త‍్వరలో నెఫ్రాలజిస్టుల నియామకం: కామినేని
Published Sat, Apr 15 2017 1:08 PM | Last Updated on Tue, Sep 5 2017 8:51 AM
శ్రీకాకుళం: త్వరలో నెఫ్రాలజిస్టులను నియమిస్తామని మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. శనివారం జిల్లాలోని శ్రీకాకుళం జిల్లా పలాసలో డయాలసిస్ సెంటర్‌ను మంత్రి అచ్చెన్నాయుడుతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్దానం ప్రాంతంలో మూడు డయాలసిస్ సెంటర్లు ప్రారంభించామన్నారు. మరో 15 రోజుల్లో కిడ్నీ బాధిత ప్రాంతాల్లో వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
Advertisement
Advertisement