‘ప్రభుత్వాసుపత్రుల్లో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. పేదలకు సంజీవిని లాంటి 108 వాహనాలు మూలన పడ్డాయి. 108కి ఫోన్ చేస్తే డీజిల్ లేదనే సమాధానం వస్తోంది. 104 వాహనాల పరిస్థితీ అంతే తయారైంది. గతంలో కిడ్నీ పేషెంట్లకుగానీ, మూగ, చెవిటి పిల్లలకుగానీ ఆరోగ్యశ్రీలో ఆపరేషన్లు చేసేవారు. చంద్రబాబు సర్కారు ఇప్పుడు వాటిని ఎత్తేసింది. కిడ్నీ వ్యాధి బారిన పడివాళ్లకు మొదట మందులు ఇస్తారు. బ్లడ్ లెవెల్స్ మెయింటెనెన్స్ కోసం వారం లేదా రెండు రోజులకు ఒకసారి ఇంజక్షన్ ఇస్తారు. ఒక్కో ఇంజక్షన్‌కు రూ.650 ఖర్చవుతుంది. మందులకు రూ.2 వేల నుంచి రూ.5వేల దాకా ఖర్చవుతోంది. అప్పటికీ జబ్బు తగ్గకపోతే డయాలసిస్‌లోకి వెళతారు. దీనికి నెలకు రూ.20 వేల దాకా ఖర్చవుతుంది. ఇక చివరిస్టేజ్.. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్. ఈ ఆపరేషన్ ఖర్చు రూ.10 లక్షలు, ఆపరేషన్ తర్వాత మందులకు అయ్యే ఖర్చు అదనం. వ్యాధికిగురయ్యేవారిలో అధికులు పేదలే. వాళ్లందరిదీ వైద్యం చేయించుకోలేని పరిస్థితే. అలాంటి వారిని ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది’ అని వైఎస్ జగన్ అన్నారు.
Published Sat, May 20 2017 1:22 PM | Last Updated on Thu, Mar 21 2024 7:47 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement