costal andhra
-
కోస్తా తెలుగుదేశం అయోమయం.. ఉక్కిరిబిక్కిరవుతున్న తండ్రీకొడుకులు
రాష్ట్రంలో ఒక అడుగు ముందుకు వేస్తే రెండడుగులు వెనక్కన్నట్లు తయారైంది టీడీపీ పరిస్థితి. వరుస ఎన్నికల్లో ఓటమిలతో చేతులు కాలుతుంటే పట్టుకోవడానికి ఎక్కడా ఆకులు దొరకని దుస్థితి. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటున్న బాబును నమ్ముకుంటే ఇక తమ గతి అంతేనని ఆ పార్టీలోని అత్యధికులు ఇప్పటికే ఎవరి దారి వారు చూసుకుంటుంటే నిలువరించలేని దీన స్థితి. అక్కడక్కడా మిగిలిన కొద్దిపాటి శ్రేణులకు సరైన మార్గ నిర్దేశం లేక కింది నుంచి పైదాకా అంతటా అయోమయం. తమ ఏలుబడిలో ఏం వెలగబెట్టారో చెప్పుకోలేక.. ప్రస్తుత సర్కారు కంటే మెరుగ్గా ఏం చేస్తారో ఏడవ లేక తండ్రీకొడుకులు ఉక్కిరిబిక్కిరవుతున్న సీన్లు నిత్యం కనిపిస్తూనే ఉన్నాయి. బాబు ఆశాదీపం పరిస్థితి దైవా‘దీనం’గా మారింది. సాక్షి ప్రత్యేక ప్రతినిధి/ సాక్షి, అమరావతి: మధ్య కోస్తాంధ్రలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి దీనంగా మారింది. సీనియర్లు చేతులెత్తేయడంతో పలు జిల్లాల్లో పార్టీని నడిపించే నాథులే లేకుండాపోయారు. అధికారంలో ఉన్నప్పుడు హవా చెలాయించిన నేతలు ఇప్పుడు చంద్రబాబుకు మొహం చాటేస్తుండడంతో ఆయన కొత్త వారి కోసం అన్వేషణలో మునిగిపోయారు. పలు నియోజకవర్గాలకు ఇన్చార్జిలను నియమించ లేక.. ఎవరు పార్టీలోకి వస్తారా అని ఎదురు చూపులు చూస్తున్నారు. పారిశ్రామికవేత్తలు, ఎన్ఆర్ఐలు, వలస నేతలపై ఆశలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరులో కానుకలు ఆశ చూపి జనాన్ని రప్పించేందుకు ప్రయత్నించి ముగ్గురు మృతికి కారణమయ్యారు. మైదానాల్లో సభలు పెట్టేందుకు ధైర్యం చేయలేక.. ఇరుకు సందుల్లో సభల నిర్వహణకు మొగ్గు చూపుతున్నారు. వైఎస్ జగన్‌ను ఎదుర్కోవడం తన వల్ల కాదని అర్థమవడంతో తోడు కోసం తహ తహ లాడుతున్నారు. గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీని నడిపించే నాయకుడే కరువయ్యాడు. సీనియర్లు చేతులెత్తేసిన పరిస్థితుల్లో కొత్త వారి కోసం చంద్రబాబు గేలం వేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు అన్నీ తానై చక్రం తిప్పిన మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గత ఎన్నికల్లో ఓటమి తర్వాత పూర్తిగా సైలెంట్ అయిపోయారు. హైదరాబాద్‌లోనే ఉండి వ్యాపారాలు చూసుకుంటున్నారు. టీడీపీ తరఫున గెలిచిన ముగ్గురు ఎంపీల్లో ఒకరైన గల్లా జయదేవ్ అడ్రస్ లేకుండా పోయారని ఆ పార్టీ నేతలే వాపోతున్నారు. ఆయన తన నియోజకవర్గం గుంటూరులో పర్యటించి ఏడాది దాటిపోయింది. ధూళిపాళ నరేంద్ర, ఆలపాటి రాజా వంటి నేతలు మొక్కుబడి కార్యక్రమాలు మినహా పార్టీలో చురుగ్గా తిరగడం లేదని టీడీపీ శ్రేణులు వాపోతున్నాయి. తెనాలి సీటు పొత్తులో పోతుందనే ప్రచారం, గుంటూరు వెస్ట్‌లో కన్నా లక్ష్మీనారాయణ కర్చీఫ్ వేయడంతో ఆలపాటి రాజా పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కీలకమైన సత్తెనపల్లికి ఇప్పటి వరకు ఇన్‌ఛార్జినే నియమించకపోగా, రిజర్వుడు నియోజకవర్గం పత్తిపాడులో జనరల్ వ్యక్తిని ఇన్ఛార్జిగా పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. మాచర్లలో ఫ్యాక్షనిజాన్ని నమ్ముకున్నారు. ‘తూర్పు’లో దీనావస్థ.. ► ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, జ్యోతుల నెహ్రూ మధ్య విబేధాలు, ఆధిపత్య పోరు సుదీర్ఘకాలం నుంచి కొనసాగుతూనే ఉంది. యనమల తన సొంత నియోజకవర్గం తునిలోనూ తమ్ముడు కృష్ణుడితో విరోధం తెచ్చుకున్నారు. ఇన్నాళ్లూ తనకు అండగా నిలిచిన సోదరుడిని పక్కన పెట్టి, తన కుమార్తె దివ్యకు తుని ఇన్‌ఛార్జి పదవి ఇప్పించుకోవడంతో ఆయన కుటుంబంలో చిచ్చు రేగింది. ► రాజమండ్రిలో ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి భవాని, గోరంట్ల బుచ్చయ్య చౌదరిల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. గోరంట్ల రాజమండ్రి నగరానికి వచ్చేందుకు ప్రయత్నిస్తుండగా ఆదిరెడ్డి కుటుంబం అడ్డుకుంటోంది. చంద్రబాబు తనను అవసరానికి వాడుకుని పట్టించుకోవడం లేదని, ఆదిరెడ్డిని ప్రోత్సహిస్తున్నారనే అసంతృప్తితో గోరంట్ల రగిలిపోతున్నారు. ► రాజానగరం, పి గన్నవరం, కొవ్వూరు నియోజకవర్గాలకు చంద్రబాబు ఇంతవరకు ఇన్‌ఛార్జిలనే నియమించలేకపోయారు. రాజానగరంలో పెందుర్తి వెంకటేష్ తప్పుకున్న తర్వాత కొత్త నాయకుడు దొరకలేదు. పెద్దాపురంలో సిట్టింగ్ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, బొడ్డు భాస్కరరామారావు కొడుకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇటీవల చంద్రబాబు పర్యటనలో రాజప్పే పెద్దాపురం అభ్యర్థని ప్రకటించినా వెనువెంటనే బొడ్డు వర్గం ఆయన్ను అడ్డుకుని గందరగోళం సృష్టించింది. ► పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ వర్మపై స్థానిక టీడీపీ నేతలంతా కట్టకట్టుకుని వెళ్లి చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. తోట త్రిమూర్తులు వైఎస్సార్సీపీలో చేరాక రామచంద్రాపురంలో టీడీపీయే లేకుండా పోయింది. ► రంపచోడవరంలో టీడీపీ నిస్తేజంగా మారింది. చంద్రబాబు ఇచ్చిన పిలుపును తూర్పులో పట్టించుకునే పరిస్థితి లేదు. అందుకే చంద్రబాబు మొన్న అనపర్తిలో సభకు ఇరుకు సందును ఎంచుకుని జనం ఎక్కువగా వచ్చినట్లు చూపించేందుకు ప్రయత్నించారు. మాలోకం పరిస్థితి ఎంటో! మంగళగిరిలో పార్టీ పరిస్థితి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిదని టీడీపీ శ్రేణులే చెబుతున్నాయి. గంజి చిరంజీవి, మరికొందరు టీడీపీని వీడిన తర్వాత లోకేశ్ భవితవ్యం ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది. ఇక్కడ ఎలా గెలవాలో తెలియని ఆందోళన ఓ వైపు పీడిస్తుండగా.. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర మొదలు పెట్టడం మైనస్సేనని కార్యకర్తలు కుండబద్ధలు కొడుతున్నారు. ఉమ్మడి కృష్ణాలో ఎదురీత ► ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీ ముఖ్య నాయకులు కాడి వదిలేశారు. తమకు పట్టుందని చెప్పుకునే జిల్లాలోనే ఆ పార్టీ నేతలు ఎదురీదుతున్నారు. విజయవాడలో ఉన్న నేతలంతా ఎవరికి వారు సొంత గ్రూపులు పెట్టుకుని రచ్చ రాజకీయాలతో కాలం గడుపుతున్నారు. ► అధికారంలో ఉన్నప్పుడు చక్రం తిప్పిన దేవినేని ఉమామహేశ్వరరావు ఇప్పుడు మైలవరంలో పోటీ చేస్తే చిత్తుగా ఓడిపోతాననే భయంతో పక్క నియోజకవర్గాల వైపు తొంగి చూస్తున్నారు. ► విజయవాడ ఎంపీ కేశినేని నాని చంద్రబాబుపై తిరుగుబాటు జెండా ఎగురవేసి తాను మళ్లీ పోటీ చేయనని చెబుతున్నారు. కేశినేని నానికి పొగ పెట్టేలా బుద్ధా వెంకన్న, బొండా ఉమా తదితర నేతలు ఆయన తమ్ముడు కేశినేని శివనాథ్‌ను ఎంపీ అభ్యర్థిగా రంగంలోకి తీసుకువచ్చారు. ► బందరు ఎంపీగా ఓటమిపాలైన కొనకళ్ల నారాయణ ఈసారి పెడన ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చూస్తుండడంతో కాగిత వెంకట్రావు కుమారుడు కృష్ణప్రసాద్ కారాలు, మిరియాలు నూరుతున్నారు. వారి మధ్య సయోధ్య కుదర్చలేక చంద్రబాబు ఆపసోపాలు పడుతున్నారు. పామర్రులో మాజీ ఎమ్మెల్యే ఉప్పలేటి కల్పనను పక్కకు తప్పించి, వర్ల రామయ్య కుమారుడు కుమార్ రాజాను ఇన్ఛార్జిగా నియమించినా అక్కడ క్యాడర్లో అయోమయం తొలగలేదు. ► గుడివాడ, గన్నవరం, నూజివీడు నియోజకవర్గాల్లో టీడీపీ కుంటుకుంటూ నడుస్తోంది. వల్లభనేని వంశీ టీడీపీకి దూరమయ్యాక ఇప్పటి వరకు గన్నవరానికి సరైన ఇన్‌ఛార్జిని నియమించలేకపోయారు. గుడివాడలో కొడాలి నానిని ఎదుర్కొనే నేత కోసం చంద్రబాబు అన్వేషణ కొనసాగుతూనే ఉంది. రావి వెంకటేశ్వరరావు, మరికొందరు నేతలను పని చేయిస్తున్నా, వారు నానిపై పోటీకి సరిపోరని అక్కడి క్యాడర్ తెగేసి చెబుతోంది. నూజివీడు, తిరువూరులోనూ ఆ పార్టీని నడిపించే నాథులు లేరు. పూర్వపు పశ్చిమలో నాయకత్వం కరువు ► ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోనూ టీడీపీని నాయకత్వ సమస్య వేధిస్తోంది. గతంలో జిల్లాను నడిపించిన మాగంటి బాబు, సీతారామలక్ష్మి వంటి నేతలు ప్రస్తుతం స్తబ్దుగా ఉంటున్నారు. ► మిగిలిన చాలా నియోజకవర్గాల్లో ఆ పార్టీ నేతలు చురుగ్గా లేకపోవడం, బలహీన నాయకులు కావడంతో పార్టీ కార్యక్రమాలేవీ జరగడంలేదు. ఉండి నియోజకవర్గంలో ఎమ్మెల్యే రామరాజు ఒక గ్రూపుగా, మాజీ ఎమ్మెల్యే శివరామరాజు మరో గ్రూపుగా మారడంతో ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. ► కీలకమైన భీమవరంలో ఆ పార్టీకి పూర్తి స్థాయి ఇన్‌ఛార్జి లేక పరిస్థితి దయనీయంగా ఉంది. మాజీ ఎంపీ సీతారామలక్ష్మిని ఇన్ఛార్జిగా పెట్టినా అది కంటి తుడుపు చర్యేనని పార్టీ నాయకులు వాపోతున్నారు. చింతలపూడికి మాజీ మంత్రి పీతల సుజాత దూరమవడంతో ఇప్పుడు అక్కడ ఇన్‌ఛార్జి లేరు. ద్వితీయ శ్రేణి నాయకులతోనే పార్టీ నడుస్తోంది. నర్సాపురం, కైకలూరు, పోలవరం, ఏలూరు నియోజకవర్గాల్లోనూ ఆ పార్టీని నాయకత్వ సమస్య పీడిస్తోంది. కైకలూరు ఇన్‌ఛార్జి జయమంగళ వెంకట రమణ రెండు రోజుల క్రితం వైఎస్సార్సీపీలో చేరడంతో అక్కడ టీడీపీ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా మారింది. -
రెండ్రోజులు కోస్తాంధ్రకు వర్ష సూచన
సాక్షి, విశాఖపట్నం/పాడేరు: పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి సమీపంలో తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర మీదుగా ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 5.1 కి.మీ. ఎత్తు వరకు విస్తరించింది. మరోవైపు ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో స్వల్ప అల్పపీడనం ఏర్పడింది. ఇది క్రమంగా బలహీనపడి నెల్లూరు, తమిళనాడు వైపుగా ప్రయాణించే సూచనలు కనిపిస్తున్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. అల్పపీడన ప్రభావంతో కోస్తాంధ్ర జిల్లాల్లో శని, ఆదివారాల్లో విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే సూచనలున్నాయని వివరించారు. ముఖ్యంగా నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడతాయని తెలిపారు. రాయలసీమలో అక్కడక్కడా తేలికపాటి వానలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ నెల 12న దక్షిణాంధ్ర, ఉత్తర తమిళనాడు ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని, దీని ప్రభావంతో కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు ఈ నెల 13 నుంచి మొదలయ్యే సూచనలున్నాయని వెల్లడించారు. విజయవాడలో అత్యధిక వర్షపాతం 2021లో అత్యధిక వర్షపాతం నమోదైన నగరంగా విజయవాడ రికార్డు సృష్టించింది. తర్వాత స్థానంలో కడప ఉండటం విశేషం. ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు కురిసిన వర్షపాత వివరాల్ని పరిశీలిస్తే.. విజయవాడలో అత్యధికంగా 1,548 మి.మీ. వర్షపాతం నమోదైంది. కడపలో 1,342, విజయనగరంలో 1,331 మి.మీ. వర్షం కురిసింది. సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైన నగరాల జాబితాలో అట్టడుగున నెల్లూరు 440 మి.మీ. వర్షపాతంతో ఉండగా, కర్నూలులో 461, కావలిలో 552, ఒంగోలులో 698 మి.మీ. వర్షపాతం నమోదైంది. పడిపోతున్న ఉష్ణోగ్రతలు విశాఖ ఏజెన్సీలో చలిగాలులు ప్రారంభమయ్యాయి. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. పొగమంచు దట్టంగా కురుస్తోంది. గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం సూర్యోదయం అయ్యే వరకు చలి తీవ్రత నెలకొంది. అతిశీతల ప్రాంతాలుగా గుర్తింపు పొందిన కాఫీ తోటల ఏరియాల్లో మాత్రం చలిగాలులు అధికంగా వీస్తున్నాయి. పాడేరుకు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న అతిశీతల ప్రాంతం మినుములూరు కేంద్ర కాఫీ బోర్డు వద్ద ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఈ నెల 3న 17 డిగ్రీలు, 4వ తేదీన 15 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాగా, శుక్రవారం ఉదయం 10 డిగ్రీలకు ఉష్ణోగ్రత పడిపోయింది. చింతపల్లి వ్యవసాయ పరిశోధన కేంద్రంలో శుక్రవారం 14.4, అరకులోయ కేంద్ర కాఫీ బోర్డు కార్యాలయంలో 18.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
నేడు రాయలసీమలో విస్తారంగా వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: కోస్తా, రాయలసీమల్లో సోమవారం, మంగళవారం అక్కడక్కడా తేలికపాటి వానలు కురిసే సూచనలున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రధానంగా రాయలసీమలో సోమవారం రాత్రి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది. అరేబియా సముద్రానికి సమీపంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. దీనివల్ల తేమగాలులు రాయలసీమ వైపు కదులుతున్నాయి. అదేవిధంగా తక్కువ ఎత్తులో నైరుతి గాలులు వీస్తున్నాయి. ఈ ప్రభావంతో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. గత 24 గంటల్లో పెద్దపల్లిలో 8.9, చంద్రగిరిలో 6.7, రామచంద్రాపురంలో 6.6, తిరుపతిలో 6.2, కుప్పంలో 5.0, పెద్దారవీడులో 4.9, శ్రీరంగరాజపురంలో 4.2 సెం.మీ వర్షపాతం నమోదైంది. -
ఏపీలో రానున్న రెండు రోజుల్లో వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: జార్ఖండ్ నుంచి ఒడిశా వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉత్తర కోస్తా మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడింది. ఇది సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. ఇప్పటివరకు నైరుతి నుంచి వాయువ్యం మీదుగా వీచిన గాలులు.. నేటి నుంచి దిశ మార్చుకొని నైరుతి నుంచి ఈశాన్యం మీదుగా వీచే అవకాశాలున్నాయి. ఫలితంగా.. వాతావరణంలో మార్పులు రానున్నాయి. ఎండ తీవ్రత క్రమంగా తగ్గనుంది. బుధవారం మాత్రం ఎండలు ఠారెత్తించాయి. అనేక చోట్ల సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గురువారం కూడా ఎండలు ఇదే రీతిలో ఉండే అవకాశముంది. ఇదిలా ఉండగా.. ఈ నెల 16న కోస్తా తీరంలో అల్పపీడనం ఏర్పడి ఉత్తరాంధ్ర మీదుగా తెలంగాణ వైపు పయనించే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో 16 నుంచి వర్షాలు జోరందుకునే సూచనలున్నట్లు తెలిపింది. మరోవైపు ద్రోణి ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో రానున్న 2 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నాయని పేర్కొంది. -
రేపు మరో అల్పపీడనం
మహారాణిపేట (విశాఖ దక్షిణ): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోంది. తూర్పు మధ్యప్రదేశ్ మధ్య భాగం, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనానికి అనుబంధంగా 7.6 కిలోమీటర్లు ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతోందని వాతావరణ అధికారులు తెలిపారు. వాయవ్య బంగాళాఖాతంలో, దాని పరిసర ప్రాంతాల్లో ఈనెల 23న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని చెప్పారు. రానున్న 48 గంటల్లో రాష్ట్రంలో ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. కోస్తా తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నందున మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. -
ఏపీలో మరో 3 రోజులపాటు వర్షాలు
సాక్షి, అమరావతి: తూర్పు-పశ్చిమ బంగాళఖాతం షేర్ జోన్ 20 °N అక్షాంశం వెంబడి సెంట్రల్ ఇండియా మీదుగా ఉపరితల ద్రోణి 4.5 కిమీ నుంచి 7.6 కిమీ ఎత్తు మధ్య కొనసాగుతోందని ఏపీ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది ఎత్తుకు వెళ్ళేకొద్దీ నైరుతి దిశ వైపుకు వంపు తిరిగి ఉండటం వల్ల ఉత్తర బంగాళాఖాతం ప్రాంతంలో ఆగష్టు 19వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. తదుపరి 42 గంటల్లో ఈ ఉపరితల ద్రోణి మరింత బలపడి క్రమంగా పడమర వైపుకు కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో రాగల మూడు రోజుల వాతావరణ సూచన తూర్పు-పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తర కోస్తాంధ్ర, యానం, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో రాబోయే రెండు రోజులు(మంగళవారం, బుధవారం) ఉరుములు మెరుపులతో కూడిన వర్షంతో పాటు చాలా చోట్ల తెలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గురువారం కూడా ఈ మూడు ప్రాంతాల్లో చాల చోట్ల తెలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. -
ఉపరితల ద్రోణి: ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు
సాక్షి, అమరావతి: తూర్పు-పశ్చిమ బంగాళఖాతం షేర్ జోన్ 13 °N అక్షాంశం వెంబడి ఉపరితల ద్రోణి 3.1 కిమీ నుంచి 5.8 కిమీ ఎత్తు మధ్య కొనసాగుతోందని ఏపీ వాతావరణ కేంద్ర వెల్లడించింది. ఇది ఎత్తుకు వెళ్ళేకొద్దీ దక్షిణ దిశ వైపుకు వంపు తిరిగి ఉన్నట్లు ప్రేర్కొంది. దీనివల్ల దక్షిణ కోస్తా ఆంధ్ర, దాని పక్కనే ఉన్న ఉత్తర తమిళనాడు ప్రాంతాలలో 3.1కిమీ నుంచి 5.8కిమీ ఎత్తు మధ్య ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఎత్తుకు వెళ్లే కొలది ఇది నైరుతి దిశ వైపుకు వంపు తిరిగి, కోత జోన్‌తో కలసినట్లు వాతావారణ కేంద్రం వెల్లడించింది. దీంతో మరట్వాడ నుంచి ఉత్తర తమిళనాడు వరకు ఇంటీరియర్ కర్ణాటక మీదుగా 1.5 కిమీ ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి ఏర్పడిందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. మూడు రోజుల వరకు వాతావరణ సూచన: ఉత్తర, దక్షిణ కోస్తా ఆంధ్ర, యానాం,రాయలసీమ ప్రాంతాల్లో ఈరోజు(శుక్రవారం) ఉరుములు, మెరుపులుతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. అలాగే భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. అదే విధంగా రేపు ఈ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులుతో పాటు ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక ఆదివారం కూడా ఈ మూడు ప్రాంతాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. -
