భరోసా.. రాష్ట్రంలో రెండో కోనసీమగా గుర్తింపు పొందిన కవిటి ఉద్దానం ప్రాంత కొబ్బరి రైతుల ఆర్థికాభివృద్ధికి కోకోనట్ ఫుడ్‌పార్క్ ఏర్పాటు కోసం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లాం. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అంశాలన్నింటిపై వ్యవసాయ శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి, జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రుల సహకారంతో ఈ ప్రాజెక్ట్ ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ప్రయత్నాలు ప్రారంభించాం. – పిరియా సాయిరాజ్, వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, ఇచ్ఛాపురం -
ఉద్దానం గూనచారు.. తింటే వదల్లేరు
ఇచ్ఛాపురం రూరల్: ఉద్దానం ప్రాంతంలో చేసే విందుల్లో విశేష వంటకం ‘గూనచారు’. వేడివేడి అన్నంలో గూనచారు వేసుకుంటే ‘ఆహా ఏమి రుచి.. తినరా మైమరచి’ అంటూ పాట పాడక తప్పదు. ఈ వంటకం అంత రుచికరంగా ఉంటుంది మరి. అరచేతికి అంటిన గూనచారు వాసన వారం రోజులపాటు పోదంటే అతిశయోక్తి కాదు. శ్రీకాకుళం జిల్లాలో ‘భోజీ పులుసు’గా పిలిచే గూనచారు కేవలం ఉద్దానం ప్రాంతానికే సొంతం. మట్టి బాన (పెద్ద కుండ)లో తయారు చేసే ఈ చారు 10 నుంచి 15 రోజులపాటు నిల్వ ఉంచినా చెక్కు చెదరకుండా.. రంగూ, రుచి పోకుండా అంతే రుచిగా ఉంటుంది. ఈ చారును ఉద్దానం వాసులు ఇతర రాష్ట్రాల్లో ఉండే మిత్రులు, బంధువులు, సహోద్యోగులకు పంపిస్తుంటారు. పోషకాల రారాజు గూనచారులో అన్నిరకాల పోషక విలువలు ఉంటాయని విశ్రాంత వైద్యాధికారి డాక్టర్ పూడి రామారావు తెలిపారు. ముఖ్యంగా ఇందులో ఏ, బీ, సీ, డీ, కే విటమిన్లు ఉంటాయని చెప్పారు. ఇది క్యాన్సర్ నిరోధకంగా పని చేస్తుందని.. రక్తహీనతను తగ్గించే ఔషధ గుణాలు, నరాల బలహీనతను తగ్గించే గుణాలు, వీర్యకణాల వృద్ధి, ఐరన్, మాంసకృత్తులు, శరీర నిర్మాణానికి అవసరమైన ప్రొటీన్లు పుష్కలంగా ఉన్నాయని ఆయన వివరించారు. గూనచారు ఎసిడిటీని రూపుమాపుతుందని పేర్కొన్నారు. ఇలా తయారు చేస్తారు ► మొదట చింతపండు నానబెట్టి రసం తీయాలి. ఆ రసాన్ని కనీసం గంటపాటు బానలో మరిగించాలి. మరిగించిన రసంలో బెల్లం, పసుపు పొడి, కారం, అరటి ముక్కలు, మునగ, పనస ఇత్యాది కూర ముక్కలు కలపాలి. ► ఇలా తయారైన రసాన్ని మరో గంటసేపు మరిగించాలి. అందులో బాగా వేయించిన బియ్యం పిండిని కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ► పోపు పెట్టడం చాలా ముఖ్యమైన ఘట్టం. మొదటిగా వంటనూనెను పావుగంట మరిగించాలి. తరువాత ఉల్లికి గాట్లు పెట్టి ఆ నూనెలో వేసి బాగా వేయించాలి. తర్వాత ఎండుమిరప కాయల్ని దోరగా వేయించాలి. తర్వాత అల్లం, వెల్లుల్లి ముద్దలు వేయాలి. ఈ పోపు కార్యక్రమం ఇంచుమించు గంటసేపు సాగాలి. ► తయారైన పోపుని బియ్యం పిండి కలిపి, మరిగించిన చింతపండు రసంలో కలిపి తగినంత ఉప్పు, కారం పొడి అందులో వేయాలి. ఆ తరువాత బానపై మూతపెట్టి అరగంట సేపు ఉంచాలి. అంతే.. భోజీ పులుసు అదేనండీ.. అదే ఉద్దానం ‘పేటెంట్’ గూనచారు తయార్. మామూలుగా ఉండదు ఉద్దానం ప్రాంతంలో వివిధ ఫంక్షన్లకు ప్రత్యేకంగా తయారు చేసే గూనచారు మామూలుగా ఉండదు. నాకెంతో ఇష్టమైన వంటకం ఇది. ఉద్యోగరీత్యా ఇతర దేశంలో ఉన్న నేను స్వదేశానికి వచ్చినప్పుడు ప్రత్యేకంగా ఈ చారును తయారు చేయించుకుని విందారగిస్తాను. స్థానికంగా దొరికే మసాలా దినుసులతో తయారు చేసే ఈ చారును ఇతర రాష్ట్రాల్లోని వారికి ఉద్దానం వాసులు బహుమతిగా పంపిస్తుంటారు. ఇప్పటివరకు నేను ఎన్నో రాష్ట్రాలు, దేశాలు తిరిగినప్పటికీ ఉద్దానం ప్రాంతంలో తయారు చేసే గూనచారును ఎక్కడా చూడలేదు. ఒక్కమాటలో చెప్పాలంటే ఉద్దానం పేటెంట్ గూనచారు. – తిప్పన శంకరరావురెడ్డి, ప్రవాసాంధ్రుడు, తిప్పనపుట్టుగ, ఇచ్ఛాపురం మండలం ఫంక్షన్లలో భలే డిమాండ్ మా తాతల కాలం నుంచీ ఉద్దానం ప్రాంతంలో జరిగే ప్రతి ఫంక్షన్లో గూనచారు వండాల్సిందే. చింతపండు, బెల్లం, పనస పొట్టుతో ప్రత్యేకంగా తయారు చేసే ఈ చారు చాలా రుచికరంగా ఉంటుంది. పెళ్లిళ్ల సీజన్లో మాకు చాలా డిమాండ్ ఉంటుంది. దీనిని చాలా జాగ్రత్తగా తయారు చేయాలి. ముఖ్యంగా చింతపండు, బెల్లం, ఉల్లిపాయలతో తయారు చేసే పాకం బాగుండాలి. చారు వాసన సుమారు అర కిలోమీటరు వరకు వ్యాపిస్తుంది. 15 రోజులపాటు నిల్వ ఉంచుకుని దర్జాగా తినొచ్చు. – దున్న ఢిల్లీరావు, గూనచారు తయారీదారు, బూర్జపాడు, ఇచ్ఛాపురం మండలం -
ఉద్దానంలో అద్భుత ద్వీపం, కానీ సంబంధాలు రావట్లే!
చుట్టూ జలనిధి.. పక్కనే సముద్ర తీరం.. చిత్తడి నేలలు.. ఓ మూలన మడ చెట్లు.. బుళుక్ బుళుక్మనే బుల్లి కెరటాల సవ్వడులు.. పక్షుల కిలాకిలా రావాలు.. తెరలు తెరలుగా తాకే చిరుగాలి.. అల్లంత దూరాన నువ్వుల రేవు బ్రిడ్జి.. అక్కడి నుంచి చూస్తే విసిరేసినట్టుండే బెస్త గ్రామాలు.. ఎత్తైన బెండి కొండలు.. వీటిమధ్య ఓ అద్భుత ద్వీపంలా అలరారే పూడిలంక గ్రామం ప్రకృతి ప్రేమికులను రా.. రమ్మని స్వాగతం పలుకుతుంటుంది. పర్యాటకంగా కాస్తంత అభివృద్ధి చేస్తే ఎందరినో అక్కున చేర్చుకుని అలరిస్తానంటోంది. ఆ ఊరి సంగతుల వైపు మనమూ ఓ లుక్కేద్దాం పదండి. పూడిలంక గ్రామానికి వెళ్లే మట్టి గట్టు సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం/వజ్రపుకొత్తూరు రూరల్: సిక్కోలుకు వరదలొస్తే మొట్టమొదట ఉలిక్కిపడే గ్రామమిది. వారధి లేని కారణంగా సమస్యల ముఖచిత్రంతోనే ఈ గ్రామం శ్రీకాకుళం జిల్లా వాసులకు పరిచయం. అందరికీ కనిపించే ఆ మట్టి బాట దాటి ఊళ్లోకి అడుగు పెడితే మరో ప్రపంచం తెరుచుకుంటుంది. అపురూపమైన అందాలతో మర్చిపోలేని అనుభూతులను ఇస్తుంది. వంతెన నిర్మించి.. పర్యాటకంగా అభివృద్ధి చేస్తే పూడిలంక గ్రామం సిక్కోలు కీర్తి కిరీటంలో మరో కలికితురాయిగా నిలబడిపోతుంది. వజ్రపుకొత్తూరు మండలంలోని పూడిలంక ఉత్తరాంధ్రలోనే ఏకైక లంక గ్రామం. బోటు ప్రయాణం, ప్రజల జీవన శైలి పర్యాటకులు మదిని దోచేస్తుంటాయి. ఏడు కుటుంబాలతో మొదలై... దాదాపు 110 ఎకరాల విస్తీర్ణంలో 180 ఏళ్ల కిందట కేవలం 7 కుటుంబాలతో ఈ గ్రామం ఆవిర్భవించిందని చెబుతారు. ప్రస్తుతం గ్రామంలోని కుటుంబాల సంఖ్య 68. ఏళ్ల తరబడి ఇక్కడి ప్రజలు ప్రకృతి వ్యవసాయ పద్ధతిలోనే పంటల్ని సాగు చేస్తున్నారు. ఈ గ్రామం పేరు చెప్పి ఎలాంటి పంటలు విక్రయించినా హాట్‌కేకుల్లా అమ్ముడుపోతాయి. ప్రధానంగా ఈ గ్రామంలో వరి, రాగులు, దేశవాళీ టమాటా, వంకాయ, జీడి పంటలను పండిస్తున్నారు. సరైన రహదారి లేకపోవడంతో బయటకు వెళ్లి కూలి పనులు చేసుకోలేని పరిస్థితుల్లో గ్రామ ప్రజలు ఈ పంటలను సాగు చేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. గత ప్రభుత్వం హయాంలో రూ.1.30 కోట్లతో అరకొరగా నిర్మించిన రోడ్డు పుట్టెడు కష్టాలకూ నిలయం ఈ గ్రామం ప్రకృతి అందాలకే కాదు పుట్టెడు సమస్యలకు నిలయంగానే ఉంది. గ్రామం చుట్టూ సముద్రం నీరు ఉండటంతో కొన్నేళ్ల క్రితం జయశ్రీ సాల్ట్ కంపెనీ కాలిబాట నిర్మించింది. అయితే, వరదల ఉధృతికి కాలిబాట పాడైపోయింది. 2018లో అప్పటి ప్రభుత్వం రూ.1.30 కోట్లతో కాలిబాట నిర్మాణానికి శంకుస్థాపన చేసింది. పనులు చేపట్టినా నిధులు సరిపోలేదని అర్ధంతరంగా ఆపేశారు. ఈ గ్రామానికి పల్లివూరు నుంచి కిలోమీటరుకు పైగా బోటు ప్రయాణం చేయాల్సిందే. విపత్తుల సమయంలో ప్రజలు బాహ్య ప్రపంచానికి రావడానికి అనేకకష్టాలు పడుతున్నారు.సరైన రోడ్లు, కాలిబాటలు లేకపోవడంతో బోటుపై ప్రయాణం చేయాల్సిన పరిస్థితి. చిన్నపాటి వరదలు, తుపాన్లు సంభవించినపుడు వారికి బయట ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోతాయి. అత్యవసర పరిస్థితిల్లో స్థానిక యువకులే బాధితులను మంచంపై మోసుకువస్తారు. గ్రామంలో ప్రాథమిక పాఠశాల మాత్రమే ఉండటంతో అక్కడి పిల్లలు ప్రాథమిక విద్య వరకే పరిమితమవుతున్నారు. గ్రామంలో సుమారు 300 మంది జనాభా ఉండగా కేవలం ఒక్కరు మాత్రమే ఇంజినీరింగ్ పూర్తి చేశారు. మరో యువకుడు ఆర్మీలో కొలువు సాధించాడు. స్థానికంగా ఉపాధి కరువవ్వడంతో యువకులు కువైట్, దుబాయ్, సింగపూర్, ఖాండ్లా, పారాదీప్, కోల్‌కతా, హైద్రాబాద్, చెన్నై తదితర ప్రాంతాలకు వలసపోతున్నారు. ఆల్చిప్పలకు భలే డిమాండ్ మగవారు వ్యవసాయ, కూలి పనులు చేస్తే..మహిళలు మాత్రం గ్రామం చుట్టూ ఉన్న ఉప్పు పరలో దొరికే ఆల్చిప్పలను సేకరిస్తూ జీవనం సాగిస్తున్నారు. వీటి మాంసానికి మంచి డిమాండ్ ఉండటంతో మహిళలు వాటిని సేకరిస్తూ సోల రూ.5 చొప్పున అమ్ముతున్నారు. కేజీ ఆల్చిప్పల మాంసం రూ.250 ధర పలుకుతుంది. కాగా పరలో దొరికే గుల్లలను కూడా సేకరించి అమ్ముతారు. వీటిని సున్నం, ముగ్గు తయారీకి వినియోగిస్తారు. ట్రాక్టర్ గుల్లలు రూ.4,500 నుంచి రూ.6 వేల వరకు ధర పలుకుతాయి. దీంతో పాటుగా పశు పోషణకు అధిక ప్రాధాన్యమిస్తారు. ఆల్చిప్పల మాంసం ఆల్చిప్పలే ఆధారం:ఉప్పు పరలో దొరికే కన్ను చిప్పలను సేకరించి వాటిలో ఉండే మాంసాన్ని అమ్ముకుని జీవనోపాధి సాగిస్తున్నాం. రోజాంతా ఈ చిప్పలను సేకరిస్తే రూ.200 నుంచి రూ.300వరకు వస్తుంది. కన్ను చిప్ప మాంసం మూలవ్యాధికి మందుగా పని చేస్తుంది. వీటిని తినేందుకు చాలామంది ఆసక్తి చూపడంతో మంచి గిరాకీ ఉంది –బొర్ర సావిత్రి, గృహిణి కాలిబాట పూర్తి చేయండి జయశ్రీ సాల్ట్ కంపెనీ నిర్మించిన కాలిబాట వరదల ఉద్ధృతికి పాడైంది. టీడీపీ హయాంలో రూ.1.30 కోట్లతో కాలిబాట నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దాదాపుగా 350 మీటర్లు వరకు పనులు జరగ్గా అర్ధంతరంగా ఆగిపోయాయి. అధికారులు స్పందించి కాలిబాట పనులు పూర్తి చేయాలి.– బత్సల దుర్యోధనరావు, రైతు సంబంధాలు రావడం లేదు గ్రామానికి పూర్తిగా రహదారి లేకపోవడంతో యువతీ యువకులకు పెళ్లిళ్లు కుదరడం లేదు. ఊళ్లో వారికి పిల్లలను ఇచ్చేందుకు ఎవరూ ఆసక్తి చూపకపోవడంతో చాలామంది ఆవివాహితులుగా మిగిలిపోతున్నారు. – బొర్ర పార్వతి, గృహిణి -
ఉద్దానం మామిడి రుచి చూశారా? యమ టేస్టీ
కవిటి: వాతావరణం సహకరించడంతో ఉద్దానం ప్రాంతంలో మామిడికాయలు విరగకాశాయి. పైగా ఉద్దానం మామిడి రుచిగా ఉంటుండడంతో మంచి డిమాండ్ ఉంటుంది. దీంతో రైతులు స్థానిక వర్తకులు, దళారీలతో ముందస్తు ఒప్పందం ప్రకారం కాయలను బరంపురం రవాణా చేస్తున్నారు. ఉద్దానంలో పండే కొబ్బరి, మామిడి, పనస వంటి ఉద్యాన పంటలకు ప్రధాన మర్కెట్ ఒడిశా. కొన్ని దశాబ్దాలుగా ఇదే రీతిలో వ్యాపారాలు సాగుతున్నాయి. ప్రస్తుతం లాక్‌డన్ కారణంగా ఒకపూట మాత్రమే లావాదేవీలకు ఆస్కారం ఉండడంతో వ్యాపారాలు పరిమితంగా సాగుతున్నాయి. ఒడిశా అంబోమార్కెట్‌కు రోజుకు 150 లోడులు టాటామ్యాక్సీ పికప్ వ్యానులలో ఉద్దానం నుంచి మామిడికాయలు వస్తున్నట్టు వర్తకులు చెబుతున్నారు. కలెక్టర్ రకం టన్ను రూ.8000, దేశవాళీ రకం టన్ను రూ.6000, బంగినపల్లి రకం టన్ను రూ.15,000 ధర పలుకుతోందని అంటున్నారు. రైతులు ఎవరైనా కాయలు కోసి తీసుకువస్తామంటే తామే వాహనం పంపిస్తామని, అన్లోడింగ్ అయినవెంటనే డబ్బులు చెల్లిస్తామని అక్కడి వ్యాపారులు చెబుతున్నారు. ఉద్దానంలో పంట కూడా ఇప్పుడేపక్వానికి వచ్చేదశలో ఉంది. నీలాల రకం ఇప్పటికీ లేత దశలోనే ఉన్నాయి. జగన్నాథ రథయాత్ర సమయానికి కోతకు వస్తాయి. మరో 10 రోజుల్లో అంబామావాస్యా (ఒడిశాలో పేరుగాంచిన పండుగ)కు పనస, మామిడిపళ్లను ఒడిశావాసులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు. దీంతో క్రమంగా ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. తరతరాలుగా ఇదే పంథా.. ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాల్లో పండి కొబ్బరి, మామిడి, పనస పంటలను ఒడిశా ప్రజలే ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. ఉద్దానం పంటను ఒడిశావాసులు ఓ బ్రాండ్ ఇమేజ్‌గా భావిస్తారు. గత కొన్ని తరాలుగా ఇదే సంప్రదాయం కొనసాగుతోంది. - పాతిన చంద్రశేఖరం, రైతు, ముత్యాలపేట, కవిటి మండలం ముందు శాంపిల్ తీసుకెళతాం చిక్కాఫ్ రైతు సంఘంలో కొంతమంది రైతులు తమ సొంత చెట్లలో పంట కోసి మ్యాక్సివ్యాన్‌లో లోడ్ చేసి ఒడిశాలోని వివిధ ప్రాంతాలకు లోడు తీసుకువెళ్తుంటారు. అక్కడ ఒప్పందం కుదిరితే మరికొన్ని లోడులు వెళ్తాయి. - ఆరంగి శివాజీ, చిక్కాఫ్ మేనేజింగ్ డైరెక్టర్, కవిటి మండలం -
బాబోయ్ భల్లూకం: ఎలుగుబంట్ల హల్చల్
వజ్రపుకొత్తూరు రూరల్: ఉద్దానం, తీర ప్రాంతాల్లో గత కొద్ది కాలంగా ఎలుగు బంట్లు (భల్లూకాలు) హల్చల్ చేస్తుండంతో ప్రజలు భయందోళన చెందుతున్నారు. ప్రధానంగా మందస, వజ్రపుకొత్తూరు, పలాస మండలాల్లోని పలు గ్రామాల్లో ఉన్న జీడి తోటలు, సముద్ర తీరాల్లో సంచరిస్తున్నాయి. ప్రస్తుతం జీడి పిక్కలను ఎరేందుకు రైతులు తోటల్లోనే ఎక్కువ సమయం ఉంటున్నారు. దీంతో ఏ సమయంతో ఏ ప్రమాదం జరుగుతుందోనని భయాందోళన చెందుతున్నారు. అనేక మందికి గాయాలు.. ►ఇప్పటికే అనేక మందిపై ఎలుగులు దాడిచేసి గాయపరిచాయి. చికిత్స పొందుతూ క్షతగాత్రులు పదుల సంఖ్యలో మృతి చెందారు. ►మూడేళ్ల క్రితం తాడివాడ వద్ద రైతులు పంట రక్ష ణకు ఏర్పాటు చేసుకున్న కంచెలో ఎలుగు చిక్కింద ►రెండేళ్ల క్రితం చినవంక గ్రామ దేవత ఆలయంలో ఎలుగు చొరబడింది. ►అక్కుపల్లిలో కిరాణా దుకాణంపై దాడిచేశాయి. ► రాజాంలో అంగన్వాడీ కేంద్రంలో ఎలుగులు చొరబడి నూనె, పప్పు, ఇతర నిత్యావసర సరుకుల ను ధ్వంసం చేశాయి. ►డెప్పూరులో రాత్రి సమయంలో గ్రామ వీధుల్లో సంచరించి ప్రజలకు ప్రాణభయం కలిగించాయి. ►కిడిసింగిలో నిర్మాణం జరుగుతున్న ఇంటిలో రెండు ఎలుగులు కనిపించడంతో భవన నిర్మాణ కార్మికులు బయటకు పరుగులు తీశారు. ►గత మూడు రోజుల నుంచి డోకులపాడు సము ద్ర తీరంలో రెండు ఎలుగులు సంచరిస్తూ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అధికారు లు స్పందించి ఎలుగుల సంచారాన్ని నియంత్రించా లని ఉద్దాన, తీర ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు. తీరంలో ఎలుగుబంట్లు.. వజ్రపుకొత్తూరు: మండలంలోని ఉద్దాన తీరప్రాంత గ్రామాల్లో ఎలుగుబంట్లు భయాందోళన కు గురిచేస్తున్నాయి. బుధ, గురువారాల్లో డోకు లపాడు తీర ప్రాంతంలో రెండు ఎలుగుబంట్లు సంచరించడంతో జీడి రైతులు ఆందోళనకు గురయ్యారు. ఒంటరిగా తిరగొద్దు ప్రస్తుత సీజన్లో పనస, జీడి పండ్లు తీనేందుకు ఎలుగులు తోటల్లో సంచరిస్తా యి. తోటలకు వెళ్లేటప్పు డు, రాత్రి సమయంతో ఆరు బయటకు వచ్చేటప్పుడు ఒంటరిగా రావొ ద్దు. ఎలుగులను కవ్వించకూడదు. వాటి సంచారాన్ని గమనిస్తూ పలు జాగ్రత్తలు పాటించాలి. ఇప్పటికే ప్రజలకు అవగాహన కల్పించాం. – రాజనీకాంతరావు, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, కాశీబుగ్గ రేంజ్ చదవండి: సీసీ ఫుటేజ్‌లో దృశ్యాలు: పావు గంటలో.. పని కానిచ్చేశారు! కొడుకును బావిలో పడేసి...ఆపై తండ్రీ ఆత్మహత్య -
Telugu Natakam: నటనలో జీవిస్తూ.. నాటకాన్ని బతికిస్తూ!
ఒకప్పుడు తెలుగునాట ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించడమే కాకుండా ప్రజల మదిలో చైతన్య భావాలను రేకెత్తించిన సుందర దృశ్యకావ్యం నాటకం. మారుతున్న కాలంలో నేటి యువతకు నాటకంలోని రసజ్ఞతను ఆస్వాదించే ఆసక్తి లేకున్నా.. వారిని నటనతో కట్టిపడేసే సామర్థ్యం కలిగిన కళాకారులకు పుట్టినిల్లు సిక్కోలు. ఇక్కడి నాటక కళాసమితులపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. కవిటి: పౌరాణిక, సాంఘిక నాటకాల్లో విశేష సేవలందించి శ్రీకాకుళం జిల్లా ఖ్యాతిని దశదిశలా మారుమోగేలా చేసిన కళాకారులు ఎంతోమంది కళామతల్లి ముద్దుబిడ్డలుగా గుర్తింపు పొందారు. పద్మశ్రీ బిరుదుపొందిన యడ్ల గోపాలరావు, మీగడ రామలింగస్వామి, ఉద్దానం ప్రాంతానికి చెందిన దివంగత బెందాళం ప్రకాష్ వంటి ఎందరో ఈ ప్రాంతంనుంచి నాటకాలు వేసి సినిమాల్లో సైతం తమ నటనా ప్రతిభను చాటుకున్నారు. 2000 సంవత్సరం వరకు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సుమారు 20 వరకు నాటక సమాఖ్యలు ఉండేవి. కాలక్రమంలో వీటిసంఖ్య సగానికి తగ్గిపోయింది. కవిటి ఉద్దానం ప్రాంతం బొరివంకకు చెందిన శార్వాణి గిరిజన సాంస్కృతిక సమాఖ్య, శ్రీకాకుళానికి చెందిన శ్రీశయన నాటక సమాఖ్య, నందిగాం మండలం పెద్దతామరాపల్లి శ్రీవేంకటేశ్వర నాటక కళాసమితి, టెక్కలిలో ప్రజాచైతన్య నాటక కళా సమితి, కోటబొమ్మాళి మండలం లఖిందిడ్డిలో శ్రీనివాస నాటక కళాసమితి, సంతబొమ్మాళి మండలం వడ్డివాడలో చైతన్య నాటక కళాసమితి తమ కళాసేవల్ని నేటికీ కొనసాగిస్తున్నాయి. శ్రీకాకుళంలో మిత్రా సాంస్కృతిక సమాఖ్య, ఉద్దానం ప్రాంతంలో భైరిపురం, బి.గొనపపుట్టేగ, బొరివంక, బెజ్జిపుట్టుగ, మఖరాంపురం, కత్తివరం గ్రామాల్లో నాటక పరిషత్ పోటీలు తరచుగా నిర్వహిస్తూ సాంఘిక నాటిక కళాసౌరభాల్ని భావితరాలకు అందించడంలో విశేషంగా కృషిచేస్తున్నాయి. ఉద్దానం ప్రాంతంలో 60 ఏళ్లుగా నాటికలు వేసే ప్రక్రియ నేటికీ అప్రతిహతంగా కొనసాగుతోంది. ప్రస్తుతం బొరివంకలో పలువురు ఉపాధ్యాయులతో కలిసి ఏర్పడిన శార్వాణి నాటక సమితి సేవలు ప్రశంసనీయంగా ఉన్నాయి. ‘నంది’సంతృప్తి అనిర్వచనీయం నాటిక ప్రదర్శనల్లో మూడు దశాబ్దాలుగా భాగస్వామిగా నటజీవితం కొనసాగడం ఎంతో సంతోషాన్నిస్తోంది. రాష్ట్రప్రభుత్వం ఇచ్చే నంది పురస్కారం పొందడం మరపురాని అనుభూతి. –పిరియాచలపతిరావు, శార్వాణీ నాటక సమాఖ్య, బొరివంక నిర్మాణంలో కళావేదిక.. బొరివంక జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో కళావేదిక ప్రస్తుతం నిర్మాణంలో ఉంది. ఇది పూర్తయిన తర్వాత తెలుగురాష్ట్రాల నాటిక పరిషత్ పోటీలు నిర్వహించాలన్న అభిలాష ఉంది. –బల్లెడ లక్ష్మణమూర్తి, గౌరవాధ్యక్షుడు, శార్వాణీనాటక సమాఖ్య, బొరివంక కళాపోషణ ఉండాలి.. మడిసన్నాక కూసింత కళాపోషణుండాలి.. అనే తెలుగు సినిమా డైలాగు నన్నెంతగానో ప్రభావితం చేసింది. వృత్తి వ్యవసాయమైనా కళారంగంపై మక్కువ నన్ను నటన వైపు ఆకర్షించేలా చేసింది. – బెందాళం శోభన్‌బాబు, సీనియర్ నటుడు, శార్వాణీనాటక సమాఖ్య -
విరగకాసిన పనస!
కాశీబుగ్గ/వజ్రపుకొత్తూరు: ఉద్దానం పనసకు హోలీ గిరాకీ వచ్చింది. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో పనసకాయలకు డిమాండ్ ఉండటంతో ప్రతిరోజూ లారీల్లో కాయలను తరలిస్తున్నారు. ఈ నెల 28న హోలీ, వచ్చే నెల ప్రారంభంలో ఉగాది పండుగల నేపథ్యంలో ఈసారి కిలో పనసకాయల ధర ఎన్న డూ లేనివిధంగా మొదట్లో రూ.25 నుంచి రూ.35 వరకు ధర పలికింది. తాజాగా కిలో రూ.16 వరకు విక్రయిస్తు న్నారు. హోలీ తర్వాత కాయలకు డిమాండ్ పడిపోతుంది. ఈ నేపథ్యంలో ముందుగానే కాయలను చెట్ల నుంచి కోసి మార్కెట్‌కు తరలిస్తున్నారు. పనసలో రెండు రకాలు ఉంటాయి. అందులో ఖర్జూరం రకం కాయలను పండ్లు గా విక్రయించేందుకు చెట్లకే ఉంచేశారు. ముదిరితే పనికిరాని గుజ్జు రకం కాయలను మార్కెట్‌కు సరఫరా చేస్తున్నారు. ప్రధానంగా సీతంపేట, పాలకొండ ఏజెన్సీలతో పాటు ఉద్దానం నుంచి పూండి, పలాస, హరిపురం, కవి టి, కంచిలి మార్కెట్‌కు ప్రతి రోజూ 350 టన్నుల వరకు తరలిస్తున్నారు. అక్కడి నుంచి కాన్పూర్, కోల్‌కతా తదితర ప్రాంతాలకు ఎగుమతి చేసి లాభాలు ఆర్జిస్తున్నారు. విరగకాసిన పనస.. తిత్లీ తుఫాన్ వచ్చి మూడేళ్లు పూర్తవుతున్న సమయంలో చెట్లన్నీ మళ్లీ పునర్వైభవం సంతరించుకుంటున్నాయి. దీంతో పనసకాయలు విరగకాస్తున్నాయి. బరంపురం, గుజరాత్, కోల్‌కతా తదితర ప్రాంతాల్లో జరిగే పెళ్లిళ్లలో పనసకాయల వినియోగం ఎక్కువ. ముఖ్యంగా పచ్చళ్లకు, పకోడీలు తదితర ఆహార పదార్థాల్లో అధికంగా వాడుతుంటారు. -
తిత్లీ పాపం.. టీడీపీకి కోలుకోలేని దెబ్బ..
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఉద్దానంలో టీడీపీ పతనం పతాక స్థాయికి చేరుకుంది. ఒకప్పుడు ఊరూరా చక్రం తిప్పిన ఆ పార్టీ నేతలు ఇప్పుడు కనీసం వార్డు మెంబర్ స్థానాన్ని కూడా దక్కించుకోలేని దీన స్థితికి చేరుకున్నారు. దశాబ్దాల తరబడి పాలించిన వారు పనులు చేయకపోవడం, ఆపత్కాలంలో అక్రమాలకు పాల్పడడం పతనానికి హేతువులయ్యాయి. ముఖ్యంగా తిత్లీ తుఫాన్ పరిహారంలో చేసిన అక్రమాలు టీడీపీని కోలుకోలేని విధంగా దెబ్బకొట్టాయి. పరిహారం పంపిణీలో అర్హులకు అన్యాయం చేసి, అనర్హులకు లబ్ధి చేకూర్చిన టీడీపీ నేతలకు ఉద్దానం ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారు. ఏకపక్షంగా ఓట్లేసి టీడీపీ మద్దతుదారులుగా పోటీ చేసిన వారందరినీ కసి తీరా ఓడించారు. ఒంటరి మహిళల పింఛన్ల అక్రమాలు జరిగిన ప్రాంతాల్లో కూడా టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. మరోవైపు సంక్షేమ పథకాలు, ఉద్దానం అభివృద్ధికి పాటు పడుతున్న వైఎస్సార్సీపీ మద్దతుదారులను ప్రజలు నెత్తిన పెట్టుకున్నారు. ఆ పార్టీ మద్దతుదారులుగా పోటీ చేసిన వారిని అధిక సంఖ్యలో గెలిపించుకు న్నారు. తిత్లీ తుఫాన్ సమయంలో టీడీపీ నేతల పాల్పడిన అవినీతి అంతా ఇంతా కాదు. భూమి లేని వారికి, నష్టం జరగని వారికి పరిహారం ఇప్పించి, వాస్తవంగా భూములుండి, నష్టపోయిన వారికి అన్యాయం చేశారు. ఈ పాపంలో పాలు పంచుకున్న వారందరికీ తాజా పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పారు. ఎమ్మెల్యేలు అచ్చెన్నాయు డు, బెందాళం అశోక్, మాజీ ఎమ్మెల్యే గౌతు శ్యామ సుందర్ శివాజీ కుటుంబీకులకు ప్రజలు షాకిచ్చా రు. ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ స్వ గ్రామం ఉన్న కవిటి మేజర్ పంచాయతీలో వైఎస్సార్సీపీ మద్దతుదారు భారీ మెజారిటీతో విజ యం సాధించారు. ఈ మేజర్ పంచాయతీలో కూన రవికుమార్, బెందాళం అశోక్‌లు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం చేశారు. అయినా ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అలాగే, గౌతు శ్యామ్ సుందర్ శివాజీ స్వగ్రామమైన సోంపేట పంచాయతీలోనైతే ఎన్నడూ లేని విధంగా అత్యధిక మెజార్టీతో వైఎస్సార్సీపీ మద్దతుదారు విజయం సాధించారు. ఇక్కడ 18 వార్డులుండగా ఒక్కటి కూడా టీడీపీ గెలుచుకోలేకపోయింది. వైఎస్సార్సీపీ పూర్తిగా స్వీప్ చేసింది. తిత్లీ అక్రమాలకు పాల్పడ్డ వారిలో పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్న మాజీ ఎంపీపీ చిత్రాడ శ్రీనివాసరావు బలపరిచిన అభ్యర్థి ఓటమి పాలవ్వడం ఇక్కడ చర్చనీయాంశమైంది. పెద్ద శ్రీరాంపురంలో ప్రతి సారి గెలిచిన టీడీపీ ఈసారి మట్టి కరిచింది. బల్లెడ సుమన్ అనే సామాన్యుడి చేతిలో టీడీపీకి చెందిన సీనియర్ నేత మాదిన రామారావు ఓడిపోయారు. అలాగే, కంచిలి మండలంలోని చిన్న కొజ్జరియా, పెద్ద కొజ్జరియ, శ్రీరాంపురం, జాడు పూడి తదితర గ్రామాల్లో టీడీపీ మద్దతుదారులు ఘోరంగా ఓడిపోవడానికి తిత్లీ అక్రమాలే కారణంగా చెప్పుకోవచ్చు. ఒంటరి పింఛన్ల అక్రమాలు.. భర్తలున్న టీడీపీ మహిళలకు ఒంటరి మహిళల పింఛన్లు మంజూరు చేసి లబ్ధి చేకూర్చిన వైనం కూడా ఎన్నికల్లో ప్రభావం చూపింది. కళ్ల ముందే అనర్హులకు పింఛన్లు ఇవ్వడంపై ప్రజలు కన్నెర్ర చేశారు. ముఖ్యంగా పింఛన్ల అక్రమాలు జరిగిన బూర్జపాడు, ఈదుపురం, లొద్దపుట్టి, మండపల్లిలో టీడీపీ నేతలు ఘోరంగా ఓడిపోయారు. ఇచ్ఛాపురం నియోజకవర్గంలో 98 పంచాయతీలకు గాను 83 పంచాయతీలను, పలాస నియోజకవర్గంలో 95 పంచాయతీలకు గాను 87 పంచాయతీలను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుందంటే టీడీపీ అక్రమాలు ఎన్నికల్లో ఎంత ప్రభావం చూపాయో అర్థం చేసుకోవచ్చు. ప్రగతి పరుగులు.. ఉద్దానం ఏరియాలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు కూడా టీడీపీ పునాదులను పెకిలించేశాయి. కిడ్నీ సమస్య పరిష్కారానికి చేస్తు న్న కృషి, స్వచ్ఛమైన తాగునీరందించేందుకు చేపడుతున్న కార్యక్రమాలు ఎన్నికల్లో పెద్ద ఎత్తున ప్రభావం చూపాయి. ముఖ్యంగా కిడ్నీ రోగుల కోసం ఏర్పాటు చేస్తున్న రీసెర్చ్ సెంటర్, మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి, ఎక్కడికక్కడ ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్లు ఎన్నికల్లో ప్రజలను ఆలోచింప చేశాయి. అలాగే ఉద్దానం ఏరియాలో స్వచ్ఛమైన తాగునీరందించేందుకు చేపడుతున్న రూ.700కోట్ల మంచినీటి ప్రాజెక్టు, మత్స్యకారుల కోసం నిర్మిస్తున్న మంచినీళ్లపేట జెట్టీ, కిడ్నీ రోగులకు రూ. 10వేల పింఛను, ఇవన్నీ ఎన్నికల్లో టీడీపీ ఓటమికి కారణమయ్యాయి. వైఎస్సార్సీపీ మద్దతుదారులకు మందసలో 2965 ఓట్ల మెజారీ్ట, సోంపేటలో 2841 ఓట్ల మెజారీ్ట, కవిటిలో 1700పైగా ఓట్ల మెజార్టీ వచ్చిందంటే ఆషామాషీ కాదు. పూండి గోవిందపురంలో ఎప్పుడూ టీడీపీయే గెలిచేది. జమీందారి వ్యవస్థ కొనసాగేది. ఆయనెవరు బొట్టు పెడితే వాళ్లే గెలిచేవారు. ఈసారి ఆ పరిస్థితి మారింది. అక్కడ వైఎస్సార్సీపీ గెలిచింది. లక్ష్మీపురం పంచాయతీలో టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కృష్ణమూర్తినాయుడు కుటుంబీకులు గెలిచేవారు. ఈ ఎన్నికల్లో ఓడిపోయారు. సోంపేట, మందస, మెట్టూరు, గుణుపల్లి, చీపురుపల్లి, రేయపాడు నగరంపల్లిలో ప్రతి సారి టీడీపీయే గెలిచేది. తొలిసారిగా ఘోరంగా ఓటమి పాలైంది. (చదవండి: విజయవాడ టీడీపీలో తారస్థాయికి విభేదాలు) మరింత వేడెక్కిన రాష్ట్ర రాజకీయాలు.. -
ఉద్దానంలో ఉషోదయం.. చకాచకా పనులు
సాక్షి, శ్రీకాకుళం: అనారోగ్యంతో ఆర్థికంగా చితికిపోతున్న బతుకులు వారివి. అనారోగ్యం కుదుట పడేందుకు ఏదైనా పనిచేయకపోతే మందులు కూడా కొనుగోలు చేసుకోలేని దుస్థితి. పనికి వెళ్లేందుకు శరీరం సహకరించని పరిస్థితి. వ్యాధి తెలుసుకునేలోపే మంచం పట్టడం.. వైద్యం చేసుకునేలోపే తనువు చాలించడం ఇక్కడ పరిపాటి. ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ మహమ్మారితో నిత్యం చావులు సంభవిస్తున్నాయి. ఇప్పటి వరకు దాదాపు 15వేల మంది కిడ్నీ బారిన మృతి చెందిననట్టుగా నివేదికలు చెబుతున్నాయి. అనేక ప్రభుత్వాలు మారినా ఇక్కడి పరిస్థితులు ఏమాత్రం మారలేదు. ఈ నేపథ్యంలో నేనున్నానంటూ ప్రజా సంకల్పయాత్ర పాదయాత్రలో వైఎస్ జగన్మోహన్రెడ్డి వారి ముందుకొచ్చారు. ఎన్నికల హామీ మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే కిడ్నీ రోగులకు పింఛన్లను రూ.3000 నుంచి రూ.10 వేలకు పెంచారు. పలాసలో 200పడకలతో కిడ్నీ రోగులకు సూపర్ స్పెషాలటీ ఆస్పత్రితో పాటు రీసెర్చ్ సెంటర్, డయాలసిస్ సెంటర్లు మంజూరు చేశారు. తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు రూ. 530.81కోట్లతో భారీ మంచినీటి ప్రాజెక్టును మంజూరు చేశారు. ఇప్పుడా పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పెద్ద నీలావతి వద్ద చేపడుతున్న 10లక్షల లీటర్ల సామర్థ్యం గల సంప్ పనులు అనేక పరిశోధనలు.. ఉద్దానంలో కిడ్నీ వ్యాధి ఆనవాళ్లు 90వ దశకంలో కన్పించాయి. 2000లో సోంపేటకు చెందిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వైద్యులు వై.కృష్ణమూర్తి, పి.శివాటీ కవిటి ప్రాంతంలో కిడ్నీవ్యాధి కేసులను అధికారికంగా గుర్తించారు. 2004లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి హయాంలో నాటి ఇచ్ఛాపురం ఎమ్మెల్యే నరేష్కుమార్అగర్వాలా(లల్లూ) చొరవ తీసుకుని కేజీహెచ్ హెచ్ఓడీ డాక్టర్ రవిరాజ్ చేత 2005లో కవిటీ ప్రాంతంలో పరిశోధన వైద్యశిబిరాలు ప్రారంభించారు. అప్పటి నుంచి అనేక మంది దేశ విదేశాలకు చెందిన బృందాలు పరిశోధనలు కొనసాగించాయి. దాదాపు 20ఏళ్లుగా జరుగుతున్న పరిశోధనలు, పరిశీలనలు చాలా వరకు మంచినీరే సమస్య కావొచ్చని సూచన ప్రాయంగా చెబుతూ వస్తున్నాయి. ప్రస్తుతం 112 గ్రామాలు కిడ్నీ వ్యాధుల బారిన పడి బాధపడుతున్నాయి. ఉద్దాన జలమాలకు శ్రీకారం ఉద్దానం బాధితులను గత పాలకులు గాలికొదిలేశారు. ఈ నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్దానంపైనే దృష్టి పెట్టారు. ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధులకు నీరే ప్రధాన కారణమై ఉండొచ్చని భావిస్తూ ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాల పరిధిలోని ఏడు మండలాలకు ఇంటింటికీ మంచినీటిని కుళాయిల ద్వారా నిరంతరం అందించేలా రూ.700 కోట్లతో ప్రత్యేక ప్రాజెక్టును రూపొందించారు. అన్నీ బేరీజు వేసుకుని చివరికీ రూ. 530.81కోట్లతో ప్రాజెక్టు మంజూరు చేస్తూ పరిపాలన ఆమోదం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. చకాచకా ఉద్దానం పనులు ఉద్ధానం మెగా మంచినీటి ప్రాజెక్టు పనులు టెండర్ల ద్వారా మెఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ సంస్థ దక్కింది. రెండేళ్లలో పూర్తి చేసేలా పనులు కూడా ప్రారంభించింది. హిరమండలం రిజర్వాయర్ నుంచి 1.12 టీఎంసీల నీటిని పైపులైన్ల ద్వారా తీసుకెళ్లి 2051 అంచనాల ప్రకారం 7లక్షల 82 వేల 707మందికి చెరో 100లీటర్ల చొప్పున 22 గంటల పాటు రక్షిత మంచినీరు సరఫరా చేసేలా పనులు చేపడుతున్నారు. ఈ ప్రాజెక్టుతో ఇచ్ఛాపురం, కంచిలి, కవిటి, సోంపేట, పలాస, వజ్రపుకొత్తూరు, మందస మండలాల్లోని 807 గ్రామాలకు నీటి సరఫరా చేయనున్నారు. ప్రతిష్టాత్మకంగా పనులు ఉద్దానం మంచినీటి పథకం పనులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. నిర్ణీత గడువులోగా పనులు జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం. మెగా సంస్థ పనులు త్వరితగతిన చేపడుతోంది. అధికారుల పర్యవేక్షణలో పనులు చకచకా జరగనున్నాయి. ఈ ప్రాజెక్టుతో ఉద్దానం తాగునీటి సమస్య తీరనుంది. కిడ్నీ వ్యాధి నియంత్రించడానికి దోహదపడే అవకాశం ఉంది. – జె.నివాస్, కలెక్టర్, శ్రీకాకుళం -
ఉద్దానం జీవనాడి.. జీడి
వజ్రపుకొత్తూరు: ఉద్దానం పేరు చెబితే గుర్తుకువచ్చేవి రెండే రెండు. ఒకటి కొబ్బరి, రెండు జీడి. 1945కు ముందు నుంచే ఇక్కడ జీడి ఆధిపత్యం చూపడం మొదలుపెట్టింది. ఇక్కడ రైతాంగానికి జీడి జీవ నాడి. ఉద్దానంలో పండే జీడిపిక్కలు నాణ్యమైనవి. ఉత్పత్తి చేసే పప్పు పలుకు సైజు, లెక్కనుబట్టి నాణ్యత నిర్ణయిస్తారు. అత్యంత నాణ్యత కలిగిన జంబో క్వాలిటీ స్థానికంగా దొరకదు. ఉత్పత్తి అయిన మొత్తంలో జంబో జీడి పప్పు జాతీయ స్థాయిలో ఎగుమతి చేస్తారు. అమెరికన్ మార్కెట్లో 454 గ్రాములను ఒక పౌను అంటారు. ఒక పౌను జీడి పప్పు తూకం వేయగా వచ్చిన కౌంటు ప్రకారం వాటి నాణ్యతను నిర్ణయిస్తారు. అందులో భాగంగా జీడి పప్పును 16 రకాలుగా విభజిచారు. మొదటిది 180 రకం అంటే 180 గుడ్లు(పలుకులు). దీని ధర డిమాండ్ సమయంలో రూ.980 వరకు పలుకగా ప్రస్తుతం రూ.740గా ఉంది. ఈ రకంను ఎగుమతికి మాత్రమే సిద్ధం చేస్తారు. స్థానికంగా దొరకదు. కోల్కత్తా, ముంబాయి, డిల్లీ, మద్రా సు, చత్తీస్‌గఢ్, ప్రాంతాలకు టిన్, పౌచ్‌ల రూపంలో ఎగుమతి చేస్తారు. ఇక పోతే 210 రకం ఇందులో కిలోకు 210 గుడ్లు తూకం వేస్తారు. ఇది ఎక్కువగా ఇతర ప్రాంతాలకు తరలిస్తారు. ఇలా గుడ్లు బట్టి 240, 320, 400 రకాలను వివిధ ధరల్లో విక్రయిస్తారు. జేహెచ్ రకం అంటే బద్ద (గుడ్డులో సగం పలుకు) దీన్ని తిరుపతి శ్రీవారీ లడ్డూ ప్రసాదంలో వినియోగిస్తారు. ఇది కాకుండా డబుల్ నంబర్ వన్, స్టాండర్డు బట్స్, జేహెచ్, కేఎల్ డబ్ల్యూపి, పీసెస్, ఎస్.ఎస్.డబ్ల్యూ, డి. డబ్ల్యూ, బి.బి, ఎస్.డబ్యూ.పీ, డీసీ తదితర రకాలు ఉన్నాయి. కుండల్లో కాల్చి(రోస్టింగ్) వలిచే జీడి పప్పుకు డిమాండ్ ఎక్కువ. ఆహా ఏమి రుచి.. అనరా మైమరచి కొత్తూరు: ఆంధ్రా–ఒడిశా సరిహద్దులోని వసప అనే ఊరొకటి ఉంది. కేవలం ఎనిమిది వందల మందే ఉంటారు. కానీ నిరంత రం ఆ ఊరికి వ్యాన్లు, బైకుల మీద చాలా మంది వస్తుంటా రు. కారణం చికెన్ బిర్యానీ.. అవును వసపలో వెంకటరావు అనే వ్యక్తి తయారు చేసే బిర్యానీని లొట్టలేసుకుని మరీ తింటా రు. శ్రీకాకుళం, ఆమదాలవల స, పాలకొండతో పాటు ఒడిశా లోని పర్లాకిమిడి, కాశీనగర్, గుణుపూర్ నుంచి కూడా ఎంతో మంది కేవలం బిర్యానీ తీసుకెళ్లడానికే ఈ ఊరికొస్తుంటారు. గ్రామానికి చెందిన కె.వెంకటరావు ఉపాధి కోసం హైదరబాద్ వెళ్లి అక్కడ బిర్యానీ తయారు చేయడం చేర్చకుని అనంతరం ఇక్కడే హొటల్ పెట్టారు. బిర్యానీ రుచి అదిరిపోవడంతో చుట్టుపక్కల వారంతా ఫిదా అయిపోయారు. పిక్నిక్ సీజన్లలో ఒక రోజు ముందు ఆర్డర్ ఇస్తే గానీ బిర్యానీ దొరకదు. అధికారులు కూడా ప్రత్యేక సందర్భాల్లో ఇక్కడి నుంచే బిర్యానీ తీసుకెళ్తుంటారు. -
ఉద్దానం కిడ్నీ సమస్యలకు శాశ్వత చికిత్స
