
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో తీర ప్రాంత అభివృద్ధిలో మరో అడుగు ముందుకు పడింది. ఇటీవలే మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో.. మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం వేగం పెంచింది.
తాజాగా మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి రూ. 3, 940 కోట్లు మంజూరు అయ్యింది. దీంతో పోర్టు వ్యయానికి అవసరమయ్యే వంద శాతం రుణం పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ మంజూరు చేసినట్లయ్యింది.
ఈ మేరకు ఏపీ ప్రభుత్వానికి మంజూరు ఉత్తర్వులు పంపింది పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్. దీంతో అతి త్వరలోనే మచిలీపట్నం పోర్టుకు సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment