పలు జిల్లాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు
విశాఖపట్నానికి 950 కిలోమీటర్ల దూరంలో ఉత్తర దిశగా ఫైలిన్ తుఫాన్ కదులుతుందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం గురువారం వెల్లడించింది. పారాదీప్నకు 850 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని తెలిపింది. తీరం వెంబడి అలల ఉధృతి పెరుగుతుందని వివరించింది. అలాగే కళింగపట్నం - పారాదీప్ల మధ్య ఫైలిన్ తుపాన్ తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది.
శ్రీకాకుళం: ఫైలిన్ తుపాను నేపథ్యంలో జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు జిల్లా కలెక్టర్ సౌరభ్ గౌర్ గురువారం శ్రీకాకుళంలో వెల్లడించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లోని అధికారులతో ఆయన సమీక్షలు నిర్వహిస్తున్నారు. శ్రీకాకుళం కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు వివరించారు. తుఫాన్ నేపథ్యంలో ఎవరికి ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైన టోల్ ఫ్రీ నంబర్లు-08942 240557, 9652838191కు ఫోన్ చేయవచ్చని వివరించారు.
గుంటూరు: ఫైలిన్ తుఫాను నేపథ్యంలో అప్రమత్తంగా ఉన్నట్లు జిల్లా కలెక్టర్ గురువారం వెల్లడించారు. జిల్లాలోని నిజాంపట్నం ఓడరేవులో 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్టు తెలిపారు.సూర్యలంక బీచ్లో అలలు ఎగిసిపడుతున్నాయని, మత్స్యకారులు వేటకు వెళ్లొదని హెచ్చరికలు జారీ చేసినట్లు వివరించారు. అలాగే గుంటూరు, తెనాలి ఆర్డీవో కార్యాలయాల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. తెనాలి కంట్రోల్ రూమ్ 08644 - 223800 వెల్లడించారు. అలాగే తూర్పు గోదావరి జిల్లాలోని అమలాపురంలోని ఆర్డీవో కార్యాలయంలో తూఫాన్ కంట్రోల్ రూమ్ 08856 - 233100 ఏర్పాటు చేసినట్లు ఉన్నతాధికారులు తెలిపారు.
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలోని మండల ప్రత్యేక అధికారులతో జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్ గురువారం ఉదయం ఏలూరులో సమీక్ష నిర్వహించారు. నర్సాపురం డివిజన్పై ప్రత్యేక దృష్టి సారించాలని ఆ ప్రాంత అధికారులను ఆదేశించారు. తీరప్రాంతంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఏలూరు కలెక్టరేట్లో కంట్రోల్ రూంలో టోల్ ఫ్రీ నెంబర్: 08812 230617ను ఏర్పాటు చేశామన్నారు.
నెల్లూరు: తుపాను పట్ల అప్రమత్తంగా ఉండాలని తీరప్రాంత ప్రజలను నెల్లూరు జిల్లా కలెక్టర్ ఎన్.శ్రీకాంత్ కోరారు. జిల్లా కలెక్టరేట్లోని కంట్రోల్ రూమ్లో 1800 425 2499, 08612 331477 ట్రోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు.