gopalpur
-
అదానీ చేతికి గోపాల్పూర్ పోర్టు
న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం అదానీ గ్రూప్ ఖాతాలోకి మరో పోర్టు వచ్చి చేరనుంది. గ్రూప్‌లో భాగమైన అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ సంస్థ (ఏపీసెజ్) తాజాగా ఒడిశాలోని గోపాల్పూర్ పోర్టును (జీపీఎల్) దక్కించుకోనుంది. ఇందుకోసం జీపీఎల్లో షాపూర్జీ పల్లోంజీ (ఎస్పీ) గ్రూప్, ఒడిశా స్టీవ్డోర్స్ లిమిటెడ్ (ఓఎస్ఎల్) నుంచి 95 శాతం వాటాలను రూ. 1,349 కోట్లకు కొనుగోలు చేయనుంది. జీపీఎల్లో ఎస్పీ పోర్ట్ మెయింటెనెన్స్‌కి 56 శాతం, ఓఎస్ఎల్కి 44 శాతం వాటాలు ఉన్నాయి. ఇందులో ఎస్పీ గ్రూప్ వాటాలను పూర్తిగా, ఓఎస్ఎల్ నుంచి 39 శాతం వాటాలను ఏపీసెజ్ కొనుగోలు చేయనుంది. ఓఎస్ఎల్ 5 శాతం వాటాతో జాయింట్ వెంచర్ భాగస్వామిగా కొనసాగనుంది. రూ. 3,080 కోట్ల ఎంటర్ప్రైజ్ విలువతో 95 శాతం వాటాను రూ. 1,349 కోట్లకు కొనుగోలు చేస్తున్నట్లు ఏపీసెజ్ తెలిపింది. నిర్దిష్ట మైలురాళ్లను అధిగమించాకా 5.5 ఏళ్ల తర్వాత మరో రూ. 270 కోట్లు చెల్లించే ప్రాతిపదికన ఈ డీల్ ఉంటుందని పేర్కొంది. దీంతో ఎంటర్ప్రైజ్ విలువను రూ. 3,350 కోట్లుగా లెక్కగట్టినట్లవుతుంది. గోపాల్పూర్ పోర్టు కొనుగోలుతో తమ కస్టమర్లకు మరింతగా సమగ్రమైన సేవలు అందించేందుకు వీలవుతుందని ఏపీసెజ్ ఎండీ కరణ్ అదానీ తెలిపారు. దీనితో ఒడిశాలోని మైనింగ్ హబ్‌లు, పొరుగు రాష్ట్రాలు అందుబాటులోకి రాగలవని, తద్వారా మారుమూల ప్రాంతాలకు కూడా తమ లాజిస్టిక్స్ సేవలను విస్తరించడానికి వీలవుతుందని పేర్కొన్నారు. ఏపీసెజ్‌కి ప్రస్తుతం తూర్పు, పశ్చిమ తీరాల్లో పద్నాలుగు పోర్టులు, టెర్మినల్స్ ఉన్నాయి. 20 మిలియన్ టన్నుల సామర్థ్యం.. ఒరిస్సాలోని గంజాం జిల్లాలో 20 మిలియన్ టన్నుల వార్షిక సామర్ధ్యంతో గోపాల్పూర్ పోర్టు పని చేస్తోంది. ఇనుప ఖనిజం, బొగ్గు, అల్యూమినా మొదలైన కార్గోను హ్యాండిల్ చేస్తోంది. ఇటీవలే ఇది ఎల్ఎన్జీ రీగ్యాసిఫికేషన్ టెరి్మనల్‌ను నెలకొల్పేందుకు పెట్రోనెట్ ఎల్ఎన్జీతో కూడా ఒప్పందం కుదుర్చుకుంది. 2024 ఆర్థిక సంవత్సరంలో జీపీఎల్ 11.3 మిలియన్ టన్నుల కార్గో హ్యాండ్లింగ్ ద్వారా రూ. 520 కోట్ల ఆదాయం ఆర్జించవచ్చని అంచనాలు ఉన్నాయి. అసెట్ మానిటైజేషన్‌పై ఎస్పీ దృష్టి.. రూ. 20,000 కోట్ల రుణభారాన్ని తగ్గించుకునే దిశగా ఎస్పీ గ్రూప్ గత కొన్నాళ్లుగా అసెట్ మానిటైజేషన్ (ఆస్తులను విక్రయించడం లేదా, లీజుకివ్వడం ద్వారా నిధులు సమకూర్చుకోవడం)పై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా గతంలో మహారాష్ట్రలోని ధరమ్‌తార్ పోర్టును రూ. 710 కోట్ల విలువకు జేఎస్‌డబ్ల్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థకి విక్రయించింది. 2015లో దీన్ని కొనుగోలు చేసిన ఎస్పీ గ్రూప్.. ఆ తర్వాత కార్యకలాపాలను టర్న్అరౌండ్ చేయగలిగింది. వార్షిక సామర్థ్యాన్ని 1 ఎంటీపీఏ నుంచి 5 ఎంటీపీఏకి పెంచింది. ఇక గోపాల్పూర్ పోర్టు ఒప్పందం గత కొద్ది నెలల్లో రెండో డీల్. రెండు పోర్టులను గణనీయమైన విలువకు విక్రయించడమనేది అసెట్స్‌ను టర్న్అరౌండ్ చేయడంలోను, స్వల్పకాలంలోనే వాటాదారులకు మెరుగైన రాబడులు అందించడంలోనూ తమకు గల సామర్థ్యానికి నిదర్శనమని ఎస్పీ గ్రూప్ ప్రతినిధి తెలిపారు. -
పంటపొలాల్లో ల్యాండైన హెలికాప్టర్
శ్రీకాకుళం: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఓ హెలికాప్టర్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో హెలికాప్టర్ గురువారం అత్యవసరంగా శ్రీకాకుళం జిల్లాలో ల్యాండ్ అయింది. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం శారదాపురం సమీపంలో ఇవాళ మధ్యాహ్నం చోటుచేసుకుంది. కాగా హెలికాప్టర్ ఒడిశాలోని గోపాల్పూర్ నుంచి చెన్నై వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. అయితే హెలికాఫ్టర్‌లో ప్రయాణిస్తున్న ముగ్గురు సిబ్బంది సురక్షితంగా ఉన్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
'మావాళ్ల జోలికొస్తే నాలుక చీరేస్తా'
పాట్నా: బిహార్ లో అధికార పార్టీ ఎమ్మెల్యేల ఆగడాలు మితిమీరుతున్నాయి. ఆర్జేడీ ఎమ్మెల్యే రాజ్ బల్లాబ్ యాదవ్.. బాలికపై అత్యాచారానికి తెబగడి పారిపోగా తాజాగా జేడీ(యూ) ఎమ్మెల్యే ఒకరు బహిరంగంగా బెదిరింపులకు దిగారు. తన మద్దతుదారుల జోలికివస్తే నాలుక చీరేస్తానంటూ భగల్పూర్ జిల్లా గోపాల్ పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే నరేంద్ర కుమార్ నీరజ్ అలియాస్ గోపాల్ మండల్ హెచ్చరించారు. నావగాచియా బజార్ ప్రాంతంలో ఆదివారం క్రికెట్ టోర్నీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... 'మా వాళ్లను ఎవరైనా బెదిరిస్తే వాళ్ల నాలుకలు చీరేస్తా. నా రెండు కాళ్లలో ఒకటి జైలులో, మరొకటి బయట ఉంటుంది. ముందు నేను గోపాల్ మండల్ ని, తర్వాతే ఎమ్మెల్యేని. సమాజంలో నాకో స్టేటస్ ఉంద'ని పేర్కొన్నారు. గోపాల్ మండల్ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఎమ్మెల్యేల వ్యవహార శైలి మహా కూటమి పాలనకు అద్దం పడుతోందని బీజేపీ నేత నంద కిశోర్ అన్నారు. గోపాల్ వ్యాఖ్యలపై స్పందించేందుకు సీఎం నితీశ్ కుమార్ నిరాకరించారు. గోపాల్ మండల్ కు వివాదాలు కొత్త కాదు. గతంలో తన కారును ఆపినందుకు డీఎస్పీ స్థాయి అధికారిపై దౌర్జన్యంగా ప్రవర్తించారు. తనను అవమానించాలని చూస్తే మోదీ ప్రభుత్వాన్నైనా, నితీశ్ సర్కారునైనా లెక్క చేయబోనని అన్నారు. -
విశాఖకు పొంచి ఉన్న పెను తుఫాను
ఆంద్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు పెను తుఫాను ముప్పు పొంచి ఉంది. 'హుదూద్' తుఫాను ప్రస్తుతం విశాఖపట్నానికి తూర్పు ఆగ్నేయ దిశగా 810 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఇది మరింత బలపడి పశ్చిమ వాయవ్య దిశగా పయనించి గురువారం రాత్రిలోపు తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంది. శుక్రవారం ఉదయానికి అది పెను తుఫానుగా మారుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈనెల 12వ తేదీన విశాఖపట్నం- గోపాల్పూర్ మధ్య ఇది తీరాన్ని తాకే అవకాశం ఉంది. దాంతో 11వ తేదీన గంటకు 50-70 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయి. తుఫాను తీరం దాటే సమయంలో అయితే గాలుల వేగం గంటలకు 130-150 కిలోమీటర్ల వరకు ఉండే అవకాశం ఉంది. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. అన్ని ప్రధాన పోర్టుల్లో రెండోనెంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలపై ఈనెల 11వ తేదీ నుంచే తుఫాను ప్రభావం తీవ్రంగా కనిపిస్తుంది. దాంతో ఏపీ, ఒడిశాలకు రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కేంద్రం పంపిది. విశాఖకు నాలుగు మిలటరీ దళాలను కూడా పంపింది. -
పై-లీన్ సహాయ కార్యక్రమాలు నాలుగు రోజుల్లో పూర్తి
పై-లీన్ తుఫాను సహాయ కార్యక్రమాలన్నీ మరో నాలుగురోజుల్లో పూర్తవుతాయని ఒడిషా ప్రభుత్వం ప్రకటించింది. వరద ప్రభావిత ప్రాంతాలన్నింటి నుంచి నీరు లాగేసిందని, పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్న వారిలో చాలామంది తిరిగి తమ ఇళ్లకు వెళ్లారని ఒడిషా రాష్ట్ర ప్రత్యేక సహాయ కమిషనర్ పి.కె. మొహాపాత్ర తెలిపారు. ఈనెల 22వ తేదీకల్లా సహాయ కార్యక్రమాలన్నీ పూర్తవుతాయన్నారు. శనివారం రాత్రి గంజాం జిల్లాలోని గోపాల్పూర్ వద్ద తీరం దాటిన పై-లీన్ తుఫాను పెను విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. గంజాం, పూరీ, గజపతి, ఖుర్దా జిల్లాలు ఈ తుఫాను వల్ల ఎక్కువగా దెబ్బతిన్నాయి. బాలాసోర్, భద్రక్, కియోంఝర్, మయూర్భంజ్, జాజ్‌పూర్ జిల్లాల్లో వరదలు వచ్చాయి. ఈ తుఫాను ప్రభావంతో 43 మంది మరణించగా 17 జిల్లాల్లోని 1.2 కోట్ల మంది ప్రజలు ప్రభావితమయ్యారు. -
నౌకలో భారీగా ఆయుధాలు, బాంబులు
-
తిండి లేదు మంచినీరు లేదు - బాధితులు
-
ఫైలిన్ విలయం
-
దక్షిణ కోస్తాలో ప్రమాద హెచ్చరికలు ఉపసంహరణ
-
వచ్చే 48 గంటల్లో ఒడిషాలో వర్షాలు
-
ఒడిషాలో కూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు
-
తుఫాన్ పీడిత ప్రాంతాల్లో బయటపడుతున్న నష్టాలు
-
బీభత్సం సృష్టించిన తుఫాను
పై-లీన్ తుఫాను తీరం దాటిన సమయంలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. వర్షం వణికించింది. ప్రకృతి విలయం సృష్టించింది. ఏకంగా 60-100 టన్నుల బరువుండే కంటెయినర్లు కూడా గాలి వేగానికి ఆగలేక పడిపోయాయంటే తుఫాను ఎంత తీవ్రస్థాయిలో వచ్చిందో తెలుస్తుంది. ఈ తుఫాను బీభత్సాన్ని రాష్ట్ర ప్రేక్షకులకు ప్రత్యక్షంగా చూపించేందుకు వెళ్లిన పలు మీడియా వాహనాలు కూడా గాలి వేగానికి కొట్టుకుపోయాయి. సాక్షి ఓమ్నీ వ్యాన్ దాదాపు 100 మీటర్లు దూరం కొట్టుకుపోయింది. సాక్షి మీడియా సహా పలు మీడియా సంస్థలకు చెందిన సిబ్బంది మొత్తం గోపాల్‌పూర్‌లోని ఒక హోటల్లో తలదాచుకున్నారు. ఆ హోటల్ యజమాని జనరేటర్ ద్వారా విద్యుత్ సదుపాయం కల్పించినా, సమాచార వ్యవస్థ మొత్తం చిన్నాభిన్నం కావడంతో విజువల్స్ తెల్లవారే వరకు అందలేకపోయాయి. హోటల్ అద్దాలు పగిలిపోయాయి. షట్టర్లను తోసుకుని మరీ గాలి వచ్చేసింది. గంజాం జిల్లాలో పంటలు మొత్తం సర్వనాశనం అయిపోయాయి. టెలిఫోన్ టవర్లు, విద్యుత్ టవర్లు కూలిపోయాయి. దీంతో కమ్యూనికేషన్ల వ్యవస్థ మొత్తం ఆగిపోయింది. ఒడిశాలోని దాదాపు ఏడు జిల్లాల్లో ఇప్పటికీ విద్యుత్ సరఫరా లేదు. మంచినీటి సరఫరా అంతంతమాత్రమే. ఒక మాదిరి కచ్చా ఇళ్లన్నీ కూలిపోవడంతో ముందుగానే అక్కడి ప్రజలు పెద్ద భవనాల్లోకి వెళ్లి తలదాచుకున్నారు. -
వాయుగుండంగా మారనున్న పై-లీన్ తుఫాను
-
రాత్రంతా బిక్కుబిక్కుమన్న తీర ప్రాంత జనం
-
ఒడిశా తీరప్రాంతాల్లో కొనసాగుతున్న భారీ వర్షాలు
ప్రస్తుతం ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 90 కిలోమీటర్ల వాయవ్యంగా కేంద్రీకృతమై ఉన్న పై-లీన్ తుఫాను ప్రభావంతో ఆ రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గోపాల్‌పూర్‌లో తీవ్ర విధ్వంసం సంభవించింది. పక్కా ఇళ్లు తప్ప పూరిళ్లు అలన్నీ కూలిపోయాయి. సెల్‌ఫోన్ టవర్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. వాహనాలు గాలికి కొట్టుకుపోయాయి. తీరప్రాంతాల్లో ఇప్పుడు కూడా భారీ వర్షం కురుస్తోంది. ఈ వర్షాలు మరో 36 గంటల పాటు కొనసాగుతాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. విద్యుత్ సరఫరా ఎప్పటికి పునరుద్ధరిస్తారో చెప్పలేని పరిస్థితి నెలకొంది. పై-లీన్ తుఫాను ప్రభావంతో ఒడిసా పరిధిలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా విజయనగరం జిల్లా తోటపల్లి బ్యారేజికి వరద నీరు ఉధృతంగా వస్తోంది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా అధికారులు బ్యారేజికి ఉన్న 8 గేట్లు ఎత్తేశారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కాంలో వరద గాలుల తీవ్రతకు 15 పడవలు దెబ్బతిన్నట్లు సమాచారం. -
వాయుగుండంగా మారనున్న పై-లీన్ తుఫాను
పై-లీన్ తుఫాను గోపాల్ పూర్ నుంచి 90 కిలోమీటర్ల వాయవ్య దిశలో కేంద్రీకృతమై ఉంది. ఇది వాయుగుండగా మారుతుంది. ఇక ఇప్పుడు మన రాష్ట్రం వైపు వచ్చే అవకాశం లేదని విశాఖపట్నం వాతావరణ కేంద్రం అధికారి రాధేశ్యాం తెలిపారు. విశాఖపట్నం, విజయనగరం శ్రీకాకుళం జిల్లాలపై ఎక్కువ ప్రభావం. తీరం వెంబడి బలమైన గాలులు. వర్షాలు కూడా ఎక్కువగా ఉంటుంది. క్రమంగా బలహీనపడుతోంది. గాలుల తీవ్రత ఎక్కువగానే ఉంది. అలలు ఎగసిపడుతున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉంది. ఇది తగ్గేవరకు మత్స్యకారులు వేటకు వెళ్లద్దని సూచించారు. లోతట్టు ప్రాంతాలకు గానీ, చేపల వేటకు గానీ వెళ్లాలంటే మళ్లీ తాము సూచనలిస్తామని, అంతవరకు మాత్రం వెళ్లడం ప్రమాదకరమేనని ఆయన చెప్పారు. ప్రస్తుతం కళింగపట్నంలో 10వ నెంబరు, కాకినాడలో 8వ నెంబరు ప్రమాదహెచ్చరికలు ఎగరేశారు. దక్షిణ కోస్తాలో 3వ నెంబరు ప్రమాద హెచ్చరిక ఎగరేశారు. తీరం వెంబడి 80-90 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. -
తీరానికి 80 కి.మీ దూరంలో తుపాన్
ఫైలిన్ తుపాన్ ప్రభావానికి ఆంధ్రప్రదేశ్, ఒడిషా కోస్తా తీర ప్రాంతాలు వణికిపోతున్నాయి. ఒడిషాలోని గోపాల్‌పూర్‌కు తుపాన్ 80 కిలోమీటర్ల దూరంలో కదులుతోంది. గంటకు 20 కి.మీ వేగంతో తీరం వైపు వస్తున్నట్టు అధికారులు తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో సముద్రం ముందుకు చొచ్చుకు వచ్చింది. ఉత్తరాంధ్రలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. లక్షలాదిమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దీంతో తీర ప్రాంత ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. * తుపాన్ కంట్రోల్ రూమ్‌ల ఫోన్ నెంబర్లు: శ్రీకాకుళం: 0894-2240557/ 9652838191 విశాఖపట్టణం: 1800425002 విజయనగరం: 0892-2236947 టోల్ ఫ్రీ: 1077 తూర్పుగోదావరి: 0884-2365506 - 0884-1077 అమలాపురంలో ఆర్డీవో కార్యాలయంలో తుఫాన్ కంట్రోల్ రూమ్ నెంబర్: 08856 233100 - జిల్లాలోని ఇండియన్ కోస్ట్ గార్డ్ :1554, మెరైన్ పోలీస్ :1093 పశ్చిమగోదావరి: 0881230617 కృష్ణా: 086722525, టోల్ ఫ్రీ: 1077 గుంటూరు జిల్లా: 08644 223800,-0863 2345103/ 0863 2234990 తెనాలి: 08644 223800 నెల్లూరు: 1800 425 2499, 08612 331477 -
భీకర రూపం దాల్చిన పై-లిన్ తుపాను
-
భీకర రూపం దాల్చిన పై-లీన్ తుపాను
గోపాల్పూర్: (భువనేశ్వర్): గోపాల్‌పూర్‌లో పై-లీన్ తుపాను భీకర రూపం దాల్చింది. తుపాను సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించడానికి సాక్షి బృందం గోపాల్పూర్ చేరుకుంది. వాహనాలు కొట్టుకుపోయేలా గాలి వీస్తోంది. భీకరగాలులకు చెట్లు విరిగిపడుతున్నాయి. గోపాల్పూర్ వెళ్లే మార్గంలో వాహనాలు నిలిచిపోయాయి. తుపానుకు గోపాల్పూర్ వాసులు వణికిపోతున్నారు. చాలా మంది గ్రామస్తులు బరంపూర్ తరలి వెళ్లిపోయారు. ఇళ్లకు కాపలాగా ఉన్నవారు మాత్రమే ఇక్కడ ఉన్నారు. ఏ నిమిషంలోనైనా తీవ్రరూపం దాల్చే ప్రమాదం విశాఖపట్నం: పై-లీన్ తుపాను చాలా విభిన్నమైనదని విశాఖపట్నం వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటివరకు రాష్ట్రం మీదుగా చాలా తుఫాన్లు వచ్చి వెళ్లినా, వాటన్నింటి కంటే దీని ప్రవర్తన చాలా తేడాగా కనిపిస్తోంది. నాలుగు రోజుల క్రితం 1200 కిలోమీటర్ల దూరంలో ఉన్న పై-లీన్ తుపాను కడపటి వార్తలు అందేసరికి తీరానికి 200 కిలోమీటర్ల దూరానికి వచ్చింది. అంటే ఇది అత్యంత వేగంగా పయనిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో్ని 8 ఓడరేవుల్లో మూడో నెంబరు ప్రమాద హెచ్చరిక ఎగరేశారు. రెండు చోట్ల సెక్షన్ ౩ హెచ్చరికలు కూడా జారీచేశారు. తుఫాను ప్రభావం ఎప్పుడు, ఏ నిమిషంలో ఎలా ఉంటుందో నిపుణులు కూడా చెప్పలేకపోతున్నారు. అర నిమిషంలోనే ఒక్కసారిగా తీవ్రరూపం దాల్చి, పెనుముప్పునకు కారణం కావచ్చని చెబుతున్నారు. లేదా.. అసలు ఎలాంటి నష్టం కలగజేయకుండా కూడా తీరాన్ని దాటే అవకాశం లేకపోలేదన్నది వాతావరణ నిపుణుల అభిప్రాయం. కేవలం ఈసారి మాత్రమే ఇలా అవుతోంది. ఇంతకుముందు వచ్చిన 73 తుఫాన్లలో ఏ ఒక్కటీ ఇలా ప్రవర్తించలేదని తెలుస్తోంది. తుపాన్ కంట్రోల్ రూమ్‌ల ఫోన్ నెంబర్లు: శ్రీకాకుళం: 0894-2240557/ 9652838191 విశాఖపట్టణం: 1800425002 విజయనగరం: 0892-2236947 టోల్ ఫ్రీ: 1077 తూర్పుగోదావరి: 0884-2365506 - 0884-1077 అమలాపురంలో ఆర్డీవో కార్యాలయంలో తుఫాన్ కంట్రోల్ రూమ్ నెంబర్: 08856 233100 - జిల్లాలోని ఇండియన్ కోస్ట్ గార్డ్ :1554, మెరైన్ పోలీస్ :1093 పశ్చిమగోదావరి: 0881230617 కృష్ణా: 086722525, టోల్ ఫ్రీ: 1077 గుంటూరు జిల్లా: 08644 223800,-0863 2345103/ 0863 2234990 తెనాలి: 08644 223800 నెల్లూరు: 1800 425 2499, 08612 331477 -
దూసుకొస్తున్న జల ప్రళయం..
జల ప్రళయం దూసుకొస్తోంది. మూడు రోజులుగా భయకంపితులను చేస్తున్న పై-లీన్ తుఫాను తీరం వైపు వేగంగా కదులుతోంది. ప్రస్తుతం గోపాల్‌పూర్‌కు 150 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. తుఫాను తీరం దాటే సమయంలో పెనుముప్పు తప్పదని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. అత్యధికంగా 25 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదవుతుందని అంచనా. శ్రీకాకుళం సహా నాలుగు జిల్లాలకు పెను ముప్పు తప్పదని అంచనా వేస్తున్నారు. పై- లీన్ తుఫాను ఈ సాయంత్రం గోపాల్పూర్ వద్ద తీరం దాటుతుందని మెట్రోలాజికల్ సీనియర్ సైంటిస్ట్ బి.కె. బందోపాధ్యాయ అన్నారు. తీరం దాటిన తర్వాత తుఫాను ప్రభావం ప్రమాదస్థాయిలో ఉంటుందన్నారు. పై-లీన్ తుఫానుతో ఒడిషాలోని గోపాల్పూర్ వాసులు వణికిపోతున్నారు. విజయనగరం జిల్లాలో తీరప్రాంతాల ప్రజలు జడిసిపోతున్నారు . తుఫాను బారి నుంచి తమను కాపాడాలని మత్య్సకార గ్రామాల ప్రజలు గంగమ్మకు పూజలు చేస్తున్నారు. సముద్రం నుంచి ప్రచండ వేగంతో గాలులు వీస్తుండటంతో తీరప్రాంత ప్రజలు బెంబేలెత్తున్నారు. విజయనగరం జిల్లాలో సుమారు 23 గ్రామాలు తీరప్రాంతాన్ని అనుకుని ఉన్నాయి. నెల్లూరు జిల్లా వాసులు పై-లీన్ తుఫానుతో వణికిపోతున్నారు. తీర ప్రాంతంలో సముద్రం దాదాపు 10 మీటర్ల మేర ముందుకు వచ్చింది. సముద్రం అల్లకల్లోలంగా మారింది. అలల ఉధృతి అధికమైంది. దాదాపు మీటరు ఎత్తున అలలు ఎగిసిపడుతున్నాయి. జిల్లాలోని తడ, తూపిలిపాలెం, కోడూరుపాడు, మైపాడు, జువ్వలదిన్నె, తుమ్మల పెంట, రామతీర్థం వద్ద సముద్రం ముందుకు రావడంతో తీర ప్రాంత ప్రజలు భయంతో వణికిపోతున్నారు. కృష్ణపట్నం పోర్టులో మూడో ప్రమాద హెచ్చరికను ఎగురవేశారు. అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పశ్చిమగోదావరిజిల్లా తీరప్రాంత ప్రజలను పై-లీన్ తుపాను భయపెట్టిస్తోంది. తుపాను హెచ్చరికల నేపధ్యంలో నరసాపురం తీరప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. చినలంక, పెదమైనవానిలంక, పేరుపాలెం, మోళ్ళవర్రు గ్రామాల్లోని మత్స్యకారులు పడవలు, వలలను భద్రపరుచుకున్నారు. ప్రత్యేక అధికారి, సీనియర్ ఐఏఎస్ సంజయ్ జాజు ఆధ్వర్యంలో తీరప్రాంత ప్రజలను సురక్షిత కేంద్రాలకు తరలిస్తున్నారు. ఇప్పటికే పలుచోట్ల మత్స్యకారుల పడవలు ధ్వంసమయ్యాయి. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిన బాధ్యత ప్రజలదే ముంపు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాల్సిన బాధ్యత ప్రజలపైనే ఎక్కువగా ఉందని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డీసీ రోశయ్య అన్నారు. అధికారులు రాలేదని... ఊళ్లు ఖాళీ చేయకుండా ఉండవద్దని సూచించారు. తీరప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఇళ్ల ముందు పశువులను కట్టివేయకుండా వదిలేయాలని సూచించారు. మత్య్సకారులు చేపలు పట్టడానికి వెళ్ళవద్దన్నారు. చెట్ల కింద నిల్చోరాదని ..ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునారావాస కేంద్రాల్లోనే ఉండాలని డీసీ రోశయ్య సూచించారు. కంట్రోల్ రూంలు, హెల్ప్ లైన్ల నెంబర్లు.. శ్రీకాకుళం: 0894-2240557/ 9652838191 విశాఖపట్టణం: 1800425002 విజయనగరం: 0892-2236947 టోల్ ఫ్రీ: 1077 తూర్పుగోదావరి: 0884-2365506 పశ్చిమగోదావరి: 0881230617 కృష్ణా: 086722525, టోల్ ఫ్రీ: 1077 గుంటూరు : 08632345103/08632234990 నెల్లూరు: 08612331477 -
పై-లీన్ తుఫాను నేపథ్యం: 3.6 లక్షల మంది తరలింపు
పై-లీన్ తుఫాను విరుచుకుపడుతుండటంతో ఆంధ్రప్రదేశ్, ఒడిషా రాష్ట్రాల్లోని దాదాపు మూడు లక్షల మందికి పైగా ప్రజలను ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గంటకు 220 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున భారీ విధ్వంసం జరుగుతుందన్న ప్రచారంతో ప్రజలను తరలించారు. రెండు రాష్ట్రాల్లో ఇప్పటికే పెనుగాలులు, వర్షం మొదలయ్యాయి. తీవ్ర పెను తుఫాను పై-లీన్ శనివారం సాయంత్రం 6-8 గంటల మధ్యలో తీరాన్ని దాటొచ్చని, ఆ సమయంలో దాని వేగం గంటకు 210-220 కిలోమీటర్ల వరకు ఉండొచ్చని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఆ సమయంలో దాదాపు ఆరు గంటల పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్, ఒడిషా తీరప్రాంతాల్లో శుక్రవారం రాత్రికే ఈదురు గాలులతో దాదాపు 8-10 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. మన రాష్ట్రంలోని శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలతో పాటు ఒడిషాలోని గంజాం, ఖుర్దా, పూరీ, జగత్సింగ్పూర్ జిల్లాల్లో పెనుగాఉలుల వీచే ప్రమాదం ఉంది. దీంతో ఒడిషాలో మూడు లక్షల మందిని, ఉత్తర కోస్తాంధ్రలో 64 వేల మందిని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. త్రివిధ దళాలతో పాటు.. జాతీయ విపత్తు నివారణ దళం (ఎన్డీఆర్ఎఫ్) బృందాలు కూడా రక్షణ చర్యలు తీసుకోడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే ఒడిషాలోని పలు ప్రాంతాల్లో గాలుల వేగం పెరిగిందని ప్రత్యేక సహాయ కమిషనర్ ప్రదీప్ కుమార్ మొహాపాత్ర తెలిపారు. గంజాంలో గాలుల వేగం గంటకు 60-80 కిలోమీటర్లుంది. గంజాం జిల్లాలోని గోపాల్పూర్ వద్ద తీరం దాటుతుందని భావిస్తుండటంతో అక్కడ భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందంటున్నారు. గంజాం, గజపతి, ఖోర్దా, పూరీ, జగత్సింగ్ పూర్ జిల్లాల్లో ప్రభావం తీవ్రంగా ఉంటుంది. పూరీ సమీపంలోని ఆస్త్రాంగా ప్రాంతం నుంచి వేటకు వెళ్లిన 18 మంది మత్స్యకారులు సముద్రంలో చిక్కుకున్నారు. -
గోపాల్ పూర్ కు 200 కిలోమీటర్ల దూరంలో పై-లిన్
-
ఉత్తరాంధ్రలో కురుస్తున్న వర్షాలు
-
ఉత్తరాంధ్రలో కురుస్తున్న వర్షాలు
కళింగపట్నానికి 340 కి.మీ దూరంలో పైలిన్ తుపాన్ కేంద్రీకృతమైంది. దాంతో ఆంధ్రప్రదేశ్, ఒడిశా తీర ప్రాంతంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంది. తుపాన్ వల్ల 50 అడుగులకు పైగా అలలు ఎగిసిపడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. కోస్తా తీరం వెంబడి అన్ని నౌకాశ్రయాల్లో మూడవ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. పైలిన్ తుపాన్ ఈ రాత్రికి గోపాలుపూర్ వద్ద తీరం దాటే అవకాశం ఉంది. గంటలకు 220 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచే అవకాశం ఉంది. తుపాన్ తీరం దాటేటప్పుడు 25 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉందని విశాఖలోని తుఫాన్ హెచ్చరిక కేంద్రం భావిస్తుంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు ఇప్పటికే కురుస్తున్నాయి. విశాఖ - ఒడిశాల మధ్య శనివారం పలు రైళ్ల సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే ఓ ప్రకటన విడుదల చేసింది. శ్రీకాకుళం: 0894-2240557/ 9652838191 విశాఖపట్టణం: 1800425002 విజయనగరం: 0892-2236947 టోల్ ఫ్రీ: 1077 తూర్పుగోదావరి: 0884-2365506 పశ్చిమగోదావరి: 0881230617 కృష్ణా: 086722525, టోల్ ఫ్రీ: 1077 గుంటూరు : 08632345103/08632234990 నెల్లూరు: 08612331477