సాక్షి, కృష్ణా జిల్లా: మచిలీపట్నంలో టీడీపీ, జనసేనల మధ్య బ్యానర్ గొడవ తారాస్థాయికి చేరింది. పరాసుపేటలో వినాయకచవితి శుభాకాంక్షల పేరుతో కూటమి నేతలు బ్యానర్ ఏర్పాటు చేశారు. తమ ఫోటోలు వేయకపోవడంపై జనసేన నేతలు అభ్యంతరం తెలిపారు. రెండు రోజుల క్రితం రాత్రి వేళ బ్యానర్‌ను జనసేన నేతలు యర్రంశెట్టి నాని, శాయన శ్రీనివాసరావు చింపివేశారు.
దీంతో యర్రంశెట్టి నానిపై టీడీపీ నేతలు దాడి చేయడమే కాకుండా ఆయన ఇళ్లంతా ధ్వంసం చేశారు. ఈ దాడిలో యర్రంశెట్టి నాని గాయపడ్డారు.అనంతరం ఇరువర్గాల మధ్య పార్టీ పెద్దలు సెటిల్‌మెంట్ చేశారు. అయితే, సెటిల్‌మెంట్ చేసిన మరుసటి రోజు మరోసారి యర్రంశెట్టి నాని ఇంటిపై టీడీపీ దాడికి పాల్పడ్డారు. అక్కడే ఉన్న శాయన శ్రీనిసరావును రక్తం కారేలా టీడీపీ నేతలు తీవ్రంగా కొట్టారు.
బ్యానర్ చించినందుకు కాళ్లు పట్టించుకుని టీడీపీ నేతలు క్షమాపణ చెప్పించుకున్నారు. టీడీపీ నేత శంఖు శ్రీను కాళ్లు పట్టుకుని యర్రంశెట్టి నాని , శాయన శ్రీనివాసరావు క్షమాపణ చెప్పారు. జనసేన, టీడీపీ నేతలు ఒకరిపైఒకరు చిలకలపూడి స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు.
ఇదీ చదవండి: తమ వాళ్ల కోసం సోషల్ మీడియా పోస్టులు
Comments
Please login to add a commentAdd a comment