సాక్షి, అమరావతి: ఉద్దానం ప్రాంతంలో దశాబ్దాల తరబడి వేధిస్తున్న కిడ్నీ సమస్యలకు రాష్ట్ర ప్రభుత్వం శాశ్వత చికిత్స ఆరంభించింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టగానే ఈ సమస్యపై దృష్టి పెట్టారు. ఆ ప్రాంతంలో వ్యాధి ప్రబలడానికి అక్కడి భూగర్భ జలాలే కారణమని పలువురు నిపుణులు నిర్ధారించడంతో.. ఆ ప్రాంత ప్రజలు తాగేందుకు ఏడాది పొడవునా సురక్షిత నదీ జలాలను సరఫరా చేసేందుకు భారీ మంచి నీటి పథకం పనులను వేగవంతం చేశారు. ఉద్దానంగా పిలవబడే ఇచ్చాపురం, పలాస నియోజకవర్గాల పరిధిలోని రెండు మున్సిపాలిటీలతో పాటు ఏడు మండలాల పరిధిలోని 809 నివాసిత ప్రాంతాలకు హిరమండలం రిజర్వాయర్ నుంచి పైపులైన్ ద్వారా నదీ జలాలను తరలించేందుకు రూ.700 కోట్లతో మంచి నీటి పథకానికి ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు పనులు ఇలా.. ► రోజుకు 84 మిలియన్ లీటర్ల తాగు నీటిని సరఫరా చేసేందుకు వీలుగా మెళియాపుట్టి ప్రాంతంలో నీటి ఫిల్టర్ బెడ్ల నిర్మాణానికి భూమి తవ్వకం పనులు కొనసాగుతున్నాయి. ► ఈ పథకంలో భాగంగా రెండు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో వివిధ గ్రామాల్లో మొత్తం 571 ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మించాలని నిర్ణయించగా.. అందులో 369 ఓవర్‌హెడ్ ట్యాంకుల నిర్మాణ పనులు ఆరంభమయ్యాయి. ► హిరమండలం రిజర్వాయర్ నుంచి గ్రావిటీ ద్వారా కాకుండానే, 124 కిలోమీటర్ల మేర పైపులైన్ ద్వారా నీటిని తరలించాల్సి ఉంది. ఈ మేరకు పైపులైన్ నిర్మాణానికి సర్వే ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. 19 ప్రదేశాల్లో పైపులైన్ ఏర్పాటుకు రైల్వే, అటవీ, ఆర్ అండ్ బీ అధికారుల నుంచి అనుమతి తీసుకునే ప్రక్రియను ఇప్పటికే ఆరంభించారు. 7.82 లక్షల మందికి ప్రయోజనం ఉద్దానం ప్రాంత కిడ్నీ సమస్య అంటే.. కంచిలి, ఇచ్ఛాపురం, కవిటి, సోంపేట, పలాస, వజ్రపుకొత్తూరు, మందస మండలాల్లోని 7,82,707 మంది ప్రజల సమస్య. ఇక్కడి ప్రజలందరికీ ఒక్కొక్కరికి రోజుకు వంద లీటర్ల చొప్పున ఏడాది పొడువునా వచ్చే 30 ఏళ్ల కాలం తాగునీటి సరఫరా చేసేలా ప్రభుత్వం ఈ పథకాన్ని రూపొందించింది. భవిష్యత్‌లో శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం, మెళియాపుట్టి మండలాల పరిధిలో 170 నివాసిత ప్రాంతాలకు కూడా ఈ పైపులైన్ ద్వారా తాగునీరు అందించేలా ఈ పథకాన్ని చేపట్టారు. బాబు సర్కార్ మాయమాటలతో సరి ► ఉద్దానం ప్రాంతంలో బహుదా, మహేంద్ర తనయ నదులు వేసవి సమయంలో ఎండిపోతున్నాయి. ఆ సమయంలో ప్రజలు బోరు నీటిని తాగక తప్పడం లేదు. దీంతో వారు వ్యాధి బారిన పడుతున్నారు. ► ఏళ్ల తరబడి ఈ సమస్య కొనసాగుతున్నా, గత టీడీపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు మాయమాటలు చెప్పిందే తప్ప చిత్తశుద్ధితో వ్యవహరించలేదు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక 2019 సెప్టెంబర్ 6వ తేదీన శాశ్వత రక్షిత మంచినీటి పథకం మంజూరు చేశారు. ► హిరమండలం రిజర్వాయర్‌లో ఏటా 19.5 టీఎంసీల నీరు అందుబాటులో ఉంటుందని, అందులో 1.12 టీఎంసీల నీటిని ఉద్దానం ప్రాంత ప్రజల కోసం కేటాయిస్తామని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు తెలిపారు. -
‘ఉద్ధానం’ సమస్యకు శాశ్వత విరుగుడు
శ్రీకాకుళం: హంగూ లేదు, ఆర్భాటం అంతకన్నా లేదు. సమస్యను మానవతా కోణంలో చూడటం, నిబద్ధతతో పరిష్కారంపై దృష్టి పెట్టడం. సరిగ్గా ఇదే పనిచేస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అధికారంలోకి రాకముందు, పర్యటనల్లో పాదయాత్రలో ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలను ప్రత్యక్షంగా చూసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి చలించిపోయారు. అధికారంలోకి వచ్చిందే తడవుగా బాధితుల పక్షాన తన మనసులో ఉన్న పరిష్కాన్ని పలుదఫాలుగా అధికారులతో చర్చించారు. ఏం చేస్తే ఉద్దానం బాధితులకు శాశ్వత ఉపశమనం లభిస్తుందో తెలుసుకున్నారు. ఆచరణాత్మకమైన మార్గంలో పని మొదలుపెట్టారు. యుద్ధ ప్రతిపాదికన శుద్ధి చేసిన తాగునీటిని అందించి వ్యాధికి శాశ్వత విరుగుడు కనిపెట్టింది. ఉద్దానం కిడ్ని సమస్యకు శాశ్వత పరిష్కారంగా మేలైన తాగునీటి పథకాన్ని మందుగా ముందుకు తీసుకువచ్చింది. ఏమాత్రం హడావుడి, ఆర్భాటం లేకుండానే సమగ్ర తాగునీటి పథకం అమలు చేసేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఏకంగా కార్యాచరణతో రంగంలోకి దిగిపోయింది. తాగునీరే విషపూరితం – లక్షల్లో బాధితులు, వేలల్లో మరణాలు ప్రపంచంలో కిడ్నీ వ్యాధి గ్రస్తులతో అల్లాడే నాలుగు ప్రాంతాల్లో ఒకటి శ్రీకాకుళం జిల్లా ఉద్దానం. నికరాగువా, కోస్టారిక, శ్రీలంక, ఉద్దానం ప్రాంతాలు ఎక్కువ కిడ్నీ వ్యాధిగ్రస్తులతో ప్రపంచంలోనే తొలి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. మంచినీటిలో ఉన్న విషపూరిత కారకాలు ఇక్కడ ప్రజల కిడ్నీ సమస్యకు కారణమని పలు పరిశోధనల్లో ప్రాధమికంగా తేల్చారు. ఈ సమస్యకు పరిష్కారం అప్పట్లోనే వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రయత్నించారు. సురక్షితమైన తాగు నీరు అందించేందుకు శ్రీకారం చుట్టారు. కానీ ఆయన మరణంతో ఈ పథకం అటకెక్కింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రాజకీయ, పర్యటనలకు, ప్రకటనలకు పరిమితం అయ్యారే తప్ప, ఉద్దానం సమస్య పరిష్కారానికి కృషి చేయలేదనే వాదనలు ఉన్నాయి. తాజాగా వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్దానంలో శాశ్వత తాగునీటి పధకాన్ని ఏర్పాటు చేయటంతో పాటు, పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు శ్రీకారం చుట్టారు. రూ 700 కోట్ల అంచనాలతో ఈ పధకాన్నిడిజైన్ చేసి రూ 530 కోట్లతో పనులకు అధికారులు టెండర్లు పిలిచారు. రివర్స్ టెండరింగ్ లో రూ 527 కోట్లతో పనులు చేసేందుకు మేఘా ఇంజనీరింగ్ సంస్థ ముందుకు వచ్చింది. ఇది నిర్ణయించిన ధర కంటే 0.60 శాతం తక్కువ. ఉద్దానం ప్రాంత ప్రజల ఏడాది కాలం తాగునీటి అవసరాల కోసం 1.12 టీఎంసీల నీటిని ఈ ప్రాజెక్ట్ ద్వారా అందించనున్నారు. త్వరలోనే పనులను ప్రారంభించేందుకు ఎంఈఐఎల్ సన్నాహాలు చేస్తోంది. తాగునీటి రంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్ లు చేపట్టిన మేఘా ఇంజనీరింగ్ ఈ పథకాన్ని నిర్ణీత గడువులోగా నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేస్తుందని ప్రభుత్వ అధికారులు విశ్వసిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని పలాస, ఇచ్చాపురం నియోజకవర్గాల్లోని రెండు పురపాలక సంఘాలతో పాటు, కవిటి, సోంపేట, కంచిలి, ఇచ్చాపురం, పలాస, వజ్రపుకొత్తూరు, మందస మండలాల్లో ఈ కిడ్నీ బాధితుల సమస్య ఎక్కువగా ఉంది. హీర రిజర్వాయర్ నుంచి నీరు- భూగర్భ మార్గంలో తరలింపు ఉద్దానంలోని 809 నివాసిత ప్రాంతాల్లో 5.74 లక్షల మంది ప్రజలు జీవిస్తున్నారు. తాగునీటికి బోరు నీరే ఆధారం. కానీ అవి విషపూరితం, రసాయనాల మయం. తప్పని పరిస్థితుల్లో అదే నీరు తాగుతున్నారు ఉద్దానం ప్రజలు. సమీపంలో ఉండే బహుదా, మహేంద్ర తనయ నదులు వేసవిలో ఎండిపోతుండడం వల్ల బోరు నీటినే తాగక తప్పని పరిస్థితి. మేఘా ఇంజనీరింగ్ ఉద్దానానికి దాదాపు వంద కిలో మీటర్ల దూరంలో ఉన్న హీర మండలం రిజర్వాయర్ నుంచి భూ గర్భ పైపులైను ద్వారా నీటిని తరలించి మిలియకుట్టి మండల కేంద్రం వద్ద ఆ నీటిని ఇసుక ఫిల్టర్ల ద్వారా శుద్ది చేసి ఆ నీటిని ఉద్దానం ప్రాంతంలోని వివిధ గ్రామా ల్లో ఏర్పాటు చేసిన రక్షిత మంచి నీటి ఓవర్‌హెడ్ ట్యాంకులకు తరలిస్తారు. ప్రతి ఇంటికి ఈ నీటిని అందిస్తారు. పాలకుల వైఫల్యం - ఏళ్ళుగా పీడిస్తున్న సమస్య ఉద్దానం సమస్య ఇప్పటిది కాదు. దీనిని పరిష్కరించడంలో ఎవరూ చిత్తశుద్ది చూపలేదు. నాడు వైఎస్సార్- నేడు వైఎస్ జగన్ ప్రజలు, పీడితుల పక్షాన నిలబడ్డారు. 1985-86 లో బయటపడ్డా అప్పటి నుంచి ప్రభుత్వాల నిర్లక్షమే బాధితుల పట్ల శాపమైంది. 2004 అధికారం తర్వాత వైఎస్సార్ దృష్టి పెట్టినా, ఆయన అకాల మరణంతో సమస్య మొదటికి వచ్చింది. 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చాక, టీడీపీతో పాటు జనసేన పవన్ కల్యాణ్ రాజకీయ లబ్ది కోసం ప్రకటనలకే పరిమితం అయ్యారు. ఉద్దానంలో 35 నుంచి 40 శాతం కిడ్నీ బాధితులు, వేల సంఖ్యలో మరణాలకు ఇప్పుడు వైఎస్ జగన్ ప్రభుత్వ సంకల్పం, మేఘా సంస్థ నైపుణ్యం పరిష్కారం చూపబోతున్నాయి. -
మరింత వేగంగా ఉద్దానం ప్రాజెక్టు
శ్రీకాకుళం,అరసవల్లి: ఉద్దానం మంచినీటి ప్రాజెక్టును ‘మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్(హైదరాబాద్) సంస్థ దక్కించుకుంది. ప్రతిష్టాత్మకమైన ఉద్దానం ప్రాంతంలో శాశ్వత మంచినీటి పథకం నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిధుల మంజూరు, పనులకు చెందిన పరిపాలన ఆమోదాన్ని కూడా ప్రకటించింది. ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ రోగులకు ఎన్నాళ్ల నుంచో వేధిస్తున్న మంచినీటి సమస్యకు ఈవిధంగా రాష్ట్ర ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపింది. ఈ మేరకు రూ.700 కోట్లతో ఉద్దానంలో ప్రతి ఇంటికి మంచినీటిని అందించేలా ప్రత్యేక ప్రాజెక్టును నిర్మించేందుకు ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి సంకల్పించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవలే పారదర్శకంగా నిర్వహించిన టెండర్లను ప్రముఖ నిర్మాణ సంస్థ ‘మేఘా’ దక్కించుకుంది. పనులు పూర్తయితే ఉద్దాన ప్రాంతంలో ఉన్న మొత్తం ఏడు మండలాల్లో 807 గ్రామాలకు స్వచ్ఛమైన తాగునీరు అందనుంది. ఏపీ తాగునీటి సరఫరా సంస్థ (ఏపీడీడబ్ల్యూఎస్సీ) ఆధ్వర్యంలో ఉద్దానం తాగునీటి ప్రాజెక్టు పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. హిరమండలమే ప్రధాన నీటి వనరుగా.... ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఈ ప్రాజెక్టును మొదట్లో రేగులపాడు వద్ద ఉన్న ఆఫ్‌షోర్ రిజర్వాయర్ నుంచి ప్రధాన నీటి వనరుగా గుర్తించినప్పటికీ సాంకేతిక కారణాలతో తాజాగా హిరమండలం బీఆర్ఆర్ వంశధార ప్రాజెక్టును ఖరారు చేశారు. ఈ సోర్స్ సెంటర్ నుంచి సుమారు 19.2 టీఎంసీల నీటిని వినియోగించేలా ప్రాజెక్టును డిజైన్ చేశారు. దీంతో ఉద్దాన ప్రాంతంలోని ఇచ్ఛాపురం మండలంలో 45 గ్రామాలు, కంచిలిలో 138, కవిటిలో 118, సోంపేటలో 74, మందసలో 225, పలాసలో 86, వజ్రపుకొత్తూరులో 121 గ్రామాలకు మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. కిడ్నీ సంబంధిత రోగాలతో ఉద్దాన ప్రాంత ప్రజలు నిత్యం అవస్థలు పడుతున్న సంగతి విదితమే. వీరికి పూర్తి స్థాయిలో ఆరోగ్య పరిస్థితులు మెరుగయ్యేందుకు సీఎం జగన్ మోహన్‌రెడ్డి ఈ ప్రాజెక్టు నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. 2051 నాటి అవసరాలకు అనుగుణంగా...: ఉద్దాన ప్రాంత పరిధిలో 2011 నాటి జనాభా లెక్కల ప్రకారం తాజా ప్రాజెక్టు ద్వారా మొత్తం ఏడు మండలాల్లోని 807 గ్రామాల్లోని సుమారుగా 4,69,157 మందికి ప్రస్తుతానికి మంచినీటి అవసరాలు తీరనున్నాయి. అయితే భవిష్యత్ అవసరాల దృష్ట్యా 2051 నాటికి ఇదే ప్రాంతంలో సుమారు 7,82,707 మంది జనాభాకు ఈ ప్రాజెక్టు ద్వారా మంచినీటిని వినియోగించుకునేలా డిజైన్ చేశారు. ఈ మేరకు మేఘా సంస్థ త్వరలోనే నిర్మాణ పనులను ప్రారంభించనుంది. ఏడు మండలాలతో పాటు పలాస–కాశీబుగ్గ, ఇచ్ఛాపురం మున్సిపాల్టీల్లోనూ తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. -
ఉద్దానం వీరుడికి ఘన స్వాగతం
యుద్ధభూమిలో శత్రువులతో పోరాడి, ఇద్దరిని మట్టుబెట్టిన ఉద్దానం వీరుడు తామాడ దొరబాబుకు స్వగ్రామంలో ఘన స్వాగతం లభించింది. ఆయనను ప్రజలు ఘనంగా సన్మానించారు. ఆర్మీలో పనిచేస్తున్న మందస మండలం లొహరిబంద పంచాయతీ చిన్నలొహరిబంద గ్రామానికి చెందిన దొరబాబు జమ్మూ కశ్మీర్లో టెర్రరిస్టులను మట్టుపెట్టడంలో ముఖ్యపాత్ర పోషించారు. ఈ సందర్భంగా గాయపడిన దొరబాబు నయమైన అనంతరం స్వస్థలానికి వచ్చారు. శ్రీకాకుళం, మందస: మాతృభూమి రక్షణలో శత్రువులతో పోరాడి, ఇద్దరు ముష్కరులను మట్టుబెట్టిన ఉద్దానం వీరు డు తామాడ దొరబాబు స్వగ్రామం చేరుకున్నాడు. ఈ సందర్భంగా ఆయనకు ప్రజలు ఘన స్వాగతం పలికి, సన్మానించారు. మందస మండలం లొహరిబంద పంచాయతీ చిన్నలొహరిబంద గ్రామానికి చెందిన దొరబాబు 1ఆర్ఆర్ బెటాలియన్‌లో చేస్తున్నాడు. ఈయనతోపాటు 200 మంది జవాన్లు బృందంగా ఏర్పడి ఈ నెల 9న జమ్మూ కశ్మీర్‌లోని కోజ్‌పూర్ గ్రామంలో సెర్చ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా హఠాత్తుగా ఓ ఇంటి నుంచి కాల్పులు ప్రారంభ మవ్వగా సైనికులు తేరుకునే లోపే దొరబాబు కాలికి గాయమైంది. బాధను భరిస్తూనే, ఏకే 47తో ముష్కరులపై దాడికి దిగాడు. పాకిస్తాన్‌కు చెందిన భయంకరమైన టెర్రరిస్టు సాభిర్అహ్మాలిక్ను హతమార్చాడు. మరో ఉగ్రవాదిని కూడా దొరబాబుతోపాటు తోటి సైనికులు హతమార్చారు. ఈ ఎన్కౌంటర్లో స్వల్పంగా గాయపడిన దొరబాబు కోలుకొని బుధవారం స్వగ్రామానికి చేరుకున్నాడు. ఈ సందర్భంగా గ్రామస్తులు దొరబాబుకు ఎదురెళ్లి, వీరతిలకం దిద్ది, త్రివర్ణ పతా క రెపరెపల మధ్య పూలమాలలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్రామ సమావేశంలో దొర బాబు సాహసాన్ని వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రామపెద్దలు బచ్చల మధుబాబు, యోగేశ్వరరావు, కృష్ణారావు, దుమ్ము ధనరాజు, తామాడ హేమరాజు, మాధవరావు, పందిరి శ్రీను, తాళ్ల తులసీదాసు, ఢిల్లీరావు, పందిరి శ్రీ ను, దున్న కుమారి, బచ్చల లక్ష్మి, నాగమ్మ, తామాడ రెయ్యమ్మ పాల్గొన్నారు. ఉద్దానం వీరుడు దొరబాబును సన్మానిస్తున్న చిన్నలొహరిబంద గ్రామ మహిళలు -
ఉద్దానం తాగునీటికి రూ.700 కోట్లు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఈనెల 22వతేదీన ప్రారంభించనున్నట్టు డిప్యూటీ సీఎం, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని) తెలిపారు. శనివారం శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో కిడ్నీ బాధితుల స్థితిగతులను తెలుసుకునేందుకు స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రి ధర్మాన కృష్ణదాస్‌తో కలిసి ఆయన పర్యటించారు. తాగునీటి సమస్యతో కిడ్నీ వ్యాధి ప్రబలుతుందనే ఆందోళన నేపథ్యంలో రూ.700 కోట్లతో మంచినీటి ప్రాజెక్టును నిర్మిస్తున్నట్టు చెప్పారు. ముఖ్యమంత్రి ఇక్కడి ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి తొలుత ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గంలోని ఏడు మండలాలకు ఆర్నెల్లలో మంచినీరు అందిస్తామని చెప్పారు. హరిపురంలో ప్రత్యేకంగా డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. పలాస, సోంపేట డయాలసిస్ సెంటర్లలో అదనంగా ఐదు పడకలు చొప్పున ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఉద్దానం ఆరోగ్యదాయని కావాలని, కిడ్నీ భూతాన్ని తరిమికొట్టాలనే ధృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి జగన్ ఉన్నారని స్పీకర్ తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. కాగా, మంత్రి నాని బొడ్డపాడులో కిడ్నీ బాధితులతో ముఖాముఖి నిర్వహించారు. తమకు పింఛన్లు, పథకాలు ముఖ్యం కాదని, కిడ్నీ వ్యాధి నుంచి రక్షించాలని బాధితులు మొర పెట్టుకున్నారు. పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో తక్షణమే నెఫ్రాలజిస్టు, ఇద్దరు రేడియోలజిస్టులను నియమిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. పలాసలో సేవలపై అసంతృప్తి కిడ్నీ మహమ్మారి వ్యాధిగ్రస్తుల ప్రాణాలు హరిస్తుంటే నామమాత్రపు సేవలతో సరిపెడుతున్నారని మంత్రి నాని ఆవేదన వ్యక్తం చేశారు. పలాస సీహెచ్‌సీలో కిడ్నీ బాధితులను పరామర్శించారు. డయాలసిస్ కేంద్రాలను నిర్వహిస్తున్న నెఫ్రోప్లస్ సంస్థ పనితీరు బాగాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నెఫ్రాలజిస్టు వారానికి ఒక్కసారి వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ నివాస్‌కు సూచించారు. పలాస డయాలసిస్ మెడికల్ ఆఫీసర్ సుభాష్ సమాధానం చెప్పలేకపోవడంతో ఆరోగ్యశాఖ కమిషనర్ రామకృష్ణను పిలిచి ప్రభుత్వం ఇంత ఖర్చు చేస్తుంటే ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రశ్నించారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్తామన్నారు. -
ఉద్దానాన్ని వణికిస్తున్న ఎలుగులు
శ్రీకాకుళం, వజ్రపుకొత్తూరు రూరల్: ఉద్దాన, తీర ప్రాంతాల్లో ఎలుగులు సంచరిస్తూ ప్రజలను వణికిస్తున్నాయి. అక్కుపల్లి, గుణుపల్లి, బాతుపురం, మోట్టూరు, చినవంక, చినకొత్తూరు, తోటూరు, డోకులపాడు, రాజాం, కిడిసింగి తదితర గ్రామాల్లో రేయింబవళ్లు అని తేడా లేకుండా గ్రామాల్లో సంచరించడంతో భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికే అనేక మంది ఎలుగుల దాడిలో మృతి చెందారని వాపోతున్నారు. దీంతో తమ జీవనాధరమైన జీడి తోటలకు వెళ్లేందుకు జంకుతున్నారు. రాత్రిళ్లు కూడా గ్రామ వీధుల్లో గుంపులుగా సంచరిస్తూ ఇళ్లలోకి చొరబడుతున్నాయి. ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. -
ఉద్దానం కిడ్నీ జబ్బులకు అదే కారణం
సాక్షి, అమరావతి: భూగర్భ జలాల్లో భారలోహాలు మోతాదుకు మించి ఉండటమే శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో కిడ్నీ జబ్బులకు ప్రధాన కారణమని నిపుణులు అభిప్రాయపడ్డారు. టెరీ (ద ఎనర్జీ అండ్ రిసోర్స్ ఇన్స్టిట్యూట్), ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. కిడ్నీ సమస్యలు తలెత్తడానికి కారణాలపై సుమారు 40 గ్రామాల్లో నిపుణుల బృందం అధ్యయనం చేసింది. ప్రధానంగా లెడ్, ఐరన్, కాడ్మియం, ఆర్సెనిక్, ఫ్లోరైడ్ సిలికా లాంటి భార లోహాలు తాగునీటిలో మోతాదుకు మించి ఉండటం వల్లే మూత్రపిండాల జబ్బుల బారినపడుతున్నట్లు అధ్యయనంలో ప్రాథమికంగా తేల్చారు. ఉద్దానంతో పాటు కృష్ణా జిల్లా మచిలీపట్నం ప్రాంతంలోనూ నీటిపై అధ్యయనం చేశారు. రెండు చోట్లా భూగర్భ జలాలు, ఆర్వో ప్లాంట్లు, వరిపైరుకు సరఫరా అయ్యే నీరు, రొయ్యల సాగుకు వినియోగించే నీరు ఇలా పలురకాల జలాలపై అధ్యయనం జరిపారు. జీఎఫ్‌ఆర్‌పై తీవ్ర ప్రభావం తాగునీరు, తినే ఆహారంలో భార లోహాలు (హెవీ మెటల్స్) ఉండటం వల్ల కిడ్నీలు నిర్వర్తించే వడపోత (జీఎఫ్ఆర్)పై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుంది. ఇలాంటి ఆహారం, నీరు తరచూ తీసుకోవడం వల్ల కొద్ది సంవత్సరాల్లోనే కిడ్నీలు పాడయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరించారు. ‘ఉద్దానంలో కిడ్నీ జబ్బులకు కొన్ని భార లోహాలు కారణమని పరిశోధనలో తేలింది. ఇది ప్రాథమిక నివేదిక మాత్రమే. నిర్దిష్ట కారణాన్ని కచ్చితంగా కనుగొనే వరకూ అధ్యయనం కొనసాగుతుంది’ –డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి (వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి) మోతాదు దాటిన భార లోహాలు లీటరు నీటికి సిలికా 40 మిల్లీ గ్రాములకు మించి ఉండకూడదు. కానీ ఉద్దానంలో గరిష్టంగా 303 మిల్లీ గ్రాములు ఉంది. సిలికా ప్రభావం వల్ల తీవ్ర సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఐరన్ ధాతువు లీటరు నీటికి 0.3 మిల్లీ గ్రాములకు మించి ఉండకూడదు. కానీ ఉద్దానంలో గరిష్టంగా 4.98 మిల్లీ గ్రాములు ఉంది. టీడీఎస్ (టోటల్ డిసాల్వ్డ్ సాలిడ్స్) పరిమాణం లీటరు నీటికి 500 మిల్లీ గ్రాములకు మించి ఉండకూదు. ఉద్దానంలో ఇది గరిష్టంగా 1,400 మిల్లీ గ్రాములు ఉంది. మచిలీపట్నంతో పోలిస్తే ఫ్లోరైడ్ శాతం ఉద్దానంలో అధికం. అల్యూమినియం మోతాదు మచిలీపట్నంతో పోల్చితే ఉద్దానంలో తక్కువగా ఉంది. రన్, మాంగనీస్ లోహాల మోతాదు మచిలీపట్నంతో పోల్చితే ఉద్దానం గ్రామాల్లో చాలా ఎక్కువగా ఉంది ఉద్దానం భూగర్భ జలాల్లో పాథలేట్స్ (ప్లాస్టిక్ పొల్యూషన్) కాలుష్యం ఎక్కువగా ఉంది. ఉద్దానం ప్రజలు వినియోగించే వరిధాన్యంలో అల్యూమినియం, క్రోమియం, బేరియం, నికెల్, ఆర్సెనిక్ మోతాదు మచిలీపట్నంతో పోలిస్తే ఎక్కువగా ఉంది. -
వెరైటీ వినాయకుడు..
సాక్షి, కవిటి: శ్రీకాకుళం జిల్లా కవిటి మండల కేంద్రంగా బొరివంకలో శ్రీబాలగణపతి ఉద్దానం యూత్ క్లబ్ పర్యావరణ పరిరక్షణలో భాగంగా లేఖినీరూప కాణిపాక గణపతిని రూపొందించారు. గత ఏడేళ్లుగా పర్యావరణానికి హాని చేయని రీతిలో గణనాథుని విగ్రహాల తయారీలో అందివేసిన చెయ్యిగా పేరు తెచ్చుకున్న ఉద్దానం యూత్ క్లబ్ సభ్యుడు, శిల్పి భైరి తిరుపతిరావు ఈ విగ్రహాన్ని రూపొందించారు. 3,500 సుద్దముక్కలను తీసుకుని ప్రతీ సుద్ద ముక్కపై గణనాథుడిని చెక్కాడు. వీటిని మట్టితో చేసిన గణనాథుడి శరీర ఉపరితలంపై అందంగా అలంకరించాడు. వాటికి ప్రకృతి సిద్ధమైన రంగులను అద్ది ఆకర్షణీయంగా సిద్ధం చేశాడు. పర్యావరణ హితాన్ని కాంక్షిస్తూ వరి నారు, నారికేళ, నలుగుపిండి, వనమూలిక, గోధుమ నారు, కొబ్బరిపూలతో వివిధ రూపాల్లో గణేశుని విగ్రహాలను తయారు చేశారు. వీటికి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం దక్కడం విశేషం. ఫోటోలు ‘సాక్షి’కి పంపండి... నవరాత్రుల పాటు ఆ దేవదేవుడిని కొలవడానికి మీరు ఏర్పాటు చేసే అపురూపమైన మట్టి ప్రతిమల ఫోటోలను ‘సాక్షి’ పంపించండి. మీ సామాజిక కర్తవ్యాన్ని నలుగురికి తెలియజేసి అందరికీ స్పూర్తిగా నిలవండి. మీ నగరంలో, మీ ఊరిలో, మీ వీధిలో, మీ గల్లీలో, మీ ఇంట్లో ఎక్కడైనా సరే వినాయకుడి మట్టి ప్రతిమల ఫోటోలను మొబైల్ ద్వారా మాకు పంపించండి. ఫోటోతో పాటు ఎక్కడ నెలకొల్పిందీ, పేరు, ఊరు, వీధి, ఫోన్ నంబర్ వంటి పూర్తి వివరాలతో lordganapati@sakshi.comకు మెయిల్ ద్వారా పంపించండి. వాటిని మేము www.sakshi.com వెబ్ సైట్లో ప్రచురిస్తాం. ఇంకెందుకు ఆలస్యం... ప్రకృతిని కాపాడుకుందాం. నలుగురికి ఆదర్శంగా నిలుద్దాం. -
సాయం.. మాయం!
తిత్లీ ప్రభావిత ఉద్దానం ప్రాంతం నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: తిత్లీ తుపానుతో గుండె చెదిరిన శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతం ప్రజలను ఆదుకుని అండగా నిలవాల్సిన అధికార పార్టీ నేతలు ఈ విపత్తును కూడా సొమ్ము చేసుకొనే దుర్మార్గానికి తెర తీశారు. ప్రకృతి విపత్తుతో సర్వం కోల్పోయి రోడ్డున పడ్డ బాధితులకు దక్కాల్సిన నష్ట పరిహారాన్ని రాబందుల్లా తన్నుకుపోతున్నారు. ఏకంగా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడి బంధువులతోపాటు టీడీపీ నేతలు, వారి బినామీల పేర్లను పరిహారం జాబితాలో పెద్ద ఎత్తున చేర్చారు. అర్హులైన వారికి మాత్రం మొండిచేయి చూపారు. అర్హుల పేర్లు గల్లంతు తిత్లీ తుపాను అక్టోబర్ 10న శ్రీకాకుళం జిల్లాను అతలాకుతలం చేసింది. కోనసీమను తలపించే పచ్చటి ఉద్దానం కకావికలమైంది. పంటలన్నీ నీట మునిగాయి. కొబ్బరి తోటలు నేలకొరిగాయి. చిన్నాచితకా బడ్డీ కొట్ల నుంచి నివాస గృహాల వరకూ అంతా ధ్వంసమయ్యాయి. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా 4.72 లక్షల మంది నష్టపరిహారం కోసం ప్రభుత్వానికి దరఖాస్తులు సమర్పించారు. ఇందులో నకిలీ పేర్లే ఎక్కువగా ఉన్నాయని గుర్తించిన అధికా రులు దాదాపు 81,000 మందిని పరిహారం జాబితా నుంచి తొలగించారు. 3.91 లక్షల మంది మాత్రమే అసలైన బాధితులని తేల్చారు. అయితే అధికార పార్టీ నేతలు, జన్మభూమి కమిటీలు ఒత్తిడితో నిజమైన బాధితులను తొలగించి టీడీపీ సానుభూతిపరులను నష్టపరిహారం జాబితాలో చేర్చారు. లేని తోటలు కూలిపోయాయట! రెంటికోట పీహెచ్సీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు, టీడీపీ మండల అధ్యక్షుడు తమ్మినాన గంగారాం అక్రమంగా నష్టపరిహారం పొందాడు. పలాస మండలం రాజగోపాలపురానికి చెందిన గంగారాం అధికారులకు భయపెట్టి తన ఖాతాలోకి సొమ్ము జమ చేసుకున్నాడు. పల్లపు ప్రాంతంలోని భూముల్లో వరి మాత్రమే పండేచోట తుపాను వల్ల కొబ్బరి, జీడి మామిడి చెట్లను కోల్పోయినట్లు రాయించుకోవడం గమనార్హం. రాజగోపాలపురం పరిసరాల్లో రెవెన్యూ రికార్డుల్లో లేని 68/7, 15/2 సర్వే నంబర్లలో తన తండ్రికి జీడి తోటలు ఉన్నట్లు చూపించి కాశీబుగ్గ విశాఖ గ్రామీణ బ్యాంకులో రూ.15,782 పరిహారం పొందాడు. తమ్మినాన గంగారం పేరుమీద ఎస్బీఐలో రూ.75,000, మరో ఖాతాలో గ్రామీణ బ్యాంకులో రూ.5,585 మేరకు పరిహారం ఇచ్చినట్లు నమోదైంది. ప్రభుత్వ భూమినీ వదల్లేదు... పలాస–మందస మండలాల మధ్య ఉన్న ప్రభుత్వ భూములను కూడా టీడీపీ నేతలు బినామీ పేర్లతో పరిహారం కోసం రాయించుకున్నారు. ఇక్కడ 1,100 ఎకరాల్లో మెండు జీడితోటలున్నాయి. ‘మెండితోట’గా పిలిచే ఈ ప్రాంతంలో బినామీ పేర్లతో టీడీపీ నేతలు సాగు చేస్తున్నారు. జాతీయ రహదారి పక్కనే ఉండటంతో అక్రమంగా క్రయ విక్రయాలు సాగిస్తూ రూ.కోట్లు ఆర్జిస్తున్నారు. తాజాగా ఇందులో 30 ఎకరాలను నష్టపరిహారం జాబితాలో టీడీపీ నేతలు రాయించుకున్నారు. కొబ్బరి చెట్ల లెక్కలు పెరిగాయి... తిత్లీ తుపానుతో శ్రీకాకుళం జిల్లాలో వరి 2.30 లక్షల హెక్టార్లలో దెబ్బ తిన్నట్లు కలెక్టర్ స్వయంగా ప్రకటించారు. అయితే చివరి అంచనాలు పూర్తయ్యేసరికి దీన్ని 1.59 లక్షల హెక్టార్లుగా నమోదు చేశారు. నిజంగానే నష్టపోయినా కావాలనే కొందరి పేర్లు తొలగించడంతో నష్టపోయిన వరి విస్తీర్ణాన్ని తగ్గించినట్లు భావిస్తున్నారు. ఇక అరటి, కొబ్బరి లాంటి ఉద్యాన పంటలు 43 వేల హెక్టార్లలో దెబ్బ తిన్నట్లు తొలుత పేర్కొనగా ఇప్పుడు దీన్ని 28 వేల హెక్టార్లకు కుదించారు. అయితే కొబ్బరి చెట్ల విషయంలో లెక్కలు పెరిగాయి. తొలుత 3.10 లక్షల కొబ్బరి చెట్లే నేల కూలినట్లు పేర్కొనగా ఇప్పుడు దీన్ని 4,54,303కు పెంచారు. చిచ్చు రేపిన స్వార్థం! ప్రకృతి ప్రకోపానికి తల్లడిల్లిన ఉద్దానం ప్రాంతానికి కష్టకాలంలో అండగా నిలవాల్సిన పాలకులు స్వార్థంతో అన్నదమ్ముల్లా జీవించే ప్రజల మధ్య చిచ్చు రగిలిస్తున్నారు. పరిహారం జాబితాలో పేర్లు లేనివారు అధికార పార్టీ కార్యకర్తలకు మాత్రం యథేచ్ఛగా పందేరం చేయడంపై ఆక్రోశిస్తున్నారు. కట్టుబాట్లకు విలువ ఇచ్చే ఉద్దానంలో అంతా ఒకేమాట, ఒకేబాటగా ఉంటారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా ఏకమవుతారు. అలాంటి చోట టీడీపీ నేతల చర్యలతో విబేధాలు తలెత్తుతున్నాయి. పరిహారం విషయంలో తమ పక్కనే ఉన్న పొలం రైతు పట్ల ఒకలా, తమ పట్ల మరోలా వ్యవహరిస్తుంటే తట్టుకోలేక అధికారులను నిలదీస్తున్నారు. కొందరికి అధికంగా పరిహారం ఇస్తున్నారని, మరి కొందరికి అసలు భూమే లేకున్నా జాబితాలో పేర్లు చేర్చడంపై ఘర్షణలకు దిగుతున్నారు. టీడీపీ నేతల బినామీ పేర్లతో పరిహారం పొందిన మెండుతోట ఇదిగో... ఇలా కాజేశారు! - వజ్రపుకొత్తూరులో మాజీ ఎంపీపీ మద్దిల చిన్నయ్యకు ఐదు ఎకరాలుంటే 10 ఎకరాల్లో నష్టం వాటిల్లిందంటూ రికార్డుల్లో రాయించుకున్నారు. - గండుపల్లి పోలయ్య, బోటు లేకున్నా నష్టపోయినట్లు రూ.4 లక్షలు పరిహారం రాయించుకుని ఇప్పటికే రూ.లక్ష కాజేశాడు. - టీడీపీ నాయకులు కాశ మాధవరావు, తమ్మినాన రంగారావు, కంబాల దానేసు, పిరియా శివప్రసాద్, మరడ ధుర్యోధన బినామీ పేర్లతోనూ, బంధువుల పేర్లతోనూ పరిహారం కాజేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. - సంతబొమ్మాళిలో టీడీపీ నేత ఒకరు రొయ్యల చెరువులు లేకున్నా పరిహారం జాబితాలో పేరు నమోదు చేయించుకున్నాడు. - బహాడపల్లిలో సారా దుర్వాసులు, అతడి భార్య లక్ష్మికి అసలు భూమే లేకున్నా వారికి రూ.1.15 లక్షల చొప్పున నష్టపరిహారం దక్కింది. - బహాడపల్లికి చెందిన మట్ట నాగమణికి 75 సెంట్లు, మట్ట తులసీదాసుకు 4.50 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు వారి పేర్లను జాబితాలో చేర్చారు. నిజానికి వీరికి ఎలాంటి భూమి లేదు. ఇదే గ్రామంలో బొడ్డు ఉదయకుమార్, లక్ష్మీనారాయణ, శాంతిప్రియలకు భూములు లేకపోయినా జాబితాలో పేర్లు నమోదు చేశారు. - టెక్కలి మండలం పోలవరం గ్రామానికి సంబంధించి పరిహారం కోసం రూపొందించిన బాధితుల జాబితాలో అన్నెపు పున్నయ్య పేరు ఉంది. వాస్తవానికి అతడి పేరుతో 70 సెంట్ల భూమి మాత్రమే ఉన్నా పరిహారం జాబితాలో మాత్రం 3.04 ఎకరాలలో వరి పంట నష్టం జరిగినట్లు నమోదు చేశారు. - పోలవరం గ్రామంలో బి.జయరామ్‌కు ఎకరం పొలం మాత్రమే ఉంది. కానీ పరిహారం జాబితాలో 3.89 ఎకరాల్లో వరి నష్టపోయినట్లు నమోదు చేశారు. - బి.ఆదినారాయణకు 50 సెంట్ల పొలం ఉంది. కానీ పరిహారం జాబితాలో అది 1.55 ఎకరాలకు పెరిగిపోయింది. - బి.గణపతిరావుకు పొలమే లేకున్నా లేదు. కానీ పరిహారం జాబితాలో అతని పేరుతో 1.09 ఎకరాల్లో వరి పంట నష్టపోయినట్లు నమోదు చేశారు. - బి.నీలకంఠం పేరున 70 సెంట్ల పొలం మాత్రమే ఉన్నా పరిహారం జాబితాలో ఏకంగా 2.35 ఎకరాల్లో వరి పొలం తిత్లీ తుపానుకు దెబ్బ తిన్నట్లు చూపించారు. - డి.హరిప్రసాద్‌కు 70 సెంట్ల భూమి ఉండగా 2.40 ఎకరాల్లో పంట నష్టపోయినట్లు రికార్డుల్లో నమోదైంది. - డి.లక్ష్మీకి అసలు భూమే లేదు. కానీ పరిహారం జాబితాలో ఆమె 3.89 ఎకరాల్లో పంట నష్టపోయినట్లు నమోదు చేశారు. ఆత్మహత్యలే శరణ్యం.... తిత్లీ తుపాన్‌తో ఉద్దానం ప్రాంతం 20 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయింది. ప్రజలు జీవనాధారం కోల్పోయారు. మళ్లీ పంట చేతికి రావాలంటే ఐదు నుంచి పదేళ్లు పడుతుంది. కూలిన చెట్లను తొలగించడానికే వేలాది రూపాయలు ఖర్చవుతుంది. ప్రభుత్వం ఇచ్చే పరిహారం ఏ మూలకూ సరిపోదు. ఒక రైతు ఎన్ని ఎకరాలు నష్టపోయినా పరిహారం మాత్రం 5 ఎకరాలకే ఇస్తామంటున్నారు. ఇక మేం కూడా పత్తిరైతుల్లా ఆత్మహత్యలు చేసుకోవాల్సిందే. –మామిడి మాధవరావు (ఉద్దానం రైతాంగ కమిటీ అధ్యక్షుడు) రెవెన్యూ రికార్డులు చూడరా? మందస గ్రామంలో 18 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు నమోదు చేశారు. నిజానికి అక్కడ ఉన్నవి 14 వేల ఎకరాలే. తర్వాత ఈ విషయాన్ని గుర్తించామంటూ తగ్గిస్తున్నారు. ఇలా పెంచి తగ్గించడం వల్ల రైతుల మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి. ఏ గ్రామంలో ఎవరికి ఎంత భూమి ఉందనేది రెవెన్యూ రికార్డుల్లో ఉంటుంది. వాటిని పరిశీలించి జాబితాలు తయారు చేస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదు. – డొక్కర దానయ్య (బహాడపల్లి) నచ్చినట్లు ఇస్తున్నారు... ఎకరా పంట నష్టం జరిగిన వారికి మూడెకరాలు కోల్పోయినట్లు పరిహారం ఇచ్చారు. మాకు ఎనిమిది ఎకరాలు దెబ్బతింటే ఐదెకరాలకే ఇస్తామంటున్నారు. ఇంతవరకూ అదికూడా ఇవ్వలేదు. ఇల్లు కూలిపోతే పరిహారం ఇవ్వ లేదు. ఇదేం అన్యాయమని అడిగితే మా గ్రామంలో ఉన్న భూమి కంటే జాబితాలో ఎక్కువగా నమోదైందని, అందువల్ల పరిహారాన్ని సర్దుబాటు చేస్తున్నామని చెబుతున్నారు. అన్ని చోట్లా ఇలాగే జరుగుతోంది. గుడ్డిభద్ర రైతులు దీనిపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పాటు కలెక్టర్ దృష్టికి తెచ్చినా ఎలాంటి ప్రయోజనం లేదు. –శేషగిరిరావు (లొహరబంద) ‘కింజరాపు’ అని ఉంటే చాలు..లక్షల్లో లబ్ధి.. తిత్లీ తుపాను బాధితుల జాబితాను ఏకపక్షంగా రూపొందించారు. జన్మభూమి కమిటీలు ఇచ్చిన పేర్లను జాబితాలో చేర్చేశారు. మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఇంటిపేరే ఏకైక అర్హతగా జాబితాలు తయారయ్యాయి. కింజరాపు అని ఉంటే చాలు కళ్లు మూసుకుని వారికసలు భూమి ఉందా? లేదా? అని కూడా చూడకుండా పరిహారానికి అర్హులుగా నిర్ధారిం చేశారు. మంత్రికి స్వయానా వదిన అయిన మహిళ పేరును కూడా రికార్డుల్లో చేర్చారు. ఇలా చిన్నబమ్మిడి, హరిశ్చంద్రపురం, నిమ్మాడ గ్రామాల్లో కింజరాపు అని ఇంటిపేరు ఉన్న దాదాపు 80 మంది రూ.9.72 లక్షల దాకా పరిహారం పొందారు. కుటుంబమంతా రోడ్డున పడ్డాం.. తిత్లీ తుపాను మా ఇళ్లను నేల కూల్చడంతో నలుగురు పిల్లలతో సహా మా కుటుంబం మొత్తం రోడ్డున పడింది. కర్రలకు బరకా కట్టి అందులోనే తలదాచుకుంటున్నాం. ఇంత వరకూ ఒక్కరైనా మా దగ్గరకు వచ్చి ఎలా బతుకుతున్నారని చూడలేదు. ఒక్క పైసా కూడా పరిహారం ఇవ్వలేదు. -
ఛిద్రమైన దశాబ్దాల ఉద్దానం కల
తిత్లీ తుఫాను బీభత్సం ఒకేఒక్క రాత్రిలో ఉద్దానం ప్రజల జీవితాలను చెల్లాచెదురు చేసింది. ఐదారు దశాబ్దాల వారి కలలను ఛిద్రం చేసింది. 1,91,012 ఎకరాల తోటలు ధ్వంసమయ్యాయి. ఇందులో జీడితోటల శాతమే అధికం. రైతులు ధ్వంసమైన పంటల్ని తలచుకొని భవిష్యత్తుని ఊహించుకోవడానికి కూడా భయపడుతున్నారు. మరో పదేళ్ళ పాటు ఏం తిని బతకాలంటూ వారు కన్నీరుమున్నీరవుతున్నారు. ఉద్దానంలో తిత్లీ విధ్వంసం వల్ల జరిగిన నష్టాన్ని పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి. అలా జరగకపోతే శతాబ్దాల చరిత్ర కలిగిన ఉద్దానం రూపు రేఖలే మారిపోయే ప్రమాదం ఉంది. ఉద్దానం...ఇది ఒక ఊరు కాదు. ఉద్యమాల ఊపిరి. భారత చరిత్రనే మలుపుతిప్పిన పేరు ఇది. ఎండిన డొక్కలూ, ఎముకల గూళ్ళ లాంటి దేహాలతో దోపిడీపై తిరగబడ్డ ఉద్దానం ప్రాంత ప్రజల నెత్తుటి త్యాగాలు చరిత్ర మరువజాలనిది. నక్సల్బరీకి సమకాలీనంగానూ, నక్సల్బరీ కొనసాగింపుగానూ దోపిడీపె దండెత్తి నెత్తురు చిందించిన శ్రీకాకుళ రైతాంగ పోరాటాలన్నీ ఉద్దానం పచ్చనాకు సాక్షిగా జరిగినవే. తీరప్రాంతంలోని ప్రతి ఇసుకరేణువూ అవే పోరాట కథలను వినిపి స్తుంది. అదే చైతన్యాన్ని ప్రదర్శిస్తుంది. కానీ మొన్నటి తిత్లీ తుఫాను అక్కడి పేదల మదినిండిన ఉద్దానం జాడలను చెరిపేసింది. కనుచూపు మేరలో పచ్చటి జీడితోటలతో కళకళలాడే ఉద్దానమిప్పుడు ఎండినమో డులతో శ్మశానాన్ని తలపిస్తోంది. అందమైన అక్కుపల్లి, మెట్టూరు, గడూరు మామిడిపల్లి, రాజాం, మర్రిపాడు, బొడ్డపాడు, మాకన్నపల్లి, నీలావతి, రంగోయి, లాంటి ఎన్నో పల్లెలు తిత్లీ తుఫానుతో తీరని శోకాన్ని మూటగట్టుకుని ఊళ్ళకు ఊళ్ళే వల్లకాడుగా మారిపోయాయి. పచ్చని పొదలు పరచుకున్న ఉద్దానం తిత్లీ తుఫానుతో అతలాకు తలమైంది. మొత్తం 38 మండలాల్లో 50 వేల ఇళ్ళు నేలమట్టమ య్యాయి. 38 వేలకు పైగా పశువులు మరణించాయి. 2,500కు పైగా దుకాణాలు ధ్వంసమయ్యాయి. లక్షలాది ఎకరాల పంటలూ, తోటలూ పెనుతుఫాను తాకిడికి తుడిచిపెట్టుకుపోయాయి. ప్రకృతికే పచ్చతో రణం కట్టినట్టుండే ఉద్దానం అదే ప్రకృతి విలయతాండవంతో మరు భూమిగా మారింది. ఇప్పుడక్కడ మిగిలిందంతా çశ్మశాన నిశ్శబ్దమే. ఐదారు దశాబ్దాల పాటు రెక్కలుముక్కలు చేసుకుని పెంచుకున్న జీడి మామిడీ, పనస, మునగ, కొబ్బరి తోటలు పెనుతుఫాను తాకిడికి తుడి చిపెట్టుకుపోయాయి. చుక్కనీరు దొరకని చోట తమ చెమటనే రక్తంగా «ధారబోసి కాపాడుకున్న తోటలు సర్వనాశనం అయ్యాయి. ఒంటినిండా గుడై్డనా కట్టుకోవడం తెలియని అమాయక జన ఉద్దానమిప్పుడు ఆకలి దప్పులతో అల్లాడిపోయే రోజొచ్చింది. ఉద్దానంలో మూడు రకాల పంట భూములుంటాయి. మెట్టభూ ములు, గుడ్డి(ఇసుక నేలలు), పల్లపు భూములు. మెట్ట భూముల్లో పంటలు పూర్తిగా వర్షాధారమైనవే. ఇక్కడన్నీ ఇసుకనేలలే కాబట్టి జీడి తోటల పెంపకం చాలా ఎక్కువ. ఇది అక్కడి ప్రజలకు ప్రధానమైన వ్యాపార పంట. గ్రామంలోనే తోట ఉందా? తోటలోనే గ్రామం ఉందా అన్నది తేల్చుకోలేని విధంగా పల్లెలన్నీ పచ్చనాకు పందిళ్ళలా ఉంటాయి. ఈ తోటలు దట్టమైన అడవిని మరిపిస్తుంటాయి. ఒక చెట్టు మరుగైతే మనిషి అలికిడిని గుర్తించడం మహాకష్టం. అక్కడి నీటి ఎద్దడిని అర్థం చేసుకోవడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. కింద పెద్ద అండా లాంటిది పెట్టి అందులో నించోబెట్టి పిల్లలకు స్నానం చేయించేవారు. స్నానం చేసేటప్పుడు అండాలో పడిన నీటితో గిన్నెలు కడుక్కునేవారు. ఈlకరువు ప్రాంతంలో లక్షలాది ఎకరాల్లో పచ్చదనం నింపేందుకు ఆ ప్రాంత ప్రజలు పడ్డ కష్టం అనన్యసామాన్యమైనది. ఎడారిని తలపించే ఇసుక భూములు, ఉప్పునీటిమయమైన సము ద్రతీర పొలాలు. అక్కడి ఇసుకతిన్నెల్లాంటి భూముల్లో సాధారణ పంటలు పండే అవకాశమే లేదు. అందువల్లే అక్కడ జీడి, కొబ్బరి లాంటివి మాత్రమే సేద్యానుకూలంగా ఉంటాయి. అందులో కీలకం జీడిమామిడే. శ్రీకాకుళం ప్రాంతానికి జీడిపంట తొలిసారిగా 1950లో పరిచయం అయ్యింది. ఆ తరువాత 1970 నుంచి జీడితోటల పెంపకం ఊపందుకుంది. అయితే జీడి తోటల పెంపకం దక్షిణ అమెరికాలో ప్రారంభమైంది. 16వ శతాబ్దంలో పోర్చుగీసు ద్వారా బ్రెజిల్ నుంచి ఈ పంటను భారత దేశానికి తీసుకువచ్చారు. కేరళలోని మలబారు తీర ప్రాంతంలో జీడిమామిడిని తొలిసారిగా సాగుచేశారు. అప్పటి నుంచి ఈ పంట భారతదేశంలోని తీరప్రాంతాలన్నింటికీ విస్తరించింది. 1960– 61లో భారత్‌లో 1,76,000 హెక్టార్లలో పంట సాగుచేయగా, 2006– 07లో 8,54,000 హెక్టార్లలో జీడిమామిడి సాగుచేశారు. కేవలం 40 ఏళ్ళలో సాగులోకి వచ్చిన భూమి 8 రెట్లు పెరిగింది. అదే తరహాలో శ్రీకాకుళం ఉద్దానంలో కూడా జీడిమామిడి సాగు విస్తృతంగా పెరిగింది. 1970 ప్రాంతంలో చాలా తక్కువ మంది రైతులు జీడిమామిడిని సాగుచేసేవారు. అయితే రైతులను దళారీలు, షావుకారులూ, ఊరి పెద్దలు ముప్పేట దోపిడీ చేసేవారు. తిండి దొరకని పరిస్థితుల్లో రైతులు ముందుగా అప్పులు తెచ్చుకునేవారు. ముందుగా అప్పు పేరుతో డబ్బులు ఇచ్చి జీడిపిక్కలను బస్తాల్లో నింపుకుని వెళ్ళేవారు. కొలత ల్లోనూ, తూకాల్లోనూ అంతులేని దోపిడీ ఉండేది. 1960 చివరి దశలో ప్రారంభమైన నక్సలైటు ఉద్యమం షావుకార్ల, మధ్య దళారీల దోపిడీకి అడ్డుకట్ట వేసింది. నక్సలైటు ఉద్యమ చైతన్యంతో దోపిడీదారులను తరిమికొట్టగలిగారు. వారి చైతన్యానికి తగ్గట్టుగా వ్యవసాయపద్ధతు ల్లోనూ నైపుణ్యం పెరిగింది. జీడితోటల పెంపకంలో మెళకువలు నేర్చు కున్నారు. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో 1985 నాటికి 28,000 హెక్టా ర్లలో జీడిమామిడి సాగు అయితే 2001 కల్లా అది 60,000 హెక్టార్లకు పెరిగింది. ఈ రోజు అది లక్షలాది హెక్టార్లకు విస్తరించింది. అయితే తిత్లీ తుఫాను బీభత్సం ఒకేఒక్క రాత్రిలో ఉద్దానం ప్రజల జీవితాలను చెల్లాచెదురు చేసింది. ఐదారు దశాబ్దాల వారి కలలను ఛిద్రం చేసింది. 1,91,012 ఎకరాల తోటలు ధ్వంసమయ్యాయి. ఇందులో జీడితోటల శాతమే అధికం. 1,18,757 మంది రైతుల జీవి తాలు విధ్వంసానికి గురయ్యాయి. అయితే ఏపీ ప్రభుత్వం జీడితోటల నష్టానికి ఇస్తున్న పరిహారం హెక్టారుకు కేవలం 30,000 రూపాయలు. ఎకరాకు 12,000 రూపాయల్ని నష్టపరిహారంగా చంద్రబాబు ప్రభుత్వం దయతల్చి ఇస్తామని ప్రకటించింది. కొబ్బరి తోటలు, అరటి తోటలకు కూడా ఇదేరకమైన భిక్షాప్రాయమైన నష్టపరిహారాన్ని ఖరారు చేశారు. కొబ్బరి చెట్టుకు ఒక్కింటికి 1,500 రూపాయల నష్టపరిహారం ప్రకటిం చారు. ఒకవైపు రైతులకు ప్రకటించిన నష్ట పరిహారం ఏమాత్రం న్యాయ బద్ధంగా లేదు. అంతేకాదు ఏజెన్సీ ప్రాంతంలో పోడు చేసుకుంటున్న ఆదివాసీల దగ్గర భూములకు పట్టాలుండవు. దీన్ని సాకుగా తీసుకుని ప్రభుత్వం వారి నష్టపరిహారానికి ఎగనామం పెట్టింది. ప్రభుత్వం పేద లకు ఇచ్చిన అసైన్డ్ భూములలోని పంటలకు కూడా నష్టపరిహారం ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ప్రభుత్వాలు కేవలం కంటి తుడుపుగానే వ్యవహరిస్తున్నాయనడానికి ఇంతకంటే నిదర్శనం అక్క ర్లేదు. ఇటీవల తిత్లీ ప్రభావిత గ్రామాలను చూసినప్పుడు అక్కడి రైతులు చెప్పిన మాటలు వింటుంటే వాస్తవ అంచనాలకు ప్రభుత్వాల ఆలో చనలు ఎంత దూరంగా ఉన్నాయో అర్థం అవుతుంది. ఒక జీడి తోటలో మొక్కలు నాటిన తరువాత మొదటి ఫలసాయం అందడానికి కనీసం 5 ఏళ్ళు పడుతుంది. ప్రస్తుతం ధ్వంసమైన తోటల స్థాయి చేరడానికి కనీసం 12 సంత్సరాలకు పైగా పడుతుంది. ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం మొక్కలు కొనడానికి కాదుగదా «ధ్వంసమైన చెట్లను తొల గించడానికి కూడా సరిపోదు. మొక్కలు నాటి ఐదేళ్లపాటు ప్రతి మొక్కనీ బతికించుకోవడానికి బొట్టుబొట్టుగా నీటి చుక్కలను పట్టుకొచ్చి ప్రాణప్ర దంగా పెంచడానికి కనీసం ఇద్దరు మనుషులు నిరంతరం కష్టపడాలి. దీనికి ప్రతి కూలీకి ఒక్కొక్కరికి నెలకు పదివేల రూపాయల చొప్పున లెక్కవేస్తే ఏడాదికి 2,40,000 రూపాయలు అవసరమవుతాయి. ఐదేళ్లకు 12 లక్షల రూపాయలు అవుతాయి. ఇంకా ఎరువులు, విత్తనాలు, పురు గుమందుల ఖర్చు అదనం. ఈ లెక్కన కనీసం ఒక ఎకరం జీడితోటలో ఐదేళ్లలో మొదటి ఫలసాయం అందడానికి కనీసం 15 లక్షలు ఖర్చు అవుతుంది. కానీ ఏపీ ప్రభుత్వం కంటి తుడుపు చర్యగా 30 వేల రూపా యలిచ్చి మొసలి కన్నీరు కార్చింది. అయితే ప్రస్తుతం జీడితోటల యజమానులుగా ఉన్న రైతులు ఎవ్వరూ అంతటి ఆర్థిక స్థోమత కలిగిన వారు కాదు. అంతా ఒక ఎకరం నుంచి రెండెకరాల లోపున్న చిన్నసన్నకారు రైతులే. ప్రతి కుటుంబం నుంచి ఎవరో ఒకరు అండమాన్ నికోబార్ దీవులకో, దుబాయ్‌కో, బర్మాకో వలసెళ్ళి రెక్కలు ముక్కలు చేసుకుంటే కానీ ఇక్కడి జీడిపంటకీ, ఆ కుటుంబాలకీ ఆధారం ఉండదు. రైతులు «ధ్వంసమైన పంటల్ని తల చుకుని భవిష్యత్తుని ఊహించుకోవడానికి కూడా భయపడుతున్నారు. మరో పదేళ్ళపాటు ఏం తిని బతకాలంటూ వారు కన్నీరుమున్నీరవుతు న్నారు. తిత్లీ విధ్వంసం వల్ల జరిగిన నష్టాన్ని పూర్తిగా ప్రభుత్వమే భరిం చాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చేసిన డిమాండ్ నూటికి నూరుపాళ్ళూ సరైనది. ప్రభుత్వం గనక ఆ బాధ్యత తీసుకోకపోతే ఉద్దానం రూపు రేఖలే మారిపోయే ప్రమాదం ఉంది. ప్రభుత్వం సాయం చేయకపోతే వాళ్ళు సొంత డబ్బుతో దాన్ని బాగుచేసుకోలేరు. బాగుచేసుకోకపోతే అనివార్యంగా తాము నమ్ము కున్న భూములన్నింటినీ తెగనమ్ముకోక తప్పని దయనీయ స్థితి. చిన్న సన్న కారు రైతుల కష్టంతో తడిసిన ఆ భూములన్నీ బడాభూస్వాముల, పెట్టు బడి దారుల చేతుల్లోకి పోవడానికి ఎంతో కాలం పట్టదు. ఉద్దానం పచ్చటి పంటపొలాలన్నీ రేపు కార్పొరేట్ల చేతుల్లోకి జారిపోయే ప్రమాదం ఉంది. అయితే జీడిపంట నాశనమవడంతో దానిపై ఆధా రపడిన జీడిపిక్కల పరిశ్రమల్లో రోజుకూలీలుగా పనిచేసే పలాసలోని 30,000 మందికి పైగా ప్రజలకు తిండికూడా దొరకని పరిస్థితి దాపురిం చనుంది. వ్యాపారంపై ఆధారపడి జీవిస్తోన్న మరో పాతిక వేల మంది భవిష్యత్తు అంధకారంగా మారింది. నిత్యజనసంచారంతో సజీవంగా కళకళలాడే ఉద్దానం పల్లెజనం వలసబాటపట్టి కాశీబుగ్గ, పలాస లాంటి పట్టణాలు జీవకళను కోల్పోయే ప్రమాదం ఉంది. వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు : మల్లెపల్లి లక్ష్మయ్య lmallepalli@gmail.com -
గుడ్డు రూ.10.. టమాట రూ.50
(ఉద్దానం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి): తిత్లీ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నిత్యావసర వస్తువుల ధరలు మండిపోతున్నాయి. సాధారణంగా రూ.5 ఉన్న కోడిగుడ్డు రూ.10 పలుకుతోంది. 25 లీటర్ల మంచినీరు క్యాన్ రూ.20 నుంచి రూ.50కి పెరిగింది. కిలో టమాటాలను రూ.40 నుంచి 50 వరకూ అమ్ముతున్నారు. కూరగాయల ధరలూ ఆకాశాన్ని అంటుతున్నాయని.. దీంతో పచ్చడితో సరిపెట్టుకుంటున్నామని బాధితులు చెబుతున్నారు. (పచ్చటి బతుకుల్లో తిత్లీ చిచ్చు) లూజులో పెట్రోలును లీటర్ రూ.150కి అమ్ముతున్నారని.. వంటగ్యాస్‌ను రెట్టింపు ధరకు విక్రయిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ‘ధరలు చూస్తే.. కొట్టోడు బతకాలి.. కొనేవాడు చావాలి’ అనే చందంగా ఉంది’ అని వజ్రపుకొత్తూరు మండలానికి చెందిన బైపల్లి గోపాలరావు, కామమ్మ దంపతులు చెప్పారు. కాగా.. నాలుగో రోజు ఆదివారం కూడా 1300 పైగా గ్రామాలకు విద్యుత్ సరఫరా కాలేదు. దీంతో వేలాడుతున్న కరెంటు తీగలపై గ్రామస్తులు దుస్తులు ఆరేశారు. పచ్చిబొప్పాయి కూర చేసుకుంటున్నాం కూరగాయల ధరలు మండిపోతుండడంతో తోటలో పడిపోయిన చెట్టు నుంచి పచ్చి బొప్పాయి కాయలు తెచ్చి కూర చేసుకుంటున్నాం. అసలే తుపానువల్ల తోటలు పోగొట్టుకుని కష్టాల్లో ఉన్న తాము ఎక్కువ ధర పెట్టి ఎక్కడ కొనగలం? వంట గ్యాస్ అయిపోవడంతో బయటే పొయ్యి మీద చేస్తున్నాం. – బైపల్లి గోపాలరావు, కామమ్మ దంపతులు -
వణుకుతున్న ఉద్దానం
సాక్షి, అమరావతి: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనాలు ఏర్పడటంవల్ల మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఆదివారం జారీ చేసిన హెచ్చరికలు శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం వాసులను వణికిస్తున్నాయి. ఇప్పటికే తిత్లీ తుపాను ధాటికి తోటలు, ఇళ్లు కూలిపోయి నిరాశ్రయులైన తాము వర్షం వస్తే ఎక్కడ తలదాచుకోవాలంటూ ఆందోళన చెందుతున్నారు. ‘వేలాది ఇళ్లు కూలిపోయి కుటుంబాలకు కుటుంబాలే కట్టుదుస్తులతో చెట్ల కింద పరాయి పంచన ఉంటున్నారు. ఇంకా వర్షం కురిస్తే మా పరిస్థితి ఏమిటి’ అని వారు బెంబేలెత్తిపోతున్నారు. ‘బంగాళాఖాతంలో ఒడిశా తీరంలోనూ, కర్ణాటక ప్రాంతంలోనూ ఉపరితల ఆవర్తనాలు ఏర్పడటంవల్ల రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయి. కోస్తా జిల్లాలో కొన్ని చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉంది’ అని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు ఆదివారం రాత్రి తెలిపారు. కాగా, తిత్లీ తుపాను దెబ్బకు ఉద్దానం కకావికలైంది. జీడి, కొబ్బరి చెట్లు నేలమట్టయ్యాయి. తుపాను ధాటికి ఊళ్లన్నీ శ్మశానాన్ని తలపిస్తున్నాయి. తిత్లీ విధ్వంసం నుంచి ఇంకా కోలుకోకముందే మరోసారి వర్షాలు ఉద్దానం వాసులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. -
ఊపిరాగిన ఉద్దానం!
ఉద్దానం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: తిత్లీ తుపాను దెబ్బకు ఉద్దానం ఊపిరాగింది. 30 ఏళ్లుగా చెట్టుతో పెనవేసుకున్న బంధం ఒక్కసారిగా నేలమట్టమైంది. కూకటివేళ్లతో కూలిపోయిన జీడి, కొబ్బరి చెట్ల వద్దే రైతన్న గుండె పగిలేలా రోదిస్తున్నాడు. బిక్కచచ్చి బావురుమంటున్నాడు. ఊళ్లన్నీ శ్మశానాన్ని తలపిస్తున్నాయి. ‘చెట్లు కాదు.. మా ప్రాణాలే పోయాయి’ అంటూ పల్లె జనం ఘొల్లుమంటున్నారు. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు, పలాస, టెక్కలి మండలాల్లో ఏ ఊరుకెళ్ళినా ఇదే పరిస్థితి. మచ్చుకు ఒక్క చెట్టయినా కన్పించని దారుణమైన విషాదం నుంచి రైతన్న కోలుకోవడం లేదు. తాతలనాడు వేసుకున్న చెట్లు.. పసిపిల్లల్లా పెంచుకున్న వనాలను గుండె చెదిరిన రైతన్న గుర్తుచేసుకుంటూ గగ్గోలు పెడుతున్నాడు. ఉపాధి పోయి ఊళ్లొదిలే పరిస్థితిని చూస్తూ కుమిలిపోతున్నాడు. (అన్నమోరామ‘చంద్రా’!) గుండె పగిలే దుఃఖం వజ్రపుకొత్తూరు మండల పరిధిలోని పూడి, రెయ్యిపాడు, ఆర్ఎం పురంతో పాటు అన్ని గ్రామాల్లోనూ 90 శాతానికిపైగా జీడి, కొబ్బరి తోటలే ఉన్నాయి. రైతులు, రైతు కూలీలకు ఇవే జీవనాధారం. ఎన్నో ఏళ్లుగా వాళ్లకు వలసలు అంటే ఏంటో తెలీదు. తిత్లీ తుపాను దెబ్బకు ఒక్క చెట్టూ మిగల్లేదు. రెయ్యిపాడుకు చెందిన ఎం. తిరుపతిరావు ఐదెకరాల్లో జీడి, కొబ్బరి సాగుచేస్తున్నాడు. తండ్రి కాలంలో వేసిన చెట్లు నెలకు రూ.30వేల ఆదాయమిస్తున్నాయని చెప్పాడు. ‘ఐదెకరాలూ కొట్టుకుపోయిందయ్యా.. ఏం చెయ్యాలి’.. అంటూ గుండెలవిసేలా రోదిస్తున్నాడు. తిరుపతిరావును ఓదార్చడం ఎవరివల్లా కావడంలేదని ఆయన బంధువు వెంకటరమణ తెలిపాడు. ‘ఆయనేం చేసుకుంటాడో? ఏమవుతాడో?’ అని ఇంటిల్లిపాదీ కుమిలిపోతున్నారని చెప్పాడు. మద్దెల హరినారాయణ అక్కడ జీడి పరిశ్రమ నడుపుతున్నాడు. అతనూ ఓ రైతే. అతన్ని కదిలించినా ఆవేదన తన్నుకొచ్చింది. ‘ఒక్కో చెట్టూ లక్షలు చేస్తుంది. మళ్లీ అంత చెట్టు కావాలంటే ఏళ్లు పడుతుంది. మాకా ఓపిక లేదు.. అంత శక్తీ లేదు. మా నష్టాన్ని ఎవరు పూడుస్తారు? ఒక్కో వ్యక్తికీ రూ.20 లక్షలిచ్చినా కోలుకోలేం’ అని బావురుమన్నాడు. ప్రతీ రైతన్నదీ ఇదే ఆవేదన. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ఆదుకోకపోతే ఆత్మహత్యలే.. నిన్నటిదాకా ఈ ప్రాంతంలో ఆకాశాన్ని తాకి, పచ్చగా రెపరెపలాడిన కొబ్బరి చెట్లు.. ఏపుగా ఎదిగిన జీడి చెట్లు తిత్లీ దెబ్బకు పూర్తిగా నేల కొరిగాయి. కూలిన చెట్లను రంపంతో ముక్కలుగా కోస్తుంటే అక్కడ రైతన్న వేదన హృదయ విదారకంగా ఉంది. ఊళ్లకు ఊళ్లే ఎడారిగా మారిన పరిస్థితి నెలకొంది. ఇప్పుడు వాళ్లు సాయం కోసం ఎదురుచూస్తున్నారు. మళ్లీ మొక్కనాటి, పెంచి పెద్దచెయ్యాలనుకుంటున్నారు. కానీ, వారికి సాయం కావాలి. మళ్లీ ఉద్యానవనం పెంచడానికి ప్రభుత్వం కనీసం ఆరేళ్ల పాటు సాయం చేస్తే తప్ప కోలుకోలేమని ఇక్కడి రైతులు చెబుతున్నారు. రైతును ఆదుకోకపోతే ఆత్మహత్యలే శరణ్యమయ్యే దుస్థితి రావచ్చని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఒక్కరూ పలకరించలేదు మా గుండెలు మండిపోతున్నాయి. హుద్‌హుద్ తుపాను వస్తే విశాఖను ఆదుకున్నారట. ఎక్కడో కూర్చుని చెప్పడం కాదు. ఇక్కడికి రావాలి. రైతు కష్టాన్ని చూడాలి. నిజాయితీగా ఆదుకునే ఆలోచన చేయాలి. మేం సర్వనాశనమయ్యాం. ఒక్కరూ రాలేదు. పిల్లల్లా పెంచుకున్న చెట్లు కూలిపోయాయి. రోడ్డున పడ్డాం. ఓదార్చే దిక్కేలేదు. – మద్దెల పాపయ్య, రెయ్యిపాడు, జీడి, కొబ్బరి రైతు అధికారులు ఎవరూ రావడంలేదు రైతుకు ప్రభుత్వం భరోసా ఇవ్వాలి. రెండు రోజులుగా అదేదీ కన్పించడం లేదు. అధికారులు అస్సలు రావడంలేదు. కూలిన చెట్లను రైతులే తొలగించుకుంటున్నారు. కానీ, అన్ని సహాయ చర్యలు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. క్షేత్రస్థాయి పరిశీలనకు అధికారులను పంపితే వాస్తవ పరిస్థితి తెలుస్తుంది. లేకపోతే ఉద్దానం ఆవేశం ఏంటో ప్రభుత్వం చూస్తుంది. – సాంబమూర్తి, సీపీఎం మండల నాయకుడు, వజ్రపుకొత్తూరు -
మళ్లీ భల్లూకాల అలజడి
మందస : ఉద్దానం ప్రజలను ఎలుగుబంట్లు భయభ్రాంతులకు గురిచేస్తూనే ఉన్నాయి. మండలంలోని ఎర్రముక్కాం, పాతపితాళిలలో భల్లూకం చేసిన బీభత్సం ఇంకా ప్రజల కళ్ల ముందు కదులుతూనే ఉంది. ఎర్రముక్కానికి చెందిన దంపతులు ఎలుగు దాడిలో దుర్మరణం చెందారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి నేటికీ ఆందోళనకరంగానే ఉంది. దీని నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటుండగానే గురువారం ఎలుగుబంట్లు బీభత్సం సృష్టించాయి. అరగంట వ్యవధిలోనే.. మందస మండలంలోని నల్లబొడ్లూరు గ్రామానికి చెందిన బొడ్డు గంగమ్మ ఉదయం 5.30 గంటలకు తోటల్లోకి వెళ్తుంగా ఒక్కసారిగా భల్లూకం దాడి చేసింది. కుడిచేయిపై కొంత భాగాన్ని కొరికేసింది. గ్రామస్తులు గమనించి, కేకలు వేసి తరమడంతో ఎలుగు పారిపోయింది. వీరు వెంటనే 108కు సమాచారం ఇవ్వడంతో ఈఎంటీ తారకేశ్వరరావు, పైలట్ వెంకటరావు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని చికిత్స చేశారు. అనంతరం గంగమ్మను పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఉదయం 6 గంటల సమయంలో సువర్ణాపురం గ్రామానికి చెందిన సాలీన భీమారావు తోటకు వెళ్తుండగా దారిలో ఎలుగుబంటి దాడి చేయడానికి ప్రయత్నించింది. సమయస్ఫూర్తితో వ్యవహరించి సమీపంలోని చెట్టు ఎక్కారు. ఆ ప్రాంతంలో కొంతసేపు తిరిగిన ఎలుగుబంటి వెళ్లిపోవడంతో ఆయన బతుకు జీవుడా అనుకుంటూ ఇంటికి చేరుకున్నారు. కేసుపురం సమీపంలోని జీడి, మామిడి తోటల్లో ఎలుగులు కనిపించడంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. తోటల్లోకి వెళ్లడానికి సాహసించలేకపోయారు. వరుస ఎలుగుబంట్లు దాడులతో ఉద్దాన ప్రాంత వాసులు హడలెత్తిపోతున్నారు. ప్రాణభయంతో రాత్రి వేళల్లో ఇంటి నుంచి రావడానికి భయపడుతున్నారు. ప్రాణనష్టంతో పాటు పెంచుకుంటున్న పశువులు, జంతువులను కూడా చంపివేస్తుండడంతో ఉద్దానవాసులు ఉలిక్కి పడుతున్నారు. దేవుడే రక్షించాడు: సాలీన భీమారావు ఎప్పుడూ లేనిది ఉదయాన్నే తోటకు వెళ్లాను. దారిలో ఓ ఎలుగుబంటి కనిపించింది. దాడి చేయడానికి ప్రయత్నించగా, దగ్గర్లో ఉన్న చెట్టు అప్రయత్నంగా ఎక్కేశాను. ఈ సమయంలోనే మరో ఎలుగుబంటి కూడా వచ్చింది. ప్రాణాలు అరచేత పట్టుకుని బిక్కుబిక్కుమంటూ చెట్టుపైనే ఉన్నాను. కొద్దిసేపు ఎలుగులు కదల్లేదు. ఈలోగా గ్రామస్తులు వచ్చి తరమడంతో వెళ్లిపోయాయి. ఎలుగుల నుంచి దేవుడే కాపాడాడు. -
మసకబారిన బతుకులు
సోంపేట: మండలంలోని ఎర్రముక్కాం గ్రామంలో ఆదివారం ఎలుగుబంటి సృష్టించిన బీభత్సంతో గ్రామానికి చెందిన బైపల్లి శ్యాం జీవితం చీకట్లోకి వెళ్లిపోగా, మరో రెండు కుటుంబాలు ఇళ్లకు తాళాలు వేసి విశాఖపట్టణంలోని ఓ ఆస్పత్రి వద్ద, ఒక కుటుంబం శ్రీకాకుళంలో రిమ్స్ ఆస్పత్రి వద్ద కాపలా కాయవలసిన పరిస్థితి ఏర్పడింది. మరో ఇద్దరు తమ ఇళ్ల వద్ద కదలలేని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. మొత్తం ఆరు కుటుంబాలకు ఎలుగు రూపంలో తీరని కష్టం మిగిల్చింది. జీడితోటలు, సముద్ర తీరంతో ఆనందంగా గడిపే ఎర్రముక్కాం గ్రామంలో ఆదివారం నుంచి విషాదఛాయలు అలుముకున్నాయి. ఎవరి నోట విన్నా అదే కథ. నలుగురు ఒకచోటకు చేరితే ఈ విషాద ఘటనను తలచుకుని బాధ పడుతున్నారు. గత ఏడు, ఎనిమిది సంవత్సరాలుగా గ్రామ పరిధిలో ఒక ఎలుగు సంచరించడం, మనుషులు మాటలు విని వెళ్లిపోతుండంతో, సహజంగా గ్రామస్తులు ఎలుగు అంటే అంత భయపడే వారు కాదు. కాని ఆదివారం నాడు ఎలుగు సృష్టించిన విధ్వంసంతో గ్రామంలో ఎలుగు పేరు చెపితే బయపడే పరిస్థితి వచ్చింది. మందస మండల పరిధిలో రెండు ఎలుగులు సంచరిస్తున్నాయని మంగళవారం వార్త వ్యాపించడంతో ఈ గ్రామంలోని యువత గ్రామం చుట్టూ కర్రలు పట్టుకుని కాపలా కాయవలసిన పరిస్థితి ఏర్పడింది. శ్యాం జీవితం అంధకారం బైపల్లి శ్యాంది ఆదివారం ఉదయం వరకు అమ్మ, నాన్నలతో కలిసి ఆనందమయం జీవితం. ఆదివారం ఉదయం ఎలుగు దాడిలో శ్యాం అమ్మ, నాన్న ఊర్మిళ, తిరుపతి మృతి చెందడంతో ఇతడి జీవితం అగమ్యగోచరానికి చేరుకుంది. శ్యాం అమ్మమ్మ, తాతయ్య, నాన్నమ్మ, తాతయ్య ఇదివరలో మృతి చెందడంతో శ్యాం ఒంటరి వాడయ్యాడు. ఇంట్లో కూర్చుని అమ్మ, నాన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుని రోదిస్తున్నాడు. ఆయన రోదనను ఆపేవారు కూడా లేని పరిస్థితి. ఆయన జీవితానికి దేవుడే దారి చూపాలని గ్రామస్తులు తెలుపుతున్నారు. ఇలాంటి విషాదం ఏ కుటుంబంలోను చోటు చేసుకోకూడదని గ్రామస్తులు కోరుకుంటున్నారు. విశాఖలో కాపలా అలాగే బైపల్లి అప్పలస్వామి, దుర్యోధన ఎలుగు దాడిలో తీవ్ర గాయాలపాలవ్వడంతో విశాఖపట్నం తరలించారు. బైపల్లి అప్పలస్వామి తలకు, చేతులకు తీవ్రగాయాలు కావడంతో సెవెన్ హిల్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దుర్యోధనకు కాలికి తీవ్ర గాయం కావడంతో, కాలు తీయక తప్పలేదని వైద్యాధికారులు తెలిపారు. దుర్యోధన ప్రస్తుతం కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు. దుర్యోధన, అప్పలస్వామి తీవ్రగాయాలతో ఇబ్బందులు పడుతుండడంతో, వారి కుటుంబ సభ్యులు ఇళ్లకు తాళాలు వేసి విశాఖపట్నంలో బాధితులు వద్ద ఉంటున్నారు. అలాగే గ్రామానికి చెందిన యువకుడు బైపల్లి రాజేష్ తీవ్రగాయాలతో శ్రీకాకుళం రిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడు. మరో ఇద్దరు రట్టి అప్పన్న, బైపల్లి పాపారావు ప్రస్తుతం గాయాలతో ఇంటి వద్ద కదలలేని పరిస్థితిలో ఉన్నారు. వారి నిత్యవసరాలకు కూడా వేరేవారి సహాయం కోరవలసిన పరిస్థితి. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని, వైద్యం ఖర్చులు పూర్తిగా పెట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఉద్దానాన్ని వీడని ఎలుగుల భయం, తీర ప్రాంతంలో హల్చల్ చేసిన రెండు ఎలుగులు మందస: మందస, సోంపేట మండలాలకు ఎలుగుబంట్ల భయం వీడడంలేదు. మూడు రోజుల కిందట సోంపేట, మందస మండలాల్లో బీభత్సం సృష్టించిన ఎలుగుబంటి హతమైనప్పటికీ పదుల సంఖ్యలో ఉన్న ఎలుగుబంట్లు ఉద్దానం వాసులను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. మంగళవారం రెండు ఎలుగుబంట్లు సముద్ర తీర ప్రాంతాల్లో హల్చల్ చేశాయి. దీంతో తీర ప్రాంతానికి చెందిన ఉద్దానం వాసులు ఏ క్షణాన ఏం జరుగుతుందోనని భయపడ్డారు. ఉద్దానం కొండలు, జీడితోటల్లో సంచరిస్తున్న రెండు ఎలుగులు దారి తప్పి భేతాళపురం, దున్నవూరు, రట్టి, గంగువాడ తదితర గ్రామాల పరిసరాల్లో తిరిగాయి. సముద్ర తీరం నుంచి వెళ్తూ, కనిపించిన మత్స్యకారులను భయపెట్టాయి. దీంతో వారు అమ్మో.. ఎలుగులు అంటూ పరుగులు తీశారు. కాగా, ఉద్దానంలో ఎలుగులు మనుషులు హటాత్తుగా కనిపిస్తే తప్ప కావాలని వచ్చి మీద పడి దాడి చేయవు. అయితే ఎన్నడూలేని విధంగా మూడు రోజుల కిందట కనిపించిన మనుషులు, పశువులు, పెంపుడు జంతువులపై దాడి చేసి మరీ చంపేయ్యడంతో స్థానికులు హతాశులవుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఉద్దానంలో జీవించడం కూడా కష్టమేనని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎర్రముక్కాం, పాతపితాళి, దున్నవూరు సంఘటన మరువక ముందే మరో రెంటు ఎలుగుబంట్లు కలకలం సృష్టించడంతో తీరప్రాంతవాసులు, ఉద్దానం ప్రజలకు కంటిమీద కునుకు కరవవుతుందన్నారు. -
కిడ్నీ బాధితుల సమస్యపై పవన్ ఒకరోజు దీక్ష
-
రిసార్ట్స్‌లో పవన్ కల్యాణ్ దీక్ష
సాక్షి, హైదరాబాద్: ఉద్దానం కిడ్నీ బాధితుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఒకరోజు దీక్ష చేపట్టారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ప్రస్తుతం తాను బసచేసిన ఎచ్చెర్ల డాట్లా రిసార్ట్స్‌లోనే శుక్రవారం సాయంత్రం నుంచి ఆయన దీక్షలో కూర్చున్నారు. 24 గంటలపాటు ఈ దీక్ష కొనసాగనుంది. శనివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పవన్ ప్రజల మధ్యే దీక్ష చేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. పవన్ దీక్షకు సంఘీభావంగా అన్ని జిల్లా కేంద్రాల్లో సంఘీభావ దీక్షలు జరుగుతాయని జనసేన పార్టీ నాయకులు మాదాసు గంగాధర్, అద్దేపల్లి శ్రీధర్‌లు తెలిపారు. ఉద్దానం బాధితులకు ప్రభుత్వం మెరుగైన వైద్యసేవలు అందించేదాకా జనసేన పోరాడుతూనేఉంటుందని వారు చెప్పారు. బౌన్సర్లు లేక ఆగిన యాత్ర: జన పోరాట యాత్ర పేరులో మే 20 నుంచి పవన్ యాత్రను ప్రారంభించిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 45 రోజుల పాటు కొనసాగనున్న ఈ యాత్ర అనూహ్య కారణాల వల్ల అర్ధాంతరంగా నిలిచిపోయింది. ప్రభుత్వం భద్రత కల్పించడంలేదని ఆరోపిస్తోన్న పవన్.. ప్రైవేటు సెక్యూరిటీ(బౌన్సర్ల) సాయంతో యాత్రను కొనసాగిస్తున్నారు. పలు చోట్ల స్థానికులు, అభిమానులతో బౌన్సర్లు దురుసుగా ప్రవర్తించడం, ఒక దశలో దెబ్బలాటకు దిగడం, ఈ క్రమంలో బౌన్లర్లూ గాయపడటం, ఆస్పత్రిపాలుకావడం తెలిసిందే. ప్రైవేటు సెక్యూరిటీ లేని కారణంగా పవన్ యాత్ర గురు, శుక్రవారాల్లో వాయిదాపడింది. ఇక ఒక్క రోజు దీక్ష చేస్తుండటంతో శనివారం కూడా యాత్ర లేనట్లే. -
ఉద్దానం నీటిలో ప్రమాదకర మూలకాల్లేవు
జీఎస్ఐ అదనపు డైరెక్టర్ జనరల్ శ్రీధర్ హైదరాబాద్: ఉద్దానం నీటిలో ఎలాంటి ప్రమాదకర మూలకాల్లేవని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అదనపు డైరెక్టర్ జనరల్ శ్రీధర్ తెలిపారు. ఇటీవల తాము జరిపిన పరిశోధనల్లో ఈ అంశం స్పష్టమైనట్లు పేర్కొన్నారు. ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధుల బారిన పడి వేలాది మంది మృతి చెందడానికి కారణం అక్కడి తాగునీరే కారణమని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) పరీక్షల్లో తేలిందనడం అవాస్తవమని చెప్పారు. సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి, సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ చైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య ఆగస్టులో ఉద్దానం నుంచి సేకరించిన 12 నీటి నమూనాలను పరీక్ష కోసం అందజేసినట్లు తెలిపారు. వాటితో పాటు మరో 8 నమూనాలను తమ సిబ్బంది సేకరించారని, వాటితో కలిపి మొత్తం 20 నమూనాలను పరీక్షించగా ఎలాంటి హానికరమైన మూలకాలు అందులో లేవని తేలిందని వివరించారు. ఉద్దానం నీటిలో ప్రమాదకర మూలకాలు ఉన్నాయని జీఎస్ఐ నిర్ధారించినట్లు నిమ్స్ మాజీ డైరెక్టర్ డా.రాజారెడ్డి చెప్పారని పేర్కొనడం సరైంది కాదన్నారు. ఆయనను ఫోన్లో సంప్రదించగా ఉద్దానం నీటిలో ప్రమాదకరమైన మూలకాలు ఉన్నట్లు ఎక్కడా ప్రకటించలేదని చెప్పినట్లు వివరించారు. కాడ్మియం, క్రోమియం, సిలికా, లెడ్ మూలకాలు అధికంగా ఉంటే కిడ్నీ సమస్యలు తలెత్తుతాయని మాత్రమే రాజారెడ్డి చెప్పినట్లు పేర్కొన్నారు. ఉద్దానం పరిసర ప్రాంతాలపై అధ్యయనానికి జీఎస్ఐ 2018–19 సంవత్సరంలో ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. సమావేశంలో ఆర్‌ఎంహెచ్–3 డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ప్రేమ్‌చంద్, డైరెక్టర్ కె.రవి, కెమికల్ ల్యాబ్ డైరెక్టర్ శోభారాణి, అజయ్‌కుమార్, కామేశ్వర్ పాల్గొన్నారు. ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాల్లో విశేషంగా కృషి చేసిన డాక్టర్ రాజారెడ్డి చెప్పిన అంశాల మేరకే సమావేశంలో చెప్పామని, జీఎస్ఐ అధికారుల ప్రకటనపై ఆయనే స్పందించాల్సి ఉందని, శాస్త్రీయ అంశాల్లో తమకు ప్రవేశం లేదని కె.రామచంద్రమూర్తి తెలిపారు. -
‘ఉద్దానం’ నీటిలో ప్రమాదకర మూలకాలు
జీఎస్ఐ పరీక్షలో నిర్ధారణ: నిమ్స్ మాజీ డైరెక్టర్ రాజారెడ్డి - కిడ్నీ వ్యాధులతో వేల సంఖ్యలో మరణాలకు ఇదే కారణం - భూ ఉపరితల జలాల వినియోగమే దీనికి పరిష్కారమని వెల్లడి - 26న ఉద్దానంలో బహిరంగసభ: సాక్షి ఈడీ రామచంద్రమూర్తి సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో వేల మంది మరణాలకు అక్కడి తాగునీరే కారణమని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) పరీక్షలో తేలింది. ఉద్దానం ప్రాంతంలోని నీటిలో కిడ్నీవ్యాధులకు కారణ మయ్యే మూలకాలు అధిక స్థాయిలో ఉన్నట్లు నిర్ధారణ అయింది. శుక్రవారం నిమ్స్ మాజీ డైరెక్టర్ రాజారెడ్డి, సాక్షి మీడియా గ్రూప్ ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి, సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ చైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్యలతో కలసి ఉద్దానం కిడ్నీ బాధితుల సంఘీభావ కమిటీ ప్రతినిధులు హైదరాబాద్‌లోని ప్రెస్‌క్లబ్‌లో ఈ వివరాలను వెల్లడించారు. కిడ్నీ వ్యాధుల బారినపడి వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్న ఉద్దానం ప్రాంతంలోని తాగునీటి నమూనాలను ఇటీవ ల సేకరించి జీఎస్ఐలో పరీక్షించినట్లు నిమ్స్ మాజీ డైరెక్టర్ రాజారెడ్డి తెలిపారు. ‘‘తాగే నీటిలో ఏ మూలకం కూడా పరిమితికి మించి ఉంటే ఆరోగ్య సమస్యలు వస్తాయి. భూగర్భం లో 118 రకాల మూలకాలు ఉంటాయి. వాటిలో 14 రకాలు సాధారణం కంటే ఎక్కువ మోతాదులో ఉంటే కిడ్నీ వ్యాధులు తలెత్తుతా యి. ఉద్దానం ప్రాంతం నుంచి సేకరించిన 12 తాగునీటి నమూనాలను జీఎస్ఐ పరీక్షించింది. ఆ ప్రాంతంలోని ఒక గ్రామంలో 23 మంది కిడ్నీ వ్యాధులతో చనిపోయారు. ఆ గ్రామం లోని తాగునీటిలో కాడ్మియం, యురేనియం, క్రోమియం, లెడ్ మూలకాలు అధిక స్థాయిలో ఉన్నాయి. అవి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నిర్దేశించిన పరిమితి కంటే చాలా ఎక్కువగా ఉన్నట్లు నిర్ధారించారు. సిలికా స్థాయి కూడా ఎక్కువే ఉంది. కానీ సిలికా ఏ స్థాయిలో ఉంటే ప్రమాదకరమనే అంశాన్ని డబ్ల్యూహెచ్‌వో ఇంకా నిర్ధారించలేదు..’’ అని ఆయన చెప్పారు. ఉపరితల జలాల వినియోగమే శ్రేయస్కరం తాగునీరు డబ్ల్యూహెచ్‌వో నిర్ధారించిన ప్రమాణాల ప్రకారం ఉంటే వ్యాధులు రావనేది కూడా అన్ని సందర్భాల్లో జరగదని రాజారెడ్డి చెప్పారు. ఆయా ప్రాంతాల్లోని వాతావరణ పరిస్థితులు, వ్యక్తుల ఆరోగ్యస్థాయిని బట్టి ఉంటుందన్నారు. నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ అధికంగా ఉందని పరిశోధనలలో తేలిందని, దాంతో కోట్ల రూపాయలతో డీఫ్లోరైడ్ వ్యవస్థను ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. కానీ తర్వాత పరిస్థితి ఇంకో రకంగా మారిందని, బోర్ల నుంచి వచ్చే నీటిని సరఫరా చేసే పరిస్థితి వచ్చిందని చెప్పారు. భూగర్భ జలంలో ఎన్నో రకాల మూలకాలు మోతాదుకు మించి ఉంటాయని, వాటన్నింటినీ సరిపోయే స్థాయిలోకి తీసుకురావడం కష్టమని వివరించారు. తాగేందుకు, వంట కోసం భూ ఉపరితలంలోని నీటినే వినియోగించాలని, కిడ్నీల వ్యాధుల నియంత్రణకు అదే శాశ్వతమైన పరిష్కారమని స్పష్టం చేశారు. ఇక ఈ నెల 26న ఉద్దానంలో కిడ్నీ బాధితులతో బహిరంగ సభ నిర్వహిస్తున్నా మని సాక్షి ఈడీ రామచంద్రమూర్తి చెప్పారు. ఆ సభ ఏర్పాట్లను జర్నలిస్టు రమణమూర్తితో పాటు స్థానికులు కృష్ణమూర్తి, శ్రీనివాస్‌లు పర్యవేక్షిస్తారని వెల్లడించారు. ఉద్దానం ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నట్లుగా వంశధార నది నీటిని తాగునీటి కోసం సరఫరా చేయాలని మల్లేపల్లి లక్ష్మయ్య డిమాండ్ చేశారు. ఆ ప్రాంతంలోని ప్రజల సమస్యపై ప్రభుత్వం, రాజకీయ పార్టీలే కాదు అందరూ ఆలోచించాలన్నారు. ఇక తమకు అందరూ మద్దతుగా నిలవాలని ఉద్దానం కిడ్నీ బాధితుల సంఘీభావ కమిటీ ప్రధాన కార్యదర్శి వంకల మాధవరావు కోరారు. కిడ్నీ వ్యాధులతో చనిపోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, ఉద్దానంలో ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించాలని డిమాండ్ చేశారు. -
‘ఉద్దానం’పై నేడు సీఎంకు నివేదిక
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెల్లడి విశాఖ సిటీ: శ్రీకాకుళం జిల్లా ఉద్దానాన్ని పట్టిపీడిస్తున్న కిడ్నీ వ్యాధులపై హార్వర్డ్ వైద్య బృందం రూపొందించిన నివేదికను సోమవారం సీఎం చంద్రబాబుకు అందజేయనున్నట్లు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తెలిపారు. ఆదివారం విశాఖలోని వి–కన్వెన్షన్ సెంటర్లో ఉద్దానం కిడ్నీ వ్యాధులపై జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరికే వరకు తమ పోరాటం సాగుతుందన్నారు. అవసరమైతే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మద్దతు కూడా కోరతానని చెప్పారు. -
చల్లపేటలో చావుడప్పు
కిడ్నీ వ్యాధి... ఈ పేరు చెప్పగానే టక్కున గుర్తుకు వచ్చేది జిల్లాలో ఉద్దాన ప్రాంతం. అటువంటి ఈ మాయదారి రోగం మైదాన ప్రాంతాల్లో కూడా విజృంభిస్తుంది. గార మండలంలోని అంపోలు పంచాయతీ చల్లపేట గ్రామంలో ఈ మహమ్మారి జడలు విప్పింది. గత కొద్ది రోజులుగా ఈ వ్యాధిన బారిన పడి గ్రామంలో పలు కుటుంబాలు సతమతమవుతున్నాయి. గత ఏడాది వరకు 9 మందికి వ్యాధి సోకగా... ఈ ఏడాది ఆ సంఖ్య 20కి చేరింది. దీంతో మా గ్రామానికి ఏమైంది. అసలు కారణం ఏమై ఉంటుందని గ్రామస్తులు ఆందోళనకు గురవుతున్నారు. ∙విజృంభిస్తున్న కిడ్నీ వ్యాధి ∙మూడేళ్లలో వివిధ కారణాలతో 34 మంది మృత్యువాత ∙భయాందోళనలో గ్రామస్తులు ∙పట్టించుకోని ప్రజాప్రతినిధులు, అధికారులు గార: మండలంలో అంపోలు పంచాయతీ చల్లపేట గ్రామంలో కిడ్నీ వ్యాధి చాపకింద నీరులా విస్తరిస్తుంది. ఈ మాయదారి రోగం బారిన పడి పలువురు మృత్యువాత చెందారు. గ్రామంలో 282 కుటుంబాలు ఉండగా 1180 మంది జనాభా నివసిస్తున్నారు. ఇప్పటివరకు 20 మందిని ఈ మహమ్మారి పొట్టన పెట్టుకుంది. కిడ్నీ వ్యాధి సోకిన రోగులే కాకుండా సాధారణ వ్యక్తులు కూడా గత మూడేళ్లగా 34 మంది మృత్యువాత చెందారు. వీరందరూ మధ్యవయస్కులే. వీరందరూ కిడ్నీ వ్యాధితో మృతి చెందారా లేదా అన్నది తెలియడం లేదు. అయితే గుండెపోటు, జ్వరం వంటి లక్షణాలతో అధికమంది ప్రాణాలు కోల్పోయారు. నిత్యం కష్టపడి పనిచేసేవారికి గుండెపోటు అంటే కొంత అయోమయానికి గురిచేస్తుంది. వైద్య శాస్త్రం ప్రకారం కిడ్నీ వ్యాధి వస్తే త్వరగా మరణించే పరిస్థితిలేదు. కిడ్నీ వ్యాధికి అనుబంధంగా మరిన్ని రోగాలు(వీటిలో గుండెపోటు, జ్వరాలు) వచ్చే అవకాశం ఉంది. కిడ్నీ వ్యాధితో నేరుగా చనిపోకపోయినా వీరందరి చావుకి కిడ్నీ వ్యాధితో సంబంధం ఉందని చెప్పవచ్చు. తాగునీటి వనరులిలా... గ్రామంలోని ప్రజలు రక్షిత పథకం, నేలబావి, బోరు నీటిని తాగునీరుగా వినియోగిస్తున్నారు. ఈ నీటిని పలుమార్లు ప్రయోగశాలకు పంపించి పరీక్షలు చేసినా ఉద్దానం మాదిరి భూమిలో సిలికాన్ లేదని వైద్య సిబ్బంది చెబుతున్నారు. నొప్పి మాత్రలే కారణమా... గ్రామస్తులు ప్రతి చిన్నరోగానికి సంచివైద్యులను ఆశ్రయించడం పరిపాటి. దీనికి తోడు కీళ్లనొప్పులు అధికంగానే ఉన్నాయి. నొప్పి అంటేనే పెయిన్‌కిల్లర్ ట్యాబ్లెట్స్ రాసేయడం లేదా సూదిమందు వేసేయడం సంచి వైద్యుల అలవాటు. ఈ గ్రామస్తులు అతిగా పెయిన్‌కిల్లర్స్ వాడుతున్నారని వైద్య సిబ్బంది గతంలో చేసిన సర్వేలో తేల్చింది. దీనిపై అప్పటి కలెక్టర్ లక్ష్మీనరసింహం పెయిన్ కిల్లర్స్ తగ్గించేలా ప్రజల్లో చైతన్యం చేయాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. -
చంద్రబాబు తోలుమందం.. గట్టిగా ఒత్తిడి చేద్దాం
-
కిడ్నీ బాధితులతో వైఎస్ జగన్ ముఖాముఖీ
ఉద్దానం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...ఉద్దానం కిడ్నీ బాధితులతో ముఖాముఖీ అయ్యారు. ఆయన శనివారం జగతి గ్రామంలో కిడ్నీ బాధితులను కలిసి, వారి సమస్యలను, కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాధితులు తమ గోడును వైఎస్ జగన్ ఎదుట వెళ్లబోసుకున్నారు. డయాలసిస్ చేయించుకునేందుకు నెలకు ఒక్కొక్కరికి రూ.15 వేలు నుంచి రూ.20వేలు అవుతోందన్నారు. అంత ఆర్థిక స్తోమత తమకు లేదని, చావే దిక్కని వారు వాపోయారు. ప్రభుత్వం కూడా తమ సమస్యను పట్టించుకోవడం లేదని ఆవేదన చెందారు. పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేస్తామన్న విషయాన్ని కూడా మర్చిపోయారని తెలిపారు. విశాఖ వెళ్లి వైద్యం చేయించుకోలేకపోతున్నామని వెల్లడించారు. బాధితులకు అండగా ఉంటామని వైఎస్ జగన్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. -
త్వరలో నెఫ్రాలజిస్టుల నియామకం: కామినేని
శ్రీకాకుళం: త్వరలో నెఫ్రాలజిస్టులను నియమిస్తామని మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. శనివారం జిల్లాలోని శ్రీకాకుళం జిల్లా పలాసలో డయాలసిస్ సెంటర్‌ను మంత్రి అచ్చెన్నాయుడుతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్దానం ప్రాంతంలో మూడు డయాలసిస్ సెంటర్లు ప్రారంభించామన్నారు. మరో 15 రోజుల్లో కిడ్నీ బాధిత ప్రాంతాల్లో వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. -
కామ్నేని!
► ఆరోగ్యశాఖ మంత్రి వస్తారు... వెళ్తారు! ► సిక్కోలులో మెరుగుపడని వైద్య సౌకర్యాలు ► ఆచరణకు నోచుకోని కామినేని హామీలు ► ఉద్దానం యేతర ప్రాంతాల్లోనూ విస్తరిస్తున్న కిడ్నీ వ్యాధులు సాక్షి ప్రతినిధి శ్రీకాకుళం: ప్రాణాలు పోతున్నా.. ఉద్దానంపై మొద్దునిద్ర శీర్షికతో ఈనెల 11న సాక్షి ప్రచురించిన కథనంతో రాష్ట్ర ప్రభుత్వంలో చలనం వచ్చింది! రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ స్పందించారు! వైద్య సౌకర్యాలు మెరుగుపరుస్తామని హామీ ఇచ్చారు! అయితే ఆయన ఇలా హామీ ఇవ్వడం ఇది తొలిసారి కాదు! శ్రీకాకుళం జిల్లా పర్యటనకొచ్చినప్పుడల్లా వైద్య సౌకర్యాలపై దృష్టి పెడతామని చెబుతున్నారు! ఇలా ఆయన ఎన్నిసార్లు పర్యటించి వెళ్లినా పరిస్థితిలో మాత్రం మార్పు రావట్లేదు. పలాస ఆసుపత్రిలో డయాలసిస్ యూనిట్ ప్రారంభించేందుకు మంత్రి కామినేని శ్రీకాకుళం జిల్లాకు శనివారం మరోసారి వస్తున్నారు. వాస్తవానికి మంత్రి స్థాయిలో ప్రారంభించాల్సిన కార్యక్రమం కాకపోయినా ఆయన వస్తే వైద్య, ఆరోగ్య శాఖ పరిస్థితి మారుతుందేమోనన్న ఆశలు జిల్లా ప్రజల్లో అలాగే ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాను కిడ్నీ వ్యాధులు వణికిస్తున్నాయి. ఒక్క ఉద్దానం ప్రాంతంలోని ఎనిమిది మండలాల్లోనే 28 శాతం మంది వాటిని బారినపడ్డారు. ప్రపంచంలో అంత ప్రమాదకరస్థాయిలో కిడ్నీ వ్యాధి ప్రబలిన మూడు ప్రాంతాల్లో ఉద్దానం ఒకటని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నివేదిక ఎప్పుడో హెచ్చరించింది. ఇప్పుడు జిల్లాలో ఉద్దానం ఒక్కటే కాదు ఆమదాలవలస, ఫరీదుపేట, చిలకపాలెం, పాలకొండ తదితర ప్రాంతాల్లోనూ కిడ్నీ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతోంది. ఉద్దానంలోనైనా నిపుణులు ఎవ్వరికి వారు పరిశోధనలు చేసి వెళ్లిపోవడమే తప్ప వాటినన్నింటినీ క్రోడీకరించి, తదుపరి పరిశోధనలను కొనసాగించే, సమన్వయం చేసే వ్యవస్థే లేకుండా పోయింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్)కు అనుబంధంగా పరిశోధన కేంద్రాన్ని శ్రీకాకుళంలోని రాజీవ్‌గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)లో ఏర్పాటు చేస్తే ఉపయోగకరంగా ఉంటుందనే వాదనలు ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా దృష్టి సారించట్లేదు. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదన కూడా రాలేదని ఇటీవలే కేంద్ర ప్రభుత్వమే ప్రకటించిన సంగతి తెలిసిందే. మంత్రి కామినేని దీనిపై ఏదొక ప్రకటన చేస్తారని జిల్లా ప్రజలు ఆశిస్తున్నారు. ఉద్దానంలో ఇప్పటివరకు 39 వేల మందికి రక్తం, యూరియా, సీరం క్రియేటినిన్ పరీక్షలు నిర్వహించగా వారిలో 12 వేల మందికి సీరం క్రియేటినిన్ 1.2 శాతం కంటే ఎక్కువుగా ఉన్నట్లు వెల్లడైంది. కిడ్నీ వ్యాధి బారిన పడిన వీరికి తక్షణమే వైద్య సహాయం అందించాల్సి ఉంది. మిగతావారికి వైద్య పరీక్షలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాల్సి ఉంది. గత జనవరి 19న సోంపేటలో జరిగిన సమావేశంలో పలాస, సోంపేట ఆసుపత్రుల్లో డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని మంత్రి కామినేని హామీ ఇచ్చినప్పటికీ కేవలం పలాసలో మాత్రమే శనివారం ప్రారంభిస్తున్నారు. నిర్లక్ష్యం నీడలో రిమ్స్.. వెనుకబడిన సిక్కోలు జిల్లాకు ఆరోగ్య ప్రదాయినిలా ఉంటుందనే ఆశయంతో 2008లో నాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన రిమ్స్‌ను టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం ఛాయల్లోకి నెట్టేసింది. దీన్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌గా చూడాలన్న వైఎస్ ఆశయాన్ని నీరుగార్చేస్తోంది. మొత్తం 13 బ్లాక్‌ల్లో ఇప్పటికీ ఏడు బ్లాకులు అందుబాటులోకి రాలేదు. పీజీ మెడికల్ సీటు ఒక్కటే రిమ్స్ బోధనాసుపత్రిలో ఉందంటే ప్రభుత్వం నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. పరిపాలన తూతూమంత్రంగా మారిపోయింది. కీలకమైన పోస్టులన్నింటిలోనూ ఇన్చార్జి్జలతోనే నెట్టుకొస్తున్నారు. ఎంతో కీలకమైన డైరెక్టర్, మెడికల్ సూపరింటెండెంట్, రిజిస్ట్రార్, డీన్ (ప్రిన్సిపాల్) వంటి పోస్టుల్లోనూ రెండేళ్లుగా ఇన్చార్జి్జలే కొనసాగుతున్నారు. ఇలా ముఖ్యమైన వైద్యసిబ్బంది కొరత ఉన్నా ఆ ఖాళీలను భర్తీ చేయడంలో ప్రభుత్వం కాలయాపన చేస్తోంది. దీని పర్యవసానంగా వైద్య కళాశాల, ఆస్పత్రిలో ప్రొఫెసర్లు, ట్యూటర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల, అసోసియేట్ ప్రొఫెసర్లు తీవ్రమైన పనిఒత్తిడి ఎదుర్కొంటున్నారు. రిమ్స్ ఫ్యాకల్టీ విభాగాల్లో 30 శాతం, వైద్యుల విభాగంలో 20 శాతం, దిగువ స్థాయి సిబ్బందిలో 20 శాతం మేర ఖాళీలు ఇప్పటికీ ఉన్నాయి. దీంతో రిమ్స్‌కు వచ్చే రోగులకు తగినవిధంగా వైద్యసేవలు అందట్లేదు. వారంతా మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రంలోని కార్పొరేట్ ఆసుపత్రులకో, లేదంటే విశాఖపట్నంలోని కేజీహెచ్, ఇతర ప్రైవేట్ ఆసుపత్రులకో పరుగులు తీస్తున్నారు. మరోవైపు వైద్య విద్యార్థులకు బోధనాపరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయి. -
ఉద్దానం బద్దలవుతోంది
- తీవ్ర కిడ్నీ వ్యాధులతో ఉన్నవారు ఎక్కువైనట్టు వెల్లడి - ముప్పై ఏళ్ల లోపు వారే ఎక్కువ మంది బాధితులు - వ్యాధుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలన్న ఐసీఎంఆర్ - ఇప్పటివరకూ 77 వేల మందికి వైద్య పరీక్షలు.. 20 శాతం మందిలో అధిక తీవ్రత సాక్షి, అమరావతి: శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ రోగుల సంఖ్య అమాంతం పెరుగుతోంది. ఇప్పటికీ రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించే ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. వైద్య పరీక్షల్లో మూత్రపిండాల వ్యాధులతో బాధపడుతున్న వారిసంఖ్య తీవ్రంగా పెరుగుతూండటం కలవరపెడుతోంది. ఉద్దానంలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న వైద్యులు, జిల్లా ఆరోగ్యశాఖ అధికారుల నుంచి సాక్షి సమాచారం సేకరించగా.. బాధితుల్లో ఎక్కువ మంది ముప్ఫై ఏళ్ల వారుండటం కలవర పెట్టే అంశం. 2017 మార్చి 31 వరకు సుమారు 110 పల్లెల్లో 77 వేల మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా 20 శాతం వరకూ బాధితులు తీవ్ర మూత్రపిండాల వ్యాధికి గురైనట్టు తేలింది. అంటే 15 వేల మంది పైచిలుకు బాధితుల్లో మోతాదుకు మించి సీరం క్రియాటినైన్ ఉన్నట్టు తేలింది. మూత్రపిండాల వ్యాధికి కారణమైన సీరం క్రియాటినైన్ 1.2 కంటే తక్కువగా ఉంటేనే కిడ్నీలు సురక్షితంగా ఉన్నట్టు. కానీ వైద్య పరీక్షల్లో 1.2 నుంచి 4 వరకు ఉందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. సీరం క్రియాటినైన్ 5గా నమోదైన వారు కూడా 500 మంది ఉన్నట్టు తేలింది. బాధితులకు ఇప్పటికే 80 శాతం పైన దెబ్బతిన్నట్టు తేలింది. ఇలాంటి వారిని తక్షణమే డయాలసిస్ కేంద్రాలకు తరలించాలని వైద్యులు సూచించారు. సీరం క్రియాటినైన్ 3 కంటే తక్కువగా ఉన్న వారిని సోంపేట, పలాస, హరిపురం, కవిటి తదితర సామాజిక ఆరోగ్య కేంద్రాలకు తరలించి వైద్యం అందిస్తున్నారు. ఏప్రిల్ 15 నాటికి వైద్య పరీక్షల ప్రక్రియ పూర్తవుతుందని, ఇంకా ఎంతమంది బాధితులున్నారో అర్థం కావడం లేదని వైద్యులు తెలిపారు. ఉన్నతస్థాయి కమిటీలు ఏం చెప్పాయి? ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధుల తీవ్రతపై రాష్ట్రప్రభుత్వం ఒక కమిటీ వేసింది. అలాగే కేంద్రం ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) బృందాన్ని వేసింది. ఈ రెండు కమిటీలు చెప్పిన విషయాలు ఇలా ఉన్నాయి.. ⇒ ఈ ప్రాంతంలో పరిస్థితులపై సుదీర్ఘమైన ప్రయోగాలు (రీసెర్చ్) జరగాల్సిన అవసరం ఉంది ⇒ సీకేడీ (క్రానిక్ కిడ్నీ డిసీజెస్) వైద్య పరీక్షలు ఎప్పటికప్పుడు పకడ్బందీగా నిర్వహించాలి ⇒ ఇక్కడ కిడ్నీ జబ్బులను నియంత్రించేందుకు వైద్యులు తదితర సిబ్బందిని బాగా పెంచాలి ⇒ కిడ్నీ వ్యాధులకు కారణమైన పర్యావరణ కారకాలను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలి. ఈ చర్యలు తీసుకుంటున్నాం: ప్రభుత్వం ⇒ ఏప్రిల్ 15 వరకూ కిడ్నీ వ్యాధులపై వైద్య పరీక్షలు ⇒ కిడ్నీ వ్యాధుల పరీక్షలకు సోంపేట, పలాస, కవిటి, హరిపురం మండలాల్లో ల్యాబ్ పరికరాలు ఏర్పాటు ⇒ పలాస సామాజిక ఆరోగ్య కేంద్రంలో డ యాలసిస్ కేంద్రం ఏర్పాటు.. సోంపేటలో కూడా త్వరలో ఏర్పాటుకు చర్యలు ⇒ రెండు వారాలకు ఒకసారి టెక్కలి ఏరియా ఆస్పత్రిలో మూత్రపిండాల వ్యాధి నిపుణుల (నెఫ్రాలజిస్ట్)ను అందుబాటులో ఉంచడం ⇒ కింగ్‌జార్జి ఆస్పత్రి నిపుణుల ఆధ్వర్యంలో ఉద్దానం ప్రాంతంలో పనిచేస్తున్న వైద్యులకు, పారామెడికల్ సిబ్బందికి కిడ్నీ వ్యాధుల గురింపుపై శిక్షణ ⇒ కిడ్నీ వ్యాధుల తీవ్రత ఉన్న వారి వివరాలను ఆధార్‌తో అనుసంధానించి వైద్యసేవలు ⇒ కిడ్నీ ప్రభావిత పల్లెలకు రక్షిత మంచినీటి వసతి కల్పించడం -
ఉద్దానానికి మొండిచేయి!
