మచిలీపట్నం : పై-లిన్ తుపాను దృష్ట్యా కృష్ణాజిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. తుపాను తీరం దాటే సమయంలో భారీ వర్షాలు పడే అవకాశం ఉండటంతో పర్యాటకులను, జాలర్లను అధికారులు అనుమతించటం లేదు. దాదాపు ఆరడుగుల ఎత్తులో అలలు ఎగసిపడుతున్నాయి.
గిలకలదిండి హార్బర్ వద్ద మూడో నంబరు ప్రమాద హెచ్చరిక ఎగురవేశారు. దీంతో మంగినపూడి బీచ్‌లోకి పర్యాటకులను కూడా అనుమతించలేదు. కాగా సముద్రంలో ఉండిపోయిన 24 బోట్లు సముద్రపు పోటు అధికంగా ఉన్న సమయంలో హార్బర్‌కు చేరే అవకాశం ఉంది. మరోవైపు తుపాను కారణంగా కురిసిన భారీ వర్షాలతో పశ్చిమ కృష్ణాలోని కొండవాగు, బుడమేరు, పోతులవాగు, కుంపిణీ వాగు పొంగి ప్రవహిస్తున్నాయి. కృష్ణా: 086722525, టోల్ ఫ్రీ: 1077
విజయనగరం: 0892-2236947 టోల్ ఫ్రీ: 1077
తూర్పుగోదావరి: 0884-2365506
పశ్చిమగోదావరి: 0881230617
నెల్లూరు: 08612331477