కోస్తాంధ్రలో మూడు రోజుల పాటు వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: నైరుతి రుతుపవనాలు కోస్తాంధ్రపై సాధారణంగా ప్రభావం చూపుతున్నాయి. రాయలసీమలో బలహీనంగా ఉన్నాయి. మరోవైపు వాయవ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది సముద్రమట్టానికి 3.1 నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తులో దక్షిణం దిశగా ఆవరించి ఉంది. వీటి ఫలితంగా రానున్న మూడు రోజులు కోస్తాంధ్రలో కొన్నిచోట్ల, రాయలసీమలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శుక్రవారం రాత్రి నివేదికలో తెలిపింది. శనివారం కోస్తాంధ్రలో అనేక ప్రాంతాల్లో మోస్తరు వర్షాలకు ఆస్కారం ఉందని పేర్కొంది. నైరుతి దిశ నుంచి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో తీరం వెంబడి బలమైన గాలులు వీస్తాయని, మత్స్యకారులు సముద్రంలో చేపలవేటకు వెళ్లవద్దని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు సూచించారు. గడచిన 24 గంటల్లో కోస్తాంధ్రలో అనేక చోట్ల వర్షాలు కురిశాయి. అమలాపురంలో 7, భీమవరంలో 4, హోలగుండలో 2, తుని, కొయ్యలగూడెం, కంభం, బెస్తవారిపేట, తిరువూరు, పొదిలి, అర్థవీడు, వీరఘట్టం, పోలవరం, గరుగుబిల్లి, పార్వతీపురంల్లో ఒక్కో సెంటీమీటరు వర్షం కురిసింది. -
రాగల 48గంటల్లో తెలంగాణ,కోస్తాంద్రలో వర్షాలు
-
మచిలీపట్నానికి 80కి.మీ దూరంలో లెహర్
లెహర్ తున్ క్రమంగా బలహీనపడుతోంది. తుపాను కాస్తా... తీవ్ర వాయుగుండంగా మారిపోయింది. అయితే... సాయంత్రానికి ఇది మరింత బలహీనపడే అవకాశం ఉందని వాతావరణశాఖ చెప్పింది. మచిలీపట్నానికి 80 కిలోమీటర్ల దూరంలో ఈ వాయుగుండం కేంద్రీకృతమైయ్యింది. గంటకు 20 కిలోమీటర్ల వేగంతో వాయుగుండం కదులుతోంది. రాత్రి ఏడు గంటల సమయంలో తుపాను తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ సమయంలో గంటకు 50 నుంచి 75కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. వచ్చే 24 గంటల్లో కోస్తాంధ్రలో, 36 గంటల్లో తెలంగాణలోనూ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది. దీని ప్రభావంతో విశాఖ, తూర్పు, పశ్చిమ, కృష్ణ, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. అలాగే ప్రకాశం జిల్లాలో భారీ గాలులు వీస్తాయని, తెలంగాణ జిల్లాల్లో కూడా ఈ ప్రభావం ఉంటుందని చెప్పారు. కోస్తావ్యాప్తంగా వర్షాలు పడతాయని తెలిపారు. -
మరో 24గంటలు వర్షాలు
-
బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం
విశాఖ :బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. మరోవైపు ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా కదలటంతో కోస్తా, రాయలసీమల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర తమిళనాడు ప్రాంతాలను ఆనుకొని పశ్చిమ బంగాళాఖాతంలో ప్రస్తుతం తీరంవైపు అల్పపీడనం కేంద్రీకృతమై ఉంది. ఇది వాయుగుండంగా మారే వాతావరణ పరిస్థితులపై ఈరోజు ఒక అంచనాకు వస్తామని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. అదే సమయంలో మరో అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని, దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు పడతాయన్నారు. కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు కురుస్తామన్నారు. వచ్చే 