► బడ్జెట్లో కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం రూపాయి కూడా కేటాయించని సర్కార్ ► ఆందోళనలో బాధితులు కవిటి: అత్యంత ప్రమాదకరస్థాయిలో విజృంభిస్తున్న ఉద్దానం కిడ్నీవ్యాధులపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. వ్యాధిగ్రస్తులపై తమకు ఎంతో చిత్తశుద్ధి ఉందని పాలకులు చెబుతూ వచ్చారు. అయితే తాజాగా బుధవారం శాసనసభలో ఆర్థికశాఖమంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టిన బడ్జెట్లో కిడ్నీవ్యాధిగ్రస్తులకు మొండిచేయి చూపా రు. వ్యాధి మూలాలు కనుక్కోవడానికి గాని, వ్యాధిగ్రస్తుల వైద్య సేవల కోసం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. ఈ విషయం తెలిసి బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉద్దానం వాసులు చాలామంది మూత్రపిండల వ్యాధిబారిన పడుతున్న విషయం తెలిసిందే. వ్యాధి మూలాలు కనుక్కోవడానికి కేంద్ర ప్రభుత్వం భారతీయ వైద్యపరిశోధనామండలి(ఐసీఎంఆర్) బృందంతో అధ్యయనం పేరిట ఉద్దానం ప్రాంతానికి ఫిబ్రవరి మొదటివారంలో నిపుణుల బృందాన్ని పంపింది. దురదృష్టవశాత్తూ వారు క్షేత్రస్థాయిలో కాలుమోపకుండానే వెనుదిరగడంతో ఇక్కడ ప్రజలు పెట్టుకున్న ఆశలు అడియాసలయ్యాయి. పైగా ఈ బృందంలో సభ్యుడు ఎన్టీఆర్ హెల్త్వర్సిటీ వైస్‌చాన్సలర్ డాక్టర్ రవిరాజ్ కిడ్నీ వ్యాధులకు కారణం నీటిలో ఉన్న సిలికాన్ అంటూ రాష్ట్ర వైద్యశాఖ మంత్రి కామినేనికి నివేదిక ఇచ్చారు. ఎటువంటి పరిశోధనలూ లేకుండానే ఈ నివేదిక అందించడం ఈ ప్రాంతంలో తీవ్రచర్చనీయాంశం అయింది. తమపై అనవసరంగా బురదజల్లారని జిల్లా గ్రామీణా నీటిసరఫరా విభాగం అధికారులు, ఉద్దానం ప్రాజెక్ట్ అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు మాటమాత్రం చెప్పకుండానే ప్రభుత్వానికి ఇచ్చిన ఆ నివేదికలో నీటిలో సిలికాన్ ఉందని డాక్టర్ రవిరాజ్ సిలికా పలుకులు పలకడం పట్ల నిర్ఘాంతపోయారు. ఇలాంటి పరిస్థితిలో రాష్ట్ర బడ్జెట్లో వ్యాధి మూలాలు కనుక్కోవడానికి ప్రత్యేక నిధులు కేటాయిస్తారని ఈ ప్రాంతీయులు గంపెడాశతో ఎదురు చూశారు. అయితే వారందరికీ భంగపాటు మిగిలింది. వ్యాధిగ్రస్తుల వైద్యఖర్చులకు నిధులు కేటాయింపు లేదు. డయాలసిస్‌కు వెళ్లేవారికి రవాణాచార్జిల పేరిట నిధుల మంజూరుగానీ, వ్యాధిగ్రస్తులకు ఉచిత మందుల పంపిణీ వంటి విషయంపై బడ్జెట్లో ప్రస్తావించకపోవడంతో ఉద్దానం వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ తీరుని తప్పుబడుతున్నారు. బడ్జెట్ అంకెల గార డీ: ప్రభుత్వం ప్రవేశప ెట్టిన వార్షిక బడ్జెట్ అంకెల గారడీగా ఉంది. ప్రాధాన్యతా రంగాలకు కేటాయింపుల్లేవు. ఉద్దానం కిడ్నీ వ్యాధుల అధ్యయనాన్ని ప్రభుత్వం తూతూమంత్రంగా మార్చేసిందనటానికి బడ్జెట్లో కనీస ప్రస్తావన లేకపోవడం, నిధుల కేటాయింపులో మొండిచెయ్యి చూపడం ఉదాహరణగా చెప్పవచ్చు. ఇది చాలా బాధాకరం. ప్రభుత్వం తమను ఆదుకుంటుందని చూసిన కిడ్నీవ్యాధిగ్రస్తులకు ఈ బడ్జెట్ చేదుగుళికనే ఇచ్చింది. –పిరియా సాయిరాజ్, మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ ఇచ్ఛాపురం నియోజకవర్గ సమన్వయకర్త కుటుంబానికి భారమయ్యాను: 50 ఏళ్ల వయసు వరకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. నాలుగేళ్ల క్రితం ఒంట్లో బాగోకపోవడంతో సోంపేట వెళ్లి వైద్యుడిని సంప్రదిస్తే కిడ్నీవ్యాధి బారిన పడ్డానని తెలిపారు. అప్పటి నుంచి మందులు వాడుతూ వస్తున్నాను. రెండు సంవత్సరాల నుంచి వారానికి రెండుసార్లు డయాలసిస్ కోసం వైజాగ్ వెళ్తున్నాను. శ్రీకాకుళం దగ్గర ఉందని వెళితే వివిధ కారణాలు చూపి.. వైజాగ్ వెళ్లాలంటున్నారు. భార్య సాయంతో వైజాగ్ వెళ్లి వస్తున్నాను. పిల్లలు కూలి చేసి తెచ్చే డబ్బులను వైద్యానికి ఖర్చు చేస్తున్నాను. వారానికి రూ.1600 మందులు అవసరమవుతున్నాయి. దీంతో కుటుంబానికి భారంగా మారాను. – పొడియా మదను, శ్రీహరిపురం, కవిటి మండలం -
కిడ్నీ రోగులకు మరిన్ని సేవలు
► సర్వేలో గుర్తించిన వారికి తదుపరి పరీక్షలు చేయాలి ► కిడ్నీ రోగుల వైద్యంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ► ఆరోగ్య శాఖ డైరెక్టర్ అరుణకుమారి శ్రీకాకుళం పాతబస్టాండ్ : ఉద్దానం ఇతర ప్రాంతాల్లో కిడ్నీ వ్యాధి బాధితులకు మెరుగైన సేవలు అందించాలని, వారిని గుర్తించి వ్యాధి ముదరక ముందే చర్యలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ ఎస్.అరుణకుమారి అన్నారు. ఉద్దానం కిడ్నీ ప్రాంతంలో ఉన్న ఆస్పత్రుల వైద్యాధికారులకు శనివారం జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో కిడ్నీవ్యాధులపై ఒక రోజు అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. ఉద్దానం తదితర ప్రాంతాల్లో జరుగుతున్న సర్వే ను కచ్చితంగా కొనసాగించాలని అన్నారు. ప్రమాదకరంగా ఉన్న వారిని హరిపురం, పలాసల్లోని సీఈసీ కేంద్రాలకు పంపించాలని తెలిపారు. రోగుల పరిస్థితులు, అలవాట్లపై అధ్యయనం చేయాలని అన్నారు. అలాగే కిడ్నీ రోగం దశలు, రకాలు కూడా గుర్తిం చాలని అన్నారు. ప్రస్తుతం అందజేస్తున్న మందులు ఎంతవరకు పనిచేస్తున్నాయి, వాటి పరిస్థితి, మం దుల కొరత, ఇంకా కావల్సిన వసతుల గురించి ఆరా తీశారు. రానున్న రోజుల్లో ఎ లాంటి సేవలు అం దించాలి, మెరుగైన సేవలకు కావల్సిన చర్యలపై చర్చించారు. ప్రతి రోగికీ తప్పని సరిగా కౌన్సిలింగ్ చేయాలని అన్నారు. ఏపీ వైద్యవిధాన పరిషత్ జాయింట్ కమిషనర్ జయచంద్ర రెడ్డి మాట్లాడుతూ కిడ్నీ రోగుల గుర్తింపు ప్రాథమిక దశలో ఉంటే మందుల ద్వారా ఎంతవరకు నయం చేయగలమో అంతవరకు వారికి తగిన సేవలు, మందులు అందించాలని తెలిపారు. సర్వేలో రోగి పూర్తి వివరాలు ఉండడంతో వారికి తగిన సూచనలు, సలహాలు అందించి, వారి జీవిత కాలం పెరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. డీఎంహెచ్ఓ తిరుపతిరావు మాట్లాడుతూ ఇప్పటివరకు 13 వేల మందిని సర్వే చేశామని, 9వేల మంది హైరిస్క్‌లో ఉన్నారని వివరించారు. మిగిలిన వారికి సర్వేలు వేగవంతం చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా విశాఖపట్నం కేజీహెచ్‌కు చెందిన నెఫ్రాలజీ ప్రొఫెసర్ ప్రసాద్ కిడ్నీ వ్యాధి రకాలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ బొడ్డేపల్లి సూర్యారావు, వైద్యాధికారులు బగాది జగన్నాథరావు, మెండ ప్రవీణ్, 17 పీహెచ్‌సీల వైద్యాధికారులు పాల్గొన్నారు. -
శ్రీకాకుళం జిల్లాలో రేపు పవన్ పర్యటన
విశాఖ: జనసేన అధ్యక్షుడు, ప్రముఖ సినీనటుడు పవన్ కల్యాణ్ మంగళవరాం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. ఉత్తరాంధ్ర కోనసీమగా పిలిచే శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం ప్రాంతంలో ఆయన మంగళవారం పర్యటించనున్నారు. 20 ఏళ్లగా అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న కిడ్నీ వ్యాధి సమస్య గురించి స్థానికుల నుంచి అడిగి తెలుసుకుంటారు. ఉద్దానం ప్రాంతంలో గత రెండు దశాబ్దాల కాలంలో దాదాపు 20 వేల మంది కిడ్నీ వ్యాధి కారణంగా మరణించారని పవన్‌కల్యాణ్ సోమవారం తన ట్వీట్టర్లో పేర్కొన్నారు. ఇప్పటికీ ఆ ప్రాంతంలో లక్షల మంది అదే వ్యాధితో బాధపడుతున్నారన్నారు. అక్కడి ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వారు సమస్య పరిష్కారం కోసం సమర్థంగా పనిచేయలేదని దుయ్యబట్టారు. కాగా రేపు ఉదయం ఇచ్ఛాపురంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులతో ఆయన ముఖాముఖీ అవుతారు. ఈ పర్యటనలో భాగంగా పవన్ సోమవారం సాయంత్రమే విశాఖ చేరుకున్నారు. రాత్రికి ఇక్కడే బస చేస్తారు. రేపు ఉదయం ఏడుగంటలకు శ్రీకాకుళం జిల్లా బయల్దేరి వెళతారు. ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలపై దృష్టి పెట్టిన పవన్ కిడ్నీ వ్యాధిగ్రస్తులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. pic.twitter.com/HnWUMNFTTS — Pawan Kalyan (@PawanKalyan) 2 January 2017 -
బాతుపురం.. విప్లవ స్వరం
బాతుపురం(కాశీబుగ్గ) : మల్కన్‌గిరి అడవుల్లో ఎన్కౌంటర్ వార్త విన్నప్పటి నుంచి ఉద్దానంలోని బాతుపురం నిద్దరపోలేదు. ఇదే ఎన్కౌంటర్లో గ్రామానికి చెందిన చెల్లూరు నారాయణరావు, అతని భార్య బొడ్డు కుందన చనిపోయారని తెలిసి ఆ ఊరంతా రోదించింది. గ్రామం విడిచి 26 ఏళ్లయినా స్థానికులు ఇంకా వారిని మర్చిపోలేదు. జిల్లాలో విప్లవ భావాలు అధికంగా ఉండే ప్రాంతాల్లో ఉద్దానం ప్రముఖమైనది. ఉద్దానంలోని ఓ పల్లెటూరైన బాతుపురం గ్రామానికి చెందిన చెల్లూరు నారాయణ అలియాస్ సూరన్న (సురేష్) 1990 అక్టోబర్ 13 తేదిన గ్రామం విడిచి అజ్ఞాతంలోకి వెళ్లాడు. ఇన్నేళ్ల తర్వాత భార్య కుందనతో కలిసి కన్ను మూశాడని తెలియడంతో గ్రామంలో విషాద ఛాయల అలముకున్నాయి. నారాయణకు ఇద్దరు సోదరులు సింహాచలం, భూచంద్రరావులు ఉన్నారు. వీరి ఊరిలోనే కొద్దిపాటి భూమిలో వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్నారు. నారాయణ ఊరిలో ఉన్నప్పుడే చాలా దుడుకుగా ఉండేవాడు. వాలీబాల్ ఆటలో మంచి నేర్పరి కూడా. అక్కుపల్లిలో పదో తరగతి చదివాడు. గ్రామంలో అక్షరభారతి పాఠాలు బోధిస్తూ గ్రామంలో అనేక మందిని విద్యా వంతులుగా తీర్చి దిద్దాడు. గ్రామంలో నాటుసారాతో ఆరోగ్యాలు పాడుచేసుకుంటున్న వారికి రైతులుగా తీర్చిదిద్దాడు. పూర్తిస్థాయిలో వ్యవసాయం వైపు మరళించిన ఘనత ఇతనికే దక్కింది. వ్యవసాయదారులకు మద్దతుగా నిలిచి ప్రభుత్వ సేవలు సక్రమంగా అందేలా చర్యలు చేపట్టాడు. గ్రామంలోని యువజన సంఘ నాయకుడిగా గ్రామ అభివృద్ధికి పాటుపడే వాడు. ఉద్దాన ప్రాంతాల్లో పెత్తందారులకు మొదటిగా ఎదురించిన వ్యక్తిగా నిలిచాడు. విప్లవభావాలతో గ్రామానికి చెందిన జోగారావుతో పాటు 11మందిని తన అడుగుజాడల్లో నడిపించాడు. తన కుటుంబం కోసం గానీ, ఆస్తి కోసం గానీ ఎన్నడూ ఆలోచించలేదని స్థానికులు తెలిపారు. -
ఉలిక్కిపడిన ఉద్దానం !
– ఏవోబీ మల్కన్‌గిరిలో భారీ ఎన్కౌంటర్ నేపథ్యంలో.. – మృతి చెందిన మావోల్లో ముగ్గురు జిల్లావాసులు – మృతుల్లోని అగ్రనేతలకూ ఉద్దానంతో అనుబంధం – ఒడిశాకు బయల్దేరి వెళ్లిన కుటుంబసభ్యులు – జిల్లా అంతటా అప్రమత్తం, ముమ్మర తనిఖీలు ఆంధ్రా–ఒడిశా సరిహద్దు (ఏవోబీ) ప్రాంతమైన మల్కన్‌గిరి, రాయ్‌గడ జిల్లాల మధ్య ఆదివారం అర్ధరాత్రి తుపాకుల మోతతో దద్దరిల్లింది. తెల్లవారేసరికి ఈ వార్త జిల్లా అంతటా వ్యాపించడంతో ఉద్దానం ప్రాంతం ఉలిక్కిపడింది. ఎన్కౌంటర్లో మృతి చెందిన 24 మందిలో ముగ్గురు... మావోయిస్టు పార్టీ సెంట్రల్ రీజినల్ కమిటీ సభ్యుడు చెల్లూరి నారాయణరావు అలియాస్ సూరన్న అలియాస్ సురేష్, అతని భార్య రీజినల్ కమిటీ జననాట్యమండలి సభ్యురాలు బొడ్డు కుందనాలు అలియాస్ సునీత అలియాస్ మమత, సెంట్రల్ టెక్నికల్ కమిటీ సభ్యుడు మెట్టూరి జోగారావు అలియాస్ కోటీశ్వరరావు ఉద్దానం ప్రాంతం వారే. అంతేకాదు అదే ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయిన మరో ఇద్దరు అగ్రనేతలు ప్రతాపరెడ్డి రామచంద్రారెడ్డి అలియాస్ సుధా అలియాస్ చలపతి, కృష్ణప్ప అలియాస్ దయాలకు ఈ ప్రాంతంతో అనుబంధం ఉంది. వజ్రపుకొత్తూరు మండలం బాతుపురం గ్రామంలోనున్న సూరన్న, మమత, కోటీశ్వరరావు కుటుంబసభ్యులకు పోలీసుల నుంచి సమాచారం అందినట్లు తెలిసింది. మృతదేహాలను గుర్తించేందుకు వారు మల్కన్‌గిరికి బయల్దేరి వెళ్లారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఉద్యమాలకు దిక్సూచిగా పేరొందిన శ్రీకాకుళం సాయుధ పోరాటం తర్వాత పీపుల్స్‌వార్ (మావోయిస్టు పార్టీగా మారకముందు) కార్యకలాపాలు 1990 సంవత్సరం నుంచి మొదలయ్యాయి. ఆ కాలంలో చిత్తూరు జిల్లాకు చెందిన ప్రతాపరెడ్డి రామచంద్రారెడ్డి అలియాస్ సుధా శ్రీకాకుళం జిల్లాకు వచ్చారు. అప్పటి వరకూ కాన్వెంట్ టీచర్‌గా పనిచేస్తున్న చెల్లూరు నారాయణ పీపుల్స్‌వార్‌లో చేరడానికి సుధా పిలుపే కారణం. సూరన్నగా పేరుమార్చుకున్న నారాయణ రాడికల్ యూత్‌లీగ్‌లో సభ్యునిగా చేరాడు. శ్రీకాకుళ రైతాంగ సాయుధ పోరాటంలో ఉద్దానం ప్రాంతం నుంచి కీలక పాత్ర పోషించిన రాజాం నివాసి గొరకల రాంబాబుకు సూరన్న బంధువు. తరువాత గంటి రాజన్న ఎన్కౌంటర్లో చనిపోవడంతో సూరన్న డివిజన్ కార్యదర్శి బాధ్యతలు తీసుకున్నాడు. మిలటరీ క్యాంపుల్లో చురుకుగా పనిచేసేవాడు. మందస మండలం నల్లబొడ్డులూరు గ్రామానికి చెందిన బొడ్డు కుందనాలు అలియాస్ మమత అలియాస్ సునీత కూడా మావోయిస్టు పార్టీ దళం సభ్యురాలిగా చేరింది. ఆమెను సూరన్న వివాహం చేసుకున్నాడు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఏవోబీలో జరిగిన ఎన్కౌంటర్లో వారిద్దరూ ఒకేసారి మృతి చెందడంతో ఉద్దానం ప్రాంతంలో విషాదఛాయలు అలముకున్నాయి. బాతుపురానికే చెందిన మెట్టూరి భాస్కరరావు అలియాస్ కోటీశ్వరరావు కూడా ప్రాణాలు కోల్పోవడం ఆ ప్రాంతం వారిని కదిలించింది. ఈ ఎన్కౌంటర్లో మృతి చెందిన శ్రీకాకుళం డివిజన్ కార్యదర్శి కృష్ణప్ప అలియాస్ దయా కూడా ఉద్దానం ప్రాంత వాసులకు పరిచయస్థుడే. సుధా తర్వాత ఈ ప్రాంత దళ కమాండర్‌గా పనిచేసిన కాలంలో భాస్కర్ పేరుతో ఆయన ఇక్కడ కార్యకలాపాలు సాగించేవాడు. జిల్లాలో పార్టీ బలహీనపడినప్పటికీ ఆయన మాత్రం పార్టీలో ఉన్నత స్థితికి ఎదుగుతూ ఇతర ప్రాంతాల్లో బాధ్యతలు నిర్వహించేందుకు వెళ్లిపోయాడు. కొన్నేళ్లుగా అజ్ఞాతంలోనే... సూరన్న, ఆయన భార్య సునీత, కోటీశ్వరరావు పుష్కర కాలంగా అజ్ఞాతంలోనే ఉన్నారు. 2004 సంవత్సరం తర్వాత వారు జిల్లాకు దూరంగానే ఉన్నారు. వారు ముగ్గురూ ఒకేసారి ఎన్కౌంటర్లో మృతి చెందారని తెలియడంతో ఉద్దానం ప్రాంతంలో చర్చనీయాంశమైంది. అంతేకాదు వారు ముగ్గురూ బలహీనవర్గాలకు చెందినవారు. ఈ ప్రాంతంలో అనేక మందితో వారికి కుటుంబపరమైన సంబంధాలు ఉన్నాయి. ఉద్యమాలకు పురిటిగడ్డ... ఉద్యమాలకు పురిటిగడ్డగా జిల్లాకు పేరు. ఉద్దానం ప్రాంతంలో ఎంతోమంది ఉద్యమబాట పట్టారు. పీపుల్స్‌వార్‌లో చేరి తుపాకులు ఎత్తిపెట్టారు. అలాగే ఎన్కౌంటర్లు జిల్లావాసులకు కొత్త కాదు. జిల్లాలో 1969 సంవత్సరంలో జరిగిన గిరిజన రైతాంగ సాయుధ పోరాటంలో 360 మంది ఎన్కౌంటర్లో మృతి చెందారు. అయినా ఇక్కడ పోరాటాలు ఆగలేదు. 1980 తరువాత పీపుల్స్‌వార్ పార్టీ ప్రజా సంఘాల పేరుతో రాడికల్ స్టూడెంట్ యూనియన్, రాడికల్ యూత్ లీగ్‌లను ఏర్పాటు చేసింది. వాటిలో జిల్లా నుంచి ఎక్కువ మంది సభ్యులుగా చేరారు. అందుకే దేశంలో ఎక్కడ మావోయిస్టులకు–పోలీసులకు మధ్య ఎన్కౌంటర్ జరిగినా సిక్కోలు ఉలిక్కిపడటానికి కారణం ఇదే. చాలా ఎన్‌కౌంటర్‌ల్లో ఒకరిద్దరైనా జిల్లావాసులు ఉంటున్నారు. తాజాగా ఆదివారం అర్ధరాత్రి జరిగిన మల్కన్‌గిరి ఎన్కౌంటర్లో మృతి చెందిన ముగ్గురు మావోలు ఉద్దానం ప్రాంతంవారే కావడం గమనార్హం. జిల్లా అంతటా అప్రమత్తం... ఎన్కౌంటర్ నేపథ్యంలో జిల్లాలో అలెర్ట్ ప్రకటించారు. రణస్థలం, బత్తిలి, పాతపట్నం, మెళియాపుట్టి, మందస, వజ్రపుకొత్తూరు, పలాస ప్రాంతాల్లో సోమవారం పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహించారు. వాహనాలను క్షుణ్నంగా పరిశీలించారు. ఎన్కౌంటర్లో గాయపడిన మావోయిస్టులు ఏవోబీ దాటి జిల్లాలోకి ప్రవేశించే అవకాశం ఉందన్న నిఘావర్గాల సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లావ్యాప్తంగా పోలీసులను అప్రమత్తం చేసినట్లు జిల్లా ఎస్పీ జె.బ్రహ్మారెడ్డి చెప్పారు. -
ఉద్దానం కకావికలం
(ఉద్దానం నుంచి సాక్షి బృందం): పై-లీన్ తుపాను బీభత్సానికి శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతం కకావికలమైంది. శనివారం రాత్రి వీచిన ప్రచండ గాలులకు ఒకరు మృతి చెందారు. సుమారు రూ.1,000 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా. ఉద్యాన పంటలు దాదాపు తుడిచిపెట్టుకుపోయాయి. మిగతా పంటలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. వందల సంఖ్యలో విద్యుత్ స్తంభాలు నేలమట్టమయ్యాయి. 200 విద్యుత్ ఫీడర్లు, 16 సబ్ స్టేషన్లు పాడయ్యాయి. చెరువులు, రోడ్లు, భవనాలకు తీవ్రంగా నష్టం వాటిల్లింది. 87 పశువులు మృత్యువాత పడ్డాయి. మత్స్యకారులకు తీవ్ర నష్టం వాటిల్లింది. పడవలు, వలలు, ఇళ్లు దెబ్బతిన్నాయి. ఈ నష్టం రూ.6 కోట్ల వరకు ఉండొచ్చని ప్రాథమిక అంచనా. ఉద్దానం ప్రాంతంలోని ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి, సోంపేట, మందస, వజ్రపుకొత్తూరు మండలాల్లోని 233 గ్రామాలు అతలాకుతలమయ్యాయి. 1999లో విరుచుకుపడిన సూపర్ సైక్లోన్ రోజును మళ్లీ గుర్తు చేశాయి. అప్పుడు కూడా దసరాకు ముందే భీకర గాలులు వీచాయి. ఆ నష్టం నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న రైతులకు తాజా తుపాను శరాఘాతమైంది. కొబ్బరి సుమారు 16,325 ఎకరాలు, మామిడి 1,000 ఎకరాలు, అరటి 500 ఎకరాలు, మునగ 100 ఎకరాల మేర దెబ్బతిన్నాయి. 29 వేల ఎకరాల వరి పంటకు నష్టం వాటిల్లింది. 5,141 హెక్టార్లలో ఉద్యానవన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఆరు మండలాల్లో సుమారు వంద ఇళ్లు కూలిపోయాయి. మరో 50 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. రోడ్డుపై చెట్లు పడిపోవడంతో వందలాది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మత్స్యకార గ్రామాల పరిస్థితి దయనీయంగా ఉంది. అలల తాకిడికి, వరద ఉధృతికి రోడ్లు దాదాపు దెబ్బతిన్నాయి. వందల సంఖ్యలో వలలు, పదుల సంఖ్యలో పడవలు కొట్టుకుపోయాయి. చాలా ఇళ్లు దెబ్బతిన్నాయి. కాగా, తుపాను నేపథ్యంలో శ్రీకాకుళంలోని పునరావాస కేంద్రాలలో ఆశ్రయం పొందుతున్న వారి పరిస్థితి దయనీయంగా ఉంది. వారి అవసరాలను పట్టించుకునే వారే కరవయ్యారు. తుపాన్ తీరం దాటాక బాధిత గ్రామాలకు అధికారులు వెళ్లడంలో శ్రద్ధ చూపించడం లేదు. జిల్లా వ్యాప్తంగా 52 పునరావాస కేంద్రాల్లో దాదాపు 61 వేల మందికి ఆశ్రయం కల్పించారు. చాలా మందికి సరిగా భోజనం అందలేదు. కొన్నిచోట్ల మంచినీళ్లతోనే సరిపెట్టేశారు. తమను పట్టించుకునే వారే కన్పించలేదని బారువ శివారు గ్రామాలైన కొత్తూరు, వాడపాలెం మత్స్యకారులు వాపోయారు. నష్టపోయిన గ్రామాల పరిస్థితేంటో ఆరా తీసే ప్రయత్నం జరగలేదు. అధికార యంత్రాంగం కార్యాలయాల్లోనే ఉండి నష్టం అంచనాలు వేస్తున్నారు. జాతీయ విపత్తు నివారణ బృందాలే కొన్ని గ్రామాల్లో సహాయ చర్యలు చేపడుతున్నాయి. మొత్తం 9 బృందాలు స్థానిక పోలీసులు, రెవెన్యూ విభాగాల సహకారంతో సహాయ చర్యల్లో పాల్గొంటున్నాయి. ఈ ఆపరేషన్ పూర్తయ్యేంత వరకూ తమ సిబ్బంది ఇక్కడే ఉంటారని అసిస్టెంట్ కమాండెంట్ కృష్ణకుమార్ ‘సాక్షి’కి చెప్పారు. కాగా, ఇచ్ఛాపురం మండలంలోని మండపల్లి, మశాకపురం, తేలుకుంచి, కొళిగాం, పాయితారి, కీర్తిపురం, రత్తకన్న, డొంకూరు, పెదలక్ష్మీపురం గ్రామాలను వరద నీరు భయపెడుతోంది. ఈ గ్రామాలకు వెళ్లాలంటే అటు భీమ సముద్రం ఇటు బహుదానది మధ్య ఉండే ఒకే ఒక రోడ్డు వరద నీటిలో చిక్కుకుంది. మరోపక్క విజయనగరం జిల్లాలోని సీతానగరం, బలిజిపేట, మక్కువ, సాలూరు మండలాల్లో వందలాది ఎకరాల్లో పంట నాశనమైంది. మొక్కజొన్న, అరటి, చెరుకు పంటలు ఎక్కువగా దెబ్బతిన్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో చెట్లు విరిగి రాకపోకలకు ఇబ్బంది కలిగింది. -
ఉద్ధానంలో విద్యుత్, టెలిఫోన్ వ్యవస్థలు నిలిపివేత
శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లా ఉద్ధానంలో ముందు జాగ్రత్త చర్యగా విద్యుత్, టెలిఫోన్ వ్యవస్థలను అధికారులు శనివారం నిలిపివేశారు. పై-లిన్ తుపాన్ ప్రభావంతో ఉద్దానంలో జోరుగా ఈదురు గాలులు వీస్తున్నాయి. కాగా ఇప్పటివరకూ జిల్లాలో 60వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు మంత్రి కొండ్రు మురళి తెలిపారు. ప్రతి మండలంలో నాలుగు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. హెల్ప్ లైను నెంబర్లు: శ్రీకాకుళం: 0894-2240557/ 9652838191 విశాఖపట్టణం: 1800425002 విజయనగరం: 0892-2236947 టోల్ ఫ్రీ: 1077 తూర్పుగోదావరి: 0884-2365506 పశ్చిమగోదావరి: 0881230617 కృష్ణా: 086722525, టోల్ ఫ్రీ: 1077 గుంటూరు : 08632345103/08632234990 నెల్లూరు: 08612331477 ..... కాగా పై-లిన్ తుఫాన్ ప్రభావంతో పలు రైళ్లు రద్దు భువనేశ్వర్-తిరుపతి ఎక్స్‌ప్రెస్ రద్దు (భువనేశ్వర్-సికింద్రాబాద్) విశాఖ ఎక్స్‌ప్రెస్ రద్దు గుంటూరు- సింహాద్రి ఎక్స్‌ప్రెస్ రద్దు హౌరా-భువనేశ్వర్ జనశతాబ్ధి ఎక్స్‌ప్రెస్ రద్దు హౌరా-పూరి శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రద్దు భువనేశ్వర్-ఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్ రద్దు హౌరా-విశాఖ దారిలో ప్రయాణించే రైళ్లు రద్దు హౌరా నుంచి చెన్నై వెళ్లాల్సిన పలు రైళ్లు దారి మళ్లింపు