మచిలీపట్నానికి 80కి.మీ దూరంలో లెహర్ | Cyclonic storm 'Lehar' weakens; turns into deep depression | Sakshi
Sakshi News home page

మచిలీపట్నానికి 80కి.మీ దూరంలో లెహర్

Published Thu, Nov 28 2013 12:33 PM | Last Updated on Sat, Sep 2 2017 1:04 AM

మచిలీపట్నానికి 80కి.మీ దూరంలో లెహర్

మచిలీపట్నానికి 80కి.మీ దూరంలో లెహర్

లెహర్‌ తున్‌ క్రమంగా బలహీనపడుతోంది. తుపాను కాస్తా... తీవ్ర వాయుగుండంగా మారిపోయింది. అయితే... సాయంత్రానికి ఇది మరింత బలహీనపడే అవకాశం ఉందని వాతావరణశాఖ చెప్పింది. మచిలీపట్నానికి 80 కిలోమీటర్ల దూరంలో ఈ వాయుగుండం కేంద్రీకృతమైయ్యింది. గంటకు 20 కిలోమీటర్ల వేగంతో వాయుగుండం కదులుతోంది.  రాత్రి ఏడు గంటల సమయంలో తుపాను తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

ఈ సమయంలో గంటకు 50 నుంచి 75కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. వచ్చే 24 గంటల్లో కోస్తాంధ్రలో, 36 గంటల్లో తెలంగాణలోనూ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది. దీని ప్రభావంతో విశాఖ, తూర్పు, పశ్చిమ, కృష్ణ, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. అలాగే ప్రకాశం జిల్లాలో భారీ గాలులు వీస్తాయని, తెలంగాణ జిల్లాల్లో కూడా ఈ ప్రభావం ఉంటుందని చెప్పారు. కోస్తావ్యాప్తంగా వర్షాలు పడతాయని తెలిపారు.

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement