పై-లిన్ పై అప్రమత్తం: రఘువీరా
హైదరాబాద్ : పైలిన్ తుపాను వల్ల ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సన్నద్ధం అవుతోంది. తుపానుతో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరారెడ్డి తెలిపారు. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు మంత్రి చెప్పారు.
తుపాను తీవ్ర ప్రభావం చూపు అవకాశం ఉన్న శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో 64వేల మందిని సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అధికారులు ఇచ్చే సూచనలను పాటించి ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఫైలిన్ తుపాను సూపర్ సైక్లోన్గా మారే అవకాశం లేదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
తుపాను తూర్పు ఆగ్నేయ దిశగా ప్రయణించి శనివారం నాటికి ఒడిశా-కళింగపట్నం-గోపాలపూర్ ప్రాంతాల్లో తుపాను తీరం దాటే అవకాశం ఉందని వివరించారు. అల్పపీడన ద్రోణి కూడా కొనసాగుతున్న కారణంగా రానున్న 12 గంటల్లో ఉత్తర కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. కోస్తా అంతటా భారీగా ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని సూచించారు.
శ్రీకాకుళం: 0894-2240557/ 9652838191
విశాఖపట్టణం: 1800425002
విజయనగరం: 0892-2236947 టోల్ ఫ్రీ: 1077
తూర్పుగోదావరి: 0884-2365506
పశ్చిమగోదావరి: 0881230617
కృష్ణా: 086722525, టోల్ ఫ్రీ: 1077
గుంటూరు : 08632345103/08632234990
నెల్లూరు: 08612331477
For the latest stories, you can like Sakshi News on Facebook and also follow us on Twitter. Get the Sakshi News app for Android or iOS