వాయుగుండంగా మారనున్న పై-లీన్ తుఫాను
పై-లీన్ తుఫాను గోపాల్ పూర్ నుంచి 90 కిలోమీటర్ల వాయవ్య దిశలో కేంద్రీకృతమై ఉంది. ఇది వాయుగుండగా మారుతుంది. ఇక ఇప్పుడు మన రాష్ట్రం వైపు వచ్చే అవకాశం లేదని విశాఖపట్నం వాతావరణ కేంద్రం అధికారి రాధేశ్యాం తెలిపారు. విశాఖపట్నం, విజయనగరం శ్రీకాకుళం జిల్లాలపై ఎక్కువ ప్రభావం. తీరం వెంబడి బలమైన గాలులు. వర్షాలు కూడా ఎక్కువగా ఉంటుంది.
క్రమంగా బలహీనపడుతోంది. గాలుల తీవ్రత ఎక్కువగానే ఉంది. అలలు ఎగసిపడుతున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉంది. ఇది తగ్గేవరకు మత్స్యకారులు వేటకు వెళ్లద్దని సూచించారు. లోతట్టు ప్రాంతాలకు గానీ, చేపల వేటకు గానీ వెళ్లాలంటే మళ్లీ తాము సూచనలిస్తామని, అంతవరకు మాత్రం వెళ్లడం ప్రమాదకరమేనని ఆయన చెప్పారు. ప్రస్తుతం కళింగపట్నంలో 10వ నెంబరు, కాకినాడలో 8వ నెంబరు ప్రమాదహెచ్చరికలు ఎగరేశారు. దక్షిణ కోస్తాలో 3వ నెంబరు ప్రమాద హెచ్చరిక ఎగరేశారు. తీరం వెంబడి 80-90 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి.