కటక్: పారాదీప్ ఓడ రేవులో మూడు నెలలుగా బెర్త్ అద్దెను చెల్లించని ఓ విదేశీ నౌకను అరెస్ట్ చేయాలని ఒరిస్సా హైకోర్టు ఆదేశించింది! ఎంవీ డెబి అనే ఈ నౌకలో రూ.220 కోట్ల విలువైన కొకైన పట్టుబడటంతో గత డిసెంబర్ నుంచి పోర్టులో లంగరేసి ఉంది.
తమకు ఫీజు చెల్లించనందుకు షిప్పును అరెస్ట్ చేయాలంటూ పారాదీప్ పోర్టు కార్గో టెర్మినల్ విభాగం కోర్టుకెక్కింది. దాంతో నౌక అరెస్టుకు న్యాయమూర్తి జస్టిస్ వి.నరసింహ ఆదేశించారు. అడ్మిరాలిటీ చట్టం–2017 ప్రకారం ఇలాంటి ఆదేశాలు జారీ చేసే అధికారం ఒరిస్సాతో పాటు మరో ఏడు హైకోర్టులకుంది.
Comments
Please login to add a commentAdd a comment