కళింగపట్నానికి 340 కి.మీ దూరంలో పైలిన్ తుపాన్ కేంద్రీకృతమైంది. దాంతో ఆంధ్రప్రదేశ్, ఒడిశా తీర ప్రాంతంలో సముద్రం
అల్లకల్లోలంగా ఉంది. తుపాన్ వల్ల 50 అడుగులకు పైగా అలలు ఎగిసిపడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. కోస్తా తీరం వెంబడి అన్ని నౌకాశ్రయాల్లో మూడవ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.
పైలిన్ తుపాన్ ఈ రాత్రికి గోపాలుపూర్ వద్ద తీరం దాటే అవకాశం ఉంది. గంటలకు 220 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచే అవకాశం ఉంది. తుపాన్ తీరం దాటేటప్పుడు 25 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉందని విశాఖలోని తుఫాన్ హెచ్చరిక కేంద్రం భావిస్తుంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు ఇప్పటికే కురుస్తున్నాయి. విశాఖ - ఒడిశాల మధ్య శనివారం పలు రైళ్ల సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే ఓ ప్రకటన విడుదల చేసింది.
విజయనగరం: 0892-2236947 టోల్ ఫ్రీ: 1077
తూర్పుగోదావరి: 0884-2365506
పశ్చిమగోదావరి: 0881230617
నెల్లూరు: 08612331477