24 గంటల్లో కోస్తాంధ్ర జిల్లాలతోపాటు రాయలసీమలోని కడప, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొందని విపత్తు నిర్వహణ శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణలోని మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక తిరుమలలో గత రెండు రోజులు నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే కర్నూలు జిల్లా శ్రీశైలంలో వర్షాల కారణంగా ఆలయం ముందు ఉన్న దుకాణాల వరకూ వర్షపు నీరు చేరింది. మరోవైపు వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రజలు విజ్ఞప్తి చేశారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని సూచించారు. -
బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం
-
పలు జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు
విశాఖపట్నానికి 950 కిలోమీటర్ల దూరంలో ఉత్తర దిశగా ఫైలిన్ తుఫాన్ కదులుతుందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం గురువారం వెల్లడించింది. పారాదీప్నకు 850 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని తెలిపింది. తీరం వెంబడి అలల ఉధృతి పెరుగుతుందని వివరించింది. అలాగే కళింగపట్నం - పారాదీప్‌ల మధ్య ఫైలిన్ తుపాన్ తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. శ్రీకాకుళం: ఫైలిన్ తుపాను నేపథ్యంలో జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు జిల్లా కలెక్టర్ సౌరభ్ గౌర్ గురువారం శ్రీకాకుళంలో వెల్లడించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లోని అధికారులతో ఆయన సమీక్షలు నిర్వహిస్తున్నారు. శ్రీకాకుళం కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు వివరించారు. తుఫాన్ నేపథ్యంలో ఎవరికి ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైన టోల్ ఫ్రీ నంబర్లు-08942 240557, 9652838191కు ఫోన్ చేయవచ్చని వివరించారు. గుంటూరు: ఫైలిన్ తుఫాను నేపథ్యంలో అప్రమత్తంగా ఉన్నట్లు జిల్లా కలెక్టర్ గురువారం వెల్లడించారు. జిల్లాలోని నిజాంపట్నం ఓడరేవులో 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్టు తెలిపారు.సూర్యలంక బీచ్‌లో అలలు ఎగిసిపడుతున్నాయని, మత్స్యకారులు వేటకు వెళ్లొదని హెచ్చరికలు జారీ చేసినట్లు వివరించారు. అలాగే గుంటూరు, తెనాలి ఆర్డీవో కార్యాలయాల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. తెనాలి కంట్రోల్ రూమ్ 08644 - 223800 వెల్లడించారు. అలాగే తూర్పు గోదావరి జిల్లాలోని అమలాపురంలోని ఆర్డీవో కార్యాలయంలో తూఫాన్ కంట్రోల్ రూమ్ 08856 - 233100 ఏర్పాటు చేసినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలోని మండల ప్రత్యేక అధికారులతో జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్ గురువారం ఉదయం ఏలూరులో సమీక్ష నిర్వహించారు. నర్సాపురం డివిజన్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని ఆ ప్రాంత అధికారులను ఆదేశించారు. తీరప్రాంతంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఏలూరు కలెక్టరేట్లో కంట్రోల్ రూంలో టోల్ ఫ్రీ నెంబర్: 08812 230617ను ఏర్పాటు చేశామన్నారు. నెల్లూరు: తుపాను పట్ల అప్రమత్తంగా ఉండాలని తీరప్రాంత ప్రజలను నెల్లూరు జిల్లా కలెక్టర్ ఎన్.శ్రీకాంత్ కోరారు. జిల్లా కలెక్టరేట్లోని కంట్రోల్ రూమ్‌లో 1800 425 2499, 08612 331477 ట్రోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు.