విశాఖ : రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరారెడ్డి శనివారం ఉదయం విశాఖ చేరుకున్నారు. పై-లీన్ తుపాను నేపథ్యంలో ఆయన సహాయక చర్యలు పర్యవేక్షించనున్నారు. ఈ సందర్భంగా రఘువీరారెడ్డి మాట్లాడుతూ తీరప్రాంతాల్లో ఇప్పటికే ఆర్మీ, మిలటరీ, నేవీ దళాలు గస్తీ నిర్వహిస్తున్నాయన్నారు.
విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో సుమారు 64వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు చెప్పారు. మూడు రోజుల పాటు రఘువీరారెడ్డి విశాఖలోనే ఉండి తుపాను సహాయక చర్యలను పర్యవేక్షిస్తారు. తుపాను ప్రభావిత జిల్లాల అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతున్నారు.
విజయనగరం: 0892-2236947 టోల్ ఫ్రీ: 1077
తూర్పుగోదావరి: 0884-2365506
పశ్చిమగోదావరి: 0881230617
నెల్లూరు: 08612331477