శ్రీకాకుళం జిల్లాలో రేపు పవన్ పర్యటన
విశాఖ: జనసేన అధ్యక్షుడు, ప్రముఖ సినీనటుడు పవన్ కల్యాణ్ మంగళవరాం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. ఉత్తరాంధ్ర కోనసీమగా పిలిచే శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం ప్రాంతంలో ఆయన మంగళవారం పర్యటించనున్నారు. 20 ఏళ్లగా అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న కిడ్నీ వ్యాధి సమస్య గురించి స్థానికుల నుంచి అడిగి తెలుసుకుంటారు.
ఉద‍్దానం ప్రాంతంలో గత రెండు దశాబ్దాల కాలంలో దాదాపు 20 వేల మంది కిడ్నీ వ్యాధి కారణంగా మరణించారని పవన్‌కల్యాణ్ సోమవారం తన ట్వీట్టర్‌లో పేర్కొన్నారు. ఇప్పటికీ ఆ ప్రాంతంలో లక్షల మంది అదే వ్యాధితో బాధపడుతున్నారన్నారు. అక్కడి ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వారు సమస్య పరిష్కారం కోసం సమర్థంగా పనిచేయలేదని దుయ్యబట్టారు.
కాగా రేపు ఉదయం ఇచ్ఛాపురంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులతో ఆయన ముఖాముఖీ అవుతారు. ఈ పర్యటనలో భాగంగా పవన్ సోమవారం సాయంత్రమే విశాఖ చేరుకున్నారు. రాత్రికి ఇక్కడే బస చేస్తారు. రేపు ఉదయం ఏడుగంటలకు శ్రీకాకుళం జిల్లా బయల్దేరి వెళతారు. ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలపై దృష్టి పెట్టిన పవన్ కిడ్నీ వ్యాధిగ్రస్తులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు.
— Pawan Kalyan (@PawanKalyan) 2 January 2017