శ్రీకాకుళం: వేరు నుంచి ఈనె వరకు.. నీరు నుంచి పీచు వరకు.. కాండం నుంచి కమ్మల వరకు.. వ్యర్థమంటూ లేదు. ఉద్దానాన్ని దశాబ్దాలుగా పెంచి పోషిస్తున్న కొబ్బరి స్పెషాలిటీ ఇది. నారికేళ వృక్షమంటే కొబ్బరి కాయ ఒక్కటే కాదు... తరచి చూస్తే ఈ తరువు నిలువెల్లా ఉపయోగకారిణే. ఇక్కడి కొబ్బరి ఉత్తరాదికి ఎగుమతి అవుతుంది.
కాయతోపాటు కమ్మలు, ఈనెలకు కూడా ఆ లారీల్లో స్థానం ఉంటుంది. అక్కడితో అయిపోలేదు. కొబ్బరి పీచు దొరకడం ఆలస్యం.. తాళ్ల నుంచి సోఫాల వరకు బోలెడు వస్తువులు తయారైపోతాయి. అదృష్టం ఉండి కొబ్బరి కాండం దొరికిందా.. అల్మరా బల్లల నుంచి దూలాల వరకు ఎన్నింటినో తయారు చేసుకోవచ్చు. ఇన్ని సద్గుణాలు ఉన్నాయి కాబట్టే ఉద్దానం పెద్ద కొడుకుగా దీనికి పేరు వచ్చింది.
పోషకాలు మెండు..
ఆరోగ్య పరిరక్షణలో కొబ్బరి పా త్ర కీలకం. చక్కటి పోషక విలు వలున్న ఆహారం. బీ6, ఐరన్, మెగ్నీషియం, జింక్ లాంటి శక్తినిచ్చే పోషకాలు దీనిలో ఉన్నాయి. గుండె పనితీరును మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుందని చెబుతున్నారు వైద్య నిపుణులు.
పీచుతో గృహ‘షో’భ..
కొబ్బరి కాయల్లో ఉండే పీచు పర్యావరణ హితమైంది. అందుకే దీనిని చాలా రకాల వస్తువుల తయారీలో వినియోగిస్తున్నారు. ముఖ్యంగా సోఫాలు, దిండ్లు, ఫ్లోర్‌మ్యాట్‌లు, పరుపుల తయారీలో అధికంగా వినియోగిస్తున్నారు. అలాగే తాళ్ల తయారీకి అధిక శాతం పీచును వినియోగిస్తున్నారు.
ఆహా..రం..
కొబ్బరి గుజురుతో కొబ్బరి పాలు, నూనె, బిస్కెట్లు, పాలపొడి, తినుబండారాల తయారీలతో పాటు వంటల్లో అదనపు రుచుల కోసం దీనిని వినియోగిస్తున్నారు. ఔ
కమ్మలు, ఈనెలు.. బోలెడు ఉపయోగాలు
కొబ్బరి ఈనెల నుంచి చీపుర్లను తయారు చేస్తు న్నారు. ఉద్దానం ప్రాంతంలో తయారైన చీపుళ్లకు వి విధ రాష్ట్రాల్లో ఫుల్ డిమాండ్ ఉంది. ఎండు ఈనెలు, పచ్చి ఈనెల్ని వేర్వేరుగా అమ్మకాలు చేస్తున్నారు. ఎండు ఈనెల్ని చీపుర్ల తయారీకి వినియోగిస్తున్నా రు. వీటికి ఒడిశా, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్టాలకు ఎగుమతి చేస్తున్నారు.
పచ్చి ఈనెల్ని పైకప్పులకు, ఊటబావుల్లో నీటి నిల్వకోసం, అగ్గిపుల్లల తయారీ, ఐస్‌క్రీం తయారీలో వినియోగిస్తున్నారు. ఒడిశా, ప శ్చిమ బెంగాల్‌లకు ఇవి ఎగుమతి అవుతున్నాయి. శుభకార్యమేదైనా కొబ్బరి కమ్మల పందిళ్లు వేయడం ఆనవాయితీ. వేసవి వచ్చిందంటే చాలు జిల్లాలోని ప్రతి ఏరియాలోనూ చలవ పందిళ్లు వేసి ప్రజలు సేదతీరు తుంటారు. కొబ్బరి కాండాన్ని దూలాలు గా, వంటచెరుకుగా, ఇంటిలోని అల్మారా బల్లలుగా, ఇంటి నిర్మాణంలో కలపగా వినియోగిస్తున్నారు.
సీడీబీ, ఉద్యానశాఖలు ఆధ్వర్యంలో..
కొబ్బరి పునరుద్ధరణ పథకం(ఆర్‌అండ్‌ఆర్‌జే): రైతు లు సాగుచేస్తున్న కొబ్బరితోటల్లో పురుగుపట్టి పాడై న చెట్లు, అనుత్పాదక చెట్లు తొలగించి కొత్త మొ క్కల పెంపకానికి రాష్ట్ర ప్రభుత్వం కొబ్బరి తోటల పునరుద్ధరణ పథకం(ఆర్‌అండ్‌ఆర్ జే ) సీడీబీ (కోకోనెట్ డెవలప్‌మెంట్ బోర్డ్) సాయంతో అమలు చేస్తోంది. దీనికోసం హెక్టారుకు రూ. 35000 వరకు ఆర్థిక ప్రోత్సాహాన్ని రైతులకు అందజేస్తోంది.
కొబ్బరి రైతు సంఘాలు(సీపీఎస్): 1000 చెట్లు సాగు చేసే రైతులు ఓ సమాఖ్యగా, 10 సమాఖ్యలు ఓ ఫెడరేషన్‌గా, 10 ఫెడరేషన్లు ఓ కంపెనీగా ఏర్పా టు చేయడం ఈ పథకం ఉద్దేశం. ఈ సీపీఎస్ సంఘాలకు కొబ్బరి అభివృద్ధి బోర్డు గుర్తింపు ఇస్తుంది. గుర్తింపు పొందిన కంపెనీలు, ఫెడరేషన్లకు ప్రత్యేక రాయితీలు, వ్యాపారంలో భాగస్వామ్యాలు కల్పించడం వంటి వెసులుబాటు ఉంది. కొబ్బరిమొక్కల ఉత్పత్తి కేంద్రం కూడా బారువలోఉంది.
సర్కారు సాయం ఇలా...
వడ్డీలేని రుణం: కొబ్బరి రైతులకు లక్ష రూపాయల వరకు పంటరుణంగా(క్రాప్ లోన్) స్వల్ప వడ్డీకే ప్రభుత్వం అందిస్తోంది. గరిష్టంగా రూ.1.60 లక్షల వరకు అందిస్తున్నారు. కిసాన్ గోల్డ్‌కార్డ్ పేరిట కొబ్బరితోటల అభివృద్ధి పథకం కింద రుణాన్ని కూడా అందజేస్తున్నారు. డీసీసీబీ ద్వారా షార్ట్‌టెర్మ్, లాంగ్‌టెర్మ్ రుణాలపేరిట భారీ మొత్తంలో రుణాలు మంజూరు చేస్తున్నారు.
విశేషాలెన్నో...
► ఎనిమిదేళ్లకు దిగుబడి మొదలై ఇరవై ఐదేళ్ల పాటు నిరంతరాయంగా కాయల్ని అందిస్తుంది.
► అతి తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ ఆదాయం సాధించే పంట.
► రాష్ట్రంలో ఉభయ గోదావరి జిల్లాల తర్వాత సిక్కోలులోనే కొబ్బరి పంట విస్తారంగా సాగవుతోంది.
నాణ్యమైన కొబ్బరి
ఉద్దానం కొబ్బరికి ప్రపంచ స్థాయిలో నాణ్య త విషయంలో ఎంతో గుర్తింపు ఉంది. కోకోనట్ ఫుడ్‌పార్క్ ఇక్కడ ఏర్పాటు చేయగలిగితే రైతుకు ప్రస్తుత ధర కంటే పది రెట్ల ఆదాయం దక్కుతుంది. కొబ్బరి ఉప ఉత్పత్తుల పరిశ్రమ ఏర్పాటు అయితే జిల్లా రాష్ట్రానికే తలమానికంగా నిలుస్తుంది. – జోహర్‌ఖాన్, చిక్కాఫ్ చైర్మన్, కవిటి
కోకోనట్ ఫుడ్‌పార్క్‌కు సీఎం భరోసా..
రాష్ట్రంలో రెండో కోనసీమగా గుర్తింపు పొందిన కవిటి ఉద్దానం ప్రాంత కొబ్బరి రైతుల ఆర్థికాభివృద్ధికి కోకోనట్ ఫుడ్‌పార్క్ ఏర్పాటు కోసం సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లాం. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అంశాలన్నింటిపై వ్యవసాయ శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి, జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రుల సహకారంతో ఈ ప్రాజెక్ట్ ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ప్రయత్నాలు ప్రారంభించాం.
– పిరియా సాయిరాజ్, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, ఇచ్ఛాపురం
Comments
Please login to add a commentAdd a comment